Friday, May 8, 2026

గాంధీ కుటుంబం దాచిన మరో చీకటి ❌ నిజం బయటపడింది! || 6 Biggest Mistakes Committed By Sanjay Gandhi

గాంధీ కుటుంబం దాచిన మరో చీకటి ❌ నిజం బయటపడింది! || 6 Biggest Mistakes Committed By Sanjay Gandhi

Author Name:Shivaraj Facts

Youtube Channel Url:https://www.youtube.com/@shivarajfacts7869

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XrVqjCUOxz0



Transcript:
(00:00) 1976 లో ఢిల్లీలోని ప్రసిద్ధ జామా మసీదు సందర్శనకు వెళ్ళిన సంజయ్ గాంధీ గారు ఆ మసీదు చుట్టుపక్కల ఉన్న కొన్ని వేల మంది నిరుపేదలు నిర్మించుకున్న గుడిసెల్ని బలవంతంగా ఎందుకు తొలగించారు? తనకు ఎలాంటి రాజకీయ పదవి లేకపోయినా సరే దేశంలోని జనాభాను తగ్గించడానికి కోటి మందికి పైగా భారతీయులపై ఆయన అనుసరించిన అత్యంత క్రూరమైన చర్య ఏమిటి? దేశంలోని సామాన్యులకు అత్యంత తక్కువ ధరకే విలాసవంతమైన కార్లు అందిస్తానని ప్రభుత్వ సొమ్ముతో 290 ఎకరాల్లో స్థాపించిన మారుతి లిమిటెడ్ ని రెండేళ్లు గడిచినా సరే 21 కార్లు మాత్రమే ఉత్పత్తి చేసి ఎందుకు మూసివేశారు? ఇలా సంజయ్ గాంధీ గారు తన
(00:36) అనుభవం లేమితో చేసిన ఐదు ఘోరమైన తప్పిదాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1946 డిసెంబర్ 14వ తేదీన ఇందిరా గాంధీ మరియు ఫిరోజ్ గాంధీలకు జన్మించిన రెండవ సంతానమే సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ గారు డెహరాండూన్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఆయనకు కార్లంటే విపరీతమైన ఆసక్తి ఉండడంతో ఇంజనీరింగ్ లో ఆటోమొబైల్ రంగాన్ని ఎంచుకున్నారు.
(01:01) కానీ తన ఇంజనీరింగ్ పూర్తఅవ్వకముందే ఆయన తన తల్లి ఇన్ఫ్లయెన్స్ తో ఇంగ్లాండ్ లోని ప్రముఖ రోల్స్ రాయల్స్ కంపెనీలో అప్రెంటిస్షిప్ లో జాయిన్ అయ్యారు. ఇదే సమయంలో నాటి భారత ప్రధాని అయిన నెహ్రూ గారు తీవ్ర అనారోగ్యంతో చనిపోవడంతో పార్టీ వ్యవహార బాధ్యతలు మొత్తం ఇందిరా గాంధీ గారు చూసుకునేవారు. దీనికి తోడు సంజయ్ గాంధీ గారి తండ్రి అయిన ఫిరోజ్ గాంధీ కొంతమంది అమ్మాయిలతో చనువుగా ఉన్న కారణంగా ఇరువురి మధ్య వివాదాలు తలెత్తడంతో 1959 లోనే వీరిద్దరూ విడిపోయారు.
(01:29) అలా ఒకవైపు పార్టీ బాధ్యతలు మరోవైపు కుటుంబ బాధ్యతలు చూసుకోలేని ఇందిరా గాంధీ గారు సంజయ్ గాంధీ గారిని వెంటనే ఇండియాకు తిరిగి రావాల్సిందిగా కబురు పంపారు. దాంతో రోల్స్ రాయస్ లో తన అప్రెంటిస్షిప్ పూర్తి చేయకుండానే సంజయ్ గాంధీ గారు ఇండియాకు తిరిగి వచ్చారు. అలా ఆయన దేశ ప్రధాని అయిన ఇందిరా గాంధీ గారికి అనధికారిక సలహాదారుగా ఉంటూ తన అనుభవలేమితో దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా పేర్కొనే ఎమర్జెన్సీతో మొదలుకొని మరో ఐదు దుష్పరిణామాలకు మూలకారకులయ్యారు.
