Monday, August 10, 2026

నీకసలు మనుషులు ఎందుకు కావాలి?

PRATIKULA VEDAM
2 days ago (edited)
నీకసలు మనుషులు ఎందుకు కావాలి?


"మనుషులు సంఘజీవులు, ఒకరికొకరు తోడుండాలి, ప్రేమ పంచుకోవాలి" లాంటి society నేర్పించిన పనికిమాలిన చింతపండు statements ని కాసేపు పెట్టు. మనం పచ్చిగా నిజం మాత్రమే మాట్లాడదాం.

సరిగ్గా గమనించు.. నువ్వెప్పుడైనా, ఏ లోటూ లేకుండా, పూర్తి సంతోషంతో, పరిపూర్ణంగా ఉన్నప్పుడు, ఇంకొకరి అవసరం నీకు వచ్చిందా? రాలేదు కదా! నీకు తోడు కావాలని, ఒకరితో మాట్లాడాలని, ఎవరో ఒకరు నీతో ఉండాలని ఎప్పుడు అనిపిస్తుంది? నీకు bore కొట్టినప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, లేదా నీ లోపల ఏదో తెలియని 'ఖాళీ' emptiness, నిన్ను భయపెడుతున్నప్పుడు.

అంటే దీని అర్థం ఏంటి?

For example, ఒక గదిలో, ఎలాంటి mobile, laptop, TV లేకుండా, కనీసం ఒక పుస్తకం కూడా లేకుండా, పడుకోకుండా, నీతో నువ్వు ఒంటరిగా ఒక రోజంతా కూర్చోగలవా?

కూర్చోలేవ్. పిచ్చి పట్టినట్టుంటది.

ఎందుకంటే, నీతో నువ్వు గడపడం నీకే ఇష్టం లేదు. నీ company నీకే ఎంత చిర్రాగ్గ ఉంటదో, ఆ గంట సేపు కూర్చుంటే నీకర్ధమైపొద్ది.

అంటే, నీ company నీకే నచ్చనప్పుడు.. నీ జీవితంలోకొచ్చే ఇంకొక మనిషి మాత్రం, నిన్ను జీవితాంతం ఎందుకు భరించాలనుకుంటున్నావ్? వాళ్ళకి మాత్రం నీతో ఉండటం ఆనందంగా ఉంటదని, గుడ్డిగా ఎలా నమ్మేస్తున్నావ్?

నువ్వు ఎదుటి మనిషి దగ్గరికి వెళ్తున్నది వాళ్ళ మీద ప్రేమతో కాదు. నీ లోపల ఉన్న శూన్యాన్ని భరించలేక. నీ తలనొప్పికి నువ్వేస్కునే ఒక టాబ్లెట్ లాంటి వాడే, ఎదుటి మనిషి. వాళ్ళని నువ్వు ఒక Emotional Painkiller లాగా వాడుకుంటున్నావు.

First of all, నువ్వొక పెయిన్ కిల్లర్ ని ఎందుకు ఇష్టపడతావ్? ఎందుకంటే అది నీ బాధను తగ్గిస్తుంది కాబట్టి. ఆ టాబ్లెట్ మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు, నీకు కావలసిందల్లా, అది ఇచ్చే relief మాత్రమే. మనుషులతో మనం పెట్టుకునే సంబంధాలు కూడా అక్షరాలా ఇంతే.

నీకు loneliness అనిపించినప్పుడు, నీకు time-pass అవ్వడానికి ఒక మనిషి కావాలి. (వాడికి నువ్వు friend అని పేరు పెడతావ్).

నీకు future గురించి భయం వేసినప్పుడు, నీకు security ఇవ్వడానికి ఒక మనిషి కావాలి. (వాడికి / ఆమెకి life partner అని పేరు పెడతావ్).

