Why Modern Life Feels So Hard | Motivational videos | Tips to follow good habits #healthylifestyle
Author Name:Jeevithamastu
Youtube Channel Url:https://www.youtube.com/@Swapna_Jeevithamastu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-pZJmFURDp8
Transcript:
(00:00) ఈ మధ్య ఒక విషయం నా మైండ్ లో చాలా రన్ అవుతుంది. అదేంటంటే ఈ రోజుల్లో మనకి మంచి చేసే పని చేయడం అంటే రైట్ ఛాయిసెస్ తీసుకోవడం రోజు రోజుకి కష్టమైపోతుంది. మనం హెల్దీగా ఉండాలనుకుంటాం కానీ అన్‌హెల్తీ ఛాయిసెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం ఫోకస్ గా ఉండాలి అనుకుంటాం కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మన పిల్లలకి మంచి వాల్యూస్ నేర్పాలి అనుకుంటాం కానీ వాళ్ళు పెరుగుతున్న ఎన్విరాన్మెంట్ వేరే మెసేజ్ ఇస్తుంది.
(00:28) మనిషి ఎంత తెలివిగా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తున్నాడో అదే సమయంలో తనకి తాను ఛాలెంజెస్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. నేను కంఫర్ట్ కి అగైనెస్ట్ కాదు టెక్నాలజీకి అగైనెస్ట్ కాదు బిజినెస్ కి అగైనెస్ట్ కాదు సోషల్ మీడియా కూడా తప్పు అని అనడం లేదు. నిజానికి అవన్నీ మన లైఫ్ ని చాలా ఈజీ చేశయి. కానీ ఒక క్వశ్చన్ మన చుట్టూ ఉన్న ఈ సిస్టమ్స్ ఈ ఎన్విరాన్మెంట్ నిజంగా మనల్ని హెల్దీగా హ్యాపీగా స్ట్రాంగ్ గా చేస్తున్నాయా లేక లైఫ్ ని ఈజీ చేస్తూనే తెలియకుండానే మనల్ని వీక్ చేస్తున్నాయా ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తే నాకు మూడు విషయాలు మనల్ని బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి
(01:05) అనిపించింది. అందులో మొదటిది కంఫర్ట్ ఈ రోజుల్లో మనకి అన్ని విధాలుగా కంఫర్ట్ ఎక్కువైపోయింది కానీ ఒక్కోసారి అది మనల్ని వీక్ చేస్తుంది. ఇదివరకటి రోజుల్లో మన రోజువారి లైఫ్ లో చాలా మూమెంట్ ఉండేది. నీళ్లు మోసేవాళ్ళం మెట్లుఎక్కేవాళ్ళం చాలా పనులు చేతులతో చేసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి పనికి ఒక మెషిన్ ఉంది. దాని రిజల్ట్ మన బాడీకి అవసరమైన మూమెంట్ తగ్గిపోయింది.
(01:32) జిమ్ కి వెళ్తే తప్ప ఎక్సర్సైజ్ లేదు. చాలా మంది 40 ఇయర్స్ కే ఫ్లక్సిబిలిటీ కోల్పోతున్నారు. ఫ్లోర్ మీద కూర్చోవడం లేవడం సింపుల్ మూమెంట్స్ కూడా కష్టంఅవుతున్నాయి. ఇక్కడ ప్రాబ్లం కంఫర్ట్స్ కాదు మన బాడీకి అవసరమైన మూమెంట్ తగ్గిపోవడమే ప్రాబ్లం ఇదే విషయం మన బ్రెయిన్ కి కూడా అప్లై అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అమేజింగ్ టూల్ నేను కూడా యూస్ చేస్తాను.
(01:53) కానీ ప్రతి చిన్న విషయం ప్రతి చిన్న డెసిషన్ ప్రతి ఐడియా ఏఐ మీద డిపెండ్ అవుతుంటే క్రియేటివ్ గా ఆలోచించడం సొల్యూషన్స్ వెతకడం నిర్ణయాలు తీసుకోవడం ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేయడం ఇలాంటివి చేసే ఎబిలిటీ మన బ్రెయిన్ కి తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. ఒక రకంగా లైఫ్ చాలా ఈజీ అయింది కానీ మన బాడీ మైండ్ కి అవసరమైన పని తగ్గిపోతుంది మన ఎబిలిటీస్ తగ్గిపోతున్నాయి.
