Wednesday, August 12, 2026

జుట్టు పట్టుకొని కొట్టుకునేంత సమస్య ఏముంది #viralvideo #viral #trending #explore #youtube

జుట్టు పట్టుకొని కొట్టుకునేంత సమస్య ఏముంది #viralvideo #viral #trending #explore #youtube

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lBlUWOz-fcY



Transcript:
(00:01) అరుణాచల శివ ఈరోజు విజయనగరం జిల్లా ఎస్కోటలో ఉన్న నా యొక్క మిత్రుడికి ఫోన్ చేసి వాడి యొక్క యోగక్షేమాలు కొనుక్కున్నాను ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాడికి ఆరోగ్యం బాలేదు అంటే వాడికి బాగానే ఉంది వాడి శరీరానికే అనారోగ్యం చేసింది. కాబట్టి ఫోన్ చేసి ఎలా ఉందిరా నీ యొక్క శరీరం అని అడిగితే వాడు నీరసంగా మాట్లాడి ఉంటే పర్వాలేదు ఇంకా అనారోగ్యం ఉందేమో అని అనుకోవడానికి వాడు నిరాశగా మాట్లాడాడు నిస్పృహతో మాట్లాడాడు చాలా డల్ గా మాట్లాడాడు.
(00:36) మామ ఆరోగ్యం బాగానే ఉంది మామ మనసు బాగాలేదు మామ అన్నాడు. ఏమైంది రా అని అడిగితే మామ మా ఇంటి పక్కనే మా పిన్ని వాళ్ళు ఉన్నారు కదా మా పిన్ని వాళ్ళ కూతురు ఇద్దరూ కూడా ఈరోజు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో బూతులు విన్నాను మామ ఇద్దరూ కూడా జుట్టులు పట్టుకొని వీధిలోకి వచ్చి కొట్టుకున్నారురా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బూతులకి ఆ అరుపులకి అందరూ లేచి వచ్చి సినిమా చూసినట్లు చూశారు కానీ ఎవ్వరూ ఆపలేదురా ఇన్నాళ్లుగా ఎన్నో రోజులు రోజులు ఎంతో గౌరవంగా బతికాం కానీ పరువు మొత్తం పోయింది మామ జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారురా ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా తెలియదన్నంత
(01:21) స్థితిలో పడి కొట్టుకున్నారురా అంటే నాకు అర్థం కాలేదు ఏమైంది రా అని అడిగితే వాడు చెప్పిన సమాధానం విని ఏమనాలో అర్థం కాలేదు. ఏమైందంటే ఆ అమ్మాయిని చిన్నప్పటి నుండి చాలా చక్కగా చదివించారండి ఆ అమ్మాయి బీటెక్ చదివింది. ఒక ఉద్యోగం సంపాదించుకుంది. సంపాదించుకొని హైదరాబాద్లో చక్కగా ఒక రూమ్ తీసుకొని తన యొక్క స్నేహితులతో కలిసి ఆడవాళ్ళతోనే స్నేహితులతో కలిసి చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంటికి వచ్చేసింది ఎస్కోట జాబ్ చేసుకుంటుంది ఐ మీన్ ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకుంటుంది.
(02:02) కానీ తనకంటూ కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. 28 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలి ఈ లోపల నేను కొన్ని టూర్స్ తిరగాలి కొన్ని దేవాలయాలు కొన్ని కొడైయ కెనాలు ఊటీ లాంటి టూరిస్ట్ ప్లేసులు ఇలాంటివి కొన్ని తిరిగి కొంత సేవ్ చేసుకొని 28 ఏట గాని 30 ఏట గాని పెళ్లి చేసుకుంటాను అని ఇలా కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ తనకు ఉన్నాయి అది మంచా చెడా అనేది కాసేపు పక్కన పెట్టేయండి.
