ఇల్లు, ఉద్యోగం వదలకుండానే మోక్షం సాధ్యమా?....ఈ 3 విషయాలు చాలు....|| అష్టావక్ర గీత
Author Name:Darma rahasyam
Youtube Channel Url:https://www.youtube.com/@Darmarahasyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=aDSfP0EjJ0I
Title: ఇల్లు, ఉద్యోగం వదలకుండానే మోక్షం సాధ్యమా?....ఈ 3 విషయాలు చాలు....|| అష్టావక్ర గీత
Author Name: Darma rahasyam
Description: ఇల్లు, ఉద్యోగం వదలకుండానే మోక్షం సాధ్యమా?...
ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చింది ఒక 12 ఏళ్ళ బాబు — అష్టావక్రుడు.
అష్టావక్ర గీత సిరీస్ Ep2 ఇప్పుడే చూడండి...
.#DharmaRahasyam #Ashtavakra #HinduMythology #AshtavakraGita
#TeluguMythology #PuranicStories #TeluguSpirituality #SanatanaDharma
#TeluguDevotional #BhaktiKathalu #JanakaMaharaja #AtmaGnanam
#TeluguMotivation #SpiritualWisdom #IndianMythology
Transcript:
(00:00) ఒక మనిషికి జీవితం మీద విరక్తి కలిగింది. ఇల్లు, కుటుంబం, ఉద్యోగం, ఆస్తి అన్నీ [సంగీతం] వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇక నాకు శాంతి దొరుకుతుంది అనుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి కొండల్లో కూర్చున్న అతని మనసు ఇంకా ఇంటి చుట్టూనే తిరుగుతుంది. ఎవరో ఏదో అన్నారని కోపం పక్క ఆశ్రమం పెద్దదని అసూయ అన్ని వదిలేసాడు. కానీ లోపల అశాంతి మాత్రం అలానే ఉంది.
(00:26) ఇంకోవైపు ఒక రాజు రాజ్యం, సంపద, మంత్రులు, సైన్యం ఏవి వదలలేదు. కానీ పురాణ సంప్రదాయం అతన్ని జ్ఞానిగా రాజర్షిగా గౌరవిస్తుంది. [సంగీతం] ఆయనే జనక మహారాజు. ఇప్పుడు అసలు ప్రశ్న. ఇల్లు ఉద్యోగం వదలకుండానే మోక్షం సాధ్యమా? అసలు మోక్షం అంటే ఏంటి? మీరు ఇల్లు ఉద్యోగం కుటుంబ బాధ్యతలో ఉన్నవారైతే ఈ ప్రశ్న మీకోసమే.
(00:53) అష్టావక్రుడు జనకుడికి ఇచ్చిన సమాధానంలో ఈ ప్రశ్నకి ఈ మూడు విషయాలు ఉన్నాయి. మొదటిది జ్ఞానం నిజంగా మనం ఎవరం అనేది అవగాహన. రెండవది వైరాగ్యం వస్తువులను కాదు వాటి మీద పట్టును వదలడం మూడవది సాక్షి భావం జీవితాన్ని ఒక పాత్రలా కాకుండా చూసేవాడిలా చూడడం. ఈ మూడు ఎలా పని చేస్తాయో చివరివరకు చూడండి. ముందు ఎపిసోడ్ లో మనం చూసాం.
(01:20) జనక మహారాజు రాజ్యం సంపద అధికారం అన్ని ఉన్నా లోపల ఏదో లోటు అనుభవించాడు. ఆ లోటు నుండి పుట్టిన మూడు ప్రశ్నలు అష్టావక్రుడిని అడిగాడు. ముక్తి ఎలా వస్తుంది? వైరాగ్యం ఎలా కలుగుతుంది? ఒక్క విషయం ఇవి పుస్తక జ్ఞానం కోసం అడిగిన ప్రశ్నలు కావు. ఒక మనిషి లోపల బాధ ఉన్నప్పుడు ఈ బాధ నుండి బయటపడే దారి ఏది అని తపిస్తున్నప్పుడు అడిగే ప్రశ్నలు. మనం కూడా అప్పుడప్పుడు ఇలానే అనుకుంటూ ఉంటాం.