ఇదంతా ఒక పక్కా Transaction. నా భయాన్ని నువ్వు పోగొట్టు, నీ అవసరాలు నేను తీరుస్తాను అని రాసుకున్న ఒక అగ్రిమెంట్. ఇందులో తప్పు లేదు, కానీ ఈ వ్యాపారానికి "ప్రేమ, ఆత్మ బంధం, జన్మ జన్మల అనుబంధం" అని పేర్లు పెట్టి ఎందుకు నీకు నువ్వే Bluff చేస్కుంటున్నావ్? ఆ ముసుగు ఎందుకు?

మనం ఎవరినైనా మన జీవితంలోకి తెచ్చుకోగానే, వెంటనే వాళ్ళ మీద expectations మొదలుపెడతాం. "వాడు నాకు time ఇవ్వాలి, ఆమె నా కోసమే ఆలోచించాలి" అని.

నీ సంతోషానికి బాధ్యత ఎవరిది? నీదే కదా.

మరి ఎదుటివాడి మీద expectation పెట్టుకున్నావంటే, దానర్ధమేంటి?

"నా సంతోషానికి బాధ్యత, ఈ క్షణం నుండి నీది" అని వాడి నెత్తిన భారం పెట్టడమే కదా!

ఒకరి ఆనందానికి ఇంకొకరు బాధ్యత వహించడం కంటే పెద్ద హింస, ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. నువ్వు లోపల ఖాళీగా ఉన్నావు, ఆ ఖాళీని నింపే Contract ఎదుటివారికి ఇచ్చావ్. వాళ్ళు ఆ ఖాళీని నింపుతున్నంత కాలం వాళ్లంటే నీకు ప్రాణం. ఏ రోజైతే వాళ్ళు తన సొంత జీవితం కోసం ఆలోచించడం మొదలుపెడతారో, ఆ రోజు వాళ్ళు కాంట్రాక్ట్ బ్రేక్ చేసినట్టు లెక్క. వెంటనే నీకు వాళ్ళు శత్రువు అయిపోతారు.

దీన్ని బట్టి చూస్తే, నువ్వు ప్రేమిస్తున్నది మనిషినా? లేక ఆ మనిషి నుంచి నీకు దొరికే Relief అనే Return నా? ఆలోచించు.

నువ్వొక అడుక్కునే వాడివైతే, ఎదుటివారు కూడా ఇంకొక అడుక్కునే వారే. ఇద్దరు బిచ్చగాళ్లు ఎదురెదురుగా నిలబడి, "నీ దగ్గరున్నది నాకివ్వు, నా దగ్గరున్నది నీకిస్తా" అని అడుక్కోవడమే తప్ప, అక్కడివ్వడానికి ఇద్దరి దగ్గరా ఏమీ లేదు.

అందుకే బంధాలు break అవుతున్నాయ్. ఎందుకంటే ఇద్దరూ taking కోసమే వచ్చారు తప్ప, giving కోసం కాదు.

మరి నిజమైన స్వేచ్ఛ ఎక్కడుందో తెలుసా?
"నాకు ఎవ్వరి అవసరమూ లేదు" అని నువ్వు ఏ రోజైతే గుండె మీద చెయ్యేస్కుని చెప్పగలవో, ఆ రోజే నీకు బంధం అంటే ఏంటో అర్థం అవుతుంది. ఎందుకంటే, అవసరం లేని వాడే, expectations లేకుండా బ్రతగ్గలడు.. Expectations లేని వాడే ఎదుటి మనిషిని, వాళ్ళని వాళ్ళలా, As it is గా స్వీకరించగలడు.

Dependency అనేది ప్రేమ కాదు, అది ఒక మానసిక రోగం. నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేస్కుని, నీ company ని నువ్వు enjoy చేయడం మొదలుపెట్టినప్పుడు.. అప్పుడు నీ జీవితంలోకి ఎవరు వచ్చినా, అది ఒక అద్భుతమైన celebration అవుతుంది. అలాగే, ఎవరూ రాకపోయినా, ఎవరెళ్ళిపోయినా, అది నీకసలోక లెక్కే కాదు.

