Thursday, October 1, 2026

మనశ్శాంతి ఎందుకు దొరకట్లేదు | How To Change Your Life | Satyagrahi

మనశ్శాంతి ఎందుకు దొరకట్లేదు | How To Change Your Life | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KyG4PeIJywI





Title: మనశ్శాంతి ఎందుకు దొరకట్లేదు | How To Change Your Life | Satyagrahi

Author Name: Satyagrahi

Description: Welcome to Satyagrahi, your sanctuary for relentless growth and profound self-discovery.
This isn't just a channel; it's a movement dedicated to unlocking the powerful, authentic person you were meant to be. We believe that true motivation isn't a fleeting spark—it's the steady, unwavering soul-force (Satyagraha) that arises when you align your actions with your deepest truths.
Every video here is designed to be a catalyst for life-changing clarity. We cut through the noise to deliver powerful insights, actionable strategies, and enduring wisdom that will help you:
⚡️ Overcome Procrastination and Fear: Break free from limiting beliefs and step into decisive action.
💡 Find Your Purpose: Discover your unique calling and build a life of meaning, not just routine.
🧘 Build Unstoppable Resilience: Learn to navigate challenges with grace and emerge stronger from every setback.
🌟 Master Your Mindset: Cultivate the mental toughness required to achieve ambitious goals.
Stop surviving and start thriving. Join the community committed to the force of truth and begin the extraordinary journey of mastering your inner world.
New videos every [Day of the week, e.g., Monday and Thursday]!

➡️ Subscribe now and claim your power. Your life-changing moment starts here.





This channel may feature content under Section 107 of the Copyright Act (1976). Fair use is permitted for purposes such as criticism, commentary, news reporting, teaching, scholarship, motivation, and research. Any use of copyrighted material in our videos is for educational, motivational, and non-profit purposes only, and is not intended to infringe upon the rights of the original copyright holders.







#motivation #inspiration #success #mindset #positivity #discipline #focus #growth #nevergiveup #selfimprovement #successmindset #confidence #lifelessons #dailyquotes #motivationdaily #motivationalvideo #successquotes #hardwork #positivethinking #mindpower

Transcript:
(00:01) [సంగీతం] మనం రోజు ఉదయం లేవగానే చేసే మొదటి పని ఏంటో తెలుసా మనం ఫోన్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ వైపు చూస్తూ మన సమస్యల లిస్ట్ ని మనమే ఒకసారి గుర్తు చేసుకుంటాం. నా అకౌంట్ లో డబ్బులు లేవు నా శరీరం సహకరించట్లేదు. నా భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. అసలు నన్ను ఎవరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. మన ఆలోచనలన్నీ మన బాధల చుట్టూ మన గది గోడల చుట్టూ మన స్వార్థం చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటాయి.
(00:32) మనం మనల్ని ఒక బాధితుడిగా మార్చేసుకొని ఆ బాధలోనే ఒక విచిత్రమైన సుఖాన్ని వెతుక్కుంటున్నాం. జర్మన్ గ్రేట్ ఫిలాసఫర్ ఫ్రెడరిక్ నిషే ఒక అద్భుతమైన మాట అంటారు. మీరు అగాధంలోకి ఎక్కువ సేపు తదేకంగా చూస్తూ ఉంటే ఆ అగాధం కూడా మీలోకి చూడటం మొదలు పెడుతుంది అని. నిజం ఏంటంటే మనం సరిగ్గా అదే చేస్తున్నాం. మనకున్న చిన్న చిన్న సమస్యలనే లోతైన లోయలుగా ఊహించుకొని వాటినే రోజంతా చూస్తూ కూర్చుంటున్నాం.
