నిద్ర రావడం లేదా? ఈ Military Method ఒక్కసారి Try చేయండి! 😴
Author Name:Itluu Mee Sravani
Youtube Channel Url:https://www.youtube.com/@itluumeesravani
Youtube Video URL:https://www.youtube.com/watch?v=t4ywkYaFvus
Transcript:
(00:00) రెండు నిమిషాల్లో నిద్రపోవడానికి మిలిటరీ మెథడ్ నిజంగా పనిచేస్తుందా రాత్రి పడుకున్న తర్వాత కూడా నిద్ర రావడం లేదా ఎన్నిసార్లు పక్కకు తిరిగినా [సంగీతం] మైండ్ మాత్రం ఆలోచనలతో పరుగులు పెడుతుందా అయితే మిలిటరీ మెథడ్ అనే ఒక ఆసక్తికరమైన టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఇటీవల ఈ మెథడ్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది. ప్రధాని నరేంద్రమోదీ తాను పడుకున్న కొద్ది సెకండ్లలోనే నిద్రపోతానని చెప్పిన తర్వాత ఈ మిలిటరీ మెథడ్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది.
(00:33) అయితే ఈ మిలిటరీ మెథడ్ కొత్తది కాదు 1981 లో అమెరికాకు చెందిన కోచ్ లాయిడ్ బడ్ వింటర్ తన పుస్తకంలో దీని గురించి వివరించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరా సైనికులకు విశ్రాంతి తీసుకునే సమయం చాలా తక్కువగా ఉండేది. పడుకున్న వెంటనే త్వరగా నిద్రపోవడం వారికి చాలా అవసరమైంది. ఈ మిలిటరీ మెథడ్ ని రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత దాదాపు 96 శాతం మంది సైనికులు తుపాకుల శబ్దాల మధ్య కూడా రెండు నిమిషాల్లోనే నిద్రపోయారని చెప్తారు.
(01:00) అయితే ఈ మెథడ్ ఎలా చేయాలి? ముందుగా మంచంపై సౌకర్యంగా పడుకోండి. ముఖంలోని అన్ని మసల్స్ ని పూర్తిగా రిలాక్స్ చేయండి. నోటి లోపలి మసల్స్ ని కూడా రిలాక్స్ చేయండి. తర్వాత [సంగీతం] భుజాలను వదులుగా ఉంచి చేతులను శరీరం పక్కన సడలించి పెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుని మెల్లగా బయటకి వదలండి. [సంగీతం] దీనివల్ల శరీరంలోని టెన్షన్ కొంత తగ్గడానికి సహాయపడొచ్చు.
(01:25) ఆ తర్వాత కాళ్ళు తొడలను కూడా పూర్తిగా రిలాక్స్ చేయండి. ఇప్పుడు దాదాపు 10 సెకండ్ల పాటు ఒక ప్రశాంతమైన దృశ్యాన్ని ఊహించుకోండి. ఉదాహరణకు ఒక నిశశబ్దమైన సరస్సు లేదా సముద్ర తీరం లేదా పచ్చని ప్రకృతి మధ్య మీరు ఉన్నట్లు ఊహించుకోండి అది కూడా కుదరకపోతే ఎలాంటి ఆలోచనలు వద్దు అనే మాటను 10 సెకండ్ల పాటు మనసులోనే నెమ్మదిగా రిపీట్ [సంగీతం] చేయండి.
(01:49) ఈ మెథడ్ అందరికీ ఒకేలా పనిచేస్తుందని శాస్త్రీయంగా నిర్ధారించలేదు. కానీ కొందరికి రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడినట్లు అనుభవాలు చెప్తున్నాయి. మీకు నిద్ర సమస్యలు తరచు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో కూడా షేర్ చేయండి నేను మీ శ్రావణి మళ్ళీ ఇంకో మంచి విషయంతో కలుద్దాం. నమస్కారం.
No comments:
Post a Comment