(01:58) వాటిలో మొదటిది జామా మసీదు చుట్టూ ఉన్న మురికివాడల కూల్చివేత. 1976 ఏప్రిల్ 12వ తేదీన తుర్కుమన్ గేట్ను సందర్శించిన సంజయ్ గాంధీ గారు అక్కడి నుండి కేవలం 1.2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ జామా మసీదు కనిపించకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీనికి గల ప్రధాన కారణం తుర్కుమన్ గేటు నుండి జామా మసీదు వరకు గల ఖాళీ ప్రదేశంలో అనేకమంది నిరుపేదలు నిర్మించుకున్న గుడిసెలు మరియు రేకులతో నిర్మించుకున్న సాధారణ ఇల్లు.
(02:23) ఇది గమనించిన సంజయ్ గాంధీ గారు తన అత్యంత నమ్మకస్తుడైన జగ్మోహన్ మల్హోత్రాతో వెంటనే ఈ స్లమ్ ఏరియా మొత్తాన్ని ఖాళీ చేయించమని ఆదేశించారు. అలా ఆయన ఆదేశించిన రెండు రోజుల్లోనే పదులకొద్ది బుల్డోజర్లు నిరుపేదలు నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేయడం ప్రారంభించాయి. ఇది గమనించిన అక్కడి ప్రజలు పోలీసులు మరియు బుల్డోజర్లపై ఆగ్రహంతో తిరగబడి రాళ్లు విసరడం ప్రారంభించారు.
(02:47) దాంతో సిఆర్పిఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ప్రజలపై బాష్ప వాయువులతో పాటు కాల్పులు జరపడం ప్రారంభించారు. అలా వీరి కాల్పుల్లో ఒక్క రోజులోనే 14 మంది మరణించినట్లుగా అప్పటి ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. కానీ 1977 లో జనతా ప్రభుత్వాన్ని నియమించిన షాక్ కమిషన్ ఈ కాల్పుల్లో కనీసం 150 మంది అమాయకులు మరణించినట్లుగా తన నివేదికలో పేర్కొంది. అలాగే దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో 1975 నుండి 1977 మధ్య అక్రమ నిర్మాణాల పేరుతో, 50,000 కట్టడాలను కూల్చివేసినట్టుగా షా కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
(03:23) ఇలా కూల్చివేతల కారణంగా 7 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని కూడా షా కమిషన్ తన నివేదికలో రిపోర్ట్ ఇచ్చింది. నెంబర్ టూ కోటి మందికి పైగా నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. 1970 నాటికి మన దేశ జనాభా 56 కోట్లుగా ఉంటూ చైనా తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభా గల దేశంగా ఉండేది. అయితే ఈ పేదరికం మరియు నిరుద్యోగానికి ఈ జనాభా పెరుగుదలే కారణంని భావించిన సంజయ్ గాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో నూతన జనాభా విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.
(03:51) ఇందులో భాగంగానే మగవారికి వసెక్టమీ అంటే సంతానం కలగకుండా ఆపరేషన్లు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు పోలీస్ అధికారులు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి తమ పూర్తి చేయాల్సిన సర్జరీలను లక్ష్యంగా నిర్ణయించారు. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయని వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తామని వేధించడంతో వారు అనేకమంది మహిళలు మరియు పొట్టకూటి కోసం కూలి పని చేసుకునే పెళ్లి కాని మగవారికి సైతం డబ్బులు ఆశ చూపి ఈ సర్జరీలు నిర్వహించారు.