ఎందుకంటే నువ్వు అప్పటికే పరిపూర్ణంగా ఉన్నావు కాబట్టి. 
దీన్ని అర్థం చేస్కుని, కాస్త భ్రమల నుంచి బయటికి రా. 
జీవితం చాలా స్పష్టంగా, clear గా కనిపిస్తుంది.😊

-PRATIKULA VEDAM

92

Add a comment...


@mahesheluvaka5328
2 days ago (edited)
అంటే మీరు పెళ్లి చేసుకొలెడ
Jr.కునాల్ కామ్రా

2



@ramkvss1
1 day ago
అయ్యా, మరలా అడుగుతున్నాను.  మీ పూర్తి పరిచయం తెలుపగలరు.  మీరు చూడబోతే ఏవో వ్యక్తిగత సమస్యలు ఎదుర్కున్నారని, ఇంకా ఎంతో స్ట్రెస్ లో వున్నట్లు తోస్తోంది.  ప్రతి వ్యక్తి తనను తాను బాగా ఇష్టపడతాడేమో గాని, తనను నమ్ముకున్న వారి కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టడం ఈ నాటికీ జరుగుతోంది.  ఒకరిచే ప్రేమించబడాలని కోరుకోవడం మానవుని జీవిత పరమార్థం అంతేకాక అలా మనలను ప్రేమించేవారు మన జీవితంలో ఉన్నారంటే ఆ జీవితం సార్థకం.  అటువంటి వారి ఆభావంలోనే నెగెటివ్ ఆలోచనలు వస్తాయి.  దయచేసి వ్యక్తులలో మంచిని, సమాజంలో పాజిటివిటీ ని గురించి చెప్పండి.

2
1



@pratikulavedam
1 day ago
@ramkvss1
"ఒకరిచే ప్రేమించబడాలని కోరుకోవడమే జీవిత పరమార్థం" అన్నారు కదా! ఒక్కసారి ఆలోచించండి, పక్కవాడు మీకు ఆమోదముద్ర వేస్తే తప్ప మీ ఉనికికి విలువే లేదా అయ్యా? మీ సంతోషం కొరకు ఇంకొకరి దయాదాక్షిణ్యాల ముందు చెయ్యి చాపడాన్ని పరమార్థం అనరు, దారుణమైన 'బానిసత్వం' అంటారు.

ప్రాణాలు పణంగా పెట్టడం అంటారా? మనిషి ప్రాణం పెట్టేది ఎదుటివాడి మీద ప్రేమతో కాదు, వాడి రూపంలో ఉన్న తన స్వార్థపు Attachment మీద ప్రేమతో. రేపు ఉదయం ఆ మనిషి మీరు గీసిన గీత దాటితే, ప్రాణం పెట్టిన అదే చేతులతో ప్రాణాలు తీయడానికీ వెనకాడని సమాజం మనది.

చీము పట్టిన గాయాన్ని కప్పిపెట్టి పైన Smiley sticker అంటించడాన్ని Positivity అనరు, Hypocrisy అంటారు. గాయాన్ని కోసి మందు రాయడం నొప్పిగానే ఉంటుంది.

నిద్ర మత్తులో ఉన్నవాడికి, నిద్రలేపేవాడి అరుపు ఎప్పుడూ Negative గానే అనిపిస్తుంది.