(00:58) మన మెదడు ఆ సమస్యలని భూతద్దంలో పెట్టి చూస్తుంది. ఫలితంగా మనకి ప్రపంచం కనిపించట్లేదు సమాజం కనిపించట్లేదు మనకంటే ఎన్నో రెట్లు ఘోరమైన నరకాన్ని అనుభవిస్తున్న మనుషులు కూడా కనిపించట్లేదు. మనం కేవలం నేను నా బాధ నా ఇబ్బంది అనే ఒక ఇరుకైన జైలు గది నిర్మించుకొని అందులో మనమే స్వచ్ఛందంగా ఖైదీలుగా మారిపోయాం. మనం మనల్ని మనం ప్రేమించుకోవడానికి మన మీద మనమే జాలి పడటానికి మద్య ఉన్న తేడాని పూర్తిగా మర్చిపోయాం.
(01:26) ఫెడ్రిక్ నిషే గారు బలహీనమైన మనస్తత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆయన దృష్టిలో నిరంతరం తన సొంత రోగాల గురించి తన అభద్రత భావాల గురించి ఏడుస్తూ కూర్చునేవాడు ఒక పిరికివాడు. కానీ ఈ రోజుల్లో మనందరికీ అదే పెద్ద అలవాటు అయిపోయింది. మనం మన స్వార్థాన్ని దాచుకోవడానికి డిప్రెషన్ అని ఓవర్ థింకింగ్ అని చెప్పేసి పెద్ద పెద్ద పేర్లు తగిలించేసుకుంటున్నాం.
(01:49) మన బాధలకు కారణం మన చుట్టూ ఉన్న పరిస్థితులు కావు. మన దృష్టి మొత్తం కేవలం మన స్వార్థం మీదే ఉండటం. మనం ఇతరుల గురించి ఒక గొప్ప లక్ష్యం గురించి ఆలోచించడమే మానేసాం. ఒకసారి వీధి చివరి వరకు వెళ్లి చూడండి. ఎండలో చెప్పులు లేకుండా నడిచే కూలింగ్ చూడండి. రోజు గడవడానికి రక్తం కళ్ళ చూసే మనుషులను చూడండి. వాళ్ళఎవరో గద్దెలుపులు వేసుకొని నాకే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి మూలన కూర్చొని ఏడవడం లేదు.
(02:15) కానీ మనం మూడు పూటల తిని తింటూ చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టుకొని ఫ్యాన్ కింద పడుకొని కూడా జీవితం నన్ను మోసం చేసిందని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాం. మనం మన సమస్యలని ఒక కిరీటంలా నెత్తికెత్తుకొని మోస్తున్నాం. ఎందుకో తెలుసా ఆ కిరీటం కింద మన బద్ధకాన్ని దాచేయొచ్చు కాబట్టి ఫెడ్రిక్ నిషే గారు ఒకచోట సూటిగా ప్రశ్నిస్తారు.
(02:38) మనుషులు ఎందుకు సుఖం కోసం జాలి కోసం ఇంతగా వెంపర్లాడతారు అని ఆయన మాటలో చెప్పాలంటే మనం మన కష్టాలను చూపించి నలుగురి సానుభూతిని పొందాలని చూస్తున్నాం. నేను చాలా బాధల్లో ఉన్నాను అని చెప్పుకోవడంలో మనకి ఒక తెలియని కిక్ వస్తుంది. మనం బాధని అనుభవించట్లేదు. ఆ బాధని ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరైనా వచ్చి నీకు కష్టం వచ్చింది కదా అని చెప్పేసి భుజం తడితే చాలు మనం ఇంకొంచెం ఎక్కువగా ఏడుస్తాం.