(01:48) నేను ఇంకేం చేస్తే ప్రశాంతంగా ఉంటాను ఇంకా ఎలా ఉండాలి ప్రశాంతంగా ఉండడానికి అని జాబ్ వస్తే పెళ్లయితే ఇల్లు కట్టుకుంటే ఇలా ఎన్నో ఆలోచిస్తాం కానీ నిజానికి మనిషి కోరికలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వాటికి అంతమంటూ ఉండదు. ఒక కోరిక పూర్తఅవ్వగానే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ అది పూర్తఅవ్వగానే ఇంకొక కోరిక మొదలవుతూనే ఉంటుంది.
(02:17) పెళ్లయతే చాలు అనుకుంటారు కొందరు కానీ ఆ తర్వాత పిల్లలు ఇలా ఒకదానికిఒకటి లింక్ ఉంటూనే ఉంటుంది. వీటన్నిటికీ అష్టావక్రుడు చెప్పిన సమాధానం చూడండి ఎలాంటి పూజా విధానం చెప్పలేదు ఎలాంటి కష్టమైన సాధన చెప్పలేదు. నేరుగా ఇలా అన్నాడు. నువ్వు ఈ శరీరం కాదు పంచభూతాలతో తయారైన ఈ శరీరాన్ని గమనిస్తున్న సాక్షివి నువ్వు దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే కానీ ఇలా అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది.
(02:48) ఒక కలని ఉదాహరణగా తీసుకోండి కలలో మీరు రాజు కావచ్చు భిక్షగాడు కావచ్చు ఏడవచ్చు భయపడొచ్చు ఆ క్షణంలో అదంతా నిజంగా అనిపిస్తుంది. కానీ మేలుకో వచ్చాక ఏమనిపిస్తుంది? నేను ఆ కల చూసినవాడిని ఆ కల కన్నవాడిని ఆ కలలో పాత్రని కాదు అది జరగలేదు అని స్టావక్రుడు చెప్పేది ఇదే మన జీవితం శరీరం ఆలోచనలు భావోద్వేగాలు ఇవన్నీ కలలో పాత్రల వంటివి వాటిని చూస్తున్న ఒకడు ఉన్నాడు ఆ చూసేవాడే నిజమైన నువ్వు ఇంకా చెప్పాలి అంటే ఒక తెర మీద యుద్ధం జరుగుతుంది.
(03:23) రక్తం చిందుతోంది. ఎవరో ఏడుస్తారు కానీ ఆ తెర కాలిపోదు తడవదు గాయపడదు. సినిమా అయిపోయాక తెర అలానే స్వచ్ఛంగా ఉంటుంది. నీ జీవితంలో జరిగే సంఘటనలు సినిమా లాంటిది. నీ అసలైన స్వరూపం ఆ తెర లాంటిది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు నేను ఇంతే అని ఒక సంఘటనతో మనం మన మొత్తం ఐడెంటిటీని నిర్ణయం చేసుకుంటాం.
(03:52) అష్టావక్రుడి దృష్టిలో ఆ సంఘటన తెర మీద ఒక దృశ్యం మాత్రమే తెర కాదు మనం వేరు శరీరం వేరు అయినప్పుడు మరి శరీరం ఎందుకుంది అనిపిస్తుంది కదా వేదాంత దృష్టిలో దీనికి ఒక సమాధానం ఉంది. శరీరం ఒక పరికరం ఆత్మ దాన్ని వాడేవాడు. [సంగీతం] సరిగ్గా చెప్పాలి అంటే కారు నడిపే డ్రైవర్ కారు కాదు. కారు అతన్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకి తీసుకెళ్లే సాధనం మాత్రమే అలాగే ఆత్మ ఈ ప్రపంచాన్ని అనుభవించడానికి శరీరం అనే సాధనాన్ని వాడుతుంది.