@Thanksgod-happy
2 days ago (edited)
Hello bro, chala goppaga chepparu as usual...Kani bro honestly Naku ala ontariga undadam chala ishtam( better acting kanna)andaritho undadamu ishtme same page lo unte ( emadya realization vachhindi ,mundhu andaritho Nachhakunna i use to be kind hurt cheyyabuddi kaka) eppudu I can't act anymore 99% alane untanu I thoroughly enjoy minding my own business now,being fake gives pain but nothing , Kani e videos lo cheptaru kada yentha socialize antha happy ga untaru anta ( healthy relationships aithe okay i understand mana family vallu nachhakunna cheyyamantaru Adhe maintain) lekunte  early ga 😅om namah shivaya, Happy undi 20yrs bathikina chalu kada Artificially 100yrs bathike bathulu i donno , sagam ville bayalu petti champutaru.Oka room lo andaru okela alochistunnaru ante akkada yevadu nijanga "alochinchatle" ani ardham ( andaru okadine blind ga follow avatru gorrella).Point is correct or wrong kadhu as per which ever is easy simple not so complicated ate potharu,ala unna parle mana life complicate chesi chastaru edhe follow avvali adhe rule.no 1 ani , arey babu maku alochinchentha Opika interest unnai vinaru.Miru nijanga chala manchiga cheptunnaru bro , nenaithe nerchukuntunna inka deep analysis.Im trying to change my perspective also few matters lo.Oka yedava edhe correct ani kurchuntadu , e konam lo nenu yendhuku chudalekpoina ani konthamandi matrame alochistaru.im happy e list lo unde buddi echhadu Devudu.

1
@pratikulavedam



@ramkikrishna1462
1 day ago
Correct anna last week naku jarigindi 👏👏👏👍👍🙏🙏🙏🙏

1



@Brahmani-w4e
2 days ago
Man is social animal. ఒక్కడే సంతోషపడుతూ కూర్చుంటే, reality అనుకుని అందరినీ దూరం పెడితే మానవ జాతి ఎప్పుడో నశించి పోయేది. ఆ realization తోనే సొసైటీ, బంధాలు, ప్రేమ, ఆప్యాయత లాంటి emotions ని inculcate చేయబడ్డాయి.

15



@pratikulavedam
2 days ago
@Brahmani-w4e
మానవ జాతి నశించిపోకుండా ఉండటం కోసం.. ప్రేమ, ఆప్యాయత లాంటివి inculcate చేయబడ్డాయి అంటున్నారు. అంటే బలవంతంగా ప్రోగ్రామ్ చేయబడ్డాయని, మీ నోటితో మీరే ఒప్పుకుంటున్నట్టుగా!

అంటే దాని అర్థం ఏంటి? మీరు పవిత్రం అని గుడ్డిగా నమ్ముతున్న మీ 'ప్రేమ, బంధాలు'.. ఏవీ మీ సొంతంగా పుట్టినవి కావు. అవి కేవలం ప్రాణాలతో బ్రతకడం కోసం, Nature and Society కలిసి మీ మెదడులో ఎక్కించిన ఒక Biological Software! దానికి మించి వాటికి ఏ విలువా లేదు అని మీరు చెప్పకనే చెప్పారు.

గుంపులో ఉంటేనే బ్రతకగలం అనే భయంతో మందలుగా ఉండటం, పిల్లల్ని కనడం ఆవులకి, గొర్రెలకి కూడా తెలుసు. వాటికి కూడా మీరు Social Animal అనే లాజిక్ apply చేసి, అవి ప్రేమతో బ్రతుకుతున్నాయని చెబుతారా? ప్రాణం నిలబెట్టుకోవడానికి, భయంతో గుంపులో చేరడం జంతువు లక్షణం.

కానీ, తన లోపలి శూన్యాన్ని జయించి, ఒంటరిగా, స్వేచ్ఛగా, పూర్తి ఎరుకతో జీవించడం మనిషి లక్షణం.

Nature తన జాతిని పెంచుకునే స్వార్ధం కోసం మనల్నోక పావులా వాడుకుని, దానికి 'ప్రేమ' అనే మత్తు ముందు ఇస్తే, ఆ మత్తులో పడి మనం మురిసిపోతున్నాం.

1
14



@Brahmani-w4e
2 days ago
​@pratikulavedamఅలా మురిసిపోకపోతే ముక్కలు అవుతాం 😅 నేను అనేదే ఉండకుండా పోతుంది. Nature కి survival of the fittest అనే సూత్రం మాత్రమే తెలుసు. జంతువులు కూడా extinction కి against గా వాటికి తగ్గ strategies అవి create చేసుకుని పాటిస్తాయి.