(03:04) ఈ సైకాలజీనే నీషా గారు స్లేమ్ మొరాలిటీ లేదా బానిస మనస్తత్వం అంటారు అంటే తన చేతకానితనాన్ని ఒక గొప్ప గుణంగా ప్రచారం చేసుకోవడం మనం కూడా సరిగ్గా అదే ట్రాప్ లో పడి కొట్టుమిట్టాడుతున్నాం. మనం మనల్ని ఒక హీరోగా కాకుండా ఒక ట్రాజడీ సినిమాలోని అనాధ పాత్రలా ఫీల్ అవుతున్నాం. ఎదుటివాడు ఎదుగుతుంటే అసూయ పక్కవాడు సంతోషంగా ఉంటే అక్కసు కానీ మన జీవితాన్ని మార్చుకోవడానికి మాత్రం అడుగు ముందుకు పడదు ఎందుకంటే మనం మన ఆలోచన పరిధిని కేవలం మన శరీరం మన జేబు మన అహంకారం వరకే పరిమితం చేసాం సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
(03:41) మనం మన స్వార్థంలో ఎంతగా మునిగిపోయామ అంటే బయట ప్రపంచంలో ఒక మహా సంగ్రాామం నడుస్తుందని స్పృహ కూడా మనకి లేకుండా పోయింది. అందులోనూ ఈ చిన్న మనస్తత్వంతో మనం ఎప్పటికీ విముక్తి పొందలేము. సరే ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఈ జబ్బు మన మెదడులోకి ఎప్పుడు ఎక్కిందో తెలుసా? సమాజం మనకి చిన్నప్పటి నుంచి ఒక ప్రమాదకరమైన విషయాన్ని నూరి పోసింది నీ కెరీర్ చూసుకో నీ మార్కులు చూసుకో నీ ప్యాకేజీ ఎంత నువ్వు ఎవరికంటే ముందున్నావు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఎంతమందికి కింద ఉన్నావు ఎంతమందికి పైనున్నావు మనం పుట్టిన దగ్గర నుంచి మనల్ని ఒక పరుగు పందంలో నెట్టేశారు.
(04:19) ఆ పరుగులో పక్కవాడిని తొక్కేయడమే గెలుపు అనుకుంటున్నావు. ప్రతీక్షణం నాకేంటి లాభం నాకేం దొక్కుతుంది అనే ప్రశ్నతోనే బ్రతకడం అలవాటు చేసుకున్నాం. ఫలితంగా మన ప్రపంచం మన అద్దం కంటే చిన్నదైపోయింది. మనం అద్దంలో కనిపించే మన ముఖాన్ని చూసుకొని మురిసిపోవడం లేదా ఆ ముఖం పై ఉన్న మచ్చలను చూసి కుమిలిపోవడం తప్ప ఆ అద్దంలో కనిపిస్తున్న మనిషి యొక్క అద్భుతమైన జీవితాన్ని చూడలేకపోతున్నాం.
(04:44) ఫ్రెడ్రిక్ నిషే గారు అంటారు ఒక సమాజం ఎప్పుడైతే గొప్ప ఆదర్శాలను కోల్పోతుందో అప్పుడు అది కేవలం చిన్న చిన్న సుఖాల కోసం వ్యక్తిగత భయాల కోసం పాకులాడే చివరి మనుషుల సమాజంగా మారిపోతుంది అని ఈరోజు మనం సరిగ్గా ఆ స్థితిలోనే ఉన్నాం. మనకి యుద్ధాలు లేవు సాధించాల్సిన గొప్ప విప్లవాలు లేవు. కళ్ళ ముందు నిలబడి సవాలు విసిరే భీకరమైన శత్రువులు కూడా లేరు.
(05:08) అందుకే మనం ఏం చేస్తున్నాం మన బెడ్రూమ్ లోనే కూర్చొని మన మనసులోనే యుద్ధాలు మొదలు పెట్టేసాం. ఎవరో ఆఫీస్ లో ఏదో అన్నారని చెప్పేసి రోజంతా కుమిలిపోతాం.ఇస్గ లో మన ఫోటోకి లైకులు రాలేదని చెప్పేసి పక్కవాడికి నీకంటే ఎక్కువ లైకులు వచ్చేసినయ అని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన జీవితంలో నిజమైన భారీ పోరాటాలు లేనప్పుడు మన మెదడు అత్యంత అల్పమైన విషయాలని కొన్నంత సమస్యలుగా మార్చేస్తుంది.
