Monday, August 10, 2026

🔥 TUKARAM MUNDHE | కల్తీ మాఫియాకి యముడు ☠️🚨 | By Naresh Bukya

🔥 TUKARAM MUNDHE | కల్తీ మాఫియాకి యముడు ☠️🚨 | By Naresh Bukya

Author Name:NB Show Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FctU5FaEnUk



Transcript:
(00:04) గాయస్ మీరు సినిమాల్లో ఇలాంటి స్టోరీని చాలాసార్లు చూసే ఉంటారు. ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ ని ఒక చిన్న టౌన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడికి వెళ్లి చూస్తే మొత్తం సిస్టం కరప్ట్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరి చేతిలో అమ్ముడిపోయి ఉంటారు. ఆ ఆఫీసర్ వచ్చి క్వశ్చన్ చేయడం మొదలు పెడతాడు. ఎవరికీ భయపడకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు.
(00:26) ఆ నిర్ణయాలతో అప్పటివరకు అక్కడ నడుస్తున్న మొత్తం సిస్టం ఒక్కసారిగా షేక్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. ఆ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇలాంటి స్టోరీస్ మనకు ఎందుకు అంతగా నచ్చుతాయి అంటే రియల్ లైఫ్ లో ఇలాంటివి జరగడం చాలా రేర్. అందుకే సినిమా చూసినంతసేపు అదిఒక డ్రీమ్ లా అనిపిస్తుంది.
(00:48) సినిమా అయిపోగానే క్లాప్స్ కొట్టి బయటకు వస్తాం. మళ్ళీ బయట మాత్రం అంతకుముందు సిస్టం ఎలా నడుస్తుందో అలాగే నడుస్తూ ఉంటుంది. కానీ 2026 లో మహారాష్ట్రలో ఇలాంటి స్టోరీ నిజంగానే జరిగిందని చెప్తే మీరు నమ్ముతారా ఒక ఆఫీసర్ వచ్చి అక్కడి సిస్టం ని షేక్ చేసేసాడు. యాక్చువల్లీ ఈ రియల్ స్టోరీ సినిమాలో కంటే కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
(01:11) ఎందుకంటే ఇందులో సినిమాలో కూడా కనిపించని అనేక ట్విస్టులు ఉన్నాయి. ఆ ఆఫీసర్ పేరే తూకారాం ముండి. 2005 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ యూపీఎస్స లో ఈయన ర్యాంక్ ఆల్ ఇండియా 20 మహారాష్ట్రలోని బి డిస్ట్రిక్ట్ కి చెందిన వ్యక్తి ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. 21 సంవత్సరాల సర్వీస్ లో ఈయన్ని 25 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒక్కో పోస్టింగ్ కి యవరేజ్ 10 మంత్స్ కూడా లేరు.
(01:37) సోలాపూర్ నుంచి నవి ముంబైకి, నవి ముంబై నుంచి నాసిక్ కి, నాసిక్ నుంచి నాగ్పూర్ అక్కడి నుంచి పూణే ఇలా చాలా సిటీస్ మారుతూ వచ్చాయి. నార్మల్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ తమ కరియర్ ని బిల్డ్ చేసుకోవాలని చూస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం 2005 నుంచి తన పనులతో తన ఇమేజ్ ని ప్రెస్టేజ్ ని ఇంకా పెంచుకుంటూ వచ్చారు. అందుకే ఇక్కడ అసలు క్వశ్చన్ ఏమిటంటే సిస్టం ఈఎన్ ని మళ్ళీ మళ్ళీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి అని చూస్తుంది.
