Tuesday, May 12, 2026

 స్వధర్మం అంటే వృత్తి ప్రవృత్తి కాదు! మనసు యొక్క నివృత్తి!!
_*శ్రీశివానంద గురుభ్యోనమః! శ్రీ నిసర్గదత్త మహారాజు వారి ధ్యానములు గ్రంథము పై శివశ్రీ రమణ గురుదేవుల ప్రవచన సారాంశంగా వెలువడిన "నేను లేను" గ్రంథము నుండి నిత్య సత్సంగ పాఠము (131) అధ్యాయం -14, ది.05.05.26.*_


*_శాంతిని పొందడం ఎలా ?_*

_మనం రోజూ చేసుకునే పూజ ఒక్కరోజు చేయకపోతే ఏదో వెలితిగా, బాధగా, ఆందోళనగా ఉంటుంది. అదే కలలో పూజ చేయకపోయినా ఏ బాధ ఉండదు. కారణం అక్కడ పూజ చేయాలన్న సంకల్పమే లేదు కాబట్టి. మరి ఇక్కడ బాధ పెట్టింది పూజ చేయక పోవడం కాదు. పూజ చేయాలన్న సంకల్పం. జ్ఞానం రాక పోవడం దుఃఖహేతువు కాదు. ఏదో జ్ఞానం రాలేదన్న వెలితి దుఃఖ హేతువు అవుతుంది. ఆత్మకు ఆలోచనలు లేవు. అది విషయంతో మమేకం అవుతుంది. కనుకనే ప్రణాళికలు, సంకల్పాలు. కోరికలు లేని కలలో అదే అనేక అనుభవాలను ఇచ్చినా తాత్కాలిక బాధ తప్ప మిగిలిపోయేంత దుఃఖాన్ని ఇవ్వదు. నీ అశాంతికి కారణం పరిస్థితులా? ఆలోచనలా? అన్న విషయం లోతుగా విచారణచేస్తే ఆలోచనలే ప్రధానకారణం అని తెలుస్తుంది. ఎందుకంటే నిన్ను దుఃఖ పెట్టిన పరిస్థితి అలా నిలబడి ఉండదు. కదిలి వెళ్లిపోతుంది. కానీ దుఖానికి కారణమైన ఆలోచన మాత్రం నిలిచి ఉండి నిన్ను పదేపదే దుఃఖానికి గురిచేస్తుంది._


_*శ్రీశివానందగురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్, శ్రీగురుధాం ధర్మక్షేత్రం బలుసుపాడు, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. Srigurudham.org*_



https://m.youtube.com/post/UgkxIOjW41A_p6b2w_cJ4gxJSt6856Ki7jOs

No comments:

Post a Comment