Thursday, May 7, 2026

మీ మీద అసూయతో రగిలిపోయే వాళ్ళని గుర్తించండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి

మీ మీద అసూయతో రగిలిపోయే వాళ్ళని గుర్తించండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి

Author Name:Sunitha's World

Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9hLDNCDspFM



Transcript:
(00:03) మన మీద ఈర్ష ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు కొంతమంది ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళ నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న విషయాలని మనం ఈ వీడియోలో చూడబోతున్నామఅండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్ నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను పాజిటివ్ గా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.
(00:23) కొంతమంది మనల్ని చూసి ఎందుకు ఈర్షతో రగిలిపోతుంటారు అనింటే మన ఎదుగుదల వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఎదగరు మనల్ని ఎదగనివ్వరు కిందకి లాగడానికి చూస్తూఉంటారు అట్లాంటి వాళ్ళతో మనం ఎలా డీలింగ్ చేయాలి అనేది కచ్చితంగా తెలుసుకొని ఉండాలండి ప్రతి ఒక్కళ్ళ కూడా మీ ఇంట్లోనే మీరంటే ఈర్ష పడే వాళ్ళు ఉండొచ్చు ఏమో ఎవరు తోడవచ్చారు వాళ్ళ మనసులో ఏముందో మీకు మంచి మాటలు చెప్తూ మిమ్మల్ని క్రిందికి తొక్కటానికి చూస్తూ ఉండవచ్చు.
(00:51) సరేనండి ఈ పాయింట్ల మీద మనం మాట్లాడేసుకుందాం. అంతకన్నా ముందు కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం హైప్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ సింబల్ ని మీరు ఆన్ లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
(01:09) అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. అసూయపరులు జెలసీ పీపుల్ వీళ్ళని ఎలా కనిపెట్టాలి వీళ్ళని కనిపెట్టడం అంత సింపుల్ విషయం ఇంకొకటి లేదండి ఎందుకంటే మీరు సంతోషంగా ఉన్నప్పుడు వీళ్ళు ఏమాత్రం సంతోషించరు. మీ సంతోషాన్ని చూసి కుళ్లుకుంటూ ఉంటారు అందులో ఉన్న మీ యొక్క పెయిన్ చూసి వాళ్ళు చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు.
(01:41) కావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీలు కూడా చేసుకుంటూ ఉంటారు చేసుకొనివ్వండి ఎవడి ఆనందం వాళ్ళది అయితే ఈ జెలసీ పీపుల్ ని ఎలా పసికట్టాలి వీళ్ళ నుంచి మనం మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది పాయింట్ ఇక్కడ మనతో ఉంటూనే ఉంటారు మనల్ని పొగుడుతూనే ఉంటారు మన విజయాలు చూసి సహించలేరు. మనం పైకి ఎదుగుతుంటే కాళ్ళు పట్టుకొని కిందకి గుంజడానికే చూస్తూ ఉంటారు.