1



@Brahmani-w4e
2 days ago
లోపల శున్యం, తొక్క తోలు ఏమి వుండవు. నెల రోజులు hotel లో తింటే, urgent గా వంట చేసే పెళ్ళాన్ని వెతుక్కుంటాడు మనిషి. అన్నీ సక్రమంగా జరిగినంతసేపే ఈ వేదాంతాలు అన్నీ అయ్యా 😁

7



@pratikulavedam
2 days ago
@Brahmani-w4e అప్పుడిక మనుషులకి జంతువులకి ఏ డిఫరెన్స్ లేనట్టే గా!




@pratikulavedam
2 days ago
@Brahmani-w4e సో, ఫైనల్ గా మీరే ఒప్పుకుంటున్నట్టు. మనిషి జంతువు కంటే స్పెషల్ ఎం కాదు అని. అదే నేను కూడా చెప్పేది, ఒకవేళ జంతువులాగే జీవిస్తే😎

6



@Brahmani-w4e
2 days ago
​@pratikulavedamజంతువు లాగానే జీవిస్తున్నాం కొన్ని విషయాలల్లో.జంతువులు అంటే మీకు చాలా చులకన భావం ఉన్నట్టుంది. మనం కొన్ని విషయాలల్లో జంతువుల కన్నా చాలా హీనంగా బ్రతుకుతున్నాం. మనం గొప్ప అనే భ్రమలో బ్రతుకుతున్నాం. మన ancesters కొన్ని శతబ్దాలుగా nature నుంచి protection కి, stability కి, growth కి develop చేసుకున్న brain power ని పనికి మాలిన మతాలు, వేదాంతాలు, మూఢ నమ్మకాలు లాంటి trash కి ఉపయోగించి ఇతరులని మోసం చెయ్యటానికి use చేసుకుంటున్నాం. సరే, ఇంక శెలవు.

5



@pratikulavedam
2 days ago
@Brahmani-w4e "మనుషులు వేదాంతాలతో మోసం చేస్తున్నారు" అని చెప్పడానికి మీరు రాసిన ఈ comment కూడా, మిమ్మల్ని మీరు intellectual గా defend చేసుకోవడానికి, మీ Ego వాడుతున్న ఇంకో 'సొంత వేదాంతమే' కదా?

జంతువులకి survival తప్ప వేరే choice లేదు. దానికి "తానొక జంతువు" అని కూడా తెలియదు. కానీ మనిషికి తెలుసు.

ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే.. ఈ 'స్పృహ' ఇచ్చే భారాన్ని మోయలేక, దాన్ని ఎలా handle చేయాలో తెలియక.. "జంతువులే బెటర్, మనం వాటికన్నా హీనం" అని మీకు మీరే ఒక కంఫర్ట్ జోన్ ని వెతుక్కుంటున్నారు.

మనం జంతువుల కంటే హీనంగా ఎందుకున్నాం అంటే.. జంతువు ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది, మనిషి భవిష్యత్తు భయంతో రేపటి కోసం కూడా ఈరోజే వేటాడుతున్నాడు.

జంతువులా బ్రతకడం స్వేచ్ఛ కాదు, అది evolution నుంచి పారిపోవడం. తప్పు మన brain power లో లేదు, ఆ brain ని కేవలం physical and emotional survival కోసమే వాడుకుంటున్న మన 'భయంలో' ఉంది.

4



@Brahmani-w4e
2 days ago
​@pratikulavedamమీరు, నేను comments లో చెపుతున్నది same అనిపిస్తుంది. మీ post మాత్రం not for me. Bye




@pratikulavedam
2 days ago (edited)
@Brahmani-w4e "Comments లో చెప్పిన logic same" అని మీకే అనిపించినప్పుడు.. అదే logic మీద ఆధారపడి ఉన్న Post మాత్రం మీకు కాదు అని ఎలా అవుతుంది? ఇక్కడే మీలోపల ఉన్న అసలు Contradiction ఏంటో బైటపడుతుంది.

