జ్ఞాపకాలతో నువ్వు ఏడుస్తుంటే.. వాళ్లు నవ్వుతూ గడుపుతున్నారా? why they are not missing you Explained
Author Name:Psychologyintelugu
Youtube Channel Url:https://www.youtube.com/@Psychologyintelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=u7mhpvpNKnI
Transcript:
(00:00) చాలామంది బయట చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ లోపల వాళ్ళని ఒక ప్రశ్న తినేస్తూ ఉంటుంది. అదేంటి అంటే నేను వాళ్ళని అంతలా మిస్ అవుతున్నాను కానీ వాళ్ళఎందుకు నన్ను మిస్ అవ్వట్లేదు అని ఒక్కసారి మీరు నిశబ్దంగా కూర్చొని ఆలోచించండి మీరు వాళ్ళని గుర్తు చేసుకుంటారు. వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని మీ గుండె బరవెక్కుతుంది కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవితంలో ముందుకు కొనసాగిపోతూ ఉంటారు.
(00:27) అప్పుడు మీ మనసు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. ఏంటి నా ఫీలింగ్స్ అంత చీపా అని ఇక్కడే చాలా మంది వాళ్ళ ఫీలింగ్స్ ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు వేరే వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు అని అంటే అది మీ బలహీనత కాదు మీరు వేరే వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు అనింటే మీరు నిజాయితీగా ప్రేమించే వ్యక్తి మీరు బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి మీరు డీప్ గా ఫీల్ అయ్యే వ్యక్తి అని అర్థం ఈ మూడు లక్షణాలు ఉన్నవాళ్లే ఇలా బాధపడతారు.
(00:58) ఇది లోపం కాదు ఇది చాలా గొప్ప విషయం. అసలు దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి మీరు ఎందుకు అంతలా మిస్ అవుతున్నారు వాళ్ళు ఎందుకు మిమ్మల్ని మిస్ అవ్వడం లేదు దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ ఏంటి అనేసి అంటే మీరు ట్రూ రిలేషన్షిప్ ని కోరుకుంటారు అంటే నిజమైన బంధాన్ని కోరుకుంటారు.
(01:22) ఇది ఫస్ట్ రీజన్ చాలా మంది ఏం చేస్తారంటే ఒక బంధాన్ని ఏదో టైం పాస్ కి టైం గడపడానికి సమయం గడపడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ మీరు అలా కాదు మీరు ఆ బంధానికి విలువ ఇస్తారు మీరు ఏదైతే మాట్లాడుతారో అదేదో వాళ్ళని బుట్టలో పడేయడానికి కాదు వాట్ఎవర్ యు సే యు మీన్ ఇట్ అంటే మీరు ఏదైతే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతారో అది నిజంగా మీరు ఫీల్ అయితేనే మాట్లాడతారు ఏదో వాళ్ళని మెప్పించడానికి కాదు దీనివల్ల మీరు వాళ్ళని మర్చిపోవడం మీకు చాలా కష్టంగా అవుతుంది.
(01:51) ఇంకొక రీజన్ ఏంటి అంటే మీరు ప్రేమించేటప్పుడు మీరు మీ స్వార్థం చూసుకోరు అంటే మీరు నేను వీళ్ళని ప్రేమిస్తే నాకు ఏం వస్తుంది అన్నది ఆలోచించరు. అలా కాకుండా ఓన్లీ వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని చూసుకుంటారు. దీనివల్ల మీరు వాళ్ళ నుంచి ఒక చిన్న మెసేజ్ వచ్చినా మీరు చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ చిన్న నవ్వు వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలు మీకు పదే పదే వస్తూ ఉంటాయి అన్నమాట.
(02:17) ఎందుకంటే మీరు వాళ్ళ నుంచి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమిస్తారు కాబట్టి దీనివల్ల మీరు వాళ్ళని మర్చిపోవడం ఇంకా ఎక్కువగా డిఫికల్ట్ అవుతుంది. ఇంకొక సొల్యూషన్ ఏంటి అనింటే మీరు అంత ఈజీగా ఎవ్వరిని వదులుకోలేరు అంటే మీరు ఒక్కసారి మనసు పెట్టారు అనింటే వాళ్ళ నుంచి దూరం అవ్వడం వాళ్ళని దూరం చేయడం అన్నది చాలా కష్టం మీరు మీ గుండెలో వాళ్ళకి స్థానం ఇస్తారు దానివల్ల మీరు వాళ్ళని మర్చిపోవాలి అని అనుకున్న వాళ్ళ జ్ఞాపకాలు మీకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి.
