Friday, May 8, 2026

What is seen in self-realization?_The Teachings of Ramana Maharshi

What is seen in self-realization?_The Teachings of Ramana Maharshi

Author Name:Spiritual Books Club

Youtube Channel Url:https://www.youtube.com/@SpiritualBooksClub

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AM7QH1WPD38



Transcript:
(00:02) ఓం నమో భగవతే శ్రీ రమణాయ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి గారు చెప్పినటువంటి బోధనలు తెలుసుకుందాము. ఇందులో ముఖ్యంగా కొన్ని ప్రశ్నలకు భగవాన్ రమణ మహర్షి గారు ఇచ్చిన సమాధానాలు చూద్దాం. ఎరుక అంటే ఏమిటి? దాన్ని ఎలా సంపాదించుకోవాలి మరి దానిని ఎలా పెంచుకోవాలి ఆత్మే ఎరుక అయితే ఇప్పుడు ఆ ఎరుక నాకుఎందుకు లేదు ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం అయితే అతనికి కనిపించేది ఏమిటి? దానిని ప్రత్యక్ష అనుభవంగా ఎలా పొందాలి మౌనం అంటే ఏమిటి? వీటి ప్రశ్నలకు
(00:51) వీటి యొక్క సమాధానాలు మనకి భగవాన్ రమణ మహర్షి గారు అందించారు వాటిని చూద్దాం. మొదటగా ఎరుక అంటే ఏమిటి దాన్ని సంపాదించుకోవడం ఎట్లా పెంచుకోవడం ఎట్లా అనేదానికి భగవాన్ రమణ మహర్షి గారు ఇచ్చినటువంటి సమాధానం నువ్వే ఎరుక అంటే నీకు మరొక పేరు ఎరుక నీవే ఎరుకవు కనుక దాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం గాన పెంచుకోవాల్సిన అవసరం గానీ లేదు.
(01:20) ఇతర విషయాల గురించి అంటే అనాత్మ అయిన వాటి ఎరుకను విననాడాలి చేయవలసిందంతా అదే. వాటి గురించి ఎరుక విడనాడితే మిగిలేది స్వచ్ఛమైన ఎరుకే అదే ఆత్మ అంటే ఇక్కడ మనకి మీకు మొదటగా భగవాన్ రమణ మహర్షి గారు అందించినటువంటి ప్రమాదాన్ని యదావిధిగా తెలియజేస్తాను. ఆ తర్వాత కొంచెం ఎక్స్ప్లనేషన్ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఎరుక నువ్వే నువ్వే ఎరుక ఆత్మపరమైన సంబంధ విషయాలు కాకుండా వేరేవైతే ఏవైతే ఉంటాయో అవి వదిలేస్తే మిగతలేదంతా కూడా ఆత్మే అంటే నువ్వే ఎరుక ఎరుక నువ్వే
(02:06) అనాత్మ అయిన వాటి ఎరుకను విడనాడాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆత్మే ఎరుక అయితే మరి ఇప్పుడు ఆ ఎరుక నాకుఎందుకు లేదు అని ఒక భక్తుడు ప్రశ్నించాడు. దానికి భగవాన్ సమాధానం అసలు ద్వయిభావం లేనే లేదు నీ ప్రస్తుత జ్ఞానం అహంకారం వల్ల కలిగింది. అది సాపేక్షకం మాత్రమే సాపేక్ష జ్ఞానానికి కార్యకారణాలు ఉండాలి కానీ ఆత్మజ్ఞానం కేవల స్థితి దానికి ఏమీ అక్కర్లేదు.
(02:39) స్మృతి కూడా అట్లాగే సాపేక్షకం జ్ఞాపకం ఉంచుకోవడానికి ఒక విషయం కావాలి జ్ఞాపకం ఉంచుకునేవాడు కావాలి. ద్వయిభావం లేనప్పుడు ఎవరు దేనిని జ్ఞాపకం ఉంచుకోవాలి ఆత్మ ఎప్పుడు ఉంటూనే ఉంది. ప్రతి వారికి ఆత్మను తెలుసుకోవాలని ఉంటుంది. తన గురించి తాను తెలుసుకోవడానికి ఎవరి సహాయం కావాలి. ఆత్మ ఏదో కొత్త పదార్థం వల్లే అందరూ చూడాలనుకుంటారు కానీ అది శాశ్వతము ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
(03:09) అదేదో మెరిసిపోయే కాంతి వలెనో మరేదో గానో చూడాలని కోరుతారు. అది ఎట్లా సాధ్యం అది వెలుగు కాదు చీకటి కాదు అది అదే దానిని నిర్వచించలేము. అదే నేను నేను అదే ఇదే అన్నిటికన్నా శ్రేష్టమైన నిర్వచనం. శృతులు ఆత్మ అంగుష్ట అంగుష్ట మాత్రమని కేశాంతమని విద్యుత్ కణమని సూక్ష్మాతి సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమని వర్ణిస్తాయి.
(03:41) ఇవేవి నిజం కాదు అది సంస్థితం అవ్వడమే అది వాస్తవానికి అవాస్తవానికి భిన్నం అది జ్ఞానం కానీ అవిద్యకి జ్ఞానానికి భిన్నం దానిని నిర్వచించడం ఎట్లా సంస్థితం అవ్వడమే అప్పుడు ఒక భక్తుడు ఉండి ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం అయితే మరి అతను చూసేది ఏమిటి అని అడిగాడు. దానికి భగవాన్ సమాధానం చూడడం అంటూ ఏమీ లేదు చూడడం అంటే సంక్షితం అవ్వడమే ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే కొత్తగా దేనినో చూడడం కాదు దూరంగా ఉన్న గమ్యాన్ని చేరుకోవడము కాదు ఎల్లవెలలా నీ నిజ స్థితిలో సంసితం అవ్వడమే అసత్యాన్ని సత్యం అనుకోవడం విరనాడడమే నువ్వు
(04:26) చేయవలసింది. ఈ అభ్యాసాన్ని మనం వదులుకోవాలి. అప్పుడు ఆత్మని ఆత్మగా గుర్తిస్తాం. ఇంత స్పష్టంగా సువితమైన ఆత్మ కోసం అన్వేషించానఏమిటా అని నీ గురించి నీవే ఒక దశలో అనుకుంటావు కాబట్టి ఈ ప్రశ్నకి ఏమని జవాబు ఇవ్వగలం ఆ స్థితి దృశ్యానికి ద్రష్టకి అతీతం చూచేవాడు గాని చూడబడేది గాని ఏమీ ఉండవు. ఇప్పుడు అన్నింటిని చూస్తున్న ద్రష్ట ఉండడు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఇక్కడ ఆత్మ ఒక్కటే ఉన్నదల్లా అని చెప్తున్నారు మరి దానిని ప్రత్యక్ష అనుభవంగా ఎలా పొందాలి అంటున్నారు ఎలా తెలుసుకోవాలని ఒక భక్తుడు అడిగారు. దానికి భగవాన్ సమాధానం
(05:13) ఆత్మ విషయంలో తెలుసుకోవడం గురించి పలికామంటే ఇద్దరు ఉండాలన్నమాట ఒకటి ఆత్మను తెలుసుకునే నేను రెండోది తెలియబడే నేను ఇవి కాక తెలుసుకోవడం అనే కార్యం కూడా ఉండాలి. ఆత్మ సాక్షాత్కారం అనే మనం అనే స్థితి కేవలం తానుగా ఉండడమే దేనిని తెలుసుకోవడం గానీ ఏదైనా అవ్వటం గాని కాదు ఎవరి గురించి అయినా సాక్షాత్కారం పొందాడని అంటే అతడు నిత్యుడు అనే మాటే నిత్యుడు అన్నమాటే ఆ స్థితిని వర్ణించలేము ఆ స్థితే అతడు అన్నమాట అయితే ఒకటి మనం సాక్షాత్కారం అనే మాటని యధాలాపంగా అంటాం అంతకంటే మంచి పదం లేక
(05:56) ఎల్లవేలలా ఏది సంసిితమైన సత్యమో దానిని సాధించడం ఏమిటి ఎట్లా మీరు ఒక్కొక్కసారి మౌనమే ఆత్మ అంటారు ఎందుచేత ఇక్కడ చూడండి మొదటగా ఎరుక ఆత్మ అన్నారు మరి ఆత్మ మౌనం అన్నారు మౌనమే ఆత్మ అన్నారు. దానికి సమాధానం ఆత్మలో సంస్థితమైన వారు భావాలు లేని సౌందర్యంలో ఉంటారు. వారు భావించవలసింది ఏమీ లేదు అంటి పెట్టుకొని ఉండవలసిందల్లా మౌననుభవమే ఆ పరిస్థితిలో తానుగా ఉండడం తప్ప వేరే సాధించవలసింది ఏమీ ఉండదు.
(06:38) మరి మౌనం అంటే ఏమిటి అని మరో భక్తుడు అడిగాడు వాకుకి భావానికి అతీతమైన స్థితే మౌనం అంటే ఉన్నదల్లా మౌనమే మౌనాన్ని మాటలలో వర్ణించడం ఎట్లా అహంకారం ఏమాత్రం ఉదయించని స్థితే స్వరూపం అంటారు ఋషులు అదే మౌనం ఆ మౌనమైన ఆత్మే భగవంతుడు ఆత్మే జీవుడు అంటే ఈ విశ్వమంత అంతా ఆత్మే ఇతర పరిజ్ఞానం అంతా చాలా చాలా అల్పం. మౌనానుభూతే అసలైన పరిపూర్ణమైన జ్ఞానం పైకి కనబడే తేడాలన్నీ నిజం కావని అవన్నీ ఆత్మపై పడే ముద్రలేనని గ్రహించు.
(07:24) ఆత్మే అసలైన జ్ఞానం ఇ చూడండి మనకు మొదటగా ఎరుక అన్నారు ఆత్మే ఎరుక అన్నారు ఆత్మ సాక్షాత్కారం నువ్వే ఆత్మ అని తెలుసుకోవాలి అక్కడి నుంచి ఆత్మే మౌనం మౌనమే ఆత్మ అన్నారు. మరి మౌనం అంటే ఏందని తెలియజేసినప్పుడు ఆ మౌనమే ఆత్మ ఆ ఆత్మే భగవంతుడు ఆ వాకుకి భావానికి అతీతమైన స్థితే మౌనం అంటే ఇక్కడ మనకి విశ్వమంతా కూడా ఆత్మే బయట ఉన్న విశ్వమంతా ఆత్మే మన లోపల ఉన్న ఆత్మ కూడా భగవంతుడే
(08:09) ఆ మౌనమైన ఆత్మే భగవంతుడు మిగతాదంతా కూడా చాలా చాలా స్వల్పం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఇన్నర్ లోకి ప్రయాణం చేస్తూ మీ యొక్క నిజతత్వమైన ఆత్మని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ భగవాన్ రమణ మహర్షి గారికి మీ అందరికీ నా యొక్క ఆత్మపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ నెక్స్ట్ ప్రశ్నతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ థాంక్యూ ఆల్

No comments:

Post a Comment