(02:05) అంతకన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్రాన్స్ఫర్ అయ్యే ముందు తనకు దొరికిన ఆ కొన్ని నెలల్లో ఆయన ఏం చేస్తున్నారు? ఎందుకు అక్కడి పొలిటిషియన్స్ ఇతన్ని చూసి అన్కంఫర్టబుల్ ఫీల్ అయి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. దానికి ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం మే 25, 2026 కి వెళ్ళాలి. ఆ రోజు తూకారా ముండే మహారాష్ట్ర ఎఫ్డిఏ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నారు. ఎఫ్డిఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ యాక్చువల్లీ చాలా మంది ఇండియన్స్ కి ఈ ఏజెన్సీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు.
(02:36) కానీ ఆయన పోస్టింగ్ అయిన వెంటనే ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేశారు. రివ్యూ మీటింగ్ పెట్టి నెలల తరబడి వెయిట్ చేయలేదు. ముందు సిస్టం ని అర్థం చేసుకుందాం సెటిల్ అవుదాం తర్వాత చూద్దాం అనుకోలేదు. డైరెక్ట్ గా యక్షన్ లోకి దిగిపోయారు. ఆ తర్వాత 60 రోజుల్లో ఆయన తీసుకున్న స్టెప్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. మొదటి నెలలోనే 94 రేట్స్ గుట్కా మీద యాక్షన్ తీసుకున్నారు.
(02:59) పాన్ మసాలా పాకెట్ సీస్ చేశారు. వాటి వాల్యూ దాదాపు 34కోట్ల 66 లక్షలు కేవలం 30 డేస్ లో రిపోర్టెడ్ ఫిగర్స్ ప్రకారం 235 ఎఫ్ఐఆర్లు 350 అరెస్టులు 274 యూనిట్స్ ని సీల్ చేశారు. అండ్ రెండు నెలల్లో 1100కు పైగా ఇన్స్పెక్షన్స్ అంటే యవరేజ్ గా రోజుకి 20 కు పైగా రేట్స్ చేశారు. ఒక్క రోజు కూడా ఆగకుండా ఎన్ఫోర్స్మెంట్ కొనసాగించారు. ఈ పీరియడ్ లో మొత్తం సీస్ చేసిన ప్రొడక్ట్ వాల్యూ దాదాపు 49కోట్ల 57 లక్షలు అలాగే కల్తీ చేయబడిన దాదాపు 1,60,000లటర్ల మిల్క్ ని కూడా సీస్ చేశారు.
(03:39) ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన నంబర్స్ కానీ రేట్స్ లో బయట పడిన విషయాలు మీ కిచెన్ వరకు ఎఫెక్ట్ చేసేవి ఉన్నాయి. ముంబైలో చాలా ఫేమస్ ఓల్డ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఒకటి ఉంది. దాని పేరే కే రుస్తుం. రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అక్కడ లైవ్ రాట్స్ ఎక్స్పైర్ అయిన ఫ్లేవర్స్ కనిపించాయి. అక్కడ వాళ్ళు తయారు చేస్తున్న ఐస్ క్రీమ్ లో రాట్స్ కనిపించాయి.
(04:04) టెస్ట్ చేసిన పన్నీర్ శాంపిల్ లో దాదాపు 40% సేఫ్టీ స్టాండర్డ్స్ లో ఫెయిల్ అయిపోయాయి. అంటే ప్రతి ఐదు శాంపిల్ లో ఒకటి ఫెయిల్ అయిపోయింది. ఇక మిల్క్ విషయానికి వస్తే ప్రతి 100లీటర్ల మిల్క్ లో దాదాపు 10లటర్లు సింతటిక్ మిల్క్ ని కలిపినట్టుగా తెలిసింది. కానీ ఇందులో అన్నిటికంటే డిస్టర్బింగ్ విషయం ఇంకోటి ఉంది. శిరిడీ సాయిబాబా టెంపుల్ దగ్గర దాదాపు 700కgీల అడల్ట్ట రేటెడ్ ప్రసాద్ పేడాస్ ని సీజ్ చేశారు.
