*గరుడ పురాణము*
శ్రీహరి!!! ఏఏ పాపాల వల్ల ఏ చిహ్నాలు కలుగుతాయి? ఏ జన్మలు కలుగుతాయి అని గరుడుడు అడుగగా శ్రీ హరి ఇట్లా వివరించాడు.....
పాప ఫలితాలు..!!!
బ్రహ్మ హత్య (అంటే కేవలం బ్రాహ్మణులని మాత్రమే కాదు ఎవర్ని హత్య చేసినా కూడా ఇదే వర్తిస్తుంది) - చండాలుడై పుట్టి క్షయ రోగం గలవాడు అవుతాడు
గోహత్య - ఛండాలుల్లో మరగుజ్జు వాడుగా పుడతాడు
కన్యహత్య - ఛండాలుల్లో కుష్టు రోగి
స్త్రీ హత్య,గర్భ పాతం చేసినవాడు - నిత్య రోగ బాధ
స్వగోత్ర స్త్రీ సంబంధం - నపుంసక జన్మ
గురు భార్య తో అక్రమ సంబంధం - దుష్కర్మం గల జన్మ
మాంసం భక్షణ చేసే బ్రాహ్మణుడు - అతిరక్ష అనే కుష్టు వ్యాధి
కల్లు త్రాగుట - నల్లని దంతాలు గల జన్మ
మధుర పదార్ధాలు ఇతరులకు పెట్టకుండా తనొక్కడే తినేవాడు - గరళగండ రోగ జన్మ పొందుతాడు
తినరాని వస్తువుల్ని తినే బ్రాహ్మణుడు - మహోదర జాడ్యం తో జన్మిస్తాడు
శ్రార్ధం లో అశుచి ఆహారం పెట్టేవాడు - చిత్రకుష్టువు రోగి జన్మని పొందుతాడు
గురువుని అవమానించిన వాడు - అపస్మార రోగి జన్మ
వేద శాస్త్రాలని నిందించేవాడు - పాండురోగి జన్మ
అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు - మూగవాడి జన్మ పొందుతాడు
ఏకపంక్తి లో తేడాగా భోజనం పెడితే - ఒక కన్ను లేనివాడిగా పుడతాడు
పెళ్లి చెడగొట్టే వాడు - పెదవుల్లేని జన్మ పొందుతాడు
పుస్తక చోరుడు - అంధుడై పుడతాడు
గో-బ్రహ్మణులని కాలితో తన్నేవాడు - కుంటి వాడై పుడతాడు
అబద్ధాలు చెప్పేవాడు - స్పష్టమైన వాక్కు లేని జన్మ పొందుతాడు
అబద్ధాలు వినేవాడు - చెవిటివాడి జన్మ పొందుతాడు
విషము పెట్టేవాడు - జడ ఉన్మత్త జన్మ పొందుతాడు
ఇళ్ళు తగలేబెట్టే వాడు - బట్టతల వాడి జన్మ పొందుతాడు
బంగారం దొంగలించే వాడు - పుప్పి గోళ్ళతో జన్మ పొందుతాడు
ఆచారాలని నిరసన చేసేవాడు - అడవి పావురంగా జన్మిస్తాడు
లోహాదులని దొంగలించే వాడు - నిర్ధనుడి జన్మ పొందుతాడు
అన్నమును దొంగలించే వాడు - ఎలుక జన్మ పొందుతాడు
ధాన్యము దొంగలించే వాడు - మిడత జన్మ పొందుతాడు
నీళ్లు దొంగలించే వాడు - చాతకపక్షి జన్మ పొందుతాడు
కూరలు,ఆకులు దొంగలించే వాడు - నెమలి జన్మ పొందుతాడు
పరిమళ ద్రవ్యాలు అపహరించే వాడు - చుంచుగా జన్మిస్తాడు
తేనె అపహరించేవాడు - దోమగా జన్మిస్తాడు
మాంసం అపహరించే వాడు - గ్రద్ద గా జన్మిస్తాడు
ఆత్మ హత్య చేసుకుంటే - కొండ మీద నల్ల త్రాచుగా జన్మిస్తాడు.....
No comments:
Post a Comment