(04:20) అలాగే నాటి రాజస్థాన్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకొని గ్రామాలకు నీటి సరఫరాను నిలువపవేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం స్టెరిలైజేషన్ చేయించుకోవాల్సిందని పట్టుపట్టింది. చాలా మంది స్త్రీలు తమ భర్తలు నపుంసకులుగా మారుతారనే భయంతో పగటి సమయంలో వారిని రహస్య ప్రదేశాలలో తలదాచేవారు.
(04:40) అలాంటి వారిని కాపుకాసి మరి అర్ధరాత్రి సమయంలో హాస్పిటల్లకు తరలించేవారు. కేవలం 1976 లోనే 62 లక్షల మందికి ఈ స్టెరిలైజేషన్ నిర్వహించినట్లు షా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. కానీ సరైన పరిశుభ్రత చర్యలు చేపట్టకపోవడం వల్ల కొన్ని వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో 1977 లో ఇందిరా గాంధీ గారు ఎమర్జెన్సీ నిలిపి వేసిన వెంటనే ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కార్యక్రమానికి ముగింపు పలికారు.
(05:07) ఈ కారణంగానే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ మరియు సంజయ్ గాంధీ గారు ఓడిపోవడంతో పాటు కాంగ్రెస్ కేవలం 154 స్థానాలు మాత్రమే దక్కించుకొని ఘోర పరాజయాన్ని చవిచ చూడాల్సి వచ్చింది. నెంబర్ త్రీ చౌకడి గ్యాంగ్. సంజయ్ గాంధీ గారికి ఎలాంటి పదవి లేకపోయినా ఆయనకు అనుకూలంగా పని చేసేందుకు సీనియర్ ఐపిఎస్ అధికారి అయిన పిఎస్ బండార్ ఢిల్లీ లెఫ్ట్ హెండ్ గవర్నర్ అయిన నవీన్ చావల యూత్ కాంగ్రెస్ నాయకురాలు అయిన అంబికా సోని మరియు రుక్సానా సుల్తానాలతో చౌకడి గ్యాంగ్ ను ఏర్పరచుకున్నారు.
(05:36) ప్రభుత్వం తరపున వచ్చే కాంట్రాక్టులు గాని లైసెన్సులు గాని చివరికి ప్రభుత్వోద్యోగుల ప్రమోషన్లు గాని ఇలా ముఖ్యమైన విషయాలన్నింటిని ఈ చౌకడి గ్యాంగ్ చూసుకునేది. ఇలా సంజయ్ గాంధీ గారికి ఎలాంటి పదవి లేకపోయినా కూడా ఆయన ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ రాజమర్యాదలు లభించేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక పర్యటనలో భాగంగా రాజస్థాన్ వెళ్ళినప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అయిన హరిదేవ్ జోషి గారు ఆయనకు ప్రధానమంత్రి స్థాయిలో స్వాగత మర్యాదలు ఏర్పాటు చేశారు.
(06:05) అలా సంజయ్ గాంధీ గారు ఫ్లైట్ నుండి కిందకు దిగుతుండగా పొరపాటున ఆయన కాలికి ఉన్న చెప్పు కింద పడిపోయింది. అది గమనించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఎన్డి తివారి గారు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చెప్పు తీసి సంజయ్ గాంధీ గారి కాళ్ళకు తొడిగారు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో ఇందిరా గాంధీ గారు ఇకనుండి తన కుమారుడికి ఎలాంటి రాజమర్యాదలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు.