(04:29) వాటిని డిస్ట్రాయ్ చేశారు. అంటే దేవుడి ప్రసాదాన్ని కూడా వదిలి పెట్టకుండా కల్తీ చేశారు. ఒకసారి ఆలోచించండి అదేదో నార్మల్ స్వీట్ కూడా కాదు ప్రజలు దాన్ని ప్రసాదం అని నమ్మి ఇంటికి తీసుకెళ్తారు. తమ పిల్లలకు పెడతారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు ప్రసాదం అని ఇస్తారు. ఇక్కడ మనం ఒక విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ వీడియోలో మెయిన్ పాయింట్ కూడా అదే.
(04:52) ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తూకారా ముండే క్రియేట్ చేయలేదు. ఆయన పోస్టింగ్ కి ముందే ఇవన్నీ జరుగుతున్నాయి. మే 25 కు ముందు కూడా ఫేక్ పన్నీర్ అమ్ముతున్నారు. అప్పుడు కూడా ఫేక్ మిల్క్ ఉంది కల్తీ జరుగుతుంది. ఆ పేడాస్ ని కూడా అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్ పార్లర్ లో రాట్స్ కూడా తిరుగుతున్నాయి. ఆయన పోస్టింగ్ తర్వాత మారింది ఒకటే. ఆయన వాటిని చూడడం మొదలు పెట్టారు అంతేకాదు ప్రజలకు కూడా చూపించడం మొదలు పెట్టారు.
(05:16) ఇప్పుడు ఇక్కడ ఇంకో పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇది మహారాష్ట్రకి మాత్రమే సంబంధించిన స్టోరీయా లేదంటే ఇండియా మొత్తం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయా అని? దానికి ఆన్సర్ కావాలంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొన్ని నెంబర్స్ చూడాలి. 2025 అండ్ 26 లో ఇండియా మొత్తం 2,23,808 ఫుడ్ శాంపిల్స్ ని టెస్ట్ చేశారు. వాటిలో దాదాపు 40,23 శాంపిల్స్ నాన్ కన్ఫర్మింగ్ గా వచ్చాయి.
(05:45) అంటే రిక్వైర్డ్ స్టాండర్డ్స్ ని మీట్ చేయలేదు. దాదాపు ప్రతి ఐదు శాంపిల్ లో ఒకటి ఫెయిల్ అయింది. ఇందులో డైరీ సిచువేషన్ ఇంకా బ్యాడ్ గా ఉంది. రిపోర్ట్స్ ప్రకారం పంజాబ్ లో గత మూడు సంవత్సరాల్లో టెస్ట్ చేసిన 1915 డైరీ శాంపిల్స్ లో 902 ఫెయిల్ అయ్యాయి. అంటే దాదాపు 47% ఉత్తరప్రదేశ్ లో 12945 శాంపిల్స్ లో 8299 శాంపిల్స్ ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ మనం ఒక విషయం హానెస్ట్ గా చెప్పుకోవాలి లేదంటే ఈ వీడియో వన్ సైడెడ్ గా అనిపిస్తుంది.
(06:17) నాన్ కన్ఫర్మింగ్ అంటే పాయిజనస్ అని కాదు ఈ రెండు సేమ్ కాదు కొన్ని శాంపిల్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే అందులో ఫ్యాట్ తక్కువగా ఉండొచ్చు.ఎస్ఎన్ఎఫ్ క్వాంటిటీ రిక్వైర్డ్ లెవెల్ లో ఉండకపోవచ్చు లేదంటే ఓవరాల్ క్వాలిటీ వీక్ గా ఉండొచ్చు. అలాంటి కేసెస్ లో సేఫ్టీ త్రెట్ ఉండకపోవచ్చు. కానీ మీరు పే చేస్తున్న మనీకి ఎక్స్పెక్టెడ్ క్వాలిటీ ప్రొడక్ట్ రావడం లేదు అని అర్థం.
(06:39) ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్ఎస్ఏఐ 2018 నేషనల్ మిల్క్ సేఫ్టీ అండ్ క్వాలిటీ సర్వేలో 6432 శంపిల్స్ టెస్ట్ చేశారు. వాటిలో నిజంగా తాగడానికి అన్సేఫ్ గా ఉన్నవి కేవలం 12 శాంపిల్స్ే కానీ అదే సర్వేలో దాదాపు 41% శాంపిల్స్ ఏదో ఒక క్వాలిటీ పారామీటర్ లో బిలో స్టాండర్డ్ గా ఉన్నాయి. దాదాపు 5.7% శాంపిల్స్ లో అఫ్లో టాక్సిన్ M1 కనిపించింది.
(07:06) ఇది మన లివర్ ని డామేజ్ చేయగలదు. అలాగే 77 శంపిల్స్ లో యాంటీబయోటిక్ రెసిడ్యూస్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన లిమిట్ కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే ట్రూత్ ని రెండు పార్ట్స్ గా చూడాలి. ఒకటి లార్జ్ స్కేల్ లో ఫుడ్ పాయిజనింగ్ జరగట్లేదు. అంటే ఇక్కడ నిజాన్ని రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి మన దేశంలో లార్జ్ స్కేల్ లో ఫుడ్ పాయిజనింగ్ జరగట్లేదు.
(07:27) బట్ లార్జ్ స్కేల్ లో ఇర్రెగ్యులారిటీస్ మాత్రం జరుగుతున్నాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ మన బాడీలోకి కొంచెం కొంచెంగా విషాన్ని ఎక్కిస్తున్నాయి. ఇక్కడే ఫుడ్ అడల్టరేషన్ ని హెల్త్ కేర్ తో కనెక్ట్ చేసి చూడాలి. ఎందుకంటే అడల్టరేషన్ అంటే కేవలం మీ డబ్బు కోసం చీటింగ్ చేయడం కాదు. అది మీలో స్లోగా డెవలప్ అయ్యే మెడికల్ ఇష్యూ కూడా మనం రోజు తాగే మిల్క్ లో డిటర్జెంట్ కాస్టిక్ సోడాని కలిపితే అవి మన స్టమక్ ని ఇంటెస్టైన్ ని ఎఫెక్ట్ చేస్తాయి.
(07:53) ఎస్పెషల్లీ చిల్డ్రన్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. యూరియా కిడ్నీ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే కిడ్నీ పని యూరియాని ఫిల్టర్ చేయడం. అప్పుడు బయట నుంచి మనం అడిషనల్ గా యూరియాని టాక్సిన్స్ ని బాడీలోకి పంపిస్తే కిడ్నీ పైన బర్డెన్ ఇంకా పెరుగుతుంది. అలాగే ఎఫ్లో టాక్సిన్ ఇది అనిమల్ ఫీడ్ ఫంగస్ పట్టిన గ్రేన్ నుంచి మిల్క్ లోకి రావచ్చు.
(08:18) ఇది ఒక నోన్ కార్సినోజన్ అంటే దీనివల్ల లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. అలాగే అడల్ట్రెడ్ స్వీట్స్ లో సింతటిక్ కలర్స్ యూస్ చేస్తారు. అవి పిల్లల్లో అలర్జీస్ లాంగ్ టర్మ్ లివర్ ప్రాబ్లం్ ని క్రియేట్ చేయవచ్చు. స్వీట్ మీద పెట్టే ఫేక్ సిల్వర్ లేయర్ కూడా కొన్నిసార్లు ఇతర మెటల్ ఎలిమెంట్ తో మిక్స్ చేసి తయారు చేస్తారు. వీటన్నిటికంటే డీపర్ ప్రాబ్లం ఏమిటంటే యాంటీబయోటిక్ రెసిడ్యూస్.