(05:36) మన దృష్టి కేవలం మన పైనే కేంద్రీకృతమైనప్పుడు మన అహంకారం ఒక సైతానులా తయారవుతుంది. మనం ఈ సృష్టి మొత్తం నాకోసమే తిరుగుతుంది అనే భ్రమలో ఉంటాం. వర్షం పడితే మన బట్టలు తడిసిపోయేమని ఏడుస్తాం తప్ప ఎండిపోయిన నీళ్ల దాహం తీరిందని ఆలోచించం. ట్రాఫిక్ జామ్ అయితే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి రోడ్డు తిడతాం తప్ప అక్కడ మనలాగే వందల మంది మనుషులు ఆగిపోయారనే కనీస జ్ఞానం మనకు ఉండదు.
(06:03) ఫ్రెడ్రిక్ నిషే గారు ఒక లోతైన నిజాన్ని బయట పెడతారు. మనిషి తన స్వార్థంలో బందీ అయినప్పుడు అతనికి ప్రతి చిన్న గాలివాన కూడా ఒక ప్రళయంలా కనిపిస్తుంది అని. ఎందుకంటే అతనికి తన శరీరాన్ని, తన స్వార్థాన్ని మించిన పెద్ద లక్ష్యం ఏదీ తెలియదు. మనసు చేసే ఈ విచిత్రమైన మోసాన్ని మనం పట్టించుకోవాలి. మన బ్రెయిన్ అప్పుడు ఒక ట్రిక్ ని ప్లే చేస్తూ ఉంటుంది.
(06:26) ఎవరికైనా మనం ఒక సమస్య గురించి పదే పదే చెప్తుంటే మన మెదడులో అది నిజంగానే పరిష్కారం లేని ఒక మహా విపత్తులా నమోదయపోతుంది. మనం మన సమస్యలనే మన ఐడెంటిటీగా మార్చేసుకుంటున్నాం. నేను ఒక ఫెయిల్యూర్ ని నాకు అప్పులు ఉన్నాయి. నన్నందరూ మోసం చేశారు. ఈ లేబుల్స్ ని మనం ఒక బ్యాడ్జ్ లాగా చాతిపై తగిలించుకొని తిరుగుతున్నాం. ఎందుకంటే ఆ లేబుల్స్ తీసేస్తే మనకంటూ ఏ ప్రత్యేకత మిగలదనే భయం.
(06:51) కష్టాలు పడుతున్న వ్యక్తికి నలుగురు దృష్టి మన మీదే ఉండాలనే అహంకారం. ఫ్రెడ్రిక్ నిషా గారు ఒక నిర్మొహమాటమైన మాట చెప్పారు. చాలా మంది మనుషులు తమ గొలుసులను ప్రేమించడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ గొలుసులు లేకపోతే తాము ఎవరో వారికి అర్థం కాదు. మనం కూడా అంతే మన అప్పులు, మన బాధలు, మన ఆందోళనలనే ఒక అలవాటుగా మార్చేసుకున్నాం.
(07:13) రోజు వాటితో జీవించడం మనకి సౌకర్యంగా మారిపోయింది. ఒకవేళ ఆ సమస్యలన్నీ రేపటికి రేపు మాయమైపోతే మనం ఏం చేయాలో కూడా మనకి తోచదు. జీవితంలో అంతకంటే ఉన్నతమైన బాధ్యతలు మోసే దమ్ము మనకు లేక ఈ చిన్న చిన్న గోలుసులు సవ్వడిలోనే మనం కాలాన్ని వృధా చేసుకుంటున్నాం. మనం మనల్ని సమాజంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా భావించడమే ఈ మానసిక రోగానికి అసలైన మూల కారణం.
(07:38) ఈ విశ్వంలో మనం ఎంత చిన్న నలుసుమో మనం గ్రహించట్లేదు. కోట్లాది నక్షత్రాలు లక్షలాది జీవరాశులు తరతరాలుగా వచ్చి పోయే కోట్లాది మనుషుల ప్రవాహం వీటన్నిటి మధ్య మనకున్న ఈ 60 70 ఏళ్ల జీవితం ఒక్క క్షణం కంటే తక్కువ అయినా సరే మనం మన చిన్న అహంకారాన్ని హిమాలయ పర్వతాల కంటే పెద్దదిగా ఊహించుకుంటున్నాం. ఫెడ్రిక్ నీషో గారు సరిగ్గా ఇక్కడే మనల్ని హెచ్చరిస్తారు.