(02:05) కానీ మళ్ళీ మనతో బాగానే ఉంటారు ఇట్లాంటిోళ్ళు మీకు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒకసారి చూద్దాం ప్రతి మనిషికి ఉంటారండి ప్రతి మనిషికి అని చెప్పడం కన్నా సరే ఎవరైతే లైఫ్ లో ఎదగాలని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళ అందరికీ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేని తనము అన్నమాట అలాని వాళ్ళఏమైనా సాధించి ఎదగబోతున్నారా ఏమి లేదు. వాళ్ళు చేయరు మిమ్మల్ని చేయనేరు.
(02:28) ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళలో మనం పసికట్టేది మనం ఎప్పుడైనా సరే దుఃఖంలో ఉన్నామ అనుకోండి వీళ్ళ పెదవుల మీద చిరునవ్వు తాండవం ఆడుతూ ఉంటుంది. ఎక్కడ లేని ఆనందంతో వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారు సంతోషంగా ఉంటారు తుల్లుతూ ఉంటారుఅన్నమాట దానికి కారణం ఏంటయ్యా అంటే మనం ఆనందంగా లేకపోవడం అది చూసి వాళ్ళు పండగ పండగ చేసుకుంటారు.
(02:49) దాన్ని చూసి మనం కనిపెట్టేసేయొచ్చు వీళ్ళు ఎట్లా ఉన్నారా అని అయితే కొంతమంది బయటికి కనిపించకపోవచ్చు మీ దగ్గర నాటకాలు ఆడొచ్చు మీరు బాధపడుతుంటే వాళ్ళు కూడా బాధ ఉన్నట్టు ఇట్లా రకరకాలుగా కూడా వేషాలు వేస్తూఉంటారు అయినా సరే వాళ్ళని ఈజీగా పసికట్టొచ్చండి కారణం లేకుండా మీరు దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు.
(03:10) పాయింట్ నెంబర్ టూ మీ ఎదుగుదలను చూసి సహించలేరు. నువ్వు ఏదైనా ఒక ఏదైనా సాధించాలి అని అనుకుంటుంటే ఫస్ట్ే వాళ్ళు అడ్డుకులలు వేసేస్తా ఉంటారుఅన్నమాట ఏ పోయినసారి సాధించావో ఏంటి ఈసారి సాధించడానికి వచ్చేసావు మళ్ళీ ఊపుకుంటా అని చెప్పేసి మనల్ని నీరు కార్చే మాటలు మాట్లాడతారు. మనం గతంలో ఏదైతే తప్పులు చేసి శిక్షలు అనుభవించామో వాటన్నిటిని మనకి గుర్తు చేస్తూ ఉంటారు.
(03:36) మనం గతంలో చేసిన తప్పులు గుర్తు చేసేవాళ్ళు మనవాళ్ళు కాదండి ఎక్కడే అక్కడ మన తప్పులు మన మిస్టేక్స్ ఎక్కడే అక్కడ మర్చిపోతూ కాల గర్భంలో కలిపేస్తూ మనల్ని ఎవరైతే ప్రేమగా చూసుకుంటూ ఉంటారో మనలో ఉన్న లోపాలని కూడా ఇష్టపడదు అట్లాంటిోళ్ళు మనవాళ్ళు ప్రతి పాయింట్ గుర్తుపెట్టేసుకుని మనల్ని దెప్పుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మన మీద అసూయతో ఉన్నారని అర్థం.
(04:00) థర్డ్ పాయింట్ వచ్చేసి మనల్ని ఏమాత్రం ఎంకరేజ్ చేయరు. మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నామఅండి చిన్నదో పెద్దదో సాధన అని అంటే అన్నిటికీ ఒకటే అర్థం ఏదైనా సరే నీ వల్ల కాదు వదిలేయ్ అని చెప్పేస్తూ ఉంటారు. ఇలా చెప్తున్నారు అని అంటే కచ్చితంగా వాళ్ళకి మీ మీద అసూయ ఉంది అని అర్థం. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇదే పనిని చేసి ఉంటారు ఫెయిల్ అయి ఉంటారు.
(04:24) ఇప్పుడు మీరు చేసి ఎక్కడ సక్సెస్ అవుతారో అన్న భయంతోటి మిమ్మల్ని ఆపేస్తూ ఉండొచ్చు. ఇది కూడా చూసుకోండి వాళ్ళు ఏదో వద్దన్నారు అని చెప్పేసి మీకు ఇష్టమైన పనులు మానేయకండి. మీకు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో దాన్ని సాధించి చూపించండి. ఇట్లాంటి వాళ్ళకి మీ అజెండాలన్నీ చెప్పకండి నేను ఇది చేయబోతున్నాను అది చేయబోతున్నాను నెక్స్ట్ నా స్టెప్ ఇదే అని చెప్పేసి చెప్పొద్దు అసలు సీక్రెట్ గా మూవ్ అయిపోవాలి.
