Saturday, May 2, 2026

అలవాట్ల బానిసగా మిగిలిపోకండి! | Break Old Habits Now | Satyagrahi

అలవాట్ల బానిసగా మిగిలిపోకండి! | Break Old Habits Now | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AVSk-YfJr9k



Transcript:
(00:00) మీరు ఈ వీడియోని వింటున్నారంటే మీ జీవితంలో ఏదో ఒక మార్పుని మీరు బలంగా కోరుకుంటున్నారని అర్థం ఒక క్షణం ఆలోచించండి మీ రోజు ఎలా గడుస్తుంది మీరు అనుకున్న పనులు మీరు చేస్తున్నారా లేక మీ మనసు మిమ్మల్ని ఎటు లాగితే అటు వెళ్తున్నారా పరమహంస యోగానంద గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీరు మీ అలవాట్ల బానిస కాదు మీరే వాటికి యజమాని కానీ నిజంగా మనం యజమానులమేనా పొద్దున్నే లేవాలని అలారం పెట్టుకుంటాం.
(00:27) కానీ మనసు ఇంకో ఐదు నిమిషాలు అని చెప్తే దానికి తలగ్గేస్తాం. ఒక పని చేయాలని మొదలు పెడతాం. కానీ ఫోన్ నోటిఫికేషన్ రాగానే మన ఏకాగ్రత మొత్తం చెదిరిపోతుంది. ఇక్కడ నియంత్రణ ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనా లేక మీ పాత అలవాట్ల చేతిలోనా? ఈరోజు మనం మన మనసుని ఎలా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలో ఆ పాత గొలుసుల నుంచి ఎలా బయట పడాలో చాలా లోతుగా మాట్లాడుకుందాం.
(00:50) సమస్య ఎక్కడుందో తెలుసా? మనం రోజు చేసే పనులు ఆలోచించే ఆలోచనలు మనకు తెలియకుండానే ఒక లోతైన గీతలా మన మెదడులో ముద్ర పడిపోతాయి. దీనినే మనం నెగిటివ్ ప్రోగ్రామింగ్ అంటాం. మీరు గమనించారో లేదో మనలో చాలా మందికి ఒక రకమైన భయం లేకపోతే అపనమ్మకం ఉంటుంది. నేను ఇది చేయగలనా అసలు నావల్ల అవుతుందా అందరూ నన్ను చూసి నవ్వుతున్నారేమో అని చెప్పేసి రకరకాల అనుమానాలు వస్తాయి.
(01:16) ఇవి కేవలం అనుమానాలు కావు ఇవి మీ మనసులో లోతుగా పాతుకుపోయిన వైరస్లు మనం శారీరికంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నా మానసికంగా ఈ నెగిటివ్ ఆలోచనల వలయంలో చిక్కుకపోతే జీవితం ఒకే చోట ఆగిపోయినట్లు అనిపిస్తుంది. చెడు అలవాట్లు అంటే కేవలం వ్యసనాలు మాత్రమే కాదు పనిని వాయిదా వేయటం, ఎప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం, అనవసరమైన విషయాల గురించి ఆందోళన చెందటం ఇవన్నీ మీ శక్తిని పిండేసే పెద్ద సమస్యలు.
(01:45) మీరు ఒక అద్భుతమైన విమానం అనుకోండి. కానీ మీ నెగిటివ్ ఆలోచనలు ఆ విమానానికి కట్టిన బరువైన రాళ్లుు. ఆ రాళ్లను వదిలించుకున్నంత కాలం మీరు ఎగరలేరు. ఈ సమస్య ఎందుకు వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మన మనసు ఒక సారవంతమైన భూమి లాంటిది. అందులో మీరు విత్తనాలు వేయకపోయినా పిచ్చి మొలకలు అవే మొలుస్తాయి. పరమహంస యోగానంద గారి విశ్లేషణ ప్రకారం ప్రతి ఒక్క మనిషి సబ్కాన్షియస్ మైండ్ ఒక టేప్ రికార్డర్ లాంటిది చిన్నప్పటి నుంచి మనం విన్న మాటలు చూసిన సంఘటనలు మన చుట్టూ ఉన్న సమాజం మనకి తెలియకుండానే మన మనసుని ప్రోగ్రాం చేసేసాయి.