(02:26) అలా కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ తను ప్లాన్ చేసుకుంది. తల్లికి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అనేకమైన సంబంధాలు తీసుకొస్తున్నారు. ఆ తీసుకొచ్చిన సంబంధాలని ఇంటికి వచ్చిన సంబంధాలని మొఖం మీద వెళ్ళిపోమని చెప్పలేము కదా ఆవిడ సంబంధాలు తీసుకొస్తూనే ఉంది ఇంలోపలికి ఈ అమ్మాయి చెప్పాను కదమ్మా నేను 28 ఆటగాని 30 ఏటగా పెళ్లి చేసుకుంటానుని ఎందుకు సంబంధాలు తీసుకొస్తున్నారు నాకు కూడా చాలా ఇరిటేట్ గా ఉంది చెప్తే వినబడడం లేదా అని చెప్పి ఈ అమ్మాయి కాస్త ఆ కోపంలోనో వర్క్ స్ట్రెస్ లోనో ఒక నాలుగు మాటలు మాట్లాడింది నా తల్లే కదా అని ఆ తల్లి నేనేం చేయమంటాన ఏ వయసులో
(03:10) జరగాల్సింది ఆ వయసులో జరగాలి కదా 28 ఏళ్లకి 30 ఏళ్లకి పెళ్లి చేసుకునేక ఎప్పుడు పిల్లల్ని కంటావే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలమ్మ నా మాట వినమ్మ పెళ్లి చేసుకో బయట అందరూ కూడా నీ కూతురు ఎవరినైనా ప్రేమిస్తుందా ఎందుకు పెళ్లి చేసుకో లేదు ఉద్యోగం వచ్చింది కదా ఉద్యోగం వచ్చిన తర్వాత తర్వాత పెళ్లే కదా తర్వాత పిల్లల కాండము ఇదే కదా మనిషి యొక్క వరుస క్రమం ఎందుకు నీ కూతురు పెళ్లి చేసుకోవట్లేదు అని అంటే ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చింది.
(03:39) అమ్మ అందరూ ఏదో చెప్పారని గుడ్డిగా ఎందుకమ్మా ఫాలో అవుతావ్ ఒక మనిషి పుట్టగానే చదువు చదువు తర్వాత ఉద్యోగం ఉద్యోగం తర్వాత వ్యాపారం వ్యాపారం తర్వాత పెళ్లి తర్వాత చావు ఇంతేనా మనిషి జీవితం అంటే ఒక అనుభవం ఒక అనుభూతి ఉండొద్దా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం తిరగాలని ఉందమ్మ ప్రతి గుళలో అడుగు పెట్టాలని ఉంది. ఊటి కొడాయకన లాంటి ప్రకృతి ప్రదేశాల్లో తిరగాలని ఉంది ఒకటో రెండు రోజులు కూర్చోవాలని ఉంది పెళ్లి చేసుకుని పిల్లల కంటే అవి తిరగగలనా నా బ్రతుకు నాకు బ్రతకనివ్వరా అని చెప్పి ఆ అమ్మాయి నాలుగు మాటలు అనేసరికి తల్లి అలా కాదమ్మా నా మాట వినమ్మ ఏ వయసులో
(04:19) జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటే గుడ్డిగా అందరినీ ఫాలో అవుతావ ఏంటమ్మా గొర్రెలా తయారయ్యవ ఏంటి గొర్రె ఎలా అయితే ఒకరి వెనక ఒకటి వెనక ఒక వెళ్తుందో అలా వాళ్ళ వెనక నువ్వు వెళ్ళడం ఏంటమ్మా వాళ్ళ మాటలు నువ్వు ఎందుకు పట్టించుకోవడం అని తల్లి కూతురు అనడంతో తల్లి కూతుర్ల మధ్య మాటల యొక్క వాగ్వాదం జరిగిపోయింది. మాట మాట మాట మాట పెరిగిపోయి కోపాలు వచ్చాయి క్రోధాలు వచ్చాయి ఆవేశాలు వచ్చాయి కొట్టుకున్నారు ఇద్దరూ కూడా ఇంట్లో నుండి వీధిలోకి వచ్చి జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు.
(04:55) వాడు అన్నది ఏంటంటే మామ వాళ్ళు కొట్టుకున్నందుకు బాధ అనిపించలేదు మామ్మ. తల్లి కూతుర్లు కొట్టుకుంటారు అది పెద్ద విషయం కాదు. ఇంట్లో బంధువులు బంధుత్వాలు అన్నాక కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ వీధిలో ఉన్న వాళ్ళందరూ సినిమా చూసినట్టు చూశారు మామ ఒక్కడు కూడా ఆపడానికి ముందుకు రాలేదు ఒక్కరు కూడా ఒకరిని ఒక సైడ్ ఇంకొకరిని చిరక సైడు లాగే ప్రయత్నం చేయలేదు.
(05:18) ఏం అర్థం కాలేదు మామ ఆ టైం లో నేను లేను. నేను వచ్చేసరికి మొత్తం ఉన్న పరువు అంతా గంగలో కలిసిపోయింది మామ అన్నాడు. వెంటనే నేను అన్నాను మామ కనబడని పరువు కోసం ఎందుకు మామ అంత తాపత్రయ పడదో ఎదురుగా వాళ్ళ శరీరాలు ఉన్నాయి కదా వాళ్ళు బ్రతికే ఉన్నారు కదా దానికి ఆనందపడు అని వెంటనే నాకు ఒకటి అనిపించిందండి అంటే ఆ సందర్భం వినగానే ఆ తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా కొట్టుకోవడానికి వీధిలో పడి కొట్టుకోవడానికి జుట్టులు పట్టుకొని మరి కొట్టుకోవడానికి కారణం ఏంటంటే అంటే ఇక్కడ ఆ అమ్మాయి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ తల్లి యొక్క ముందు జాగ్రత్త కాదండి మాట
(06:02) తల్లికి నచ్చిన మాట కూతురికి నచ్చలేదు కూతురికి నచ్చిన మాట తల్లికి నచ్చలేదు. కూతురు ఇష్టాలు తల్లికి నచ్చలేదు తల్లి యొక్క ఇష్టాలు కూతురికి నచ్చలేదు. ఇక్కడ ద్వైతం ఉంది నువ్వు వేరు నేను వేరు అన్న స్థితి ఉంది కాబట్టే ఇది ఇక్కడిదాకా వెళ్ళిందండి ఇంట్లో జరగాల్సిన సంభాషణ వీధిలోకి వెళ్ళిపోయింది ఇంట్లో జరగాల్సిన గొడవ వీధిలోకి వెళ్ళిపోయింది ఇంకా ఎలాగో ఏమి జరగలేదు ఏమి చేసుకోలేదు కాబట్టి సరిపోయింది.
(06:31) అంటే నాకు వెంటనే ఒకటి అనిపించిందండి ఒకటి చెప్తున్నాను ఇలాంటి సందర్భాలు జరిగే ఏ ఇంట్లోనైనా ఒకే ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. నేను చాలా దగ్గరలు చూశాను మా పక్కింట్లో మా పిండి కూడా కూతురికి జడ వేస్తున్నప్పుడు ఆ తలలో పేలు ఉంటాయి కదా హెడ్లైస్ అంటారు అంటే పేలు అంటారు హెడ్లైస్ అంటారు ఇంగ్లీష్లో అవి ఉంటే ఎక్కడ తిరిగి వచ్చావే ఈ పేలుఏంటి అని అంటారు.
(06:59) కూతురు పడుకుంటే కూతురికి దాదాపు ఒక 50 మీటర్ల దూరంలో తల్లి పడుకుంటుంది ఎందుకు కూతురి యొక్క తలలో ఉన్న పేర్లు నా మీదకు వచ్చేస్తాయి నా యొక్క తలలోకి వచ్చేస్తాయి ఏమో అన్న ఒక భయం అంతే కదా అంటే మనిషి యొక్క తలలో పురుగులు ఉంటాయి అది ఎవడు తయారు చేయలేదు అలాగే మనిషి యొక్క కడుపులో కూడా పురుగులు ఉంటాయి. ఇలా పురుగులు పుట్టే స్థలం అండి మన యొక్క శరీరం అలాంటి శరీరాల కోసం కొట్టుకోవడమా అలాంటి శరీరాలు పట్టుకొని కొట్టుకోవడమా అలాంటి జుత్తు పట్టుకొని కొట్టుకోవడమా పురుగులకు ఆవాస స్థలం అండి పురుగులకు నివాస స్థలమైనటువంటి జుత్తులు పట్టుకొని
(07:36) కొట్టుకోవడం ఏంటి చెప్పండి నాకు అర్థం కాలేదు ఒక విషయం చెప్తాను వినండి ఈ భూమి మీద అత్యంత విలువైనది ఏదైనా ఉందా అంటే మనశశాంతి ప్రశాంతత దాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఎక్కడా కూడా నిలబడలేడు అతను అరుణాచలంలో కూర్చోబెట్టిన సిద్ధాశ్రమంలో కూర్చోబెట్టిన హిమాలయాల్లో కూర్చొని పెట్టిన అతని యొక్క స్థితి మారదు. అతను ఎక్కడున్న గందరగోళానికి గురవుతాడు.