(08:41) మీరు మిల్క్ ద్వారా రోజు కొంచెం కొంచెంగా యాంటీబయోటిక్ కన్స్ూమ్ చేస్తుంటే మీ బాడీలోని బ్యాక్టీరియా స్లోగా ఆ మెడిసిన్ కి అడాప్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఒకరోజు నిజంగానే మీకు ఇన్ఫెక్షన్ వచ్చి అదే మెడిసిన్ అవసరమైనప్పుడు ఆ మెడిసిన్ మీపైన పని చేయడం తగ్గిపోతుంది. దీన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని ప్రపంచంలో మేజర్ హెల్త్ త్రెడ్స్ లో ఒకటిగా కన్సిడర్ చేస్తుంది.
(09:09) అంటే ఇక్కడ ఒక ఎఫ్డిఏ కమిషనర్ పని కేవలం రేట్స్ చేయడం మాత్రమే కాదు ఒక విధంగా చూస్తే ఆయన చాలా పెద్ద ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రోగ్రాం ని రన్ చేస్తున్నారు. ఎందుకంటే డిసీజ్ రాకపోతే మనకు ట్రీట్మెంట్ అవసరమే ఉండదు. ఇక్కడే మనం చాలాసార్లు మిస్ అయ్యే మేజర్ పాయింట్ ఒకటి ఉంది. హెల్త్ అంటే మనం హాస్పిటల్ గురించి మాట్లాడతాం, డాక్టర్స్ గురించి మాట్లాడతాం, మెడిసిన్ గురించి మాట్లాడతాం.
(09:34) కానీ మీ హెల్త్ కి ఫస్ట్ లైన్ హాస్పిటల్ డాక్టర్ కూడా కాదు. మీ ప్లేట్ లో ఉన్న ఫుడ్ మీరు తినే ఫుడ్ సేఫ్ గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇక ఈ స్టోరీలో అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ కి వెళ్దాం. ఒక ఆఫీసర్ ఇంత అగ్రెసివ్ గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటే ఆయన చిన్న చిన్న షాప్స్ దగ్గర మాత్రమే ఆగరు. తూకారా ముండే కూడా ఆగలేదు. మినిస్టర్ ఎమమెల్యేలు ఎంపీలతో కనెక్షన్ లో ఉన్నాయని చెప్పబడే క్రికెట్ క్లబ్స్ కి ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నిటిని రేడ్ చేశారు.
(10:03) ఇనిషియల్లీ బాంబే హైకోర్ట్ ఇతను చేస్తున్న పనిని సపోర్ట్ చేసింది. కానీ తర్వాత అదే కోర్టు ఒక విషయంలో ఇతను చేస్తున్న పనిని కంప్లీట్ గా ఆపేసింది. నవీ ముంబైలోని పార్క్ ఇన్ రాడిన్సన్ కి సంబంధించిన లైసెన్స్ సస్పెన్షన్ విషయంలో కోర్టు ఇంటర్వ్యూ అయింది. కోర్టు అబ్జర్వేషన్ ప్రకారం హోటల్ దాదాపు 95% రూల్స్ ని ఫాలో చేస్తుంది. కానీ ఇన్స్పెక్షన్ లో కేవలం రెండు పురుగులు కనిపించాయన కారణంతో వీళ్ళ లైసెన్స్ ని కంప్లీట్ గా సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అని కోర్టు చెప్పింది.
(10:33) ఇక్కడ చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే ఇక్కడ కోర్టు హోటల్ ని కాపాడండి అని చెప్పడం లేదు. కోర్టు చెబుతున్న డీపర్ పాయింట్ ఏమిటంటే ఎన్ఫోర్స్మెంట్ ఎంత స్ట్రిక్ట్ అయినా అది న్యాయబద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక హానెస్ట్ ఆఫీసర్ కి రెండు పురుగులు కనిపించాయి కాబట్టి బిజినెస్ ని క్లోజ్ చేసేయొచ్చు అనే అన్లిమిటెడ్ పవర్ ని ఇస్తే రేపు ఇదే పవర్ ఒక రాంగ్ పర్సన్ చేతిలోకి వెళ్లొచ్చు.