(06:31) కానీ అలా ఆదేశించిన కొద్ది రోజులకే సంజయ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా బాధ్యతలు చేపట్టడంతో ఇకనుండి సంజయ్ గాంధీ ఏ రాష్ట్రానికి వచ్చినా పార్టీ తరపున స్వాగత మర్యాదలు ఏర్పాటు చేయాలని హోం శాఖ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. నెంబర్ ఫోర్ మారుతి కార్ కుంభకోణం. కార్లపై విపరీతమైన ఆసక్తి కలిగిన సంజయ్ గాంధీ గారు తన తల్లి అయిన ఇందిరా గాంధీ గారితో దేశ ప్రజలకు అత్యంత తక్కువ ధరలో విలాసవంతమైన కారును అందించాలనుకుంటున్నానని అందుకోసం ప్రభుత్వమే ఈ కంపెనీని స్థాపించి నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
(07:02) దాంతో ఇందిరా గాంధీ గారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాటి హర్యాణ ముఖ్యమంత్రి అయిన బన్సీలాల్ కు భూసేకరణ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బన్సీలాల్ ఇందిరా గాంధీ గారి మద్దతు కోసం అనేకమంది నిరుపేద రైతుల నుండి 290 ఎకరాల భూమిని బలవంతంగా సేకరించారు. దీనికి తోడు పంజాబ్ నేషనల్ బ్యాంకు లాంటి ప్రభుత్వరంగ బ్యాంకు లోన్ ఇవ్వడంతో పాటు అనేకమంది పారిశ్రామిక వేత్తలను ఇందులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సంజయ్ గాంధీ గారు ఒత్తిడి తీసుకువచ్చారు.
(07:31) అలా 1975 లో స్థాపించిన ఈ కంపెనీ సంవత్సరానికి 50,000 కార్లను ఉత్పత్తి చేయడాన్ని తన లక్ష్యంగా పెట్టుకుంది. కానీ నాలుగేళ్ళ గడిచిన సరే ఈ కంపెనీ కేవలం 21 కార్లను మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. దీనికి గల ప్రధాన కారణం వ్యాపార రంగంలో ఏమాత్రం అనుభవం లేని సంజయ్ గాంధీని ఇందిరా గాంధీ గారు కేవలం తన చిన్న కుమారుడు అనే ప్రేమతోనే ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించడం.
(07:54) అలాగే ఈ కంపెనీ నిర్వహణలో అనేక అవినీతి చోటు చేసుకుందని షా కమిషన్ తన నివేదికలో పేర్కొనడంతో 1977 లోనే ఈ కంపెనీని మూసివేశారు. నెంబర్ ఫైవ్ 1975 ఎమర్జెన్సీ. 1971 లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ గారు తనను ఓడించేందుకు ప్రభుత్వ సొమ్మును ఓటర్లకు పంచిపెట్టారని అలాగే సభను నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులను సైతం వినియోగించుకున్నారని రాజీవ్ నారాయణ్ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటేషన్ వేశారు.
(08:24) అలా ఈ కేసును విచారించిన హైకోర్ట్ ఇందిరా గాంధీ గారి లోక్సభ స్థానాన్ని రద్దు చేస్తూ తదుపరి ఆరేళ్ల వరకు ఆమె ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. దాంతో ఇందిరా గాంధీ గారు ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అపీల్ చేశారు. అలా ఈ కేసును విచారించిన సుప్రీం కోర్ట్ అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఇదే మంచి అదునుగా భావించిన ఇందిరా గాంధీ గారు నాటి రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారితో దేశంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేకపోయినా కేవలం తన పదవిపై ఉన్న స్వార్థం కోసం ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీని ప్రకటింపజేశారు. ఈ సమయంలో గ్రామాలతో
(08:58) మొదలుకొని ప్రతి నగరం ప్రతి రాష్ట్రం కేంద్రం ఇచ్చే ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో ఉండే ఏ ముఖ్యమంత్రికి అధికారం ఉండదు. అలా ఇందిరా గాంధీ గారు ఈ ఎమర్జెన్సీని ప్రకటించిన వెంటనే తనపై పిటిషన్ వేసిన రాజు నారాయణ్తో పాటు ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసి జైలులో వేయించారు. కనీసం మీడియాకు కూడా స్వాతంత్రం లేకుండా తనపై వ్యతిరేకంగా కథనాలు రాసిన జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేసి జైలలో నిర్బంధించారు.