(08:04) మన దృష్టి కేవలం మన కడుపు మన సుఖం మన చిన్న బాధల చుట్టూనే ఉంటే మనం ఎప్పటికీ పశువుల స్థాయి నుంచి పైకి ఎదగలేము అని మరి అసలు ఈ సమస్యని ఎలా అధిగమించాలి ఈ మానసిక నరకం నుంచి బయటపడాలంటే మనం ముందుగా మన చేతులతో మనం నిర్మించుకున్న ఈ స్వార్ధపు గోడల్ని బద్దలు కొట్టాలి. ఫెడ్రిక్ నిషో గారు ఒక అద్భుతమైన భావనని ప్రపంచానికి పరిచయం చేశారు.
(08:28) అదే ఓవర్ మ్యాన్ అంటే తన అల్పమైన స్వార్థాన్ని తన చిన్నపాటి సుఖ దుఃఖాలను దాటి తనకంటే ఉన్నతమైన సృష్టి కోసం ఒక గొప్ప లక్ష్యం కోసం తనని తాను సమర్పించుకునే మనిషి. మనం మన చిన్న చిన్న రోగాల గురించి జేబులో లేని చిల్లర గురించి ఏడవడం ఆపేయాలి. ఎందుకంటే మనకంటే పెద్ద బాధ్యతని మన భుజాలపై వేసుకున్న మరుక్షణమే ఆ చిన్న సమస్యలు వాటంతట అవే కాలి బూడిదయపోతాయి.
(08:52) నీషే గారు ఒక బలమైన ప్రశ్న వేస్తారు. ఎవరికైతే జీవితంలో ఎందుకు జీవించాలి అనే బలమైన కారణం ఉంటుందో వాళ్ళు ఎలాంటి పరిస్థితులనైనా భరించగలరు. ఇప్పుడు మనల్ని మనం నిలదీసుకోవాల్సిన అసలైన ప్రశ్న ఇదే మన జీవితానికి ఉన్న ఆ ఎందుకు ఏమిటి? కేవలం పొద్దున్న లేచి ఆఫీస్ కెళ్లి రెండు ముద్దలు తిని ఈఎంఐ లు కట్టి రాత్రికి రీల్స్ చూస్తూ నిద్రపోవడానికి మనం పుట్టామా? ఇంతేనా మన స్థాయి మనం సమాజం కోసం మన తోటి మనుషుల కోసం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడం కోసం ఏమైనా చేస్తున్నామా ఏమి చేయట్లేదు కాబట్టే మన మైండ్ కి ఏ పని లేక మనల్ని మనం పీకు తింటున్నాం. మనం మన శ్రద్ధని పూర్తిగా
(09:31) బయటకు మల్లించాలి. మన గది కిటికీలు తెరవాలి. రోడ్డు మీద ఆకలితో అల్లాడే ఒక ప్రాణికి అన్నం పెట్టడం దగ్గర నుంచి మన వల్ల నరులు జీవితాల్లో ఒక చిన్న వెలుగు నింపే వరకు మనం ఇచ్చే స్థితిలోకి మారాలి. తీసుకునేవాడు ఎప్పుడు భయంతో ఆందోళనతోనే బ్రతుకుతాడు. కానీ నిస్వార్ధంగా నలుగురికి మేలు చేసే వాడి గుండెల్లో ఒక అసాధారణమైన ధైర్యం పుడుతుంది.
(09:54) ఫెడ్రిక్ నిషే గారి మాటల్లో చెప్పాలంటే ఒక నది తన ప్రవాహాన్ని సముద్రం వైపు పరుగులు తీయించినప్పుడు మాత్రమే అది సజీవంగా ఉంటుంది. అదే నీరు ఒక చిన్న గుంటలో ఆగిపోతే అది కంపుకొడుతుంది. పురుగులు పడతాయి. మన మనసు కూడా సరిగ్గా ఆ గుంట లాంటిదే అయిపోయింది. ఇప్పుడు దాన్ని విశాలమైన నదిలా మార్చాల్సిన సమయం వచ్చింది. మన మనసుని మార్చడానికి మనమే హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయాల్సిన పనిలేదు.
