*చదివే ముందు... మెల్లగా కళ్లు మూసుకోండి... మీ దృష్టిని మీ హృదయం మీదకి తీసుకురండి... మీ హృదయంలో అపారమైన సంతృప్తిని, సమర్పణా భావాన్నిఅనుభూతి చెందండి ... చదవడం కొనసాగించండి...*
*💥సమర్పణా భావం....కథ💥*
ఒక అందమైన స్త్రీ సముద్రతీరంలోనడుస్తోంది. అలలతో పాటుగా బాగా మెరుస్తున్న ఒక రాయి సముద్రతీరానికి రావడం ఆమె గమనించింది.
అరుదుగా కనిపిస్తున్న ఆ రాయిని తీసి, చూసి,అది మామూలు రాయి కాదు నిజమైన వజ్రమని తెలుసుకుంది. మౌనంగా దానని తీసుకుని తన పర్సులో పెట్టుకుంది. అయితే ఇదంతా ఆమె ప్రవర్తనలో గానీ, ప్రశాంతతలో గానీ ఎలాంటి మార్పును తీసుకురాలేదు.
దగ్గరలో నిలబడిఉన్న ఒక వృద్ధుడు ఈ సంఘటన మొత్తాన్ని ఎంతో ఉత్సుకతతో చూస్తున్నాడు. అకస్మాత్తుగా అతను లేచి ఆ స్త్రీ వద్దకు వెళ్లి, గత నాలుగు రోజులుగా తాను ఏమీ తినలేదని ఆమె ముందు చేయి చాచి, సహాయం చేయగలరా అని అడిగాడు.
ఆ స్త్రీ వెంటనే తన పర్సు తెరిచి అతనికి తినడానికి ఇవ్వగలిగేదేదైనా ఉందేమోనని వెతకడం ప్రారంభించింది.
సముద్రతీరంలో ఇసుకలో తనకు దొరికిన రాయిపైనే ఆ వృద్ధుడి చూపు ఉందని ఆమె గ్రహించింది.
ఆమెకి మొత్తం కథ అర్థమైంది, ఈ మనిషికి నిజంగా రాయి కావాలి అని తెలుసుకుని, రాయిని తీసి వృద్ధుడికి ఇచ్చింది.
ఇంత విలువైన వస్తువును ఎవరైనా అంత తేలిగ్గా ఎలా ఇవ్వగలరా అని ఆ వృద్ధుడు ఆశ్చర్యపోయాడు!
ఆ రాయిని జాగ్రత్తగా పరిశీలించిన ఆ వ్యక్తి అది నిజమైన వజ్రమని గ్రహించాడు. అతను ఆశ్చర్యపోయి, ఆలోచనలో పడ్డాడు.
అయితే ఆ మహిళ మాత్రం ఆగకుండా తన దారిలో తాను నడిచివెళ్లిపోతోంది.
వృద్ధుడు ఆ స్త్రీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, “ఇది విలువైన వజ్రమని మీకు తెలుసా?” అని అడిగాడు.
దానికి ఆ స్త్రీ, "ఆ ..., అది నిజమైన వజ్రమని నాకు బాగా తెలుసు. కానీ నా సంతోషం ఈ వజ్రంలో లేదు, నాలోనే ఉంది" అంటూ, ఇలా కొనసాగించింది, "సముద్రపు అలల లాగానే సంపద, కీర్తి కూడా వస్తూ, వెళ్తూ ఉంటాయి, మన ఆనందాన్ని వాటితో అనుసంధిస్తే, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండలేం."
ఆమె మాటలు విన్న వృద్ధుడు లోతైన ఆలోచనలో పడ్డాడు, ఈ వయస్సుకు వచ్చిన తర్వాత కూడా అతను సంతృప్తిని, శాంతిని పొందలేకపోయాడు.
కానీ ఈమె మాత్రం తనలో తాను సంతృప్తిని,శాంతిని పొందుతూ, దేనిచేత ప్రభావితం కావాట్లేదు.
లోపల ఏదో మేల్కున్నట్లు అతనికి అనిపించింది... ఆ వజ్రాన్ని ఆ స్త్రీకి తిరిగి ఇచ్చి, ఆ వజ్రాన్ని ఆమె దగ్గరే ఉంచుకోమని, దానికి బదులుగా, వజ్రాన్ని చాలా సులభంగా అతనికి ఇచ్చేలా చేసిన మరింత విలువైన ఆ సమర్పణా భావాన్ని... సంతృప్తి భావాన్ని ఇవ్వమని కోరాడు!!
ఆ స్త్రీ నిశ్చింతగా నవ్వుతూ ముందుకు సాగింది. వృద్ధుడు మళ్ళీ వెనుక నుండి, "దయచేసి నాకు సమర్పణా భావాన్ని, సంతృప్తిని ఇవ్వండి!" అన్నాడు.
ఆ స్త్రీ వెనక్కి తిరిగి, *"అది ఇవ్వలేనిది, కానీ మీ హృదయం మీద ధ్యానించడం ద్వారా మీరు దానిని సాధించవచ్చు", అని చెప్పింది.*
*శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే, మనం మన అంతరంగంలో, లోతుగా చూడాలి....దాజీ🙏*
*హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం*
No comments:
Post a Comment