(09:27) ఇలా మీడియా స్వేచ్ఛను హరించడం ప్రమాదకరమని ఎంఎన్ రాయ్ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంతో నచ్చ చెప్పిన ఇందిరా గాంధీ గారు పట్టించుకోలేదు. అయితే ఇందిరా గాంధీ గారు ఇలా ఎమర్జెన్సీని ప్రకటించి నిరంకుశంగా వ్యవహరించడం వెనుక ఉన్న కీలకమైన వ్యక్తి సంజయ్ గాంధీయే అని భావించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీనే వ్యతిరేకించడం మొదలు పెట్టారు.
(09:48) చివరికి దేశ ప్రజలు మరియు ప్రపంచ దేశాల నుండి వచ్చిన ఒత్తిడి ఫలితంగా దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత ఇందిరా గాంధీ గారు ఎమర్జెన్సీని ఎత్తివేసి జనరల్ ఎలక్షన్స్ కు పిలుపునిచ్చారు. కానీ కాంగ్రెస్ పట్ల ఏర్పడిన వ్యతిరేకత వల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజాయాన్ని చవిచూసింది. అయితే 298 స్థానాలను దక్కించుకున్న జనత పార్టీకి సైతం సరైన మెజారిటీ లేకపోవడం వల్ల మిత్ర పక్షాలతో కలిసి తొలి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొరార్జీ దేశయ్య గారు రెండేళ్లకే అంతర్గత కలహాల వల్ల తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో
(10:21) ఇందిరా గాంధీ గారు బారి మెజారిటీని సంపాదించుకొని మళ్ళీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు చెప్పిన సంజయ్ గాంధీ గారు ఢిల్లీలోని సబ్దర్జంగ్ విమానాశ్రయంలో గల అత్యాధునిక పిట్స్ఎస్టఏ విమానాన్ని నడపాలనుకున్నారు. అడ్వెంచర్స్ అంటే ఎంతగానో ఇష్టపడే ఆయన ప్రముఖ పైలట్ అయిన సుభాష్ సక్సేనా గారిని తన వెంటపెట్టుకొని బయలుదేరారు.
(10:48) అలా ఉదయం 7:58 నిమిషాలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. దాదాపుగా 12 నిమిషాల పాటు ఫ్లైట్ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. అలా ఆయన విన్యాసాన్ని కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు చూస్తూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కానీ 12 నిమిషాల తర్వాత దురదుష్టవశాత్తు సంజయ్ గాంధీ గారు ప్రయాణిస్తున్న ఆ ఫ్లైట్ ఇంజన్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. ఈ విపత్తు నుండి బయట పడదామని ఆలోచించే లోపే ఫ్లైట్ వేగంగా వచ్చి భూమిని డీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బ్లాస్ట్ అయింది.
(11:16) ఆ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే ఈ దుర్ఘటన తర్వాత సంజయ్ గాంధీ మరియు సుభాష్ గార్ల మృతదేహాలు వేరు చేయడానికి డాక్టర్స్ కి ఆరు గంటల సమయం పట్టింది. దాంతో ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకునే ఇందిరా గాంధీ గారు తన కుమారుని మరణాన్ని జీర్ణించుకోలేక గుండెలు అవిసేలా ఏడ్చారు. ఇలా సంజయ్ గాంధీ గారు తనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా తన తొందరపాటు వల్ల తీసుకున్న నిర్ణయాలతో దేశ ప్రజలు కొన్ని దశాబ్దాల పాటు బాధపడాల్సి వచ్చింది.
(11:44) అయినా సరే ఆయన దేశం వృద్ధి పదంలో ముందుకు సాగాలి అంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఒకవేళ ఆయన ప్రధాని అయి ఉంటే దేశం మరింత వృద్ధిపదంలో ముందుకు సాగి ఉండేదని ఇప్పటికీ కొంతమంది నమ్ముతుంటారు. నా ఒపీనియన్ ప్రకారం నాయకుడు అనేవాడు బంధు ప్రీతిని విడనాడి తను గెలిపించుకున్న ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకున్నప్పుడే ఏ దేశమైనా వృద్ధి పథంలో ముందుకు సాగుతుంది.
(12:07) మరి సంజయ్ గాంధీ గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.

No comments:

Post a Comment