(04:24) మరో విధంగా చెప్పాలి అంటే ఒక నటుడు ఒక వేషం వేసాడు. నటుడు రోజుకో వేషం వేస్తాడు. పాత్ర మారుతుంది. వేషం మారుతుంది. కానీ నటుడు అతనే శరీరం ఆ వేషం లాంటిది. అసలు సమస్య శరీరం ఉండడంలో లేదు. సమస్య ఎక్కడంటే వేషాన్ని చూసి నేను ఈ వేషమే అని నమ్మేయడంలో ఉంది. ఈ తప్పు నమ్మకాన్నే వేదాంతంలో అజ్ఞానం అంటారు. చీకటిలో పడి ఉన్న తాడును చూసి పాము అనుకుంటాం.
(04:53) గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయం నిజంగా అనిపిస్తుంది. కానీ ఆ తాడు ఎప్పుడూ పాము కాలేదు. వెలుతురు వచ్చిన క్షణం భయం మాయమవుతుంది. బంధం కూడా అంతే అది నిజంగా లేదు తెలియకపోవడం వల్ల మాత్రమే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి చేసేది శరీరమే అయినప్పుడు ఆత్మకి ఏ సంబంధం లేనప్పుడు కర్మ ఎందుకుంది మొదట కర్మను శిక్షగా చూడొద్దు.
(05:21) ఇది ఎవరో కూర్చొని వేసే శిక్ష కాదు. ఇప్పుడు నిప్పును తాకితే చెయ్యి కాలడం లాంటి సహజ నియమం. నిప్పు మనల్ని శిక్షించడం లేదు అది దాని స్వభావం. అలాగే మనం చేసే పనులకు తగిన ఫలితాలు రావడం ఒక సహజ కారణ ఫలబంధం ఇష్టావక్రుడు ఇక్కడ ఒక లోతైన విషయం చెప్తాడు. నువ్వు కర్తవి కాదు నిజానికి పనులు చేసేది శరీరం మనసు నువ్వు కేవలం సాక్షివి ఎప్పుడైతే నేనే చూస్తున్నాను ఇది నా ఘనత ఇది నా తప్పు అనే భావన పలచబడుతుందో అప్పుడు నీ కర్మ నిన్ను బందించే పట్టు కోల్పోతుంది.
(05:57) సినిమాలో విలన్ ఎన్ని దారుణాలు చేసినా ఆ పాపం తెరకు అంటదు. ధర ఏమీ చేయడం లేదు కేవలం చూపిస్తోంది. ఈ కర్మ చక్రానికి మొదలు లేదు అంతం లేదు అనేది వేదాంత సిద్ధాంతం దీన్ని సైన్స్ లా నిరూపించలేను. ఇది ఒక తాత్విక చట్రం దీన్ని నమ్మడం ఆలోచించడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయం. బౌద్ధం వంటి ఇతర సంప్రదాయాలు దీనికి వేరే వివరణలు ఇస్తాయి.
(06:23) మరి ఇల్లు ఉద్యోగం వదలకుండానే మోక్షం సాధ్యమా తావక్రుడి సమాధానం వదలాల్సింది వస్తువులను [సంగీతం] కాదు ఇవి నావి నేను ఇవే అనే పట్టును జనకుడు రాజుగానే ఉన్నాడు రాజ్యం చేస్తూనే లోపల ఆ పట్టు లేకుండా జీవించాడు. ఒక మనిషి అడవిలో ఉండి కూడా పట్టు వదలలేకపోవచ్చు. ఇంకొకరు సంసారంలో ఉండి కూడా లోపల స్వేచ్ఛగా ఉండొచ్చు. బయట వదలడం కాదు లోపల వదలడం ముఖ్యం.
(06:51) ఉదాహరణకి ఒక మనిషి తన హారం పోయిందని ఇల్లంతా వెతుకుతున్నాడు. దిండుల కింద కుండలో చూస్తున్నాడు అల్మరా చిందర వందర చేస్తున్నాడు. [సంగీతం] అప్పుడే స్నేహితుడు నవ్వుతూ అన్నాడు నీ మెడలోనే ఉంది చూడు మెడ తడుముకొని చూశడు హారం అక్కడే ఉంది. ఆ క్షణంలో అతను ఏమి సాధించలేదు ఎప్పటి నుండో ఉన్నదాన్ని గుర్తించాడు అంతే అష్టావక్రగీత చెప్పే మోక్షం ఇలాంటిదే ఇప్పుడు మోక్షం ఎలా వస్తుందో చూద్దాం.
