Wednesday, May 6, 2026

*మాంసాహారాన్ని నిషేధించటానికి మూల కారణం పునర్జన్మలా?*

 *మాంసాహారాన్ని నిషేధించటానికి మూల కారణం పునర్జన్మలా?*

"పాపకార్యాలు చేసినవాళ్ళు ఆ చెడు కర్మని అనుభవించటంకోసం కోళ్ళు, కుక్కలు, పందులు లాంటి జంతువులుగా, పక్షులుగా జన్మిస్తారు" అన్న విషయం ప్రపంచంలోని చాలా మతాలలో చెప్పటం జరిగింది. అయితే, మాంసాహారం తినేవాళ్ళకి తాము తింటున్న కోడి లేదా పంది లేదా మేక లాంటి జీవి, గతజన్మలో తమ తండ్రో లేక తాతో అయి ఉండవచ్చని తెలిసే అవకాశం ఉండదు. ఆ విషయం తెలియకుండా, మళ్ళీ జన్మ ఎత్తిన తన దగ్గర బంధువుని తినటం వల్ల, ఆ తిన్న వ్యక్తికి చెడుకర్మ అనగా పాపం చుట్టుకుంటుందని ప్రాచీన గ్రీసు దేశానికి చెందిన పైథాగరస్ అనే మహా వేదాంతి పేర్కొన్నాడు. ఆ కారణంగానే, ఆయన మాంసాహారాన్ని తిరస్కరించి, శాఖాహారాన్ని స్వీకరించటమే కాకుండా మాంసాహారం తీసుకోవటంవల్ల
అకారణంగా పాపాన్ని మూట కట్టుకోవలసి వస్తుందని ఉద్ఘాటించాడు.

కొంతమంది మాంసాహార ప్రేమికులు మరియు హైందవ మతం, ప్రబోధించే శాఖాహారాన్ని ద్వేషించే హేతువాదులు (నిజానికి ఈ హేతువాదులు ద్వేషించేది హిందూ మతాన్ని మాత్రమే అని గుర్తించాలి. అయితే, నేరుగా హిందూ మతాన్ని విమర్శించటానికి అవకాశం దొరకనప్పుడు హిందూమత ఏకైక ఆహారం అయిన శాఖాహారాన్ని వివమర్శిస్తారు.) శాఖాహారుల్ని ఇలా తీవ్రంగా ప్రశ్నిస్తారు. వారి ప్రశ్నలు ఇలా ఉంటాయి.

1. మాంసాహారం తినే వాళ్ళు, నేలపై తిరిగే కోడి దగ్గర నుండి గేదెలు, పందులు, మేకలు, జింకలు, నెమళ్ళు, పిల్లులు (చైనా జాతీయులు ఆరగిస్తారు.) లాంటివి చంపటం వల్ల పాపం వస్తుందని మరియు వాటిని కోసేటప్పుడు అవి విపరీతమైన నరకయాతన అనుభవిస్తాయని, అది చాలా తప్పని "శాఖాహారాన్ని” బలపరచేవారు చెబుతున్నారు. మరి, శాఖాహారులు ఏ హింసా లేకుండానే ఆహారాన్ని పొందుతున్నారా? - తోటకూర, పాలకూర, మెంతికూర లాంటి మొక్కలకి ప్రాణం ఉండదా? మరి, వాటిని నిర్దాక్షణ్యంగా పీకి, వివిధ రకాలుగా వండుకుని ఎలా తింటున్నారు? చెట్లకు కాసే కాయలు చెట్లలలోని భాగాలే కదా? అలాంటప్పుడు ఆ కాయలను నిర్మొహమాటంగా ఎలా కోసుకుని తింటున్నారు? మరి, హింస లేకుండా శాఖాహారులే ఆహారాన్ని పొందలేనప్పుడు, మాంసాహారులు హింసలేకుండా మాంసాహారాన్ని ఎలా పొందగలరు?.

హేతువాదులు అడుగుతున్న ప్రశ్నలకు జ్ఞానులైన పండితులు ఇలా సమాధానం చెబుతున్నారు.

1. శాఖాహారంగా ఉపయోగపడే మొక్కలు (తోటకూర, కొత్తిమీర, పాలకూర వగైరా మొక్కలు). ఏవిధమైన రాగద్వేషాలను కలిగి ఉండవు. అంతేకాదు, అవి అటు, ఇటు కదిలివెళ్ళే చైతన్యాన్ని కలిగి ఉండవు.

2. జంతువుల్ని వండుకోవటంకోసం చంపటానికి ప్రయత్నించినప్పుడు అవి చాలా దారుణంగా అరుస్తాయి (వాటికి ఏడవటం రాదు కనుక), వీలైతే చావును తప్పించుకోవటానికి ఏదో ఒక దిక్కుకి పారిపోవాలని కూడా ప్రయత్నిస్తాయి. కానీ, చెట్టుకి ఉన్న కాయల్ని (వంకాయలు, మామిడికాయలు, బెండకాయలు లాంటివి).. కొయ్యాలని చూసినప్పుడు ఆ చెట్లు ఏవిధమైన ఆవేదనకు గురి కావు మరియు అక్కడ నుండి పారిపోవటానికి ప్రయత్నించవు.

3. మనుషులలో, జంతువులలో నరాల వ్యవస్థ ఉంటుంది. అందువలన ఒక మనిషినిగాని, జంతువునిగాని కొంచెం గాయపరచినా నరాల వ్యవస్థ కారణంగా ఆ బాధ ఆ జీవియొక్క మెదడుకి చేరుతుంది. ఫలితంగా, ఆ జీవి ఆ బాధను శారీరకంగా అనుభవిస్తుంది. కానీ మొక్కల్లో, చెట్లల్లో అలాంటి నరాల వ్యవస్థ లేదు. కనుక “కాకరకాయను కోస్తే- కాకర మొక్క కేకలు పెట్టదు. అరిటికాయ కోస్తే అరటిచెట్టు అరవదు" అని గ్రహించాలి.

మొత్తంమీద చూసినట్లయితే మొక్కలకు, చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని ఒప్పుకోక తప్పదు. కానీ, మొక్కల్ని లేదా చెట్లని ఆహారం కోసం ఉపయోగించినప్పుడు అవి ఏవిధమైన బాధని పొందవని గుర్తించాలి. ఇంకొక ముఖ్య విశేషం ఏమంటే, ఒక జంతు కళేబరం లేదా ఒక చిన్న జీవి కళేబరం (ఒక కప్పలాంటి చిన్నజీవి) ఒక ప్రదేశంలో రెండు, మూడు రోజుల మించి ఉంటే ఆ కళేబరం నుండి భరించలేని దుర్గంధం బైటకు వస్తుంది. ఇంకా కొద్ది రోజులు అలాగే ఉంటే దాని నుండి అతి ప్రమాదకరమైన పురుగులు, ఇంకా చెప్పాలంటే భయంకర అంటువ్యాధులను ప్రసాదించే వైరస్ లు ఉద్భవిస్తాయి. కానీ, ఒక ప్రదేశంలో కుళ్ళిపోయిన మామిడి కాయలను లేదా కుళ్లిపోయిన కూరగాయలను లేదా గుట్టలు గుట్టలుగా ఆకుకూరల్ని పడవేసినప్పుడు అతి కొద్ది రోజుల్లోనే అవి కుళ్లిపోయి, ఆపై ఎండిపోతాయి. వాటి నుండి ఏవిధమైన భరించరాని దుర్గంధమూ రాదు. వాటి నుండి ఏ చెడు క్రిములు పుట్టవు. కారణం, రక్తం మరియు మాంసం ఉన్న జీవులు మాత్రమే తమ మరణానంతరము ప్రమాదకరంగా తయారవుతాయి. అందుకే, మరణించిన జంతువుల్ని లేదా మానవుల్ని తగలపెట్టటమో లేదా సమాధి చెయ్యటమో జరుగుతుంది.

ఒక విశేషం ఏమంటే, ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి సుమారుగా 50 బిలియన్ల జీవులు (శాఖాహారాన్ని తీసుకునే జీవులు అన్నమాట.) కసాయి దుకాణాలలో మరియు మాంసాహారాన్ని విదేశాలకు ఎగుమతిచేసే కర్మాగారాలలో నిర్దాక్షిణ్యంగా నరికి చంపబడుతున్నాయి. ప్రస్తుతం, ప్రపంచంలోని వివిధ దేశాలలో పండించబడే ఆహార పంటల ఉత్పత్తిలో 80% పంటని అనగా ఆహారాన్ని- మాంసంకోసం పెంచబడే కోళ్ళు, పందులు, మేకలు, ఈము పక్షులు లాంటి జీవులకు ఆహారంగా ఇవ్వటం జరుగుతున్నది. మానవులు తినవలసిన ఈ వ్యవసాయ పంటల (శాఖాహారం)లలో ఎక్కువ భాగాన్ని జంతువులకు పెట్టి, ఆపై వాటి మాంసాన్ని మనుషులు తింటున్నారు. ఫలితంగా, శాఖాహారంగా ఉపయోగించే వివిధ రకాల ఆహార ధాన్యాలు శాఖాహారులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. అనగా విపరీతమైన ధరల స్థాయికి శాఖాహారం చేరుకుంటున్నది.

No comments:

Post a Comment