(10:59) లా కేవలం మనల్ని క్రిమినల్స్ నుంచి మాత్రమే కాపాడడం కాదు. పవర్ మిస్యూస్ చేసే ఆఫీసర్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే ఈ జుడిషియల్ రివ్యూ అనేది ఇతను చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ కి అబ్స్టాకిల్ కాదు. ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఓవర్ రీచ్ అవ్వకుండా ఆపే మెకానిజం. అయితే ఆ తర్వాత ఈ కోర్టు ఆ ఆఫీసర్ కి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది.
(11:19) మీరు ఈ డ్రైవ్ మొత్తాన్ని ప్రైవేట్ షాప్స్ మీద మాత్రమే చేస్తారా లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మీద కూడా అప్లై అవుతుందా అని ఇక్కడే స్టోరీలో బిగ్గెస్ట్ ట్విస్ట్ వచ్చింది. జూలై 30 న ఎఫ్డిఏ టీం బాంబే హైకోర్ట్ ప్రిమిసెస్ కి వెళ్ళింది. అక్కడ ఉన్న మూడు క్యాంటీన్స్ పైన ఇన్స్పెక్షన్ చేసింది. షాకింగ్లీ వాటిలో రెండు క్యాంటీన్స్ కి వాలిడ్ లైసెన్స్ కూడా లేదు.
(11:42) ఒకసారి సిచువేషన్ ని ఇమాజిన్ చేయండి ఏ కోర్ట్ అయితే తూకారా ముండే తీసుకున్న డిసిషన్ ని రివర్స్ చేసిందో ఏ కోర్ట్ అయితే ఈయన్ని క్వశ్చన్ చేసిందో అదే కోర్ట్లో ఉన్న క్యాంటీన్ ని ఈయన టీం వెళ్లి ఇన్స్పెక్ట్ చేసింది. అది బోల్డ్ స్టెప్ మాత్రమే కాదు కోర్టు అడిగిన ప్రశ్నకు వాళ్ళు పేపర్ మీద ఆన్సర్ ఇవ్వలేదు. యక్షన్ తో ఆన్సర్ ఇచ్చారు.
(12:04) అయితే ఇంతకాలం ఈ పని ఎందుకు జరగలేదు అనే విషయానికి వస్తే దీనికి ఆన్సర్ మూడు పాయింట్స్ లో ఉంది. పాయింట్ నెంబర్ వన్ ఆఫీసర్స్ లేరు.ఎఫ్ఎస్ఎస్ఏఐ 2021 రిపోర్ట్ ప్రకారం ఇండియా మొత్తంలో కేవలం 2531 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. కానీ దేశంలో దాదాపు ఒక కోటి కన్నా ఎక్కువగా ఫుడ్ బిజినెస్ లు ఉన్నాయి.సిఏజి సిఏజి 2017 ఆడిట్ ప్రకారం స్టేట్ లో ఎఫ్ఎస్ఓ వేకెన్సీస్ దాదాపు 33% నుంచి 90% వరకు ఉన్నాయి.
(12:36) మహారాష్ట్రలో 307 శంక్షన్ పోస్ట్లు ఉంటే అందులో ఫిల్ అయినవి కేవలం 118 మాత్రమే. ఉత్తరప్రదేశ్ లో 728 కి 330 మాత్రమే ఫిల్ అయి ఉన్నాయి. జార్ఖండ్ లో 124 ఆఫీసర్స్ అవసరం ఉంటే అక్కడ కేవలం తొమ్మిది మంది ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 93% వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి ఒక ఎంటైర్ డిస్ట్రిక్ట్ కి ఒకరు లేదా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ మాత్రమే ఉంటే అన్ని ప్రాంతాల్లో రేట్స్ ఎవరు చేస్తారు? అలా చేయడం కుదురుతుందా? ఇక పాయింట్ నెంబర్ టూ ల్ాబ్స్ కూడా సరిగా లేవు.
(13:10) ఫస్ట్ ఆఫీసర్స్ తక్కువగా ఉన్నారు. రెండవది టెస్టింగ్ ల్యాబ్స్ కూడా తక్కువే ఉన్నాయి. దేశంలో దాదాపు 224 నోటిఫైడ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. అందులో కూడా చాలా స్టేట్ ల్యాబ్స్ కిఎఏబిఎల్ అక్రడిషన్ లేదు. అక్రడిషన్ లేని ల్యాబ్ రిపోర్ట్స్ కోర్ట్లో పెద్దగా చెల్లవు వీక్ అయిపోతాయి. ఫేమస్ మ్యాగీ కేసు లో కూడా టెస్టింగ్ మీద క్వశ్చన్స్ వచ్చాయి.
(13:32) అందుకే బ్యాన్ కోర్ట్లో ఎక్కువ కాలం నిలవలేదు. ఇక మూడవ పాయింట్ పనిష్మెంట్. ఫుడ్ కల్తీ చేసేవారిని పట్టుకున్న చివరికి వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఈజీగా బయటకి వచ్చేస్తున్నారు. 2025 26 లో 40,000 ఫుడ్ శాంపిల్స్ ఫెయిల్ అయ్యాయి. కానీ అందులో కేవలం 1918 కి మాత్రమే శిక్షలు పడ్డాయి. చాలా కేసెస్ సివిల్ పెనాల్టీ లేదా చిన్న ఫైన్ తో క్లోజ్ అయిపోయాయి.
(13:56) ఒకసారి సింపుల్ ఎకానమీని అప్లై చేయండి. అడల్టరేషన్ చేసి లక్షలు సంపాదించవచ్చు. ఒకవేళ వాళ్ళు పట్టుబడితే కేవలం వేల రూపాయల ఫైన్ కట్టి బయటకు వచ్చేయవచ్చు. జైలుకి వెళ్ళే ఛాన్సెస్ ఆల్మోస్ట్ జీరో ఉంటాయి. [సంగీతం] అందుకే ఫుడ్ అడల్టరేషన్ ఆగట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ లా వీక్ గా లేదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 ని చాలా స్ట్రిక్ట్ గానే తయారు చేశారు.
(14:18) ప్రాబ్లం లా లో లేదు. లా రాసిన దానికి గ్రౌండ్ లెవెల్ లో ఇంప్లిమెంట్ అవుతున్న దానికి చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లోనే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ బిజినెస్ మొత్తం నడుస్తుంది. ఇక ఇప్పుడు ఈ స్టోరీలో ఇంకొక హానెస్ట్ సైడ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ వీడియోని ఒక హీరో వచ్చాడు అందరిని ఒక్కసారిగా మార్చేశడు అని చెప్పి ముగించడం చాలా ఈజీ కానీ అది కంప్లీట్ ట్రూత్ కాదు ఎందుకంటే తూకారం ఉండే వర్కింగ్ స్టైల్ మీద కూడా క్రిటిసిజం ఉంది.
(14:47) ఆయనకు సింపథెటిక్ గా ఉండే రిపోర్ట్స్ కూడా ఆయన వర్కింగ్ స్టైల్ చాలా స్ట్రిక్ట్ గా ఇన్ఫ్లక్సిబుల్ గా ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు. మెన్షన్ కూడా చేశారు. ఆయనతో వర్క్ చేసే సమయంలో గొడవలు కూడా వస్తాయని చెప్తారు. పార్కిన్ హోటల్ కేస్ కూడా ఒక విషయాన్ని చెప్తుంది. స్పీడ్ గా యాక్షన్ తీసుకునేటప్పుడు కొన్నిసార్లు న్యాయంగా పని చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు.
(15:06) కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒక ఎంటైర్ స్టేట్ లో ఫుడ్ సేఫ్టీ ప్రాపర్ గా పని చేయాలంటే ఒక పర్టికులర్ ఆఫీసర్ ఆ చైర్లో కూర్చోవాల్సిందే అనే సిచువేషన్ ఉంటే దాన్ని స్ట్రాంగ్ సిస్టం అనలేము. అది ఒక లాటరీ అవుతుంది. ఇక మళ్ళీ మనం వీడియో స్టార్ట్ చేసిన నెంబర్ దగ్గరికి వెళ్తే 21 సంవత్సరాల్లో 25 ట్రాన్స్ఫర్స్ ఒక్కో పోస్టింగ్ యవరేజ్ 10 నెలల కన్నా తక్కువ ఇప్పుడు అసలు క్వశ్చన్ తూకారా ముండే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదా మన దగ్గర ప్రాపర్ సొల్యూషన్ లేదని చెప్పడానికి ఏయనా ఒక ప్రూఫా? ఎందుకంటే ఒక మంచి సిస్టంలో ప్రతి చోట ఒక ఎక్స్ట్రార్డినరీ హానెస్ట్
(15:44) ఆఫీసర్ అవసరం ఉండకూడదు. మంచి సిస్టం తనంతట తానే పనిచేయాలి. 2531 ఆఫీసర్స్ ఒక కోటి ఫుడ్ బిజినెస్ ని మానిటర్ చేయాల్సి వస్తే ప్రతి డిస్ట్రిక్ట్ కి ఇలాంటి ఒక సింగం కావాలి. కానీ సిస్టం లో అంతమంది సింగమ్స్ ఉండరు కదా రేపు ఈయనకు 26వ ట్రాన్స్ఫర్ వస్తే ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోతే రోజుకి 1100 రేట్స్ మూమెంటం అక్కడే ఆగిపోతుంది కదా మళ్ళీ ఐస్ క్రీమ్ లోకి రాట్స్ వస్తాయి.
(16:13) అదే సబ్ స్టాండర్డ్ పనీర్ని తిరిగి అమ్ముతారు. అందుకే ఈ న్యూస్ చూసినప్పుడు చాలామంది ఇలాంటి భయం ప్రతి స్టేట్ లో ఉండాలి అని అన్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఒక వ్యక్తిని మాత్రమే ప్రేస్ చేయలేదు. వాళ్ళు చెప్పేది ఈ ఫియర్ పర్మనెంట్ గా ఉండాలి అని. రూల్స్ బ్రేక్ చేస్తే కఠినంగా శిక్షలు పడతాయి అనే భయం సిస్టం లో ఉండాలి. అండ్ అది ఒక పర్టికులర్ ఆఫీసర్ మీద డిపెండ్ అవ్వకూడదు.
(16:36) ఫైనల్లీ ఈ కంప్లీట్ స్టోరీ మనకు చెప్పే లెసన్ ఒకటి. సినిమాలో హీరో వస్తాడు సిస్టం ని ఫిక్స్ చేస్తాడు. కానీ రియల్ లైఫ్ లో హీరో సిస్టం ని ఫిక్స్ చేయలేడు చేయనివ్వరు. హీరోని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అందుకే ఈ విషయంలో రియల్ విక్టరీ రావాలంటే ప్రతి స్టేట్ కి ఒక తూకార ముండే కావాలి. లేదా ఏ స్టేట్ కి తూకార ముండే లాంటి ఒక ఎక్స్ట్రార్డినరీ ఆఫీసర్ అవసరం లేకుండా సిస్టం దానంతట అదే ప్రాపర్ గా పని చేసే రోజు రావాలి. అదే అసలైన విజయం.
(17:07) మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ తూకారా ముండే గారి గురించి మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు ఈయన గురించి ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ఇతనిపై మీ ఒపీనియన్ ఏంటి మీ ఆలోచనల్ని కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(17:27) రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై.

No comments:

Post a Comment