(08:02) ఈ భూమ్మీద నువ్వు వచ్చింది ప్రశాంతంగా నీలో నువ్వు రమించడానికి తప్ప ఇంకొకరిని తిట్టడానికి కొట్టడానికి కాదు. చెప్తున్నా కదా ఏదైనా వదులుకోండి జీవితంలో ఆస్తులు వదులుకోండి అంతస్తులు వదులుకోండి కానీ ప్రశాంతతను మాత్రం వదులుకోకండి బంధుత్వాలు బంధాలు దేన్నైనా వదులుకోండి. కానీ ప్రశాంతతను మాత్రం వదులుకోకండి ఎట్టి పరిస్థితుల్లో మనశశాంతిని ప్రశాంతతను వదులుకోకండి.
(08:29) అది వదులుకున్ననాడు జీవితం పోయినట్టే సర్వస్వం పోయినట్టే ఎందుకంటే ఆస్తులు అంతస్తులు ఏదో ఒకటి చేసి సంపాదించొచ్చు. మంచి మార్గంలోనూ సన్మార్గంలోన సంపాదించొచ్చు దుర్మార్గంలోనూ సంపాదించొచ్చు ఆస్తులు అంతస్తులు కానీ మనశశాంతి ప్రశాంతత ఉంది చూసారా అది ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి పోతే తిరుగు రాదు.
(08:55) మీరు ఎప్పుడైనా పరిశీలన చేయండి ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళిన వాడికి అప్పులు చేసిన వాడికి ఏస లో కూర్చున్నా సరే చెమటలు పడుతుంటాయి. అంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూకి వెళ్లి ఏసీ లో కూర్చున్న వాడికైనా అప్పులు చేసి ఏసీలో కూర్చున్న వాడికైనా చెమటలు పడుతుంటాయి. చెమటలు పట్టకుండా ఉండడానికే కదా ఏసి ఉండేది మరి నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి అంటే అక్కడ మనసు ప్రశాంతత లేదు వాడి యొక్క స్థితి సరిగ్గా లేదు అది లేనప్పుడు ఎక్కడ ఉంటే ఏంటి అందుకే ఒకే ఒక్క విషయం చెప్తున్నాను జీవితంలో ఏదైనా పోగొట్టుకోండి కానీ ప్రశాంతతను మాత్రం మనశశాంతిని మాత్రం పోగొట్టుకోకండి ఆ మనశశాంతిని పట్టుకొని
(09:34) పట్టుకొని చివరి ఆఖరికి నాకు మనసే లేదు ఈ శరీరమే వెళ్లి నేను కాదు ఈ మనసే నేను కాదు ఈ ఆలోచనలే నేను కాదు అన్న విషయం తెలుసు తీసుకోండి ఒకటండి జీవితంలో రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఒకటి ఎవరిని తిట్టొద్దు రెండు ఎవరిని కొట్టొద్దు అసలు ఇంకొకరిని తిట్టే హక్కు కొట్టే హక్కు నీకు ఏ మాత్రం లేదు అది కన్న కూతురైనా కన్న కొడుకైనా నీ యొక్క శిష్యుడైనా నీ యొక్క పరివారమైనా నీకు కొట్టే హక్కు తిట్టే హక్కు లేదు.