(02:17) ఇంకా రెండో విషయం ఏంటి అంటే సోషల్ మీడియా అండ్ వైరల్ కంటెంట్ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని వైరల్ చుట్టూనే తిరుగుతున్నాయి మీనింగ్‌ఫుల్ కంటెంట్ కంటే ట్రెండింగ్ కంటెంట్ కి ఎక్కువ వాల్యూ వస్తుంది. కొంతమంది జర్నలిస్ట్స్ కూడా న్యూస్ చెప్పడం కంటే ఒపీనియన్ చెప్పడం వైపు వెళ్ళిపోతున్నారు. కాంట్రవర్సీ టాపిక్స్ కి వ్యూస్ ఎక్కువ వచ్చే టాపిక్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
(02:39) కొంతమంది అస్సలు వాల్యూస్ లేకుండా ఫేక్ తంబ్నెయిల్స్ పెట్టి వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇంకొన్ని తంబ్నెల్స్ చూస్తే ఇది తింటే క్యాన్సర్ వస్తుంది ఇది చేయకపోతే ప్రమాదం అంటూ ఫియర్ క్రియేట్ చేసే కంటెంట్ తో మన అటెన్షన్ ని లాక్కుంటున్నారు. రోజంతా కాంట్రవర్సీస్ కామెంట్స్ ఒపీనియన్స్ ఒక కాంట్రవర్సీ ముగిసేలోపు ఇంకో కాంట్రవర్సీ రెడీగా ఉంటుంది.
(03:02) మనం కన్స్ూమ్ చేస్తూనే ఉంటాం కానీ చివరికి మన లైఫ్ లో ఏం మారుతుంది విషయాలు తెలుసుకోవడం కంటే చాలాసార్లు మనకి యంజైటీ పెరుగుతుంది. మన అటెన్షన్ మన పీస్ మన టైం ఇవన్నీ తగ్గిపోతున్నాయి. అండ్ దాని ఎఫెక్ట్ మన రిలేషన్షిప్స్ మీద కూడా పడుతుంది. ఇంట్లో అందరం కలిసి ఉన్న చాలాసార్లు మనం కలిసి ఉండడం లేదు కాన్వర్సేషన్స్ తగ్గిపోతున్నాయి. ఇతరులు చెప్పేది వినడం తగ్గిపోతుంది.
(03:25) ప్రెసెన్స్ కంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. మన అటెన్షన్ కోసం కొన్ని ప్లాట్ఫార్మ్స్ చాలా కాంపిటీషన్ తో పనిచేస్తున్నాయి. ఎందుకంటే మన అటెన్షన్ కూడా ఇప్పుడు ఒక బిజినెస్ అయిపోయింది. బిజినెస్ అన్నాను కదా అదే మన నెక్స్ట్ విషయం. ఈ రోజుల్లో చాలా సిస్టమ్స్ డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయేమో అనిపిస్తుంది. మనీ ఎర్న్ చేయడం తప్పు కాదు బిజినెస్ గ్రో చేసుకోవడం కూడా తప్పు కాదు.
(03:50) కానీ లాభాలు డబ్బు మాత్రమే డెసిషన్స్ ని డ్రైవ్ చేయడం మొదలు పెడితే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మధ్య తెలిసింది కొన్ని హాస్పిటల్స్ లో ఏ డాక్టర్స్ అయితే ఎక్కువ సర్జరీస్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రమోషన్స్ ఉంటాయంట. అది ప్రతి హాస్పిటల్ లో జరుగుతుందని నేను చెప్పడం లేదు కానీ అలాంటి సిస్టమ్స్ ఉంటే పేషెంట్ కి ఏది బెస్ట్ అన్నదానికంటే సిస్టం ఏది రివార్డ్ చేస్తుందో దాని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది కదా అదేవిధంగా మీడియా ఎడ్యుకేషన్ ఫుడ్ ఇండస్ట్రీ చాలా చోట్ల మనుషులకి ఏది మంచిది అనే క్వశ్చన్ కంటే ఏది ఎక్కువ లాభం
(04:24) తీసుకొస్తుంది ఏది తక్కువ ఖర్చులో అయిపోతుంది అనే క్వశ్చన్స్ కొన్నిసార్లు పెద్దవిగా మారుతున్నాయేమో అనిపిస్తుంది. దానివల్ల కొన్ని చోట్ల క్వాలిటీ తగ్గిపోతుంది కొన్ని చోట్ల కల్తీలు పెరిగిపోతున్నాయి. అండ్ నాకు ఇదొకటి ఎప్పటినుంచో అనిపిస్తూ ఉంటది ఒకవైపు స్మోకింగ్ హెల్త్ కి హానికరమనే వార్నింగ్స్ కనిపిస్తాయి. మరోవైపు సిగరెట్ మాత్రం అమ్ముడవుతూనే ఉంటుంది ఎందుకంటే వాటి వెనక ఒక పెద్ద బిజినెస్ ఉంది.