(02:50) ఇంకొక రీజన్ ఏంటి అనేసి అంటే మీరు వాళ్ళని గుర్తు చేసుకున్నా కానీ అది మీ లోపం కాదు అది చాలా గొప్ప విషయం అంటే మీరు బయట ఆ చాలా బలంగా కనిపిస్తారు స్ట్రాంగ్ గా కనిపిస్తారు లోపల మీరు బాధపడుతున్న ఎవ్వరు అది గుర్తించలేరు అంటే మీరు మీ ఫీలింగ్స్ ని లోపలే ఉంచుకొని దాంతోనే ముందుకు సాగినా కానీ ఆ మీరు ఓపికగా ఉన్నారు ఇది చాలా అరుదైన లక్షణం ఇది అందరిలో ఉండదు.
(03:16) మరి మీరు ఇంత ట్రూగా వాల్యూ చేసినా మీరు ఇంత నిస్వార్థంగా ప్రేమించినా వేరే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని మిస్ అవ్వట్లేదు అన్న విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి అందరికీ డీప్ ఫీలింగ్స్ ఉండవు అందరూ ఒక విషయాన్ని అంతే డీప్ గా అర్థం చేసుకోలేరు మనకి లేకపోతే మీకు ఉన్నంత డీప్ గా మీరు ఎంత ఎమోషనల్ గా ఉన్నారో అందరూ అలా ఉండాలని కాదు.
(03:39) కొందరు కొందరు ఏంటి అని అనేసి అంటే తొందరగా మర్చిపోతారు తొందరగా కొత్తవాళ్ళతో కలిసిపోతారు. ఏదైనా ఎవరైనా చెప్పినా గానీ వాళ్ళు అంత డీప్ గా అర్థం చేసుకోలేరు వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అన్న విషయం వీళ్ళకి అర్థం కాదు దానివల్ల వాళ్ళకి అంత ఈజీగా వాళ్ళు ఎమోషనల్ గా ఫీల్ అవ్వారన్నమాట.
(04:05) ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి సొసైటీలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది ఏదైనా యక్సిడెంట్ జరిగింది ఆ యక్సిడెంట్ ని చూసిన ఫైవ్ మెంబర్స్ సేమ్ గా ఫీల్ అవ్వరు ఒకళ్ళేమో ఓకే యాక్సిడెంట్ జరిగిందిలే అని అనుకుంటారు వెళ్ళిపోతారు ఇంకొకళ్ళేమో అరే యాక్సిడెంట్ జరిగింది ఎంతమందికి దెబ్బలు తగిలినాయో ఏమైందో ఎంతమంది చనిపోయారో ఎంత అక్కడ సఫర్ అవుతున్నారో అని ఇట్లా ఆలోచిస్తారు.
(04:26) ఇంకా కొందరేమో యక్సిడెంట్ జరిగింది కదా ఆ సరే ఎవరైనా ఉన్నారులే హెల్ప్ చేయడానికి నేను ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్ ఇట్లా ఆలోచిస్తారు. కొందరు కొందర అయితే అసలు పట్టించుకోరు యాక్సిడెంట్ జరిగినా కానీ అదిఏదో నార్మల్ అన్నట్టు చూసుకొని ముందుకు వెళ్ళిపోతారు అంటే ఒక ఇన్సిడెంట్ మీద అందరికీ సేమ్ ఫీలింగ్స్ అనేది ఉండదు ఇది యాక్సిడెంట్ కే కాదు దేనికైనా వర్తిస్తుంది.