(10:19) చేయాల్సిందల్లా ఒకటే మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న ఉద్దేశాన్ని మార్చడం. ఇప్పటివరకు మనం ఏ పని చేసినా, దీని వల్ల నాకేంటి లాభం అని చెప్పేసి ఆలోచించాం. ఇకపై ప్రతి పనిని దీని వల్ల పక్క వాడి జీవితం ఎంత బాగుపడుతుంది అనే కోణంలో మొదలుపెట్టాలి. మనం చేసే ఉద్యోగం కేవలం నలాకరు జీవితం కోసం అనుకుంటే అది రోజు ఒక నరకంలా కనిపిస్తుంది. అదే పనిని ఒక కలగా నలుగురు సమస్యలు తీర్చే సేవగా చూస్తే అక్కడ అలసట ఉండదు బోర్ కొట్టే ప్రసక్తే ఉండదు.
(10:47) మీకు డౌట్ రావచ్చు ఆ నలుగురు ఎవరని ఆ నలుగురు భార్యా పిల్లలు అవ్వచ్చు, అమ్మ నాన్న అవ్వచ్చు లేకపోతే మీకు బాగా క్లోజ్ అయిపోయి రోజులు సరిగ్గా లేని మీ చుట్టాలు కూడా అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ కోసం వాళ్ళ సమస్యల కోసం మీరు చేసే సేవగా చూస్తే అక్కడ కచ్చితంగా అలసట ఉండదు. బోరు కొట్టే ప్రసక్తి అసలే ఉండదు.
(11:06) ఫెడ్రిక్ నిషా గారు సరిగ్గా ఇదే సూత్రాన్ని నొక్కి చెప్పారు. మనిషి తన స్వార్థాన్ని అధిగమించి ఒక గొప్ప పనిలో లేనమైనప్పుడు అతనికి బాధలు కూడా ఆనందాన్ని ఇస్తాయి అని. మనం మన దృక్పదాన్ని ఎంత వేగంగా మార్చగలిగితే మన మానసిక ప్రశాంతత అంత త్వరగా మన దగ్గరికి వస్తుంది. ఎవరికైనా సహాయం చేయడం అంటే మన జేబులు ఖాళీ చేసుకోవడం కాదు. ఒక వ్యక్తి పడే మానసిక వేదనని ప్రశాంతంగా వినడం కుంగిపోతున్న మనిషి భుజం పై ధైర్యంగా చెయి వేయడం మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి నిలబడటం మనం మన శక్తిని నలుగురు మేలు కోసం ఖర్చు చేయడం మొదలు పెట్టగానే విచిత్రంగా మన మెదడులోని
(11:42) విషపూరిత ఆలోచనలన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే మన బ్రెయిన్ ఒకే సమయంలో భయాన్ని గొప్ప కర్తవ్యాన్ని రెండింటిని భరించలేదు. కర్తవ్యం ముందుకు వస్తే భయం తోక మడుస్తుంది. ఫెడరిక్ నిషో గారు ఒక సవాలు విసురుతారు. జీవితంలో ఎదురయ్యే తుఫానులను చూసి భయపడే పిరికివాడిలా కాకుండా ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే దాన్ని ఆస్వాదించే ధైర్యవంతుడిలా నిలబడండి అని సరే ఇదంతా బాగానే ఉంది.
(12:08) మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే జీవితాన్ని మార్చుకోవడం అంటే మన బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం మాత్రమే కాదు అసలైన మార్పు మన స్పృహలో మన నడవడికలో రావాలి. ఫెడరిక్ నీషా గారు ఒక అగ్ని లాంటి కాన్సెప్ట్ చెప్పారు దాని పేరు అమోర్ఫాతి అంటే విధిని ప్రేమించండి నీ జీవితంలోకి వచ్చే ప్రతి కష్టాన్ని ప్రతి నష్టాన్ని ప్రతి అవమానాన్ని పారిపోకుండా గుండెలకి హత్తుకోవడం ఇది నాకే ఎందుకు జరిగింది అని చెప్పేసి ఏడవడం మానేసి ఇది నన్ను ఒక బలమైన మనిషిగా చెక్కడానికి ప్రకృతి విసిరిన సవాలు అని కాళ్ళ ఎగరేసి నిలబడటం మన కష్టాలు మనల్ని నాశనం చేయడానికి రాలేదు.