(04:50) అలాగే ఆల్కహాల్ గురించి హెల్త్ వార్నింగ్స్ ఉంటాయి. కానీ అది కూడా ఒక పెద్ద బిజినెస్. ఇలాంటివన్నీ చూస్తుంటే కొన్నిసార్లు లాంగ్ టర్మ్ వెల్ బీయింగ్ కంటే డబ్బులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే సిస్టమ్స్ ఉంటున్నాయి అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మన మంచి డెసిషన్స్ తీసుకునేలాగా డిజైన్ కాలేదు. మనక ఏది కావాలో దానికి ఆపోజిట్ మన చుట్టూ ఉంటుంది.
(05:12) రైట్ ఛాయిస్ తీసుకోవడం ఛాలెంజింగ్ అయిపోతుంది కంట్రోల్ చేసుకోవడం ఎక్కువయపోతుంది. హెల్దీ ఫుడ్ కంటే జంక్ ఫుడ్ ఈజీ వాకింగ్ కంటే వెహికల్ ఈజీ చదవడం కంటే స్క్రోలింగ్ ఈజీ ఆలోచించడం కంటే ఇన్స్టంట్ ఆన్సర్స్ ఈజీ సైలెన్స్ కంటే నోటిఫికేషన్ ఈజీ అంటే రైట్ ఛాయిస్ తీసుకోవడానికి ఈ రోజుల్లో నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు కాన్షియస్ ఎఫర్ట్ కూడా కావాలి.
(05:33) అందుకే మనం చాలా టైర్డ్ గా ఫీల్ అవుతున్నాం. ప్రతిరోజు మన ఎన్విరాన్మెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో స్విమ్ చేయాల్సి వస్తుంది. కంఫర్ట్ ఎదురుగా ఉంటుంది ప్లెజర్ ఎదురుగా ఉంటుంది డిస్ట్రాక్షన్స్ ఎదురుగా ఉంటాయి. వాటినన్నిటిని పక్కన పెట్టి మనకి హెల్ప్ చేసేది చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అది అంత ఈజీ కాదు అందుకే చాలాసార్లు మనం ఫెయిల్ అవుతాం.
(05:54) తర్వాత నాకు డిసిప్లిన్ లేదు నేను స్ట్రాంగ్ కాదు అని గిల్టీగా కూడా ఫీల్ అవుతాం. అలానే పిల్లల్ని మంచి వాల్యూస్ తో పెంచడం కూడా ఈ రోజుల్లో చాలా ఛాలెంజింగ్ అయిపోయింది. మనం పేషెన్స్ నేర్పించాలఅనుకుంటాం కానీ ఇన్స్టెంట్ గా ప్లెజర్ ఇచ్చేది ఎదురుగా ఉంటుంది. మనం కైండ్‌నెస్ నేర్పాలి అనుకుంటాం కానీ కంపారిజన్స్ పెరిగిపోతున్నాయి మనం అవుట్డోర్ ప్లే కోరుకుంటాం స్క్రీన్స్ వాళ్ళని పిలుస్తూ ఉంటాయి.