(04:51) ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. తీగ లాగితే దొంగ కదులుద్ది అంటారు కదా అట్లాగ మనం ఏదైనా ఒక విషయం చెప్పామ అనుకోండి వాళ్ళు అది పట్టుకొని లాగి మొత్తం బయటికి తీస్తారు. కాబట్టి అసూయ పరులకు మీ ప్రతి విషయము షేర్ చేయకండి. తెరిచిన పుస్తకం లాగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనం ఉండాల్సిన అవసరం లేదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మన దగ్గరఉన్న ఉన్న సీక్రెట్స్ అన్ని బయటికి లాగుతారు వీళ్ళలో ఉన్న సీక్రెట్స్ అన్నీ కూడా బాగా దాచేస్తూ ఉంటారు.
(05:18) నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావ్ నీ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా వీళ్ళకి అవసరం పక్కనే ఉండి నిన్ను కావిలి కాస్తూ ఇప్పుడు శత్రువు దూరంగా ఉన్నాడు అనుకోండి మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ ఓకేనా శత్రువు మన పక్కనే ఉండి మనతోనే ఉండి మన ఇంట్లోనే ఉంటూ కూడే ఉంటూ ఉన్నారు అనుకోండి మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం ఎందుకంటే వాడికి ఎప్పటికప్పుడు మన విశేషాలు తెలిసిపోతా ఉంటాయి.
(05:41) అందుకని దూరంగా ఉన్న శత్రువుని ఎదుర్కోవడం చాలా ఈజీ పక్కనే ఉన్న అసూయతో నిండిన శత్రువుని ఎదుర్కోవడం చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనం చాలా ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వన్స్ మీకు డౌట్ వచ్చేసిందండి వీళ్ళు మా మీద అసూయగా ఉన్నారని అట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కానీ కట్ చేసేయాల్సిన అవసరం లేదు ప్రతి వ్యక్తిని తప్పదనుకోండి వాళ్ళు మన రిలేషన్ బంధం మనతోనే ఉండాలి తప్పదు అట్లాంటప్పుడు వాళ్ళతో ఎలా మెయింటైన్ చేయాలిఅనేది తెలిసి ఉండాలి కానీ పూర్తిగా మనం కంప్లీట్ గా ఎవరిని కట్ చేసేయలేమ అన్నమాట పాయింట్ నెంబర్ ఫైవ్ వచ్చేసి అనవసరమైన సలహాలు
(06:19) ఇస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా నువ్వు ఇలా చెయి బాగుంటుంది అలా చేయొద్దు అని చెప్పేసి కానీ అది మొత్తం కూడా మనం ఆలోచించి చూస్తే డిఫరెంట్ తేడా అనేది కొట్టేస్తూ ఉంటుంది. మనకి ఇష్టం లేని పనులు చేయమని మనతో ఫోర్స్ చేస్తూంటారు మనకి ఇంట్రెస్ట్ లేని పనులు ఎప్పుడైనా సరే మనకి ఇంట్రెస్ట్ లేని పని చేసామ అనుకోండి అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది.
(06:38) అది ఎంత గొప్ప పనైనా కానివ్వండి మనకి దాంట్లో ఇంట్రెస్ట్ లేదునుకోండి అదేం ముందుకు వెళ్లదు. అలాగా మీకు ఇంట్రెస్ట్ లేని పనులు చేయమని ప్రోత్సహిస్తూ ఉంటారు. మీరంటే అసూయతో రగిలిపోయే వ్యక్తులు. బయట కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి అవన్నీ పట్టించుకోకండి ఎందుకంటే పిల్లలకి లీవులు కదా అలా అరుస్తూ ఉంటారున్నమాట వాటిని మనం పట్టించుకోవద్దు మనకి కంటెంట్ ఇంపార్టెంట్ కంటెంట్ లో ఉన్న పాయింట్ ఇంపార్టెంట్ అంతే అసూయపరులు మనల్ని పైకి ఎదకుండా చేయాలంటే మనకి ఇంట్రెస్ట్ లేని పనులు మన చేత చేపిస్తూ ఉంటారు.
(07:10) ఇంట్రెస్ట్ లేని పనిని మనం ఎలాగో కంప్లీట్ గా ఇంట్రెస్ట్ గా చెయ్యలేము కాబట్టి అది మధ్యలో వదిలేస్తాం తద్వారా ఫెయిల్యూర్ వస్తుంది దాన్ని వాళ్ళు పాయింట్ అవుట్ చేసి మనల్ని నిందించడానికి వాళ్ళకి మంచి అవకాశం దొరికేస్తది అన్నమాట కోతికి కొబ్బరి చిప దొరికినట్టు కాబట్టి ఇట్లాంటిోళ్ళు మీకు ఇష్టం లేని పనులు చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటే వాళ్ళ మాట వినకండి మీరు వినాల్సింది ఏంటయ్యా అంటే మీ మైండ్ మాట మీ మనసు మాట ఒక్కొక్కసారి మీ మనసు ఆ వాడు మంచోడేలే వాడిని ఎందుకు అనుమానిస్తున్నావ్ వాడు నీ మేలు కోరే వ్యక్తి అని చెప్పేసి మిమ్మల్ని రకరకాలుగా మ్యానుపులేట్ చేస్తూ ఉంటుంది మన
(07:39) మనసు కూడా మనల్ని ఒక్కొకసారి మనిపులేట్ చేస్తుందండోయ్ దీన్ని కూడా మనం అన్ని చోట్ల నమ్మలేం సెంటిమెంట్ తో ఒకటి ఆయింట్మెంట్ రాస్తుంది మన మనసు ఒక్కొక్కసారి మనం మైండ్ మాట వినాలి మనసు మాట అసలు వినకూడదు ఎందుకంటే మనసుకి సెంటిమెంట్స్ కావాలి మైండ్ కి ప్రాక్టికల్ అనేది కావాలి ప్రాక్టికల్ గా ఆలోచించడం మనసుకి ఒక్కొకసారి నచ్చదు.
(08:01) చెప్పాను కదా సెంటిమెంట్ ఆయింట్మెంట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనసుకి వ్యక్తుల మీద అటాచ్మెంట్ ఉంటుంది కానీ మైండ్ కి వాళ్ళు ఎలాంటిోళ్ళు అనేది మనకి తెలియజేస్తూ నిరంతరం మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మై డియర్ ఫ్రెండ్స్ మీ మనసు మాట వినకండి మీ మైండ్ మాట విని అది ఎలా చెప్తే అలా నడుచుకోండి. ఒక్కొక్కసారి కఠినమైన నిర్ణయాలు తీసుకోమని మీ మైండ్ మీతో చెప్తూ ఉంటుంది దాని మాట వినండి.
(08:26) హార్డ్ గా ఉన్నా సరే కొన్ని నిజాలు చేదుగా ఉన్నా సరే నిజాలు నిజాలే అబద్ధాలు తీయగా ఉంటాయి కానీ అబద్ధాలు అబద్ధాలే నిజాన్ని నిరూపించుకోవడానికి మనం ఏ విధమైన ప్రయాసలు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నిజం నిలకడగా ఉంటుంది. అబద్ధాన్ని నిరూపించాలంటే మనం చాలా అబద్ధాలు ఆడాలి ఎందుకంటే అది నిలకడగా ఉండదు ప్రతీక్షణం మారిపోతూ ఉంటుంది.
(08:51) మసిపూసి మారేడికాయ చేసి అవతల వ్యక్తులకు మనం చెప్పాల్సిన పద్ధతిలో చెప్తేనే అబద్ధాన్ని నిజమని మనం నిరూపించగలం. అప్పుడు కూడా మనం అది పూర్తిగా నిరూపించలేం ఏదో ఒక రోజు కచ్చితంగా అది అబద్ధం అని తెలిసిపోతుంది. నిజము మేకప్స్ వేసుకోదు రియాలిటీగా ఉంటుంది. దాన్ని మనం మార్చలేం ఎందుకంటే అది నిలకడైనది కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను.
(09:14) వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ జై హింద్

No comments:

Post a Comment