(04:49) సో అదేవిధంగా మనం ఏదైనా గాని డీప్ గా ఫీల్ అయ్యే విషయాన్ని అందరూ అంతే పెయిన్ ఫుల్ గా ఫీల్ అవుతారు అన్నది మాత్రం కరెక్ట్ కాదు ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి సో ఎవరైనా మిమ్మల్ని మిస్ అవ్వట్లేదు అని అంటే మీ విలువ తక్కువ నా విలువనే తక్కువ నన్ను వాళ్ళు విలువ చేయట్లేదు అని కాదు వాళ్ళకి డీప్ ఫీలింగ్స్ లేవు అని అర్థం. మరి దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి దీన్ని ఎలా అధిగమించాలి అనింటే ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే మీరు కొత్త వాళ్ళతో పరిచయం చేసుకున్నప్పుడు మీరు వాళ్ళతో కొద్ది రోజులు జర్నీ చేయాలి కొద్ది రోజులు జర్నీ చేసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళకి డీప్ ఫీలింగ్స్ ఉన్నాయా లేకపోతే వాళ్ళు
(05:22) మీరు ఎంతైతే ఫీలింగ్స్ పెడతారో దాన్ని వాల్యూ చేస్తారా ఎట్లీస్ట్ రెస్పెక్ట్ చేస్తారా అన్నది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి అలా కాకుండా మీరు వాళ్ళు డిసర్వ్ చేయకపోయినా వాళ్ళకు అర్హత లేకపోయినా ఎక్కువగా వాళ్ళ మీద ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేయడం ఎక్కువగా వాళ్ళని ప్రేమించేయడం అనేది అస్సలు చేయొద్దు. ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోండి అంటే మీరు వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు అనిఅంటే నేను వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను అన్నది ఫస్ట్ మీరు తెలుసుకోండి నేను వాళ్ళని గుర్తు చేసుకోవద్దు నేను ఎందుకు ఇలా
(05:51) బిహేవ్ చేస్తున్నాను అసలు అని మిమ్మల్ని మీరు శిక్ష వేసుకోకండి. మిమ్మల్ని మీరు శిక్ష వేసుకోవడం వల్ల మీరు ఇలా నేను ఎందుకు ప్రవర్తిస్తున్నాను ఎందుకు వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తున్నాను నేను అసలు ఆలోచించొద్దు అని మీకు మీరు ఊరికే అనుకోవడం వల్ల మీకు బాధ పెరుగుతుంది. అలా కాకుండా మీరు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నా ఫీలింగ్స్ ఏంటి అన్నది అర్థం చేసుకున్నారు అని అంటే మీకు ఇంకా చాలా ఈజీగా దాని నుంచి బయటపడొచ్చు.
(06:16) ఇంకొక సొల్యూషన్స్ ఏంటి అంటే మీ జ్ఞాపకాలని దూరం చేయొద్దు. వాటికి మీనింగ్ ఇవ్వండి అంటే మీ జీవితంలో జరిగిన జ్ఞాపకాలు మీ వ్యక్తుల వల్ల వచ్చిన జ్ఞాపకాలు మీకు ఒక లెసన్స్ అవి మీ జీవితంలో ఒక భాగం అది జరిగిపోయిన విషయం దాని గురించి మీరు ఎట్లా ఆలోచించాలి అనింటే దీని నుంచి నేను ఏం నేర్చుకోగలుగుతాను అన్న దాని మీద ఫోకస్ చేయండి.
(06:44) ఇంకొక సొల్యూషన్ ఏంటి అని అనేసి అంటే మీ విలువను మీరు తెలుసుకోండి అంటే మీరు వేరే వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు అని అంటే నేను నిజంగా నిజాయితీగా ప్రేమించే వ్యక్తిని నేను బంధాలకు విలువ ఇస్తాను అని మీకు మీరు చెప్పుకోండి దాని వల్ల ఏమవుతుంది మీ బలం ఏంటో మీకు గుర్తుకొస్తుంది మీ బలం ఏంటో మీరు గుర్తిస్తారు దీనివల్ల మీరు చాలా ఈజీ గా ఫీల్ అవుతారు చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు ఇది ఇంకొక సొల్యూషన్ ఇంకొక సొల్యూషన్ ఏంటి అని అనేసి అంటే మీరు అదే విషయంలో ఉండిపోకుండా అంటే ఖాళీగా ఉండి అదే జ్ఞాపకాల్లో ఉండిపోవడం సాడ్ సాంగ్స్ వినడం అదే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని ఫీల్
(07:20) అవ్వడం కాకుండా మీరు మీరు ఉన్న టైం ని మీకు ఏవైతే విషయాలు ఇష్టమో మీరు ఏదైతే ఎంజాయ్ చేస్తారో దాని మీద మీరు ఫోకస్ చేయండి అది చేయడానికి ప్రయత్నించండి మీకు ఇష్టమైన వాటిలో మీరు మునిగిపోండి దాని వల్ల ఏమవుతుంది అనింటే స్లోగా మీరు దీని నుంచి బయట పడతారు. ఇంకొక విషయం ఏంటి అని అనేసి అంటే మీరు ఎప్పుడైనా ఎవరినైనా చూసినప్పుడు గానీ ఎవరితోనైనా రిలేషన్ లో వెళ్ళినప్పుడు గాని మీకు మీరు ఫస్ట్ నేను ఎమోషనల్ గా ఉన్నాను నేను చాలా డీప్ గా ఫీల్ అయ్యే వ్యక్తిని చాలా తొందరగా వేరే వాళ్ళని నమ్మే వ్యక్తిని అని గుర్తు చేసుకొని మీరు ఫస్ట్ వాళ్ళని టెస్ట్
(07:57) చేయండి. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాక్టికల్ గా ఉన్నారు వాళ్ళు మీ విలువని తెలుసుకుంటారు అన్నప్పుడు మాత్రమే మీరు వాళ్ళ మీద డీప్ ఫీలింగ్స్ అనేవి ఇన్వెస్ట్ చేయండి జర్నీ చేసిన తర్వాత మాత్రం ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది మిమ్మల్ని మీకు ఎవరైనా గుర్తొస్తున్నారు బాగా మీకు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అనింటే నెగిటివ్ గా మాత్రం అస్సలు ఆలోచించకండి మీ మనసుని మీరు గుర్తు చేసుకొని నేను చెప్పిన ప్రాక్టికల్ సొల్యూషన్స్ మీరు అర్థం చేసుకొని దాన్ని అప్లై చేసి మీరు దాని నుంచి బయట పడితే మిమ్ మిమ్మల్ని మీకుగా ప్రేమించే వ్యక్తి కచ్చితంగా మీ లైఫ్ లో
(08:31) వస్తారు కానీ దానికంటే ముందు మీరు ఈ ఫీలింగ్స్ నుంచి బయటపడి మీరు పీస్ ఫుల్ గా ఉండాలి మీరు న్యూట్రల్ గా ఉండాలి సో దట్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా మీ ఒక ఛాన్స్ ఉంటుంది మీకైనా వేరే వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు వేరే వాళ్ళు ఎంత డీప్ గా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అన్నది మీకు అర్థమవుతుంది అలా కాకుండా మీరు దీంట్లోనే ఉండిపోయారు అనుకోండి మీకు నిజంగా ప్రేమించే వ్యక్తి వచ్చిన మీరు దాన్ని అర్ధం చేసుకోలేదు సో ఫస్ట్ మీరు మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోండి వాటికి కొత్త మీనింగ్ ఇవ్వండి అండ్ మీరు ఎప్పుడైనా జ్ఞాపకాలు వస్తున్నాయి వేరే
(09:07) వాళ్ళవి గుర్తుకొస్తున్నారు అనింటే మీరేదో తప్పు చేశారు మీ విలువ తక్కువ అని ఫీల్ అవ్వకుండా అది మీలో ఉన్న గొప్ప లక్షణం అని గుర్తించండి. ఆ ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి అని నేను వీడియో స్టార్టింగ్ లో అట్లా చెప్పట్లేదు మధ్యలో కూడా చెప్పట్లేదు ఎందుకంటే చూసే వాళ్ళకి అది డిస్టర్బింగ్ గా ఉంటుంది అని ఆ వీడియో ఎండ్లో చెప్తున్నాను దీనివల్ల చాలా మంది మధ్యలో చూసి లేకపోతే ఎండ్లో చూసి స్కిప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు.
(09:39) మీ ఒక్క లైక్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది మీ ఒక్క సబ్స్క్రైబ్ నేను చూస్తూ ఉంటాను ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు నా ఛానల్ ని అని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది అండ్ మీ ఒపీనియన్ ఏంటి మీకు ఎట్లాంటి టాపిక్ మీద వీడియో కావాలి అన్నది డెఫినెట్ గా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ మీ కామెంట్ నాకు చాలా వాల్యూబుల్ ఆ
No comments:
Post a Comment