(06:16) మనం ఫోకస్ నేర్పాలి అనుకుంటాం కానీ చుట్టూ అంతా డిస్ట్రాక్షన్ే ఉంది. మరి వీటికి సొల్యూషన్స్ ఏంటి అంటే సొల్యూషన్స్ ఉన్నాయి కానీ వాటిని పాటించడమే రోజు రోజుకి కష్టమైపోతుంది. మూమెంట్ కి స్పేస్ క్రియేట్ చేయొచ్చు జిమ్ కి కన్సిస్టెంట్ గా వెళ్ళొచ్చు హెల్దీ ఫుడ్ ని ఈజీ ఛాయిస్ గా చేయొచ్చు బుక్స్ కి చోటు ఇవ్వచ్చు మీనింగ్‌ఫుల్ కాన్వర్సేషన్స్ పెంచొచ్చు ఫోన్ కి బౌండరీస్ పెట్టొచ్చు ఏఐ ని హెల్దీగా యూస్ చేసుకోవచ్చు సోషల్ మీడియాని కంట్రోల్డ్ గా యూస్ చేయొచ్చు పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు.
(06:45) ఇలాంటివన్నీ నేను వీడియోస్ లో మీకు ఎప్పుడు చెప్పేవే మీకు గుర్తు చేసేవే కానీ ఈ వీడియో చేసింది మాత్రం సొల్యూషన్స్ చెప్పడానికి కాదు మన స్ట్రగుల్స్ కి ఒక కాంటెక్స్ట్ ఇవ్వడానికి మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నామో మనందరం కలిసి ఒకసారి అర్థం చేసుకోవడానికి ఎస్ అందరం స్ట్రగుల్ అవుతున్నాం అందరం సైలెంట్ గా ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం.
(07:07) మన సిస్టమ్స్ తో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తో ప్రతిరోజు ఫైట్ చేస్తున్నాం. ఇది ఈజీ కాదు కానీ ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో మనకి నిజంగా హెల్ప్ చేసే పనులు చేయడం ఇంకా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే అవే మనల్ని స్ట్రాంగ్ గా నిలబెడతాయి. బయట ప్రపంచం ఎలా మారుతుందో అది ఎప్పుడూ మన చేతిలో ఉండకపోవచ్చు కానీ మన హెల్త్ ని మన పీస్ ని మన వాల్యూస్ ని మన రిలేషన్షిప్స్ ని ప్రొటెక్ట్ చేసే సిస్టమ్స్ ని అట్లీస్ట్ మన వరకు మన ఇంటి వరకు మన ఫ్యామిలీ వరకు మనకి వీలైనంత వరకు మనం క్రియేట్ చేసుకోవాలి.
(07:42) ఇది మనకోసం మాత్రమే కాదు మన నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా ఎందుకంటే వాళ్ళు ఎదిగే ప్రపంచం ఇంకా వేగంగా మారిపోతుంది. అందుకే మనకి మేలు చేసే విధంగా మనం జీవించడం అది చూసి వాళ్ళు నేర్చుకోవడం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అలానే మనం కంప్లీట్లీ హెల్ప్‌లెస్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ప్రపంచంలో ఇంకా ఎంతో కొంత మంచి ఉంది. మంచి వాల్యూస్ తో నడుస్తున్న బిజినెస్‌లు ఉన్నాయి మనల్ని ఇన్స్పైర్ చేసే బుక్స్ ఉన్నాయి పీపుల్ ఉన్నారు మంచి సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు మంచి ఎన్విరాన్మెంట్ కోసం మనుషుల వెల్ బీయింగ్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.
(08:17) అందుకే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ లెట్స్ డ అవర్ బెస్ట్. ఈ విషయం గురించి మీరేమంటారు మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా మంచి హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి అనుకున్న అది కష్టంగా అనిపిస్తుందా ఇప్పుడున్న మన సిస్టమ్స్ ఎన్విరాన్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్న మంచి హ్యాబిట్స్ ఫాలో అవ్వడం చాలా అవసరం అని మీరు నమ్ముతున్నారా మీ థాట్స్ ని కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం అని మీకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.
(08:45) అండ్ ఇలాంటి ఛానల్ కి మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ే నాకు మోటివేషన్ ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ప్రపంచం చూసినా చూడకపోయినా మనం చేసే ప్రతి పని మనం ఎవరో మనం ఏం చేయగలమో అనేదానికి మనకే ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. సో అదండి ఈ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు జీవితమస్తు [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment