Monday, August 10, 2026

7 జన్మల కర్మ.. 7 నెలల్లోనే! | Fast Karma in Kaliyuga | Sanmaarg Thoughts

7 జన్మల కర్మ.. 7 నెలల్లోనే! | Fast Karma in Kaliyuga | Sanmaarg Thoughts

Author Name:Sanmaarg Thoughts

Youtube Channel Url:https://www.youtube.com/@sanmaargthoughts18

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hzMDYBRDq1Y



Transcript:
(00:00) చాలామంది ఒక మాట చెబుతుంటారు ఏ జన్మలో ఏ పుణ్యం చేశమో ఏ జన్మలో ఏ పాపం చేశమో ఈ జన్మలో అనుభవిస్తున్నాం అని ఈ మాట మీరు కూడా ఎన్నో సార్లు వినే ఉంటారు. బహుశా ఇది నమ్మి కూడా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అదే చెప్పారు. ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచి ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి తిరిగి వస్తుంది. ఎవరికైనా బాధ కలిగిస్తే ఆ బాధ కూడా ఏదో ఒక రోజు మన ముందుకు తిరిగి వస్తుంది అని.
(00:27) ఈరోజు చేసే ప్రతి మంచి ప్రతి చెడు ఎప్పుడో ఒకప్పుడు కర్మగా మనల్ని వెతుక్కుంటూ వస్తుందని మన పెద్దలు చెప్పారు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగా ఇప్పటికీ అలానే జరుగుతుందా ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడండి మీరు ఎవరికైనా సహాయం చేసిన కొద్ది రోజులకే అనుకొని టైంలో ఎవరో వచ్చి మీకు సహాయం చేశారా అలాగే మీరు ఎవరినైనా మోసం చేసిన కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని ఇంకొకరు ఎవరైనా మోసం చేశారా? ఒకవేళ మీ సమాధానం అవునైతే ఇప్పుడు మనం ఒక గొప్ప రహస్యాన్ని అర్థం చేసుకోవాలి.
(00:57) అసలు ఈ కలియుగంలో కర్మ పని చేసే విధానం మారిపోయిందా? ఒకప్పుడు జన్మలు పట్టే కర్మ ఇప్పుడు కొద్ది రోజుల్లో కొన్ని నెలల్లోనే ఫలితాన్ని చూపిస్తుందా? అసలు ఏమిటి ఈ కలియుగ కర్మ రహస్యం ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయేది ఒక కథ కాదు. శాస్త్రాలు చెప్పిన యుగయుగాల కర్మ రహస్యం. ప్రతి మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ఒక గొప్ప సత్యం ఇది. ఈ వీడియో పూర్తయ్యేలోపు కర్మ గురించి మీరు ఎంతకాలం అనుకున్న దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అపోహ ఉందో మీరే అర్థం చేసుకుంటారు.
(01:26) కాబట్టి ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఇప్పుడే ఒక లైక్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాని వెల్కమ్ టు సన్మార్గ థాట్స్. ఇప్పుడు మీకు ఒక షాకింగ్ నిజం చెప్తాను. పూర్వం ఒక తప్పు చేస్తే దాని ఫలితం రావడానికి ఏడు జన్మలు పట్టేదని శాస్త్రాలు చెప్పాయి.
(01:55) ఏడు జన్మలు అంటే దాదాపు వందల ఏళ్ళు కానీ ఇప్పుడు అదే తప్పుకి ఫలితం రావడానికి పట్టే సమయం ఎంతో తెలుసా కొన్నిసార్లు కొన్ని నెలలు కొన్ని వారాలు మాత్రమే. ఏడు జన్మల నుంచి ఏడు నెలలకు ఈ మార్పు ఎలా వచ్చింది? ఎవరైనా ఈ నియమాన్ని మార్చేస్తున్నారా? కాదు ఇది మన శాస్త్రాలు ఎప్పుడూ చెప్పిన ఒక రహస్యం. కర్మఫలితం ఎప్పుడు వస్తుంది అనేది ఏ యుగంలో మనం జీవిస్తున్నామో దాని మీదనే ఆధారపడి ఉంటుంది.
(02:21) మన శాస్త్రాలు నాలుగు యుగాల గురించి చెప్పాయి. సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ నాలుగు యుగాల్లో మనుషుల ఆయుష్షు ఎలా తగ్గుతూ వచ్చిందో అలాగే కర్మ ఫలితం వచ్చే వేగం కూడా మారుతూ వచ్చింది. సత్యయుగంలో మనుషులు చాలా దీర్ఘాయుష్తో ఉండేవారు [సంగీతం] అంటే వందల ఏళ్ళు జీవించేవారు. అప్పుడు కర్మ ఫలితం రావడానికి కూడా చాలా సమయం పట్టేది. ఒక్కోసారి జన్మల తరబడి సమయం పట్టేది.
(02:45) దీనికి విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయల కథనే ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఈ జయ విజయులు బ్రహ్మ మానస పుత్రులు పెట్టిన శాపాన్ని అనుభవించి మళ్ళీ శ్రీ మహావిష్ణువుని చేరుకోవడానికి వాళ్ళకి మూడు జన్మల కాలం పట్టింది. చూశారా సత్యయుగంలో ఒక తప్పుకి ఫలితం రావడానికి మూడు జన్మలు పట్టింది. ఇది సత్యయుగంలో కర్మ నడిచే వేగం.
(03:09) తర్వాత త్రేతా యుగం వచ్చేసరికి ఆయుష్యు తగ్గింది. కర్మ ఫలితం వచ్చే వేగం కూడా కాస్త పెరిగింది. రావణుడు సీతమ్మని అపహరించిన అధర్మానికి ఫలితం జన్మల తరబడి కాదు అదే జన్మలో కొన్ని నెలల్లోనే యుద్ధ రూపంలో వచ్చేసింది. ఇది త్రేతా యుగంలో పెరిగిన కర్మ వేగం. ద్వాపర యుగానికి వచ్చేసరికి ఆయుష్యు ఇంకా తగ్గింది. కర్మ ఫలితం వచ్చే వేగం ఇంకాస్త పెరిగింది. దుర్యోధనుడు ద్రౌపదిని సభలో అవమానించిన తప్పుకు ఫలితం జన్మలు కాదు.
(03:36) అదే జీవితంలో కొన్ని సంవత్సరాల్లోనే కురుక్షేత్ర యుద్ధ రూపంలో వచ్చేసింది. ఇప్పుడు మీరు గమనించారా యుగం మారే కొద్దీ మనిషి యొక్క జీవితకాలం తగ్గుతూ వచ్చింది. కర్మ ఫలితం వచ్చే వేగం మాత్రం పెరుగుతూ వచ్చింది. మరి ఈ కలియుగ పరిస్థితి ఏమిటి? ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఈ కలియుగంలో మనిషి జీవితకాలం తక్కువ. మనసు అస్థిరం. ఆలోచనలు క్షణ క్షణానికి మారిపోతాయి.
(03:59) మీరు ఎంత వేగంగా ఆలోచిస్తున్నారో ఎంత వేగంగా జీవిస్తున్నారో అంతే వేగంగా మీ కర్మ ఫలితం కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంది. విష్ణు పురాణంలో ఒక మాట ఉంది కలౌ తద్దరి కీర్తనాత్ అని అంటే పూర్వ యుగాల్లో ఏ ఫలితం సాధించడానికి తపస్సు యజ్ఞాలు పూజలు కావలసి వచ్చేదో అదే ఫలితం కలియుగంలో వేగంగా తక్కువ సమయంలోనే మీ ముందుకు వస్తుంది అని దీని అర్థం.
(04:22) ఇదే సూత్రం మంచికే కాదు చెడుకు కూడా వర్తిస్తుంది. మునుపటి యుగాల్లో అయితే ఒక కర్మ ఫలితం కోసం జన్మల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ కలియుగంలో ఆ కథే వేరు. ఇప్పుడు ఆ ఫలితం కొన్ని నెలల్లోనే వచ్చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది. ఈ కలియుగంలో ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ అదే ఫలితం కొన్ని గంటల్లోనే వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
(04:45) ఇది కేవలం ఒక నమ్మకం కాదు ఇది కలియుగం పని చేసే విధానం. మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి ప్రతి యుగంలో కర్మకి దాని ఫలితానికి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ నే మనం సమయం అంటాం. సత్యయుగంలో ఈ గ్యాప్ ఎంత పెద్దది అంటే జన్మల తరబడి సాగేంత పెద్దది. ఎందుకంటే ఆ యుగంలో మనిషి మనసు స్థిరంగా ఉండేది.
(05:08) ఆలోచన నెమ్మదిగా కదిలేది. ఒక్క ఆలోచనను మనిషి చాలా కాలం పట్టుకొని ఉండేవాడు. మనసు ఎంత నెమ్మదిగా కదిలితే దాని ఫలితం రావడం కూడా అంతే సమయం పట్టేది. ఇప్పుడు ఈ కలియుగానికి రండి. ఇప్పుడు మనిషి మనసు ఒక్క క్షణంలో వందల దిక్కులకు పరిగెడుతుంది. ఒక ఆలోచన పూర్తవ్వకముందే మరో ఆలోచన మొదలవుతుంది. ఈ వేగమే ఆ గ్యాప్ ని కుదించేస్తుంది. మీ మనసు ఎంత వేగంగా కదులుతుందో కర్మకి ఫలితానికి మధ్య ఉన్న దూరం అంతే తగ్గిపోతుంది.
(05:36) ఇది కేవలం ఒక నమ్మకం కాదు ఇది ఒక సూత్రం. వేగం పెరిగే కొద్దీ గ్యాప్ తగ్గుతుంది. గ్యాప్ తగ్గే కొద్దీ ఫలితం దగ్గరవుతుంది. అందుకే సత్యయుగంలో జన్మల తరబడి పట్టే ఫలితం ఈ కలియుగంలో నెలల్లోకి వారాల్లోకి కుదించుకుపోయింది. మీరు ఎంత వేగంగా ఆలోచిస్తున్నారో ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎంత వేగంగా జీవిస్తున్నారో మీ కర్మ ఫలితం కూడా అంతే వేగంగా మీ దగ్గరికి ప్రయాణిస్తుంది.
(06:00) ఇదే అసలు రహస్యం. ఇది శిక్ష కాదు, ఇది కలియుగం నడిచే వేగం. మీ మనసు వేగాన్ని బట్టే మీ కర్మ వేగం కూడా నిర్ణయం అవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పారు. ఏ యధామాం ప్రవద్యంతే తాంస్తదైవ భజామ్యహం అని అంటే నువ్వు నన్ను ఏ దృష్టితో చేరుతావో నేను కూడా నిన్ను అదే దృష్టితో అనుగ్రహిస్తాను అని దీని అర్థం. ఇది కేవలం భగవంతుడికి మాత్రమే పరిమితమయ్యే మాట కాదు.
(06:25) ఇది యావత్ ప్రపంచం నడిచే సూత్రం కూడా అది ఎలానో చెప్తాను జాగ్రత్తగా వినండి. మీరు ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తారో ప్రపంచం కూడా మిమ్మల్ని అదే దృష్టితో చూస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఈ ప్రపంచం ఇప్పుడు ఎంత వేగంతో కదులుతోంది. మీ చేతిలో ఉన్న ఫోన్ లో ఒక సందేశాన్ని టైప్ చేసి పంపిస్తే అది ఒక్క సెకండ్ లోనే ఈ ప్రపంచం అవతలి కొస కూడా చేరిపోతుంది.
(06:49) ఏదైనా ఒక వార్త పుడితే అది నిమిషాల్లోనే కోట్ల మందికి తెలిసిపోతుంది. ఒకప్పుడు ఒక సందేశాన్ని ఒక ఊరి నుంచి మరో ఊరికి చేరాలంటే రోజులు నెలలు పట్టేది. ఇప్పుడు అదే సందేశం ఒక్క క్షణంలో ప్రపంచం మొత్తానికి చేరిపోతుంది. ఎందుకంటే ప్రపంచం వేగం పెరిగింది. మరి ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోండి. ఈ ప్రపంచం వేగం పెరిగినప్పుడు అందులో బ్రతుకుతున్న మీ కర్మ ఫలితం మాత్రమే పాత వేగంతో ప్రయాణిస్తుందా? కాదు కదా మీరు ఈ ప్రపంచంలో ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నారో అంతే వేగంగా ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని అదే దృష్టితో తిరిగి చూస్తుంది.
(07:22) మీరు వేసే ప్రతి అడుగుకి ఈ ప్రపంచం స్పందించే వేగం కూడా అంతే పెరుగుతుంది. ఇదే గీత చెప్పిన సూత్రానికి కలియుగం ఇచ్చిన కొత్త వేగం. మరింత స్పష్టంగా మరింత వేగంగా ఈ సూత్రం ఇప్పుడు పని చేస్తుంది. ఈ కలియుగంలో మరింత ముందుకు వెళ్లే కొలది ఈ వేగం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
(07:44) కర్మ ఫలితం వేగంగా వస్తుంది కదా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మీరు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మాత్రమే ఉంది. ఎందుకంటే పూర్వ యుగాల్లో మీరు చేసిన ఒక తప్పుకి ఫలితం రావడానికి చాలా సమయం ఉండేది. ఆ సమయంలో మీరు మారే అవకాశం ఉండేది. క్షమాపణ కోరే అవకాశం ఉండేది. సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండేది. కానీ ఈ కలియుగంలో ఆ వ్యవధి చాలా తక్కువ. ఇక్కడ మీకు ఎక్కువ సమయం ఉండదు.
(08:07) అందుకే మీరు మాట్లాడే ప్రతి మాట వేసే ప్రతి అడుగు తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆలోచించే ఆలోచనే రేపటి మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి. ఇప్పుడు ఒకసారి మీ చుట్టూ చూడండి తల్లిదండ్రులని పట్టించుకొని వాళ్ళను వాళ్ళ పిల్లలు కూడా అలానే చేయడం మీరు చూసి ఉంటారు.
(08:28) అబద్ధాలతో వ్యాపారం చేసే వాళ్ళ మోసం త్వరగానో లేటుగానో మొత్తం మీద బయటపడి వాళ్ళ పరపత్తి పోయే పరిస్థితికి రావడం కూడా మీరు గమనించే ఉంటారు. నిజాయితిగా కష్టపడే వాళ్ళకి ఫలితం అనేది ఆలస్యమైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇదంతా యాదృశ్యకం కాదు. ఇదే కలియుగం నడిచే విధానం. మీకు ఎదురయ్యే ప్రతి మనిషి ప్రతి పరిస్థితి ఏదో ఒక పాఠాన్ని నేర్పడానికి వస్తుంది.
(08:50) అందుకే మీకు బాధ కలిగినప్పుడు కూడా ఎందుకు నాకే ఎలా జరిగింది అని ప్రశ్నించే బదులు ఇందులో నేను ఏ పాఠాన్ని నేర్చుకోవాలి అని ప్రశ్నించుకోండి. ఈ కలియుగం కష్టమైన యుగమే కావచ్చు కానీ ఇది అత్యంత న్యాయమైన యుగం కూడా. ఎందుకు న్యాయమైన యుగం అంటే మీరు చేసిన దానికి ఫలితం మీకు ఇక్కడే ఇప్పుడే కనిపిస్తుంది. అది మంచైనా చెడైనా సరే మీరు ఇక్కడే అనుభవించి వెళ్ళాలి.
(09:12) మీ కర్మను మీరే చూసుకునే అవకాశం మీకు ఇప్పుడు ఉంది. కాబట్టి ప్రతి మాట వెనక ప్రతి పని వెనక జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇవాల్టి నుంచి మీరు మాట్లాడే ప్రతి మాటలో చేసే ప్రతి పనిలో కాస్త ప్రేమను కాస్త కరుణను కాస్త నిజాయితిని జోడించండి. ఎందుకంటే మీరు ఈరోజు చేసే ప్రతి మంచి అడుగు రేపు మీ దగ్గరికే మంచిగా తిరిగి వస్తుంది కాబట్టి ఇదే కలియుగ కర్మ రహస్యం.
(09:37) ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఇప్పుడే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కనీసం 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరింతో ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.

No comments:

Post a Comment