(07:21) అష్టావక్రగీత సమాధానం మోక్షం [సంగీతం] సాధించేది కాదు గుర్తించేది. నువ్వు ఎప్పుడూ బుద్ధుడివి కాదు నేను బుద్ధుడిని అనే బ్రమ మాత్రమే ఉంది. ఆ బ్రమ తొలగితే మిగిలేది [సంగీతం] ఎప్పుడు ఉన్న స్వభావమే ఇల్లు ఉద్యోగం వదలకుండానే మోక్షం వైపున నడవడానికి ఈ మూడు విషయాలు చాలు మొదటిది జ్ఞానం నేను శరీరం కాదు గమనించే చైతన్యాన్ని అని కేవలం మాటల్లో కాకుండా లోతుగా అర్థం చేసుకోవడం.
(07:48) రెండో విషయం వైరాగ్యం. ఫలితాల మీద పోలికల మీద ఇతరుల అభిప్రాయాల మీద పట్టు సడలించడం ఫోన్లో ఎవరిదో విజయం చూసి నేను వెనకబడ్డాను అనిపించినప్పుడు ఆ పోలిక నీ నిజమైన విలువను నిర్ణయించదని గుర్తు చేసుకోవడం మూడో విషయం సాక్షి భావం కోపం వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది అనే బదులు కోపం వస్తుందని నేను గమనిస్తున్నాను అనే దృక్పదం అలవాటు చేసుకోవడం ఈ చిన్న మార్పు కాలక్రమైన భావోద్వేగాల పట్టు నుండి మనల్ని వేరు చేస్తుంది.
(08:22) ఎవరో మనల్ని అవమానించారు అనుకోండి మామూలుగా రోజంతా అదే ఆలోచిస్తూ నేను ఎందుకు పనికి రాను అని కుంగిపోతాం. కానీ సాక్షి దృక్పదంతో చూస్తే ఇది తెర మీద జరిగిన ఒక దృశ్యం బాధ అనిపించడం సహజమే కానీ ఆ బాధ నేను కాదు ఈ దూరం పాటించడమే మోక్షం వైపు మొదటి అడుగు అష్టావక్రుడు చెప్పిన మోక్షం ఒక గమ్యం కాదు ఒక అవగాహన మార్పు ఒక్క క్షణంలో వచ్చే అరే నేను ఎప్పుడూ స్వేచ్ఛగానే ఉన్నాను అనే గుర్తింపు ఆ మనిషి దగ్గరికి వెళ్దాం.
(08:53) ఇల్లంతా వెతికి అలసిపోయిన ఆ మనిషి ఒక్క క్షణం ఆగి మెడ తడుముకున్నాడు. హారం అక్కడే ఉంది. మోక్షం కోసం మనం కూడా ఎన్నో చోట్లు వెతుకుతాం. కానీ ఎప్పుడైనా ఒక క్షణం ఆగి లోపలికి చూసుకున్నామా మన పూర్వీకులు ఎన్నో విషయాలు కథలుగా మనకు అందచేశారు. కానీ వాటిలో ఉన్న విషయాన్ని వదిలేసి వాటిని కథలుగానే వదిలేసి.
(09:16) అష్టావక్రగీత కూడా అంతే ఇందులో ప్రతి మాట వెనుక ఒక సైకాలజీ ఉంది. ఈరోజు మన జీవితానికి ప్రత్యక్షంగా వర్తించే పాఠం ఉంది. తర్వాత ఎపిసోడ్ లో ఈ జవాబు విన్న జనకుడు ఏమన్నాడో చూద్దాం. తన అనుభవాన్ని ఆయన ఎంత అందంగా వర్ణించాడో తెలుసుకుందాం. మీ జీవితంలో ఇది దొరికితే నేను ప్రశాంతంగా ఉంటాను అన్న విషయం ఏముంది కామెంట్ చేయండి.

No comments:
Post a Comment