కామెంట్స్ లోని విషయం మీ intellect ని satisfy చేసింది కాబట్టి accept చేశారు. కానీ, post లో ఉన్న కంటెంట్, మీ 'అవసరాన్ని', మనుషుల మీద మీరు పెట్టుకున్న emotional dependency ని బట్టబయలు చేసింది. ఆ నిజాన్ని face చేయడం ఇష్టం లేక, మీలోపలున్న Ego దాన్ని భరించలేక "Not for me" అనే defence mechanism వాడుకుంటోంది. Thats fine. This is the human nature i am talking about in the post.😎




@Brahmani-w4e
2 days ago
​@pratikulavedam హ హ హ




@Brahmani-w4e
2 days ago
​@pratikulavedamsubscribed.

1



@subramanyamsitaram1472
2 days ago
​@pratikulavedamసంతోషం వచ్చినప్పుడు కూడా పంచుకోడానికి మనిషి ఉండాలి కదా.
సంతోషం దుఃఖం ఉద్భవించేది నీనుండే.
ఇవి బయటకొస్తేనే కదా. బయటకి రాకపోతే పిచ్చి పడుతున్న భావన ఎర్పడుతుంది. పిచ్చి కూడా నీనుండే కదా.
సంతోషం, దుఃఖం ఇవన్నీ కూడా మనోవికారాలే.
ఈ భావనలు లేనప్పుడు ఆ వ్యక్తి బండరాయే. 
భావనలు ఉండాలి. 
అరిషడ్వర్గాలని ( శత్రువు వర్గాలు ) అంటారు కానీ 
ఈ షడ్ వర్గాలు నా దృష్టిలో మిత్రులే.
కామం వలననే ఈ ప్రపంచం నడుస్తోంది.
కోరిక కలిగిన మరుక్షణం తీర్చుకోడానికి ప్రయత్నం చేయబట్టే కదా.....
టివి తీసుకోవాలనే కోరిక వలన షాప్ వాడు, ఆటోవాడు పోషింపబడతాడు కదా


Read more
1
3



@pratikulavedam
1 day ago
@subramanyamsitaram1472 
ఒకరితో పంచుకోకపోతే భరించలేనంత బరువుగా, ఉక్కిరిబిక్కిరి చేసేది 'సంతోషం' ఎలా అవుతుంది? అది కేవలం మన Ego కు వచ్చిన ఉబ్బసం. ఆ ఉబ్బసానికి చప్పట్లు కొట్టడానికి, validate చేయడానికి మనకొక Audience కావాలి. నిజమైన ఆనందం మనలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు, దాన్ని ప్రదర్శించాల్సిన ఆరాటం, ఇంకొకరి అంగీకారం కోసం వెతుక్కునే దైన్యం ఉండవు.

ఇక కోరికల వల్ల ప్రపంచం నడుస్తుంది అంటున్నారు. అక్షరాలా నిజం. మార్కెట్ లో వ్యాపారాలు నడవాలంటే, మనలో కోరికలు మండాలి. అంటే.. టీవీ షాపు వాడిని, ఆటో వాడిని పోషించడానికి, మనం జీవితాంతం మన కోరికలకు ఒక బానిస లాగా బతకడానికి సిద్ధపడాలన్నమాట. Economy ని బ్రతికించడం కోసం, ఒక Consumer గా మన స్వేచ్ఛను మనమే బలిపెడుతున్నాం. ఇది ఎంత అద్భుతమైన వ్యాపారమో గమనించారా?

భావాలు లేకపోతే మనిషి బండరాయి అన్నారు. భావాలు రావడం తప్పు కాదు, కానీ ఆ భావాల చేతిలో కీలుబొమ్మలా మారి, అవి ఎటు లాగితే అటు వెళ్లడం మనిషి లక్షణం కాదు. బండరాయికి చలనం లేదు, కీలుబొమ్మకు సొంత చలనం లేదు.

కానీ ఈ రెండూ కాకుండా, మీలో పుట్టే కోరికను, భావనను గుడ్డిగా follow అవ్వకుండా, బయట నిలబడి సాక్షిగా గమనించే 'ఎరుక' ఒకటి ఉంటుంది. అదే మిమ్మల్ని నిజమైన మనిషిని చేస్తుంది.

2



@subramanyamsitaram1472
1 day ago
​@pratikulavedam కాబట్టి మీకు కూడా ఆడియన్స్ కావాలని అర్ధమైంది.
మీకు తెలిసిన విషయం లేదా
మీ వినూత్న ఆలోచన పంచుకోడానికి కూడా తోడు ఉండాలని మీ ఆలోచన.
శెభాష్ ఎదురు చూడడం అవివేకం
శెభాష్ చెప్పినా కూడా పట్టించుకోకపోవడం అహంకారం.
అహంకారం ఎప్పటికైనా ఒంటరిని చేస్తుంది.
మీరు ఒంటరా? లేక
సంఘ జీవా? 
సంఘంలో ఉంటూ కూడా తామరాకు మీద నీటిబిందువు లాగ?
లేక 
సంఘం తో పని ఏంటనే మనస్తత్వమా?

1



@pratikulavedam
1 day ago
@subramanyamsitaram1472 
దీపం వెలగాలంటే చీకటి యొక్క Approval కావాలా? అద్దం మీ ముఖాన్ని చూపిస్తోందంటే, దానికి మీ Attention కావాలని కాదు కదా! ఉన్నది ఉన్నట్టు చూపించడం దాని స్వభావం కాబట్టి.

అహంకారం ఒంటరిని చేస్తుంది అన్నారు. అది అబద్ధం.

నిజానికి అహంకారం ఎప్పటికీ ఒంటరిగా బతకలేదు. దానికి ఎప్పుడూ పక్కన ఇంకొక మనిషి కావాలి. వాడు ఉంటేనే కదా, వాడితో పోల్చుకుని 'నేను నీకంటే గొప్ప, నేను కరెక్ట్' అని ఫీల్ అవ్వగలదు? తన ఉనికిని తాను validate చేసుకోగలదు? అందుకే నిజమైన అహంకారి పక్కా సంఘజీవి. వాడికే ఎప్పుడూ తన గొప్ప వినడానికి ఒక crowd కావాలి.

ఇక నేను సంఘజీవినా, ఒంటరినా అంటున్నారా?

లోపల ఖాళి లేకుండా ఉండే Complete person కి, సంఘం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా! అలాగని దాన్ని ద్వేషించి పారిపోవాల్సిన పనీ లేదు కదా! వాడు మార్కెట్ రద్దీలో ఉన్నా, అడవిలో ఉన్నా వాడి లోపల ఏకాంతం చెదరదు. ఇప్పుడు నేనున్నదీ ఆ ఏకాంతంలోనే.




@nsprasad3997
16 hours ago
జై జండాలుగా అధికారం.. అక్కడ మా పెద తాత మళ్ళీ ATM అంటే.. ఇక్కడ మా 44 ఏళ్ళ వెన్నుపోటు  తాత, మా 15 ఏళ్ళ సనాతన మెట్ల బాబాయ్, మా ఉత్త కుమారుడు.. జై తెలంగాణా ఫామ్ హౌస్ లోనే ❤❤❤




@vadlaSangameshwer
1 day ago
Nee problem entraaa

2



@pratikulavedam
1 day ago
@vadlaSangameshwer
వెలుగుని చూసి చీకటి అడిగే ప్రశ్న ఇదే.

1



@pratikulavedam
1 day ago
@vadlaSangameshwer  
Correct. మీలాగ మిడి మిడి జ్ఞానంతో, ఏదో ప్రశ్నించేశామని ఫీల్ ఐపోతున్నోళ్ళని చూస్తే, అదే అనిపిస్తుంది.



No comments:

Post a Comment