(10:08) అలా కొట్టావు తిట్టావు అంటే నువ్వు భావోద్వేగాలకు గురైపోయినట్టే నువ్వు ఆవేశానికి లొంగిపోయినట్టే ఇంక నువ్వు నీ స్థితిలో ఏమని నిలబడతావ్ చెప్పు మిత్రమా నాకు అదే అనిపించింది ఉన్నఫలంగా అరే తల్లి కూతుర్లే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదానికి కొట్టుకున్నారా జుత్తులు పట్టుకొని ఏంటిది కాబట్టి ఇలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినప్పుడు మౌనం వహించండి.
(10:34) జరిగేదే జరగని వచ్చేదేదో రాని పోయేదేదో పోని స్థిరంగా ఉండండి మౌనంగా ఉండండి భావోద్వేగాలకు లోను కాకండి అరిషడ్ వర్గాలకు లోను కాకండి సాక్షిగా ఉండండి పరిశీలన చేయండి ఎవ్వరిని తిట్టొద్దు కొట్టొద్దు అలాంటి సందర్భమే వస్తే ఎదుటి వారికి బాయి చెప్పి వెళ్ళిపోండి నేను అదే పని చేశాను నా జీవితంలో నేను పట్టుకున్న వాళ్ళ కన్నా వదిలేసిన వాళ్ళు కొన్ని వందల వేలల్లో ఉన్నారు నా జీవితంలో నేను పట్టుకున్న వాళ్ళు ఒకరో ఇద్దరే ఒకటి కంచి కామాక్షిని పట్టుకున్నాను రెండు విజయనగరానికి చెందిన నాయుడు అనే ఒక మిత్రుడిని పట్టుకున్నాను.
(11:13) మూడు చంద్రశేఖర్ అని చెప్పి హైదరాబాద్ లో ఉన్న నా మిత్రుడిని పట్టుకున్నాను. ఈ ముగ్గురే నిన్ను పట్టుకున్నది వీళ్ళని కూడా నేను ఎప్పుడు నిరంతరం వీళ్ళతో మాట్లాడను. వాళ్ళు ఎలా ఉన్నా సరే నన్ను యక్సెప్ట్ చేస్తారు అజ్జు ఎలా ఉన్నా పర్లేదురా నువ్వు అని అంటారు. నేను ఏం మాట్లాడినా యక్సెప్ట్ చేస్తారు నన్ను తిట్టరు కొట్టరు నేను కూడాఏదో వాళ్ళు ఎలా అయినా ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పి నేను తిట్టను కొట్టను నేను ఎలా పడితే అలా మాట్లాడను నేను ఎంత పరిధిలో ఉండాలో అంత పరిధిలో ఉంటాను ఎందుకంటే నేను వాడు ఒకటే అయినప్పటికీ స్థితి పరంగా నా శరీరం వేరు వాడి శరీరం
(11:50) వేరు వాడి శరీరాన్ని నేను కించపరిచే హక్కు నాకు లేదు. అలా ఎప్పుడూ ఇంకొకరిని తిట్టొద్దు కొట్టొద్దు దయచేసి ఎప్పుడు ఎవరిని తిట్టొద్దు కొట్టొద్దు ఎందుకంటే అవి నీలో వాసనలుగా సంస్కారాలుగా మిగిలిపోతాయి. ఈరోజు మీరు తిట్టుకొని కలిసిపోవచ్చు ఈరోజు మీరు కొట్టుకొని కలిసిపోవచ్చు కానీ అది 10 ఏళ్ళయినా 50 ఏళ్ళ అయినా ఆ యొక్క గుర్తులు జ్ఞాపకాలు మీకు మిగిలిపోతాయి.
(12:14) ఎక్కడో దగ్గర అతని మీద ఎక్కించ కోపం ఉండిపోతుంది. అది మళ్ళీ పూర్వజన్మకి దారి తీస్తుంది ఎందుకు అవసరమా ఇంకొకరిని తిట్టడం కొట్టడం కంటే చక్కగా బాయ్ చెప్పండి బాబు నీతో నాకు ఇంకా మాటలు అనవసరం చక్కగా నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా జీవితంలో నీ జీవితాన్ని నీవు అనుభవించు నా జీవితాన్ని నేను అనుభవిస్తా నీ కష్టాన్ని నువ్వు అనుభవించు నా కష్టాన్ని నేను అనుభవిస్తా నీ కర్మలను నువ్వు అనుభవించు నా కర్మలు నేను అనుభవిస్తా అంటే సరిపోదా తిట్టుకోవాలా కొట్టుకోవాలా నేను నా యొక్క మిత్రుడు హైదరాబాద్లో చంద్రశేఖర్ అని ఉన్నాడండి వాడికి పెళ్లిఅయి మూడు సంవత్సరాలు
(12:54) అవుతుంది ఏరోజు ఇంతవరకు భార్యను తిట్టలేదు కొట్టలేదు అది జీవితం అంటే అలా అని చెప్పి వాడికి సమస్యలు లేవని కాదు ఇంట్లో బయట వాళ్ళకి అవి సమస్యలేము కానీ వాడికి అవి సమస్యలు కావు వాడు ఆ స్థితికి చేరిపోయాడు అంతే రోజు పొద్దున లేస్తే దక్షిణామూర్తి దక్షిణామూర్తి శివుడి యందు రమిస్తుంటాడు. పని చేస్తున్న ఓం నమఃశివాయ పని చేయకపోయినా ఓం నమఃశివాయ చాలు ఇంకా అంతకంటే ఏముంది జీవితంలో మౌనాన్ని పట్టుకొని నేను ఏ స్థితిని పొందానో వాడు దక్షిణామూర్తిని పట్టుకొని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టుకొని వాడు ఆ స్థితినే పొందేసాడు ఏ మార్గం అయితే ఏముంది అది భక్తి మార్గం
(13:25) అయితే ఏంది జ్ఞాన మార్గం అయితే ఏంది చేరుకోవాల్సిన స్థితి ఒక్కటే కదా వాడికి ఎలాగైతే వికారాలు లేవో నాకు లేవు బయట నుండి ఎన్ని మాటలు అవుతున్నా మూడు సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరన్నా భార్యని నిరంతరం గుల్లు గోపురాలు తిప్పుతావ్ ఇంకెక్కడికి తిప్పవా అన్నా ఎన్ని వంకలు పెడుతున్న ఏరోజు వాడికి కోపం రాదు వికారం రాదు స్థిరంగా సాక్షిగా మౌనంగా ఉంటాడు అది మనిషి నేర్చుకోవాల్సిన పద్ధతి జుత్తులు పట్టుకొని కొట్టుకోవడం ఏంటండి ఒకరినొకరు తిట్టుకోవడం ఏంటండి భార్యని భర్త కొట్టడం ఏంటి భర్తని భార్య కొట్టడం ఏంటి పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టడం ఏంటి తల్లిదండ్రులు పిల్లల్ని
(14:05) కొట్టడం ఏంటి అసలు ఈ కొట్టుకోవడం ఏంటి నరుక్కోవడం ఏంటి తిట్టుకోవడం ఏంటి నాకు అర్థం కాని విషయం ఈ భూమ్మీద వచ్చింది హాయిగా నవ్వుతూ బ్రతకడానికి ఆకాశాన్ని చూస్తూ నవ్వు ఒక చెట్టును చూసి నవ్వు ఒక సీతాక ఒక చులుకని చూసి నవ్వు ఒక గులాబిని చూసి ఆనందించు చక్కగా నవ్వుతూ వచ్చి నవ్వుతూ వెళ్ళిపోవాలి అది కదా జీవితం అందుకు కదా ఈ భూమి మీదకి వచ్చింది.
(14:28) ప్రారబ్ధం ప్రకారం ఏమైనా రాని అవి ఈ శరీరానికి జరుగుతున్నాయి నాకు కాదన్న విషయం గుర్తించి సాక్షిగా ఉండు అందుకు కదా జీవితం ఒక్కసారి ఎవరినైనా తిట్టే ముందు కొట్టే ముందు మౌనంగా ఉండండి ఉండలేను అని అనుకుంటే తిడతాను అని అనుకుంటే చక్కగా వాళ్ళకి బాయ్ చెప్పేయండి టాటా బాయ్ బాయ్ చెప్పి నీ బతుకు నువ్వు బతుకు నీ కర్మ నువ్వు అనుభవించు అని చెప్పి హాయిగా మీరు ఉండండి ఈరోజు నేను చేసేది అదేనండి నా జీవితంలో నేను వదిలేసిన వాళ్ళ పేర్లు చెప్పడాని కూడా వీలు ఉండదు అంత మందిని వదిలేసాను వందల వేల మందిని వదిలేసాను.
(15:02) అది బంధువులు అవ్వచ్చు, బంధుత్వాలు అవ్వచ్చు క్లాస్మేట్స్ అవ్వచ్చు కాలేజ్ మేట్స్ అవ్వచ్చు ఆఫీస్ మేట్స్ అవ్వచ్చు అందరినీ వదిలేసాను ఐ డోంట్ కేర్ ఎందుకంటే అక్కడ ఉన్నది నేనే వాడిలో ఏదిఉందో నాలో అదే ఉంది ఎందుకు మాట్లాడడం మాట మాట మాట్లాడితే వాడుఏదో మాట్లాడతాడు నేనేదో మాట్లాడతాను నేను మాట్లాడింది వాడికి నచ్చకపోతే వాడికి కోపం వాడు మాట్లాడింది నాకు నచ్చకపోతే నేను ఫోన్ కట్ చేసేస్తాను ఎందుకు ఇది ఇష్టము అయిష్టం లేదన్న స్థితికి కదా చేరుకోవాలి నువ్వు మంచి చెడు లేదన్న స్థితికి కదా చేరుకోవాలి నువ్వు ధర్మం అధర్మం లేదన్న విషయం తెలుసుకోవడం కదా
(15:37) నువ్వు చేరుకోవాలి ఆ స్థితి అందుకు కదా జీవితం కాబట్టి జీవితంలో తిట్టడం కొట్టడం ఈ రెండు పనులు జీవితంలో ఎప్పుడూ చేయొద్దు ఎవరితో చేయొద్దు భార్యని కొట్టకండి భర్తని కొట్టకండి తల్లిని కొట్టకండి పిల్లల్ని కొట్టకండి గురువుని కొట్టకండి శిష్యుని కొట్టండి ఒకరినొకరు కొట్టుకోకండి ఒకరినొకరు తిట్టుకోకండి. హాయిగా నవ్వుతూ మౌనంగా ఉంటూ మీలో మీరు రమిస్తూ మీ పని మీరు చేసుకుంటూ హాయిగా చచ్చిపోండి నాలాగా నేను ఎలా అయితే మౌనంగా రోజుకి 15 నుండి 18 గంటలు మౌనంగా ఉంటూ నా పని నేను చేసుకుంటున్నానో ఎటువంటి బాధరాబంది లేకుండా ఎటువంటి వికారాలు లేకుండా అలాంటి
(16:20) స్థితిని అనుభవించండి అది అనుభవించిన వాడికి తెలుస్తుందండి ఆనందం నేను ఎప్పుడు చెప్తూ ఉంటా మౌనాన్ని పట్టుకుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు అది అది ఒక రోజు ఉండే ఆనందం కాదండి నిరంతరం ఉంటుంది. కళ్ళ ముందు ఎలాంటి సందర్భం ఎలాంటి సన్నివేశం జరిగినా ఆనందమే ఉంటుంది. బాధ కలగదు అన్నమయ్య పొందిన ఆనందం అండి అది వెంగమామ పొందిన ఆనందం సనత్ కుమారులు పొందిన ఆనందం రమణ మహర్షి పొందిన ఆనందం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పొందిన ఆనందం దానికోసం వాళ్ళు ఏం చేశారు అంటే మౌనంగా ఉంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు.
(17:01) ఒకరు ఆలోచనలు ఇంకొకరి మీద రుద్దలేదు వాళ్ళు ఎప్పుడు ఎవరిని తిట్టలేదు ఎవరిని కొట్టలేదు కాబట్టి జీవితంలో ఎవరిని తిట్టొద్దు ఎవరిని కొట్టొద్దు మౌనంగా ఉంటూ నీ పని నువ్వు చేసుకో జుత్తులు పీక్కొని కొట్టుకోవాల్సిన అవసరము లేదు ఈ భూమిమీద జుత్తు పీక్కునేంత సమస్యలు లేవు ఈ భూమిమీద సరేనా కాబట్టి ఎప్పుడైనా సరే జుత్తులు పీక్కొని జుత్తులు కొట్టుకునే అంత సమస్యలు లేవని తెలుసుకోండి ఎందుకంటే నిన్న ఒక విషయం జరిగింది సరదా సంభాషణ నా మిత్రుడితో అది చెప్పి ముగిస్తాను.
(17:35) నిన్న నా మిత్రుడు ఫోన్ చేసి మామా నేను ప్రేమించిన అమ్మాయిని ఈరోజు చూశాను లంగాబోని కట్టుకొని ఎంత అందంగా ఉందోరా ముద్దు పెట్టుకోవాలి అనిపించిందిరా చేతి మీద ముద్దు పెట్టుకున్నాను మామా అన్నాడు మంచిదిరా అన్నా అని ఇంకొక విషయం అన్నా మామ అందంగా ఉందన్నావు కదా అది బయటా లోపల అని అడిగాను బయటా లోపల ఏంట్రా బుద్ధి తక్కువ ప్రశ్న అన్నాడు వాడు మామ నువ్వు చూసింది బయట శరీరాన్ని శరీరం తొలగి యొక్క చర్మా చర్మాన్ని చర్మాన్ని చూసి నువ్వు అందంగా ఉందంటున్నావ్ అదే ఆ చర్మం వెనకాల లోపల చూస్తే నువ్వు గందరగోళానికి గురవుతావ్ భయపడిపోతావ్ అంత దారుణంగా ఉంటుంది లోపల
(18:17) డైజెషన్ సిస్టం అంతా ఎంత మృదువుగా ఉంటుందో అంత దారుణంగా అంత భయంకరంగా అంత చండాలంగా ఉంటుంది మనిషి యొక్క శరీరం లోపల శరీరం బయట ముద్దు పెట్టగలుగుతున్నావ్ శరీరం లోపల ఒకవేళ తెరిచి ముద్దు పెట్టమంటే చూడగలవా అసలు అసలు చూసి తట్టుకోగలవా ముద్దు పెట్టగల అసలు చూడడానికే భయపడతావే అని అంటే వాడు వెంటనే YouTube లో వీడియో చూసి యానిమేటెడ్ వీడియో బాబు ఇంత చండాలంగా ఉంటదా మనిషి యొక్క కడుపు లోపల మనిషి యొక్క శరీరం లోపల అని చెప్పి కంగారుపడిపోయాడు.
(18:46) అంతే కదండీ బయట వాటిని చూసి ఎప్పుడూ మురిసిపోవద్దు లోపల చూడండి మూలంలోకి వెళ్ళండి మూలాన్ని పట్టుకోండి ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ ఆలోచనలు నేను కాదు అవి జస్ట్ బాహ్య స్వరూపాలు మాత్రమే లోపల మూలం ఉంది చూసారా అది గాలి అది ఆత్మ అది అందరిలో ఉన్నది ఒకటే అది లేకపోతే ఏది ఉనికే లేదు 84 లక్షల చరాచర జీవరాశులు పడిపోతాయి.
(19:10) అనే విషయం నీకు మూలం అనేది స్పష్టంగా అర్థమైన నాడు జుట్టులు జుట్టులు పట్టుకొని పీక్కోవాల్సిన అవసరం లేదు నీ జుట్టు నువ్వు పీక్కునేంత సమస్యలు లేవు గట్టిగా మాట్లాడితే ప్రేమించిన అమ్మాయిని ముద్దు కూడా పెట్టవు అలాంటి స్థితికి ప్రతి ఒక్కరు చేరుకోండి ఆ పరిశీలన ఆత్మ విచారణ అందరూ చేయండి. సరేనా ఆ స్థితిని అందరూ పొందాలని కోరుకుంటూ [నిట్టూర్పులు][ఆశ్చర్యం] అరుణాచల శివ ఇట్లు మీ అజ్జు బయపర్లి

No comments:

Post a Comment