(02:20) జీవితం అంటేనే కష్టపడాలి. డబ్బు సంపాదించిన వాళ్లే గొప్ప. ఒకవేళ నువ్వు డబ్బు సంపాదించకపోతే దేనికి పనికి రావు. ఇలాంటి మాటలు మన మనసులో లోతుగా వెళ్లి కూర్చున్నాయి. మీ అలవాట్లే మీ తలరాదను రాస్తాయి. మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న తప్పులే రేపు ఒక పెద్ద వైఫల్యానికి పునాది అవుతాయి. మనం మన మనసుని ఒక క్రమ శిక్షణలో పెట్టకపోతే అది పక్కనున్న చెత్తనంతా పోగు చేసుకుంటుంది.
(02:46) మీ అలవాట్లు బాగోలేకపోతే మీరు ఎంత కష్టపడినా ఫలితం శూన్యం. ఎందుకంటే మీ లోపల ఉన్న సాఫ్ట్వేర్ పాతది. ఇది ఈ కాలపు విజయాలకి సరిపోదు. మరి దీని పరిష్కారం ఏంటంటే యోగానంద్ గారు సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్ అనే అద్భుతమైన మార్గాన్ని సూచించారు. ఇది కేవలం పాజిటివ్ మాటలు చెప్పుకోవడం కాదు ఇది ఒక సైన్స్ మనసులోని పాత ప్రోగ్రామింగ్ తీసేసి కొత్త ప్రోగ్రామింగ్ ఇన్స్టాల్ చేయడం దీనికోసం మీరు మీ మనసులోకి బలమైన శక్తివంతమైన సంకేతాలు పంపాలి.
(03:17) మొదటిగా మీరు మాట మార్చాలి. నేను ఇది చేయలేను అనడానికి బదులుగా నాలో అంతు లేని శక్తి ఉంది. నేను దేన్నైనా సాధించగలను అని గట్టిగా అనుకోవాలి. కానీ ఇది పైపైన అంటే సరిపోదు. మీ భావం మీ ఏకాగ్రత ఆ మాటల్లో ఉండాలి. మీ మనసు ఒక కోతి లాంటిది. అది ఎప్పుడూ గింతుతూనే ఉంటుంది. దాన్ని శాంతింప చేయడానికి ధ్యానం ఒక ఆయుధం. మీ ఆలోచనలు గమనించడం మొదలు పెట్టండి.
(03:42) ఎప్పుడైతే ఒక నెగిటివ్ ఆలోచన వస్తుందో వెంటనే దాన్ని గుర్తించండి. ఒక పాజిటివ్ ఆలోచనతో దాన్ని రీప్లేస్ చేయండి. ఇది ఒక యుద్ధం లాంటిది. మీ పాత సంస్కారాలకి మరియు మీ కొత్త ఆశయాలకి మధ్య జరిగే యుద్ధం. ఇందులో మీరు గెలవాలంటే నిరంతరం [సంగీతం] సాధన అవసరం. మన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన పద్ధతి ఉంది.
(04:05) ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోయే ముందు 10 నిమిషాలు చాలా కీలకం ఆ సమయంలో మీ సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా తెరిచి ఉంటుంది. మీరు పడుకునే ముందు ఏ ఆలోచనతో నిద్రపోతారో మీ మనసు రాత్రంతా దానిపై పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి పడుకునే ముందు ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మీ లక్ష్యాలను మీరు ఇప్పటికే సాధించినట్లు ఊహించుకోండి.
(04:28) మీరు ఒక గొప్ప విజేతగా మారినట్లు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉన్నట్లు మీరు అందరితో సంతోషంగా ఉన్నట్లు విజువలైజ్ [సంగీతం] చేయండి. ఆ అనుభూతి ప్రతి నరంలోనూ ఫీల్ అవ్వాలి. ఇది రీప్రోగ్రామింగ్ ఉదయం లేవగానే మళ్ళీ అదే ఉత్సాహంతో రోజును మొదలు పెట్టండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాయి.
(04:50) కాబట్టి ఆ ప్రపంచాన్ని అందంగా మలుచుకునే బాధ్యత మీదే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి. ఓం [సంగీతం]

No comments:

Post a Comment