(12:43) మనలోని అల్పమైన స్వార్థాన్ని కాల్చి ఒక స్వచ్ఛమైన ధీరుడిని బయటకు తీయడానికి వచ్చాయి. మనం ఇకనైనా ఆ బాధితుడు ముసుగు చించి పారేయాలి. ఎవరైతే నిరంతరం తన బలహీనతలని సాకులుగా వెతుక్కుంటూ ఉంటారో కాలం గడుపుతూ ఉంటారో వారు చరిత్రలో ఎప్పటికీ ఒక అనాముకులుగానే మిగిలిపోతారు కానీ ఎవరైతే తన వ్యక్తిగత బాధలన్నిటిని ఇంధనంగా మార్చుకొని ఒక ఉన్నతమైన ఆదర్శం కోసం ప్రపంచంలో అడుగు పెడతారో వాళ్ళ కాళ్ళ కింద ఈ భూమి వణుకుతుంది అని మీకున్న అప్పులు మీకున్న ఇబ్బందులు మీకున్న అనారోగ్యాలు వాటన్నిటిని ఒకవైపు పెట్టండి ముందు ఒక మనిషిగా మీ ఉనికికి ఒక అర్థాన్ని
(13:22) సృష్టించుకోండి, సృష్టించండి. ఈ ప్రపంచం మీ దగ్గర నుంచి ఒక గొప్ప చైతన్యాన్ని కోరుకుంటుంది. సృష్టి నియమం చాలా స్పష్టంగా ఉంటుంది. ఏ చెట్టు తన పండ్లను తాను తినదు. ఏ నది తన నీటిని తాను తాగదు. ప్రకృతిలోని ప్రతి అణువు పరస్పరం మరొక దాని కోసం శ్రమిస్తుంది. మనం మాత్రమే. ఈ సమాజంలో కేవలం ఒక చిన్న స్వార్ధపు పురుగుల బ్రతకాలని చూస్తున్నాం.
(13:45) నిషే గారు చెప్పిన విల్ టు పవర్ అంటే ఇతరులను అణగదొక్కడం కాదు. మనలోని బలహీనమైన స్వార్థాన్ని జయించి మన సామర్థ్యాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లడం ఆ శక్తిని సమాజం కోసం తరతరాలకు నిలిచిపోయే ఒక గొప్ప కార్యం కోసం దారి పోయడం ఎప్పుడైతే మనం నలుగురు బాధ్యతలని మన భుజాలపై వేసుకొని నడవడం మొదలు పెడతామో అప్పుడు మన వ్యక్తిగత సమస్యలని ఈ విశ్వమే స్వయంగా పరిష్కరిస్తుంది.
(14:11) మీ చేతిలో ఒక చిన్న నాణం ఉందనుకోండి దాన్ని మీ కంటికి సరిగ్గా అంగుళం దూరంలో పెట్టుకుంటే ఆ చిన్న నాణెం వెనుకున్న హిమాలయ పర్వతం కూడా మీకు కనిపించదు. మన జీవితంలోని సమస్యలు కూడా సరిగ్గా ఆ చిన్న నాణెంలాంటివే. వాటిని మన కళ్ళకి అడ్డుగా పెట్టుకొని ప్రపంచంలోని అద్భుతమైన జీవితాన్ని మనకోసం ఎదురుచూస్తున్న ఒక గొప్ప కర్తవ్యాన్ని చూడటం మానేసాం.
(14:31) ఆ నాణ్యాన్ని కింద పడేయండి. కళ్ళు తెరిచి చూడండి. మీరు చేయాల్సిన మహా పర్వతం మీ కోసం ఎదురుచూస్తుంది. కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment