Monday, March 2, 2020

"ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ఈ మంత్రం ఎందుకు జపించాలో? తెలుసా?

🌹. మీకు తెలుసా? "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ఈ మంత్రం ఎందుకు జపించాలో? "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ఈ మంత్రం ఎందుకు జపించాలో? 🌹

ఈ కథను భవిష్యపురాణం నుంచి సేకరించటం జరిగింది.

ఒక ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు.

ఈ "ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్ర శబ్దం అని చుట్టూ చూడసాగాడు.

గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటరు దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో అస్సలు అర్దం కాలేదు, కాసేపయ్యకా చుస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు.

పట్టుకోబోతే ఈసారి మరింత దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. ఇతను చుస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు, కాని పట్టుకుందామనుకొంటే నేను ఎక్కడో పడిపోతున్నాను.

ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ''వేదవ్యాసుడు'' కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి "మహానుభావ, సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి" అన్నాడు.

వేదవ్యాసుడు నవ్వి "ఇది నీరాజ్యం, ఈ కలికాలం నీది, నీకేసందేహమా? ఇక్కడ ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!" అని అడిగాడు.

"కుశలమే! నా రాజ్యంలో నేను కాకా, నువ్వు అయితే పాలించవు కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి" అని వేడుకున్నాడు.

వేదవ్యాసుడు నవ్వి "ఓహో అదా, నీ సందేహం అర్దమయింది, ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు.

త్రికరణ శుద్దిగా నిత్యం ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.

ఓం నమో భగవతే వాసుదేవాయ..
🌹 🌹 🌹 🌹 🌹

నేటి సత్కర్మలే మనకు ఉన్న ఏకైక అవకాశం

🌹 నేటి సత్కర్మలే మనకు ఉన్న ఏకైక అవకాశం 🌹

మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వ జన్మ కర్మలే. ప్రారబ్ద కర్మ ఎలా ఉంటుందో, పురాణాల లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం...

రాముడు దండకారణ్యం లో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి, కారణం , ఒక మహాపతివ్రత శాపం !

దేవాసుర సంగ్రామం సమయంలో, మృతసంజీవనీ మంత్ర బలంతో చావు లేకుండా, ఇంకా దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తు దముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు,, అప్పుడు, తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి , వారి నీ చంపకుండా తాను గుమ్మం ముందు నిలుస్తుంది ఆ ఋషి పత్ని !

మహావిష్ణువు విధి లేక, ఆమెను కూడా రాక్షస సంహారం లో భాగంగా తన సుదర్శన చక్రం తో హతమా రుస్తాడు !, ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఆమె భర్త, మహా తపోధనుడు, హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూ సి విలపిస్తూ శపిస్తాడు ఆ సాధ్వీ మని భర్త ,!, తన భార్యను హతమార్చి, తమకు వియోగం కల్పించి నందుకు అతడు కూడా భార్యావియోగము తో బాధపడాలి అని ! అందుకే రాముని వనవాసానికి కైక, లేదా మందర , లేదా దశరథుడు కారణం కాదనీ, వారు నిమిత్త మాత్రులని తెలుస్తోంది. !అంటే రాముడు కూడా కర్మానుభవం అనుభవించి తీరాల్సిందే !..

అలాగే రామునికి పట్టాభిషేకం నిర్ణయించి, రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భ మున,,,తీరా కైకమ్మ వరాల విషయంగా, వనవాసం చేయడానికి, వెళ్తున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు,, "ఈ ముసలి తండ్రిని చంపి,, రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తానని !" అంటాడు, అప్పుడు రాముడు తమ్మునితో ,, "నాయనా,! నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన తండ్రీ గారు,, నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు, ఇప్పుడు మౌనంగా ఉండటం, అది ఆయన తప్పు కాదు,! అతి బలీయం విధివిధానం! అది ఎంత బలవత్తరం గా ఉంటుందో తెలుసుకో.! పైగా నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు, ఈ ప్రారబ్దకర్మ ను తప్పించడం ఎవరి తరమూ కాదు!

అందుచేత, కోపాన్ని తగ్గించుకొని,, నేను. తండ్రీ గారి ఆజ్ఞను పాలించెందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణా !"అంటాడు,

భగవద్గీత లో చెప్పిన "స్థితప్రజ్ఞత" అంటే ఇదే ! కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా, వాటిని దైవానుగ్రహం గా భావించడం , తన కర్మానుభవంగా గుర్తించడం, భావ్యం !""అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి,!

భగవద్గీత లోని 18 వ అధ్యాయం ,61 వ శ్లోకం లో ," ప్రతీ జీవునిలో అంతర్యామిగా ఉంటూ, జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపిస్తూ ఉంటాను !!""అని గీతాచార్యుడు శ్రీకృష్ణా భగ వానుడు , చెప్పినట్టుగా, సీతారాముల కష్టాల కు కారణం వారి పూర్వజన్మల కర్మలే. కాని మరెవరో కార కులు కా దు !! . వారే కాదు , భూమిపై జన్మించిన ఏ ప్రాణీ కూడా కర్మలకు అతీతుడు కాడు.! దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు.!.

మనం కర్మలు చేయవలసిందే! , ఆ కర్మల ఫలితం, సుఖమైనా, సుఖమైనా, ఇష్టమున్నా లేకున్నా, రాముడైనా, కృష్ణుడైనా అనుభవించ వలసినదే !! వాలిని చెట్టు చాటున దాక్కుని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రామునికి , కృష్ణ నిర్యాణం కోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వస్తుంది ! అలా కృష్ణావతారం సుసంపన్నం అయ్యింది.!.

మరో దృష్టాంతము. !! ద్రౌపది వస్త్రాహరణం చేసిన దుష్ట చతుష్టయం తో బాటు,, తమ కళ్ళ ముందు ఒక అబల పై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపా చార్యులు కూడా , జరిగిన పాపాన్ని పంచుకొక తప్పలేదు,, భారత మహా రంగంలో మిడత ల వలె మాడి పోయారు. !

అలా అన్యాయం చేస్తున్నవారితో బాటు, సమర్థత ఉండి, జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా, అన్యాయం చూస్తూ ఉన్నవారు కూడా అంతే పాపాత్ములు, శిక్ష కు పాత్రులు. అవుతున్నారు ! ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా కూడా, ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి కదా.!

అందుకే రామాయణ భారత భాగవతాలు, సారం సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు,, వస్తాయి అని ! సద్భావన అనేది భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించిన ప్పుడే కదా !

అందుకే దేవుడు మనిషికి అనుగ్రహించిన రెండు వరాలు ఒకటి జ్ఞానం! రెండు మాట్లాడే ప్రతిభ ! వీటిని తమ తమ జీవితాల్లో సత్ ప్రవర్తన, సత్ చింతన తో, సద్వినియోగం చేసుకోవాలి! ఉత్కృష్టమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి ! ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా ! , పరపీడ నం పాపాన్ని తాపాన్ని,, కలిగిస్తుంది,,!,

ఏ చరిత్ర వినినా, ఏ జీవితం చూసినా, ""అహింసా పరమో ధర్మః "" ! అనగా నవ్వులాటకైనా ఇతరులను, ఏ ప్రాణిని హింసించరాదు, !బాధ పెట్టరాదు.! ఎందుకంటే ఆ శరీరంలో ఉన్నది కూడా పరమాత్ముడే,!, అతడు అంతర్యామిగా అంతటా ఉంటూ అన్నీ గమనిస్తూ,, మన లోనే ఉంటూ మన పాపపుణ్యాల కర్మలను లెక్కలు వేస్తూ ఉన్నాడన్న సత్యం మరవకూడదు..

నీ ఆనందాన్ని ఇతరుల ఆనందంలో వెదకాలి.. అంటే తోటివారు తృప్తిగా సంతోషం గా ఉండడానికి నీ వంతు కృషి, మనసా వాచా కర్మణా, సహాయం చేస్తూ ఉండాలి , ఇదే మానవ ధర్మం, జీవన గీతం, సృష్టి రహస్యం కూడా ఇదే !
🌹🌹🌹🌹🌹
🙏

ప్రదక్షిణ ఎందుకు చేస్తాము ?

ప్రదక్షిణ ఎందుకు చేస్తాము ?

🌹🌹🌹🌹🌹

గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకరంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేస్తాము?

అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు.

ఋగ్వేదం ప్రదక్షిణ గురించి చెబుతూ దక్షిణం వైపు ముందుకు ఆర్తి తో నడవడం అని చెబుతుంది.

స్కాందపురాణం ప్రదక్షిణం లో ప్రతీ అక్షరం గురించి చెబుతూ ప్ర అంటే పాపాన్ని నివృత్తి చేస్తుంది అని, ద అంటే కోర్కెలను ఒసగేది అని, క్షి అంటే కర్మను క్షయం చేసేది అని, ణ అంటే మోక్షాన్ని అనుగ్రహించేది అని చెబుతుంది.

మొదటి అచ్యుత ప్రదక్షిణ చేస్తే మానసిక పాపాలు నాశనం చేస్తుందని, రెండవ ప్రదక్షిణ చేస్తే వాచిక పాపాలు నివృత్తి అయిపోతుందని, మూడవ ప్రదక్షిణ కాయిక పాపాలు క్షయం అవుతుందని శాస్త్ర వచనం.

గుడిలోనికి వచ్చిన వారు ఎన్నో మానసిక భారాలను మోసుకు వస్తారు.

పూర్వం ఒక వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు అతడిని ఒక అరగంట ప్రశాంతంగా కూర్చోబెట్టిన తరువాతనే అతడికి బీపీ వంటి ఇతర వైద్యపరీక్షలు నిర్వహించేవారు.

అంటే ఒకరి భౌతిక పరిస్థితి సాధారణ పరిస్థితికి వచ్చిన తరువాత కానీ అతడి స్థితిని పట్టుకోలేరు, బాగుచెయ్యలేరు అని నిరూపింపబడిన శాస్త్రం.

అలాగే గుడికి వచ్చిన వాడి మానసిక స్థితి సాధారణ స్థితి normalcy కి రావాలంటే ఆ శక్తి వలయంలో ఒక మూడుసార్లు ప్రదక్షిణ తప్పక చెయ్యాలి అని మన వాంగ్మయం చెబుతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు clock wise గా నడుస్తాము. దేవాలయం చుట్టూ మొదట దక్షిణం వైపు మొదటి అడుగు వేస్తూ నడుస్తాం.

ఇలా నడవడం వలన ఎప్పుడూ మన కుడివైపు ఎప్పుడూ లోపలున్న విగ్రహం ఉంటుంది.

కుడి వైపు ఎప్పుడూ మంగళకరం గా చెప్పబడుతుంది.

అత్యంతమంగళప్రదమైన భగవంతుడు మనకు ఎప్పుడూ మంగళం వైపు ఉండి మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్ధిస్తూ ప్రదక్షిణ చేస్తాము.

ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా నడవమని నియమం.

ఒక నిండు గర్భిణి చేత్తో ఒక నిండు కుండ పట్టుకుని నడిచినట్టు నడవాలి అని శాస్త్రం.

ఒక వలయం (circle) సెంటర్ నుండి సమాంతర దూరం గా (equidistant) గా ఉన్నట్టు లోనున్న భగవంతుని సెంటర్ గా చేసుకుని జీవుడు ప్రదక్షిణ చేసినట్టు అని అర్ధం.

ఆది శంకరాచార్యులు చెప్పినట్టు 10008 విశ్వాలు ఆ పరమాత్ముని చుట్టూ తిరిగినట్టు నువ్వు గుడిచుట్టూ తిరగాలి అని.

21 ప్రదక్షిణలు చేసిన వారు సకల సంపదలు పొందగలరని స్వయంభూ ఆగమం చెబుతుంది.
🙏🙏🙏🙏🙏

అనుకరణలు,ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి!


*నేటితరానికి ఈ వ్యాసం ఒక చెంపపెట్టు!*

అనుకరణలు,ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి!

*నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం,
*పెళ్ళికి ముందే వీడియో షూట్లు చేయటం,
*గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,
*ఆర్భాటంగా మండపాలు కట్టడం,
*మెహిందీ పేరుతో మెహర్భానీ ప్రదర్శించడం,
*డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,
*బ్రైడల్ మేకప్పంటూ బలిసినట్టు రెచ్చిపోవడం,
*పట్టెడన్నానికి ప్లేటురేటు పెంచుతూ పోవటం,
*దావత్ పేరుతో తాగితందనాలాడటం,
*కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,
*మధ్యతరగతి మనిషికి అవసరమా?

*ఒకడిని చూసి ఒకడు,
*ఒకడ్నిమించి ఒకడు
వెర్రెక్కి పోతున్నారు
నేటి కాలంలో.

*ఎంత తింటాడు మనిషి?
*దేంట్లో దొరుకుతుంది వినోదం?
*ఎలా చేయాలి వేడుక?
*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?
*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?
*ఏది కడితే వస్తుంది హుందాతనం?
*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?
*ఎలా పెరుగుతుంది ఆకర్షణ?
*ఏ విధంగా బలపడుతుంది బంధం?
ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే,
పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.

*పదిమందితో పట్టెడన్నం తింటే,
*మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే,
*కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే,
*సహజమైన అందానికి పెద్దపీట వేస్తే,
*సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే,
*దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,
కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.

*ముహూర్తం చూసి పారేసే కార్డుకి,
*పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ,
*చెమటపడితే కారిపోయే రంగుకీ,
*పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ,
*నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ,
*సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ,
*ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ,
ఉన్నదంతా ఊడ్చిపెడితే
పదికాలాలు బతకడానికొచ్చే
కొత్తమనిషికి
తర్వాత పెట్టేది ఏమిటి?

*అప్పు చేసి ఖర్చుచేసే,
వెర్రితనం కాదు పెళ్ళంటే!
*ఇంటికి దీపాన్ని తెచ్చుకునే
ఇంగితమైన పని వివాహ మంటే!
*శక్తికి మించి ఎగరటం,
*అప్పుచేసి ఆర్బాటం చేయటం
*ముమ్మాటికీ తప్పు*.

*కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి వేలకు వేలు*. 🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికి ఎరుక -ఆ పరమాత్మకే ఎరుక

ఓం నమశ్శివాయ🙏
ఫ్రెండ్స్ మనకి కష్టం వస్తే
కష్టాలు మంచి వాళ్లకే వస్తాయి అంటాం తప్ప
మనం ఏమైనా తప్పు చేసామా
ఆ తప్పు యొక్క ఫలితం
మనం పడుతున్న కష్టాన్ని కారణం అనుకోము
కానీ అదే కష్టాలు ఎదుటి వారికి వస్తే మట్టికి
చేసిన పాపాలు ఉరికెనే పోతాయా అని
పాపం వారి నిందిస్తాం పాపం కదా అలా అనటం
ప్రతి మనిషి తప్పు చేస్తాడు
తన తప్పు తాను తెలుసుకొని
ఎదుటి వారి కష్టాన్ని సానుభూతితో
అర్థం చేసుకున్న వారే గొప్పవారు
ఫ్రెండ్స్ తప్పు అనేది మన జీవిత పుస్తకంలో
ఒక పేజీ లాంటిది బంధాలు మొత్తం పుస్తకమే,
అవసరం అనుకుంటే ఆ తప్పు అనే పేజీని
చించేయండి కానీ ఆ పేజీ కొరకు
మొత్తం పుస్తకాన్ని పోగొట్టుకోకండి
అలాగే తప్పులు చేసేస్తూ ఒక్కోపేజీని చించేస్తూ
అట్టనే మిగిల్చి కోకండి.
తెలిసో తెలియకో జరిగిన తప్పులకు సంఘటనలాకు ప్రతికూల ఆలోచనలు జోడించి జీవితాన్ని మరింత ఇబ్బందిగా మార్చుకోకండి
వీలైనంత సానుకూల ఆలోచనలను ఆలోచిస్తూ
ఆ బాధ నుంచి ఆలోచనలా నుంచి బయటపడండి
భగవంతుడు మనకిచ్చిన ప్రతిక్షణం అద్భుతమైనది
ఆ క్షణాలనూ పిచ్చి పిచ్చి ఆలోచనలతో
చేతులారా పాడు చేసుకోకండి
ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికి ఎరుక
ఆ పరమాత్మకే ఎరుక
అందుకే ప్రతి క్షణం వీలైనంత వరకు
మనకు నచ్చిన భగవన్నామ స్మరణ చేస్తూ
ఆ తండ్రి మనతో మన పక్కన ఉన్నాడు
అన్న నమ్మకంతో ఆనందంగా ఉందాం
ఆ తండ్రి పాదాల చెంత చేరు వరకు
ఓం నమశ్శివాయ🙏

శివయ్య అందరినీ చల్లగా చూడు తండ్రి🙏

పువ్వు అంటే ఐశ్వర్యం లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం సరస్వతి.

పువ్వు అంటే ఐశ్వర్యం లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం సరస్వతి.
పువ్వు అంత కోమలమైనది, పువ్వు అంత పరిమళంతో కూడుకున్నది పువ్వు అంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. అందులో ఎర్రటి పువ్వు కానీ నేలమీద పడి ఉంటే ఎవరైనా సరే దానిని తీసేయాలి ముందు. అది క్రింద ఉండకూడదు. ఎర్రపువ్వు క్రింద పడి సువాసిని కానీ, ఎవరు కానీ తొక్కకూడదు. సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు. ఎవరైనా తొక్కుతారు అని వెంటనే తీసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి. అంత పరమ పవిత్రమైన పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వే వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటు వచ్చినా అక్షతలతో పూరణ చేస్తారు. నిజానికి పూజలో మనం చాలా ఇవ్వనే ఇవ్వం. మంత్రం ఒకలా ఉంటుంది. మనం అక్కడ ఇచ్చేది ఏమీ ఉండదు. సింహాసనం సమర్పయామి అంటారు. రోజూ పట్టుకువచ్చి సింహాసనం వేస్తున్నామా? అక్షతలు వేస్తారు. మనసులో భావన చేయాలి. ఎర్రటి మెత్తటి పరుపులు, పాదపీఠం, సింహం ముఖం తీసుకువచ్చి అక్కడ వేస్తే దానిమీద ఆయన కూర్చున్నట్లు భావిస్తాం. ’క్షతము’ అంటే విరిగిపోవడం; ’అక్షత’ నడుము విరగని పసుపు కలిపిన బియ్యం. అవి వేస్తే అందులోకి వచ్చేస్తుంది పదార్థం. ఈశ్వరుడికి అందిపోతుంది. అలాగే తాంబూలం. మనం నిజానికి ఏం చెప్తాం అంటే ఒక మాట చెప్తాం ’ముక్తాచూర్ణేన సంయుక్తే తాంబూలం ప్రతిగృహ్యతామ్’ – అసలు మంచి ముత్యం తీసుకువచ్చి కాలుస్తారు. దాని బూడిద ఒక సూది మొన పెట్టి తీస్తే ఎంత వస్తుందో అంత వేయాలి. అది కానీ ఎక్కువ అయితే నోరు అంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేస్తుంది. ముత్యపుగుండ అంత శక్తివంతం. తృణం వేస్తే చాలు నోరంతా ఎంత ఎర్రగా పండుతుందో! తాంబూలం ఐదోతనానికి గుర్తు. అందుకే భర్త తాంబూలం పూజలో పెడితే దానిని మధ్యాహ్నం భార్య వేసుకోవాలి. ఆమె తాంబూలం వేసుకుంది అంటే భర్తగారి భోజనం అయిపోయింది అని గుర్తు. అయిదోతనానికి గుర్తు తాంబూలచర్వణం. అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నములుతూ ఉంటుంది. అటువంటి తాంబూలానికి మనం చెప్పే మంత్రం ఒకటి, ఇచ్చేది ఒకటి. భక్తితో తమలపాకులు పెట్టి అందులో వక్క, అక్షతలు పెట్టి దేవుడి దగ్గర పెడితే అప్పుడు పూర్ణంగా పదార్థాలు అన్నీ వేసి తాంబూలం ఇచ్చినట్లే. అన్నింటికీ అక్షతలు సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర చిదిపేసి నలిపేసి రేకులు వేయమని ఎవరు చెప్పారు? ఒక అందమైన పువ్వును ఈశ్వరుడు ఎలా సృష్టించాడో చూస్తే మహాశిల్పి కనబడతాడు. అంత అందంగా ఆయన గుదిగుచ్చి పువ్వు తయారుచేస్తే తుంపి పూజ చేస్తారా? ఈశ్వరుడు అడిగాడా నిన్నుతక్కువైందని? తక్కువైందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం? రోజూ సింహాసనాలు తెస్తామా? రోజూ పంచెలచాపులు తెస్తామా? పట్టుచీరలు తెస్తామా? దానికి పనికి వచ్చింది పువ్వుల దగ్గరకి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది? ఎందుకు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం. అది హింస. పరమ కఠోరమైన మనస్తత్త్వంతో చేసేటటువంటి పని. కొంతమంది తెలియక చేస్తారు మనస్సు కఠినమై కాదు. మనస్సు కోమలంగా ఉంటుంది. తెలియక పొరపాటు జరుగుతుంది. అందుకే పువ్వును చిదమనవసరం లేదు. ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి. మిగిలినవి అక్షతలతో పూరణ చేయండి.

విష్ణు సహస్ర నామ మహిమ

విష్ణు సహస్ర నామ మహిమ :
పూర్వం పూరీ నగరం లో జగన్నాధపురం లో ఒక మహాపండితుడు భార్య తో సహా ఒక పూరి గుడిసె లో నివాసముండెడివాడు . ఇతను శ్రీ మహావిష్ణువు నకు పరమ భక్తుడు . పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది , ప్రతి నిత్యమూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేసి ఈతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన కు వెళ్లేవాడు , ఆ వచ్చినదానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు .భార్య మాత్రం పరమ గయ్యాళి , దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది . ఇంటి లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఈతడు హరి నామ స్మరణ ను విడువలేదు . ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా విష్ణుసహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్త తో " ఏమిటి చేస్తున్నావు ? " అని గద్దించి అడిగింది .దానికి ఆ భర్త "విష్ణుసహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నాన"న్నాడు . అందుకు ఆ భార్య " ప్రతీ రోజూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ! ఏమిచ్చేడు ఆ శ్రీ మహావిష్ణువు ? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప " అంది . అక్కడితో ఆగక " ఏదీ ! నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు " అన్నది . అందుకు ఆ భర్త " వెయ్యి నామాలే ! ఏమిటి చెప్పేది ? నీకేమిటి అర్ధమౌతుంది ? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణుసహస్ర నామాలేమి అర్ధమౌతాయి ? " అన్నాడు . ఆ భార్య మాట్లాడుతూ " వెయ్యి నామాలక్కరలేదు , మొట్టమొదటిది చెప్పు చాలు " అన్నది . అందుకు ఆ భర్త " విశ్వం విష్ణుః " అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య " ఆపు అక్కడ ! దీనర్ధమేమిటో చెప్పు " అన్నది .అందుకు ఆ భర్త " విశ్వమే విష్ణువు , ఈ ప్రపంచమంతా విష్ణుమయమే " అని వివరించగా " ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు , అందులో నువ్వూ , నేనూ ఉన్నామా ? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ , పూరిగుడిసె లో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతీ రోజూ నువ్వు ఆ శ్రీమహావిష్ణువు ని గానంచేస్తున్నావే ? అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా ? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్ధంలేదయ్యా ! " అంది . భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు " నా భార్య మాటలు కూడా నిజమేనేమో ? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి ? కనుక " ఈ మంత్రంలో విశ్వం" అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్క తో ఆ " విశ్వం" అనే పదాన్ని కనబడకుండా మసి పూసి ( తాటాకు ప్రతి ఉండేది ట ఈ భక్తుడి ఇంట్లో ) ఎప్పటిలాగే యాచన కై బయలుదేరి వెళ్లిపోయేడుట .

ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది . ప్రతినిత్యమూ పాల సముద్రంలో శ్రీమహావిష్ణువు ను శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లుగనే ఆరోజు కూడా స్వామి ని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందిట ! అందుకు శ్రీమహావిష్ణువు " ఏమిటి దేవీ ? ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? " అని అడిగితే అమ్మవారు " నాధా ! మిమ్ములను నల్లని వాడని , నీలమేఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంతమాత్రంచేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా " అని పరిహాసమాడగా శ్రీమహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనబడిందిట . వెంటనే శ్రీమహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టి తో గమనించాడుట . లక్ష్మీదేవి " ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు ? మీ ముఖము పై ఆ నల్లరంగు కు గల కారణమేటో తెలిసినదా ?" యని అడుగగా స్వామి " దేవీ ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని " యని పలికాడుట . లక్ష్మీదేవి " అదేమిటి స్వామీ ! పరమభక్తుడంటున్నారు ? అతడెందుకిలా చేస్తాడ" ని యడుగగా స్వామి తన భక్తుని జీవితదీన స్థితి ని వివరించగా లక్ష్మీదేవి " అంతటి పరమ భక్తుని దీనస్థితి కి కారణమేమి ? మీరాతనిని ఉద్ధరింపలేరా ? స్వామీ ! " అని యడుగగా " దేవీ ! గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైననూ దరిద్రమనుభవించుట తప్పలేదు . అయిననూ నీవు కోరితివి కనుక నేటితో ఈతనికి కష్టములు తొలగించెదన" ని పలికి మానవ రూప ధారియై ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి పోయాడు . ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషము లోనున్న శ్రీమహావిష్ణువు ఆ ఇల్లాలి తో " అమ్మా ! నీ భర్త వద్ద నేను అప్పు గా తీసుకున్న సొమ్ము ను తిరిగి తీర్చుటకు వచ్చితిని , సొమ్మును తీసికొనవలసినద"ని చెప్పగా ఆ ఇల్లాలు " నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము , నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు , ఎవరనుకుని మాఇంటికి వచ్చేరో , వెళ్లిపొ "మ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి " లేదమ్మా ! నేను పొరబాటు పడలేదు , అసత్యమసలే కాదు , నీ భర్త వద్ద అప్పు గా తీసుకున్న సొమ్ము ఇదిగో ! నువ్వు స్వీకరించు , నీ భర్త కు నేను తరువాత వివరిస్తాన" ని ఆమెకు అశేష ధన , కనక , వస్తు వాహనాలు , మణిమాణిక్యాలు , సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలూ కానుకలు గా ఇచ్చి వెళ్లిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు " ఓయీ ! నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ! నా భర్త కు చెప్పాలికదా ! నువ్వు ఎలా ఉంటావో ? " అని పలుకగా స్వామి " అమ్మా ! నా ముఖాన్ని నీకు చూపలేను , నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూసేరమ్మా ! నేనెవరో నీ భర్తకు తెలుసులే !" అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్లి కొంతదూరం పోయాక అంతర్ధానమైనాడు . ఇంతలో ఊరిలో యాచన కు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది , అనేకమంది సేవకులూ , ఉద్యానవనాలతో కళకళలాడిపోతోంది ఆ భవనం. ఇంతలో ఈతని భార్య లోపలినుండి వచ్చి " లోపలికి రమ్మని భర్త ని ఆహ్వానించగా , ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు , "అసలు ఆ సంపద ని ఎందుకు స్వీకరించావు ? మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ? అది తిరిగి వారు తీర్చడమేమిటి ? మన దీన స్థితి నీకు తెలియనిదా ? "అంటూ భార్య పై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటివెంట విన్న తరువాత తన కళ్లను , చెవులను తానే నమ్మలేకపోయాడు . అయితే ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు ? అతడి ముఖము ఎలాగ ఉన్నది ? అని భార్యని ప్రశ్నించగా " నేను అతడి ముఖాన్ని చూడ లేదు , అతడి ముఖం పై ఎవరో నల్లని రంగు పులిమారుట , ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు , అయినా అతడు వెళుతూ వెళుతూ నాగురించి నీ భర్త కు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడ"న్నది . అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో " వచ్చినవాడు మరెవరో కాదు , మారువేషంలో వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ! ప్రతి నిత్యమూ నేను విష్ణువు ను స్తుతిస్తున్నా ఆ స్వామి ని నేను దర్శించలేకపోయాను , ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శనభాగ్యం కలిగింది" అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి " విశ్వం " అనే నామంపై పులిమిన నల్లరంగు ను తొలగించాడు . తరువాత భార్య తో " నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడ " నగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డు కు చేరుకున్నాడు . అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వదిక్కుగా చేతులు జోడించి శ్రీమహావిష్ణువు నుద్దేశించి స్తోత్రగానంచేశాడు . అప్పుడు అశరీరవాణి " భక్తా ! పూర్వ జన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మ లో నీకు భగవద్దర్శనము కలుగదు , మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు " అని పలికినది .
విష్ణుసహస్త్రనామ నిత్యపారాయణ వలన కలుగు ఫలితమిదియని అందరూ గ్రహించండి , ప్రతి నిత్యమూ పఠించండి , అవసరార్ధులకు సహాయం చెయ్యండి .🌹🌹🙏🏻🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ.👌👌👍👍

అప్పు ఎవరిస్తున్నారు ? ఎందుకిస్తున్నారు?

💰
అప్పు ఎవరిస్తున్నారు ? ఎందుకిస్తున్నారు ?

😭
ఒక దళారీ పశ్చాత్తాపం (జాన్ పెర్కిన్స్)

ఒక పుస్తకం చదవగానే మన వెన్నులో సన్నగా వణుకు పుట్టిందంటే ఆ పుస్తకాన్ని ఏమనాలి ? మర్డర్ మిస్టరీయా ? సస్పెన్స్ థ్రిల్లరా ?

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల వెన్నులో వణుకు పు ట్టించి, చెమటలు పట్టించిన ఒక పుస్తకాన్ని నవల కూడా అని పిలవలేం.

ఎందుకంటే అది కల్పిత గాధ కాదు. ఒక వ్యక్తి తన వృత్తి జీవితంలో చేసిన కొన్ని ఉద్యోగ విధులను మనకు చెపితే దానిని నవల అనిగాని, ఆత్మకథ అనిగాని పిలవలేం. ఆ పుస్తకాన్ని ఏ పేరుతో పిలవాలా అని చాలామంది ఆలోచించి చివరకు ‘పెద్దన్న చేస్తున్న కుట్ర’ అని పిలుస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పట్టి కుదిపేసిన ఆ పుస్తకం పేరు “కన్ఫెషన్స్ ఆఫ్ ఏన్ ఎకనమిక్ హిట్ మాన్”.

కాగా ఇంత ప్రభావశీల పుస్తకాన్ని రాసిన అమెరికన్ జాతీయుడి పేరు జాన్ పెర్కిన్స్. వీక్షణం పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని కొణతం దిలీప్ తో అనువాదం చేయించి “ఒక దళారీ పశ్చాత్తాపం” పేరిట తెలుగు పాఠకులకు అందించారు.

మన దగ్గర కూడా దాదాపు అంతే సంచలనం రేపిన ఆ పుస్తక పరిచయం ఈవారం మీ కోసం..

ఈ పుస్తకాన్ని మూసధోరణిలో కాకుండా మరోలా చూద్దాం.

మనం ఎవరమైనా ఎందుకు అప్పు తీసుకుంటాం అని ప్రశ్నిస్తే అవసరానికని ఎవరైనా సమాధానం చెప్తారు. మరి అప్పు ఎలా ఇస్తారన్నది కీలకమైన ప్రశ్న. అప్పిచ్చేవాడు మనం ఎలా తీరుస్తామన్నది పరిగణనలోకి తీసుకుంటాడు. మనకిచ్చిన అప్పు మనం ఎలా వినియోగిస్తామన్నది ఆరా తీస్తాడు. ముందుగా మనం అడిగినంత సొమ్ము లేదంటాడు. ఆనక విడతలవారీ ఇస్తామంటాడు. తర్వాత లెక్కకు మించి షరతులు పెడతాడు. ఇంతా చేసి అప్పిచ్చేముందు తాకట్టుగా ఏదైనా పెట్టమంటాడు. కానీ, ఇవ్వాళ కొన్ని బ్యాంకులు చాలా దేశాలకు ఉదారంగా అప్పులు ఇచ్చేస్తున్నాయి. అసలు మనమెక్కడికీ అప్పులకని వెళ్లకుండానే వేలకోట్ల రూపాయలు మన ముంగిటికి తీసుకొచ్చి మరీ ఇలా అప్పుగా గుమ్మరిస్తున్నాయే!

❓❓❓
దీనికి కారణం ఏమిటి ?

దీని వెనుక కథ ఏమిటి ?

నిజంగా ఆ దేశాలు, లేదా ఆ బ్యాంకులు పూర్తిగా సంపన్నమైనవా ?

ఆ దేశాల్లో అసలు పేదరికం లేదా ?

నాలుగు దశాబ్దాలు కిందట అప్పులు తీసుకున్న దేశాల ప్రస్తుత పరిస్థితి ఏమిటి ?

ఇలాంటివన్నీ మన దేశంలో రాజకీయ నాయకులు ఎప్పుడూ వేసుకోని ప్రశ్నలు. పైగా వారి పాలన చూసి మురిసిపోయి ఆయా దేశాలు అప్పులిస్తున్నాయని అస్మదీయ పత్రికల ద్వారా ఊకదంపుడు ప్రచారం చేసుకోవడమొకటి – సిగ్గు లేకుండా.

🤭🤫🤔
ఇలాంటి అనేకమైన ప్రశ్నలకు సవివరంగా జాన్ పెర్కిన్స్ చెప్పిన సమాధానమే ఈ “ఒక దళారీ పశ్చాత్తాపం”.

ఒకప్పుడు రాజ్యాలు దురాక్రమణ చేసుకోవడానికి గజబలం, రథబలం, అశ్వబలం, సైనిక బలాలు ఉపయోగించేవారు.

తరువాత మందుగుండు సామగ్రి కనిపెట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు సులువుగా దాడులుచేసి దురాక్రమణతో ఇతర దేశాలను అన్ని విధాలుగా దోచుకునేవారు.

ఆ తరువాత దాదాపు అన్ని దేశాలు తమ అమ్ములపొదిలో అణుబాంబులు నిల్వ వుంచుకుంటున్నాక యుద్ధాలకు వెనుకంజ వేస్తున్నాయి.

ఇప్పుడు దోపిడీకి వేరే మార్గాలు అన్వేషించవలసి వచ్చింది.

కొత్తగా కనిపెట్టిన ఆ ఆయుధం పేరు అప్పు.

ఏదైనా ఒక సహజ వనరులు విస్తారంగా వున్న దేశాన్ని ఎంపిక చేసుకోవడం.. ఆ దేశానికి అప్పులు ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వడం.. ఆ దేశం ఆ అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక, ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో వున్నప్పుడు ఆ దేశపు మూలుగ పీల్చి పిప్పి చేయడం..

ఇదంతా చాలా అందంగా దోచుకోవడం అనే అమెరికా నూతన పన్నాగం.

మరి ఒకట్రెండు దేశాలు అలా సర్వనాశనమయ్యాక మరే దేశమైనా వారి దగ్గర అప్పు తీసుకుంటుందా ? ఇలాంటి సందేహాలు మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఆయా దేశాలు అప్పులు తీసుకోవడానికి కొందరు ఉద్యోగులను నియమిస్తుంది. వారిపేరే ఎకనమిక్ హిట్ మెన్.

అలాంటి ఒకానొక హిట్ మానే మన జాన్ పెర్కిన్స్. తాను ఏయే దేశాలు ఎలా వెళ్లిందీ, ఎలా వారిని అప్పుల ఊబిలో ముంచిందీ వివరించి చెప్పే పుస్తకమే ఈ “పశ్చాత్తాపం”.

తాము వెళ్లబోయే దేశపు చరిత్ర, సంస్కృతి, సమగ్ర వివరాలు తెలుసుకోవడం, ఆ దేశపు ఆర్థిక రంగం బాగా ఎదుగుతుందని అందరినీ నమ్మించడానికి దొంగ లెక్కలు, గణాంకాలు కట్టివ్వడం వారి పని. దానికోసమే రకరకాల పేర్లతో దొంగ అభివృద్ధి నివేదికలు తయారు చేస్తారు. అలా ఎదగడానికి అవకాశమున్న ఆయా దేశాలకు తాము అప్పుగా డబ్బు ఇవ్వడం ద్వారా దానితో ఎంతో అభివృద్ధి చెందగలరని అద్దంలో చందమామ చూపించడమే వారు చేసే ఉద్యోగం.

దేశాధినేతలు ఒప్పుకుంటే సరి. లేదంటే వారిని డబ్బుతోనో, మద్యంతోనో, మగువతోనో కొనేయడం కూడా వారి వృత్తిలో భాగమే. అలా కూడా కుదరకపోతే వారు వెనక్కు వెళ్లిపోతారు. అప్పుడు అమెరికా గూఢచారి దళం సి ఐ ఏ రంగప్రవేశం చేస్తుంది. ఆ దేశాధినేతను హత్య చేస్తుంది. తరువాత తమకు అనుకూలురైన వారికి అందలాలెక్కించి, అప్పు కుమ్మరిస్తారు. హత్య చేయడం కూడా కుదరకపోతే ఆయా దేశాల్లో అల్లర్లు చెలరేగుతాయి. అంత ర్యుద్ధాలు సంభవిస్తాయి. అప్పు తీసుకోని పాత ‘పిచ్చి’ ప్రభువులు పదవీచ్యుతులవుతారు. అమెరికా చెప్పులు నాకే ‘తెలివైన’ కొత్త ప్రభువులు అధికార పీఠాలు అధిరోహిస్తారు.

అప్పులు తీసుకుని తమ దేశ ఆర్థిక రంగాన్ని ‘పురోగతి’ మార్గాలు పట్టిస్తారు. అదెలా వుంటుందంటే అలా అప్పుగా తీసుకున్న డబ్బు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. రోడ్లు వేయడం, పట్టణాలు, నగరాలను సింగారించి సుందరీకరించడం, విద్యుదుత్పత్తి కేంద్రాలు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం.. అప్పుగా తీసుకునే డబ్బును ఆయా దేశాలు ఖర్చు పెట్టే తీరిది.

😳
ఇవేవీ కట్టుకథలు కావు. నిజాలు. నగ్న సత్యాలు. వాటికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా చితికిపోయిన ఆయా దేశాలను ఇప్పుడు మనం చూడొచ్చు.

జాన్ పెర్కిన్స్ స్వయంగా అప్పుల ఊబిలో ముంచిన ఈక్వెడార్, పనామా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వెనెజులా, వంటి దేశాల చరిత్రలను ఈ పుస్తకంలో వివరంగా మనం చదవొచ్చు.

😇
ఈ ఎకనమిక్ హిట్ మేన్ చేయవలసింది రెండే రెండు పనులు. అందులో
1⃣మొదటిది భారీ విదేశీ రుణాల గురించి దేశాధ్యక్షులను ఒప్పించడం

2⃣రెండోది ఈ అప్పులు తీసుకునే దేశాలను క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేసి వారిని అమెరికాకు, అప్పులిచ్చిన సంస్థలకు బానిసలుగా మార్చుకోవడం.

కన్జూమరిజం, గ్లోబలైజేషన్ చేసే విష పన్నాగం వల్ల ఏం జరుగుతుందంటే కొద్దిమంది ధనంలో ఓలలాడుతుంటే, అనేకమంది పేదరికంలో మగ్గిపోతుంటారు.

💣
ఇలాంటి అప్పుల బూటకానికి పనామా దేశాధ్యక్షుడు ఒమర్ టోరిజోస్ లాంటి అసలు దేశభక్తులు అతి దారుణంగా విమాన ప్రమాదాలలో మరణిస్తారు.

అమెరికా విసిరిన విష మంత్రాంగానికి చిక్కకుండా ఎదురు నిల్చిన టోరిజోస్ “అమెరికాను ఎదిరించి నిలవడం మా లక్ష్యం కాదు. పేదవాడి పక్షాన నిలబడడమే మాకు కావలసింది” అన్నప్పుడు మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

ప్రపంచ బ్యాంకు దగ్గర, ఆసియా అభివృద్ధి బ్యాంకు ముందు చేతులు దేబరించి నిల్చునే మన రాజకీయ నాయకులు గుర్తొచ్చి సిగ్గుతో చితికిపోతాం. దేశాన్ని కొల్లగొడుతున్న చమురు కంపెనీలకు ముకుతాడు వేస్తానని ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చిన యూనివర్శిటీ ప్రొఫెసర్ జైమ్ రోలోస్ ఈక్వెదార్ అధ్యక్షుడయ్యాక చేసిన పోరాటం మనకు వీరోచిత జానపద చిత్రాన్ని గుర్తుకు తెప్పిస్తుంది.

అమెరికాకు ఎదురొడ్ది నిలబడి అతను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలి మరణించాడు.

న్యూయార్క్ టైమ్స్ పత్రిక కూడా అతని మరణంపై అనుమానాలు ప్రకటించింది.

లాటిన్ అమెరికాలో ఉత్తుంగ తరంగంలా రేగిన అమెరికా వ్యతిరేక, ప్రపంచీకరణ వ్యతిరేక పోరాటాలు ఇప్పుడిప్పుడే ఒక రూపు దిద్దుకుంటున్నాయి.

🕶
ఈ పుస్తకం చదివాక మనకు ఓ నిరాశ, నిస్పృహ చుట్టుకుంటాయి.

👑
దేశాధినేతలు, రాజకీయ నాయకులు ఎలాంటి ముందుచూపు లేకుండా, దేశభక్తి లేకుండా చేసే ఇలాంటి అనర్ధదాయక పనులను మనం ఎలా అరికట్టగలమని తీవ్రమైన చింతనలో కూరుకుపోతాం.

మనలాంటి వర్ధమాన దేశాలు చేసే అప్పులు ఒకపక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రాలు సైతం ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయేట్టు ఇప్పటికే చేసేశాయి ఘనత వహించిన ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు. మనకే పాపమూ తెలీకపోయినా ఇప్పుడు ప్రతి ఆంధ్రుడి నెత్తిమీద పదిహేను వేల రూపాయల అప్పు వుంది. అది వడ్డీతో పెరుగుతూనే వుంటుంది.

ఎందుకంటే తీసుకునే అప్పు తీర్చే ప్రయత్నమేదీ ఇంతవరకూ మనం చేపట్టింది లేదు. దీని నుంచి మనం తప్పించుకునే మార్గమేమీ లేదు – రైతులు ఎంచుకుంటున్న ఒకే ఒక పరిష్కార మార్గం ఆత్మహత్యలు తప్ప. మరి బతకాలని నిర్ణయించుకున్నవారికి ఈ పుస్తక రచయిత కొన్ని సూచనలు చెప్తారు.

మీడియా కూడా కార్పొరేట్ స్వామ్యంలో భాగమే. రేడియోలో, టీవీలో, వార్తాపత్రికల్లో చెప్పే కథల వెనకనున్న నిజమేమిటో చూడాలి.

వార్తల పట్ల మీ దృక్పథం మారాలి.

పెట్రోలు, డీజిలు వ్యయం తగ్గించుకోవాలి.

షాపింగ్ చేయడం కూడా తగ్గించుకోవాలి.

స్వేచ్ఛా మార్కెట్లను, శ్రమశక్తిని, పర్యావరణాన్ని దోపిడీ చేసే బహుళ జాతి కంపెనీలను వ్యతిరేకించాలి.

వీలైనన్ని చోట్ల ఈ విషయాల గురించి మాట్లాడాలి.

సభలు, సమావేశాలలో ప్రసంగించాలి.

ఉత్తరాలు, ఈ-మెయిల్లు రాయాలి.

ఏదైనా కొనాల్సి వచ్చినపుడు బాగా ఆలోచించి కొనాలి.

జాన్ పెర్కిన్స్ చెప్పిన మాటలు నిజంగా మనల్ని ఆలోచనలో పడేస్తాయి.

ఎప్పుడైనా టీవీ పెట్టండి, ఏ పత్రికైనా తిరగేయండి. ప్రకటనలే ప్రకటనలు. ఊపిరి సలపనియ్యవు. అవి కొను.. ఇవి కొను… ఇంకా కొనలేదా.. ఈ వస్తువులు వినియోగించకపోతే నీ జీవితం దండగ.. అంటూ మనల్ని వేధించే ప్రకటనలకు తోడు వడ్డీరేట్ల తగ్గింపుతో ప్రభుత్వ ప్రకటనలు.

డబ్బు దాచుకుంటే వడ్డీ వస్తుందనే ఆశను చంపి ప్రజల్లో వినియోగదారీ మనస్తత్వాన్ని పెంచడానికే తోడ్పడుతున్నాయి.

పొదుపునకు బదులు వినియోగం, రకరకాల వస్తువులు కొనుక్కుని జల్సా చెయ్యమని బోధించే సినీ తారలు, క్రికెట్ హీరోలు.

ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకమే కాదు, తమ స్నేహితులందరి చేతా చదివించాల్సింది కూడా.

మంత్రపుష్పం

సాధారణంగా పుష్పం అనేదానిని పూజలో ఉపయోగించినప్పుడు ఈశ్వరుడు మనకు చెవులు ఇచ్చినందుకు ఆయనకు మనం చెప్పే కృతజ్ఞతకు సాధనంగా వాడతాం. కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం. నాలుక ఇచ్చి రుచి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం. స్పర్శ ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం. పంచేంద్రియములు ఒక్కొక్క డానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. వాసన చూసే అధికారం ఇచ్చాడు ముక్కుతో. ధూపం వేస్తాం. చెవులు ఇచ్చాడు. ఎన్నో ఉపకారాలు పొందుతున్నావు. అందుకని పువ్వులతో పూజ చేస్తున్నావు. వినడానికి పువ్వుకు సంబంధం ఏమిటి అంటే తుమ్మెదల యొక్క ధ్వనులన్నీ పువ్వుల కోసం. పువ్వు దగ్గరికి వెళ్ళి తేనే తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోయాయి. కాబట్టి ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి డానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం. అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత. అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు. చిట్టచివర చేతిలో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాం. పూజ చేసేటప్పుడు కూర్చుంటాం. అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వులను మంత్రపుష్పం అంటారు. అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో. లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేటట్లు చేయమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు. అది మంత్రపుష్పం. మంత్రపుష్పంలో ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్తాం – ‘ నాన్యః పంథాయనాయ విద్యతే’ – ఈశ్వరుడిని తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎదురుగుండా పెట్టి నువ్వు ఇప్పటివరకూ ఎవరిని పూజ చేశావో అసలు వాడు ఎక్కడ ఉంటాడో నువ్వు తెలుసుకుంటే అది ఒక్కటే వాడిని తెలుసుకొనే మార్గం. ఎక్కడ ఉన్నాడు అంటే ‘హృదయం చాప్యధోముఖం’ – యోగవిద్యను కలిగిన వాడు తెలుసుకుంటాడు. వంగిన తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ‘నాభ్యాం ఉపతిష్టతి’ – చిటికెన వ్రేలు బొడ్డులో పెట్టుకుని బొటనవ్రేలు పైకి పెడితే బొటనవ్రేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన మొగ్గ అక్కడికి వస్తుంది. దాని చివర ఒక చిన్న బిందువు ఉంటుంది. ‘నీవార సూకవత్తన్వీ పీతాభా స్వస్త్యణూపమా’ ‘తస్య మధ్యే – మధ్యలో ఒక చిన్న ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కాంతి, ఆ వెలుగు ‘ఊర్ధ్వ మూల మధశ్శాయీ’ – దానికాంతి పైకి కొడుతోంది, క్రిందకి కొడుతోంది, ప్రక్కకు కొడుతోంది. ఆ కాంతి ఏదో అది జీవుడు. ‘స బ్రహ్మః స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్’ – ఏ పేరు పెట్టి పిలు అభ్యంతరం లేదు. కానీ ఆ వెలుగు ఉన్నదే అది పరమాత్మ. అది ఎక్కడ ఉంది? – అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’. కాబట్టి నిజంగా ఈశ్వరుడిని చూడాలంటే కళ్ళు తెరిస్తే కనబడడం కాదు. కళ్ళు మూతలుపడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు కనబడుతుంది. వాడు ఈశ్వరుడు. వాడు సమస్త ప్రాణికోటియందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. కాబట్టే ఆ తొడుగుకు ఆకలి వేస్తోంది, నిద్రవస్తోంది. అది లేనినాడు ఆ తొడుగు శవం. అది ఉన్ననాడు ఆ తొడుగు శివం. ఆకలి దానివల్లనే వస్తోంది, ఆకలి తీరింది అని దానివల్లే తెలుసుకుంటోంది. జ్ఞాని ఎలా చూస్తాడంటే తనలో ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు తప్ప ఆయనకు నామరూపాలు కాదు. లోపల ఉన్నది అన్నింటిలో నేనే. తెలిసో తెలియకో ఎక్కడ ఉన్నాడు అని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు ‘నేను’ అని. అంటే ఎవరు ఆ నేను? – భగవంతుడు. ఆ ‘నేను’ అక్కడా ఉంది. ‘నేను’ ‘నువ్వు’ – ఈ ‘నేను’కి, ‘నువ్వు’కి మధ్య స్వార్థం అంతా వస్తుంది. ‘నువ్వు’ పాడైపోయినా పర్లేదు, ‘నేను’బాగుండాలి. కానీ ఇందులో ‘నేను’ అందులో ‘నేను’ ఒక్కటే – జ్ఞానం. ఇక తరతమాలు లేవు, బేధాలు లేవు, అంతటా ఉన్నది పరబ్రహ్మమే. అప్పుడు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఉన్నది ఒక్కటే అది ఎరుకలోకి వచ్చింది. అద్వితీయం – రెండవది లేదు. అద్వైతం – రెండు కానిది. ఒక్కటే. ఒక్కటి అంటే అది ఒకటి ఇది ఒకటి అని అంటారేమో అని రెండు కానిది అన్నారు. ఆ అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇది ఒక్కటే సాధనం. అందుకు అది మంత్రపుష్పం. అది మననాత్ త్రాయతే’ ఎంత ఆలోచించి సాధనలోకి తెచ్చుకుంటావో అంత గొప్పగా అద్వైతానుభూతిలో నిన్ను పెట్టగలదు. అందుకని పూజయందు చివరి భాగమై జ్ఞాన కటాక్షమై మంత్రపుష్పం అయింది. ఇది నా అంత నేను నిలబడితే రాదు, భగవంతుని అనుగ్రహం ఉంటే వస్తుంది. కాబట్టి ఆ వికసనాన్ని నాకు ఇవ్వు అని విన్నదానిని పట్టుకుని ప్రయత్నం కోసం, అనుగ్రహం కోసం అడగడం ఆ పువ్వు భగవంతునికే సమర్పించి నమస్కరించడం. అందుకే పూజ చివరలో మంత్రపుష్పం. పూజ అంతర్భాగంలో పుష్పార్చన.

Sunday, March 1, 2020

సంభాషణం

సంభాషణం

సత్యం మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడాలి. సత్యమే అయినా అప్రియంగా బాధించేదిగా మాట ఉండకూడదు. ఇది వేదసూక్తి. మాట భగవంతుడి వరం. మనిషికి తప్ప మరే ప్రాణికీ మాట్లాడే శక్తిలేదు. ఈ కారణంగానే మనిషికి విశేష ప్రాధాన్యం కలిగింది.

సంభాషణ ఒక చాతుర్యం. అది సంస్కారాన్ని తెలియజేసే సాధనం. మంచిమాట హృదయాన్ని శాంతపరుస్తుంది. ఓదార్పు కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆశలు రేకెత్తించి విజయానికి బాటలు పరుస్తుంది.
మాట రెండువైపులా పదునుగల కత్తివంటిది. అది వికటిస్తే బాధిస్తుంది. నిరాశకు గురిచేస్తుంది. వినాశనానికి దారితీస్తుంది. కొంతమంది మాట వినాలనిపిస్తుంది . కొంతమంది మౌనం వహిస్తేనే బాగుంటుందనిపిస్తుంది!
మాటలతో భగవంతుణ్ని ప్రసన్నం చేసుకోవడానికే ప్రార్థన. స్తోత్రాలతో మానసిక తృప్తి లభిస్తుందని మహర్షులు మానవాళికి ఎన్నో స్తోత్రాలు, సహస్రనామాలు అందించారు. శ్రీరాముడు ప్రియభాషణుడు. అసత్యం నోటివెంట రాదు. త్రికరణశుద్ధిగా మనసు, మాట, క్రియలో మార్పు రాదు. ఎవరెన్ని చెప్పినా తండ్రిమాట ప్రకారం వనవాసదీక్ష కొనసాగించాడు. సుగ్రీవుణ్ని, విభీషణుణ్ని మిత్రులుగా భావించాడు. చివరకు వాలి పరుషంగా నిందించినా తన సత్యభాషణతో సంతృప్తిపరచాడు.

రామకృష్ణ పరమహంసను కలిసిన నరేంద్రుడికి ఆయన మాట ఆధ్యాత్మిక బాట చూపింది. భగవంతుడి ఉనికి గురించి సత్యం తెలిపింది. ఆత్మవిశ్వాసంతో వివేకానందుడిగా జ్ఞానసుగంధాలను దేశమంతా వ్యాపింపజేశాడు.
సుగ్రీవుణ్ని వెతుకుతూ పంపాతీరానికి చేరిన రామలక్ష్మణులకు హనుమ భిక్షురూపంలో కలిశాడు. వారి గురించి ప్రశ్నించాడు. తన గురించి తన ప్రభువు సుగ్రీవుడి విషయం విన్నవించాడు. నవవ్యాకరణ పండితుడైన హనుమ మాట్లాడే విధానం రాముణ్ని ఆకట్టుకుంది. లక్ష్మణుడికి హనుమ మాట చాతుర్యం వివరించాడు.

మాట్లాడేటప్పుడు హావభావాలు ఎలా ఉండాలో కనురెప్పలు ఎగరవేయకుండా, ఎగతాళిగా నవ్వకుండా ప్రియంగా ఎలా మాట్లాడాలో హనుమ అలాగే ప్రవర్తించాడు. తడబడకుండా, పునరుక్తి దోషం రాకుండా గబగబా కాక, అతినెమ్మదిగా కాక ప్రసంగం సాగాలని, ఎదుటివ్యక్తిలో నమ్మకాన్ని కలిగించాలని, అదే మాటకు ప్రాణమని తెలిపాడు శ్రీరాముడు.

హనుమంతుడు అశోకవనంలో సీతాదేవిని దర్శించినప్పుడు తాను ఎలా మాట్లాడితే ఆమెకు నమ్మకం కలుగుతుందో అలాగే సంభాషించాడు. సంస్కృతంలో కాక కోసలదేశ భాషలో ప్రసంగించాడు.


రావణసభలో గట్టిగా, నిష్కర్షగా నిజాల్ని తెలియజేశాడు. భయపడకుండా తన మనసులోని భావాల్ని వివరించాడు. ఎప్పుడు ఎక్కడ ఏ మాట వాడాలో తెలియడం ఒక కళ. అది హనుమలోని ఘనత. సీతాదేవిని చూసి, లంకను కాల్చి శ్రీరాముడి దగ్గరికి రాగానే ‘చూశాను సీతను, లంకలో పాతివ్రత్య నియమంతో ఉన్నది’ అని ఒకే వాక్యంలో శ్రీరాముడికి చెప్పడం- ఆయనలోని ప్రతిభకు నిదర్శనం.

ఒక మంచిమాట సమాజంలో మార్పు తెస్తుంది. గాంధీజీ సత్యాన్వేషణ కేవలం ఏ కొందరి కోసమో కాదు. భారతదేశంలోని పౌరలందరూ దేశభక్తిని చాటాలి. దేశాన్ని ప్రేమించాలి. తూటాకన్నా మాట బలమైనది. తూటా అమాంతం ప్రాణం తీయగలదు. ఇతరులకు తగిలే పరుషమైన పదం విషంలా మారి కృశింపజేస్తుంది .

మాట్లాడేటప్పుడు ఆవేశం పనికిరాదు. ఆలోచన చేయాలి. తన మాట విశ్వశ్రేయస్సుకు నాంది కావాలి అనుకునేదే దైవత్వ లక్షణం. మాటలు సమాజంలో మానవతా విలువలను పెంపొందించాలి!*

ఆవు గురించి

1) ప్రపంచంలో 172 దేశాలు #ఆవుని తింటున్నారు,ఇండియాలో మాత్రం ఆవుని తినొద్దు...దాని #ఉచ్చ/మూత్రం తాగుతారు అని ఒకడంటాడు!

2) కోడి,మేక,లాగా గోవు కూడా #జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి”...???
అని మరొకడంటాడు!.

3) ఆవుసంతతి సరే మరి #గేదె ఏం పాపం చేసిందీ? ప్రతీవాడూ రోజూ తాగేదీ గేదె పాలే కదా ?

4) ప్రతీ ఒక్కరూ గేదె పై దాని రంగు "నలుపు" అనా? అందరూ #గేదెపై_సవతిప్రేమ చూపిస్తున్నారు ?
అని ఇంకొకడంటాడు!

దీనికి...నా....సమాధానం...
అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా…..
గోవు కూడా జంతువే కానీ….
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ”గోమాత” అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.
నీ చదువు…
నీ సంస్కారం…
నీ విచక్షణ…
నీ విజ్ఞత…
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే…
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా.....

ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.

అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు…ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.
ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.
మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.

విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.

వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.

ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.

కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.

గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.అందుకే శుభకార్యాలలో,నూతన గృహప్రవేశ సమయంలో గోపంచకంగా పవిత్రం చేయడానికి వాడుతారు .

గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.

ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.

ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.

ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.

గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
ఇక గేదె విషయానికొస్తే ఈ మధ్య కంచె ఐలయ్య లాంటి మహామేధావులు కొందరు దళితుల్లో వివక్ష / విభేదాలు సృష్టించి, వారికి లేనిపోని మాటలతో హిందువులు... కేవలం ఆవులనే పూజిస్తారు, ,గేదెలను పూజించరు ఎందుకంటే గేదెలు నల్లనివీ అనీ... హిందువులెప్పుడూ "పశుసంతతి పైనకూడా ఇలా వివక్ష కనబరుస్తారని" వేదికలమీద అధిక ప్రసంగాలు దంచారు .

ఒరే అజ్ఞానపు మాటలతో గేదెపాలు టీ ,కాఫీ లకు ఓకే ...,మరి?... చిన్నపిల్లలకు త్రాగడానికి పట్టిస్తే ఎలా?... గేదె పాలకన్నా "ఆవుపాలు" శ్రేష్టమైనవి ,మరియు తేలిగ్గా అరిగే గుణం కలిగినవి .

ఇక్కడ జంతువుల పైనా వివక్ష ఎవరికీ లేదు శాస్త్రీయంగా పరిశీలించిన తరువాతే హిందువులు గోమాతను సకలదేవతలు ఆవాసంగా భావిస్తారు .

అన్యమతస్థులు ముఖ్యంగా మహమ్మదీయులు /ముస్లింలు ఎక్కువగా ఇష్టపడి కోసేదీ బఱ్ఱె/గేదె లను,దున్నలను కాదు ,కక్షతో ఆవులనే ఎక్కువగా వదిస్తారు మరియు తినడానికి ఎక్కువ మక్కువచూపుతారు . అందుకే గోమాత సంతతిని కాపాడాలని ఎన్నో స్వచ్చంధ సంస్థలు పోరాడుతున్నాయి .

అందువల్లనే కొందరు పుణ్యపురుషులు ఇలా అన్నారు .
*
”గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు”.
– గాంధీజీ.

”ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు”.
– మహ్మద్ ప్రవక్త.

”ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే”.
– ఏసుక్రీస్తు.

”గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము”.
– హజరత్ మహమ్మద్.

”గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును”.
– బర్మార్డ్ మేక్ ఫెడన్.

”మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు”.
– హకీల హజ్మల్ ఖాన్.

”గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం”.
– తోహస్-వి-హింద్ బిజహరు.

భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?
నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.

నా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.
స్వేచ్ఛంటే….
”నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు”

”నాదేశం, నీదేశం ,ఈ మనదేశం మెచ్చేటట్టు బ్రతకడం”
”వందేగోమాతరం”

ఒక ఉడత నుండి మనం నేర్చుకోగల మంచి నీతి కథ... చదవండి

🐿️ ఒక ఉడత నుండి మనం నేర్చుకోగల మంచి నీతి కథ... చదవండి

🐿️రామాలయం ప్రాంగణంలో ఉన్న జామ చెట్టెక్కి, పండు కొరికి తింటున్నది చిన్నారి ఉడుత. ఆ రోజున శాస్త్రి గారి ప్రవచనంలో తన పేరు వినిపించింది దానికి! దాంతో చెట్టు దిగి, శాస్త్రిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరీ విన్నది..

"🐿️శ్రీరాములవారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక్క వానరులే కాదు! వాళ్లకంటే చిన్న జంతువు- ఉడుత కూడా ఆ మహత్కార్యంలో తన వంతు సాయం చేసిందిట!
🐿️అందుకు రాములవారు సంతోషించి, ఉడుతను దగ్గరకు తీసుకొని, దాని వీపును ప్రేమగా నిమిరాడట! దానికి గుర్తుగానే ఉడుత వీపు మీద చారలు ఉంటాయట" అని శాస్త్రి గారు చెబుతుంటే శ్రోతలతో పాటు ఈ ఉడుత కూడా శ్రద్ధగా విన్నది.

"🐿️ఏంటీ! నా వీపు మీద ఉన్న గీతలు ఒట్టి గీతలు కాదా?! రామయ్య వ్రేళ్ల గుర్తులా ఇవి! ఆహా! నేనెంత గొప్పదాన్ని?! నా గురించి నాకు తెలీకుండా ఇట్లా పెరిగానే?! ఇప్పుడు చెబుతాను!" అనే ఆలోచన మనసులోనే కలిగి ఎక్కడలేని సంతోషం వేసింది దానికి. చెప్పలేనంత గర్వంతో ఇక ఆగలేక పల్టీలు కొట్టి, ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది.

🐿️అట్లా ఉబ్బి తబ్బిబ్బైపోతూ పోతున్న ఉడుతకు దాని ఫ్రెండ్స్ ఎలుక, తాబేలు ఎదురయ్యాయి.
వాటిని చూస్తే ఉడుతకు మామూలుగానైతే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇవాళ్ల ఎందుకో, అవి రెండూ ఒట్టి పనికిమాలినవి అనిపించాయి. వాటిని చూసి కూడా చూడనట్టే పోబుద్ధయింది ఉడుతకి.
అది అట్లా పైకి పైకి చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తుంటే ఎలుక, తాబేలు కూడా దాని వెంట పరుగుపెడుతూ "ఆడుకుందామారా?" అని అడిగాయి అనురాగంతో.

"🐿️నేనా?! మీతో ఆడాలా?! అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏంటో? నా వీపుపైన ఉన్న ఈ చారలు ఎలాంటివో తెలుసా మీకు? ఇవి మామూలు చారలు కాదు! రామయ్య తండ్రి
వేళ్ళ గుర్తులివి! నాతో ఆడేందుకు మీరేంటి, మీకున్న విలువేంటి?! పోండి, పోండి!" అని ఈసడించుకుంటూ ముందుకు సాగింది ఉడుత.

🐿️అంతలో ఎదురుగా కనిపించాడు గున్నేనుగన్నయ్య. "ఏయ్‌! నీ ఫ్రెండ్స్ ఏరీ, ఆడుకోవడం లేదా?" అన్నాడు.
"లేదు లేదు" అంటూ రాగం తీసి, "ఆ విలువ లేనోళ్ళతో ఆడనన్నాను" అంది ఉడుత.
"అయ్యో! అదేమి? విలువ లేదంటావేమిటి? వాళ్ళు మంచోళ్ళేనే? రోజూ నీతోటి ఆడుకుంటుంటారు కదా?" "నిజమే. ఇప్పుడు నన్నే తీసుకోండి. నా వీపున చారలున్నై. ఇవి ఎలా వచ్చినై? రాముల వారు.. "అంటూ తను విన్నదంతా చెప్పుకున్నది ఉడుత.

🐿️అంతా విని ఆగకుండా నవ్వింది గున్న ఏనుగు. "ఎందుకు, నవ్వుతున్నావు?" అని అడిగింది ఉడుత, కోపంతో...

"🐿️అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నావే, మరి ఇంక ఎలుక ఎంత గర్వపడాలి, ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా?! మరి ఇంక తాబేలు సంగతికొస్తే, విష్ణుమూర్తే స్వయంగా దాని అవతారం ఎత్తాడు గదా?! అసలు ఇప్పుడు ఆ ఎలుక, తాబేలే 'నీతో‌ స్నేహం చెయ్యం పో!’ అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి, చెప్పు?! మరలా పడి పడి నవ్వింది ఏనుగు..

🐿️నిజంగా మనస్ఫూర్తిగా చెబుతాను విను తల్లీ, నువ్వు వాటి 'మంచితనాన్నే' 'చేతకానితనం' అనుకున్నావు. అందుకే మంచి నేస్తాలను వదులుకున్నావు- అంతకు మించి ఏమీ లేదు" అంటూ ముందుకు సాగింది ఏనుగు.

🐿️దాని మాటలు వినగానే ఉడుత తలకెక్కిన గర్వమంతా టప్పుమని ఎగిరిపోయింది. సృష్టిలోని ప్రతి జీవికీ దానిదైన గొప్పతనం ఉందని అర్థమై, తన నేస్తాలకు క్షమాపణ చెప్పేందుకు వెనక్కు తిరిగి పరుగులు తీసింది..🐿

🌷సర్వే జానాః సుఖినో భవంతు 🌷

🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం.

నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం.

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా.,పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు.

అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన మాత్రమే వాడతారు. మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు.

సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర)దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి.

పరమ శివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగ కరచరనాదులు(విగ్రహ రూపం) లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం చేయాలి.

అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము(కొమ్ముల)నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరింఛి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ట భాగంను నిమురుచూ, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి.

అంతే కాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది.

కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి.

గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు.

అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సివుంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు.

రాశి చక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం. వృషభరాశి నందిశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి, వృషభరాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు. వృషభం (నందీశ్వరుడు)యొక్క వృషభ బాగాన్ని స్పృషిస్తూ శివుని దర్శించటం వల్ల విధి విహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణలో ఉన్నది .🙏

Useful information on abbreviations and full forms

Useful information
🕸🕸🕸🕸🕸🕸🕸
1. PAN - permanent account number.
2. PDF - portable document format.
3. SIM - Subscriber Identity Module.
4. ATM - Automated Teller machine.
5. IFSC - Indian Financial System Code.
6. FSSAI(Fssai) - Food Safety & Standards Authority of India.
7. Wi-Fi - Wireless fidelity.
8. GOOGLE - Global Organization Of Oriented Group Language Of Earth.
9. YAHOO - Yet Another Hierarchical Officious Oracle.
10. WINDOW - Wide Interactive Network Development for Office work Solution.
11. COMPUTER - Common Oriented Machine. Particularly United and used under Technical and Educational Research.
12. VIRUS - Vital Information Resources Under Siege.
13. UMTS - Universal Mobile Telecommunicati ons System.
14. AMOLED - Active-matrix organic light-emitting diode.
15. OLED - Organic light-emitting diode.
16. IMEI - International Mobile Equipment Identity.
17. ESN - Electronic Serial Number.
18. UPS - Uninterruptible power supply.
19. HDMI - High-Definition Multimedia Interface.
20. VPN - Virtual private network.
21. APN - Access Point Name.
22. LED - Light emitting diode.
23. DLNA - Digital Living Network Alliance.
24. RAM - Random access memory.
25. ROM - Read only memory.
26. VGA - Video Graphics Array.
27. QVGA - Quarter Video Graphics Array.
28. WVGA - Wide video graphics array.
29. WXGA - Widescreen Extended Graphics Array.
30. USB - Universal serial Bus.
31. WLAN - Wireless Local Area Network.
32. PPI - Pixels Per Inch.
33. LCD - Liquid Crystal Display.
34. HSDPA - High speed down-link packet access.
35. HSUPA - High-Speed Uplink Packet Access.
36. HSPA - High Speed Packet Access.
37. GPRS - General Packet Radio Service.
38. EDGE - Enhanced Data Rates for Globa Evolution.
39. NFC - Near field communication.
40. OTG - On-the-go.
41. S-LCD - Super Liquid Crystal Display.
42. O.S - Operating system.
43. SNS - Social network service.
44. H.S - HOTSPOT.
45. P.O.I - Point of interest.
46. GPS - Global Positioning System.
47. DVD - Digital Video Disk.
48. DTP - Desk top publishing.
49. DNSE - Digital natural sound engine.
50. OVI - Ohio Video Intranet.
51. CDMA - Code Division Multiple Access.
52. WCDMA - Wide-band Code Division Multiple Access.
53. GSM - Global System for Mobile Communications.
54. DIVX - Digital internet video access.
55. APK - Authenticated public key.
56. J2ME - Java 2 micro edition.
57. SIS - Installation source.
58. DELL - Digital electronic link library.
59. ACER - Acquisition Collaboration Experimentation Reflection.
60. RSS - Really simple syndication.
61. TFT - Thin film transistor.
62. AMR- Adaptive Multi-Rate.
63. MPEG - moving pictures experts group.
64. IVRS - Interactive Voice Response System.
65. HP - Hewlett Packard.

Do we know actual full form of some words???
66. News paper =
North East West South past and present events report.
67. Chess =
Chariot, Horse, Elephant, Soldiers.
68. Cold =
Chronic Obstructive Lung Disease.
69. Joke =
Joy of Kids Entertainment.
70. Aim =
Ambition in Mind.
71. Date =
Day and Time Evolution.
72. Eat =
Energy and Taste.
73. Tea =
Taste and Energy Admitted.
74. Pen =
Power Enriched in Nib.
75. Smile =
Sweet Memories in Lips Expression.
76. etc. =
End of Thinking Capacity
77. OK =
Objection Killed
78. Or =
Orl Korec (Greek Word)
79. Bye =♥
Be with you Everytime.

share these meanings as majority of us don't know👌👌👌👌👌👌👌👌

తెలుసుకోదగ్గ విషయాలు...

తెలుసుకోదగ్గ విషయాలు..

1. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.

2. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

3. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.

4. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.

5. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.

6. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

7. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.

8. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.

9. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

10. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.

11. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.

12. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.

13. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.

14. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.

15. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.

16. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.

17. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.

18. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

19. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.

20. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.

21. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.

22. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.

23. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.

24. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.

25. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.

26. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.

27. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.

28. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.

29. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.

30. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.

31. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.

32. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

33. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.

34. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.

35. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.

36. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

37. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.

38. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.

39. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.

40. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.

41. దిగంబరంగా నిద్రపోరాదు.

42. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.

43. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.

44. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.

45. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.

46. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.

47. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.

48. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.

49. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.

50. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.
జై శ్రీరాం

మృతకణాలు(Dead Skin Cells), కొన్ని అయుర్వేద నియమాలు

పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు.

ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి.

వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును.

రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను.

ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.

మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.

నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను

వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను

పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .

భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.

గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.

శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.

ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .

రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .

అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.

కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .

అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.

ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.

విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.

పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.

మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .

ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను .

దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .

రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .

అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .

వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .

నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.

పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .

ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .

దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .

ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .

ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .

చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం

మినుములు అతిగా వాడరాదు.

వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.

చవిటి ఉప్పు మంచిది కాదు.

గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.

పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.

దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.

మలమూత్ర వేగములను ఆపరాదు .

ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.

హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .

స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .

విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.

గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .

ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .

నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును

నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .

తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .

కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.

ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .

ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .

మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .

అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .

నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .

పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .

స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.

ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .

బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .

నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.

గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .

మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .

పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు .

సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .

రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.

మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .

స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .

బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .

నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .

భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు.

మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు .

అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు .

ముక్కుతో శబ్దం చేయకూడదు .

పళ్ళు కొరకకూడదు .

ప్రతినిత్యం సూర్యోదయానికి ముందుగా నిద్రలేవవలెను . రెండు మైళ్లు వరకు నడవవలెను .

రాత్రి భోజనం అయ్యిన తరువాత ఒక మైలు దూరం నడుచుట చాలా మంచిది .

రాత్రి భోజనం నిద్రించుటకు మూడు గంటల ముందు చేయుట మంచిది .

రాత్రి సమయం నందు 10 గంటల లోపు నిద్రించుట చాలా మంచిది .

ఆహారం ని పూర్తిగా నమిలి మింగవలెను.

స్నానం చేసిన వెంటనె భోజనం చేయరాదు . అలా చేసినచో జీర్ణశక్తి నశించును. గంట సమయం తరువాతనే
భోజనం చేయవలెను .

రాత్రి నిలువ ఉన్న వంటలను భుజించరాదు. చద్ది అన్నం భుజించినచో వళ్ళు బరువెక్కును . చురుకు లేకుండా ఉండును.

దంతధావనం అనంతరం యే వస్తువులు తినకుండా 6 తులసి దళములు నమిలి ప్రతినిత్యం మింగుతూ ఉన్నయెడల జ్వరములు రాకుండా ఉండుటయే కాక జీర్ణశక్తి పెంపొందును.

నిద్రనుంచి లేచిన వెంటనె మంచినీటిని సేవించరాదు. అలా త్రాగిన యెడల జలుబు చేయును . ఫలములు తీసుకున్న వెంటనె కూడా నీటిని సేవించరాదు .

వేడి వస్తువులు తీసుకున్న వెంటనె చల్లని నీరు తీసుకోకూడదు.

అతి కారం గల వస్తువులు , అతిగా మసాలా గల వస్తువులు తీసుకున్నచో కడుపు మరియు పేగులు బలహీనం అగును.

రాత్రి పడుకునే అరగంట ముందు పాలు తాగవలెను ఉదయం ఎమన్నా తీసుకున్న తరువాత నీటిని తాగవలెను. భోజనం చేసిన పిమ్మట మజ్జిగ తాగవలెను . ఇలా చేయువారికి ఆరోగ్యం బాగా ఉండును.

బాగా ఆకలి గా ఉన్నప్పుడు నీటిని తాగుట , దాహాంగా ఉన్నప్పుడు అన్నం తినటం వలన కడుపునొప్పి వచ్చును.

కడుపు ఉబ్బరం గా ఉండి పుల్లటి తేపులు వచ్చుచున్నప్పుడు చల్లటి మంచినీరు తాగవలెను.

అన్నం తినేముందు గాని , తిన్న తరువాత గాని అల్లం మరియు ఉప్పు తింటూ ఉన్న యెడల జీర్ణశక్తి ఎక్కువ అగును.

మూసి ఉన్న ఇంట్లో గాని గదిలోకి గాని తలుపు తీసి వెంటనె ప్రవేశించరాదు. తలుపు తీసి అయిదు నిమిషములు దూరముగా ఉండి లొపల ఉన్న గాలి బయటకి వెళ్లిన తరువాత మాత్రమే లొపలికి వెళ్లవలెను .

నిద్రించే గదిలో చెడు వాయువులను ఉత్పతి చేసేటువంటి వస్తువులు ఉంచరాదు.

బట్టలు బిగుతుగా కట్టుకోరాదు. వదులుగా ఉండవలెను .

శిరస్సు చల్లగా ఉంచుకొనుట , పాదములు వెచ్చగా ఉంచుకొనుట ఆరోగ్యవంతులు యొక్క లక్షణం .

మలమూత్రములు బిగపట్టుకొని ఉండకూడదు వెంటనె విసర్జించవలెను . అలాగే తుమ్ములు మరియు ఆవలింతలు ఆపుకొనకూడదు. లేనిచో భయంకరమయిన వ్యాధులు సంభంవించును.

సారా మొదలయిన మత్తుపదార్థాలు సేవించరాదు . దానివల్ల ఆకలి చెడిపోయి బుద్ది చెడిపొవును.

మిక్కిలి ప్రకాశవంతమైన వెలుతురు , మధ్యాన్న సూర్యుడిని చూడరాదు.

అవసరం లేకుండా కళ్ళజోడు ధరించరాదు. కళ్లు చెడిపొవును.

చిన్న అక్షరాలు గల పుస్తకాలు రాత్రి యందు చదవరాదు.

* భోజనం చేసిన వెంటనె వ్యాయమం , మైధునం చేయరాదు . ఆరోగ్యం చెడిపొవును


పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను .

ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి .

ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యెక్క రస ప్రభావం 40 రొజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి . మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు . ఈ 40 రొజులు శుద్ధమైన ఆహారం , సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ది అవుతుంది.

అదేవిదంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభంవించును .

పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు.

ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి.

వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది.

వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును.

ప్రతిదీ ఎందుకు జరిగింది అని సమాధానం కోసం ప్రయత్నించి ఉన్న మనశ్శాంతి కూడా పోగొట్టుకోకండి

ఓం నమశ్శివాయ🙏
ఫ్రెండ్స్
ప్రతిదీ ఎందుకు జరిగింది అని సమాధానం కోసం ప్రయత్నించి ఉన్న మనశ్శాంతి కూడా పోగొట్టుకోకండి
మనశ్శాంతి అనేది అన్ని కాలాల్లో అన్ని వయసులో అన్ని పరిస్థితిలో ఒకే విధంగా హాయినిస్తుంది.
ఎలా అంటే
యవ్వనములో సుఖమే మనకు
పరమావధిగా తోస్తుంది
వృద్ధాప్యంలో విశ్రాంతి మనకు
పరమావధిగా అనిపిస్తుంది
అలానే సంతోషము దుఃఖాలు కూడా
కాలానుగుణంగా వయసును బట్టి
మారిపోతూ ఉంటాయి
కానీ మనశ్శాంతి మాత్రం అలా కాదు
అన్ని కాలాల్లో అన్ని వయసులలో
అన్ని పరిస్థితిలో ఒకే విధమైన హాయినిస్తుంది.
ఏవి అనిత్యమో అవి మారతాయి
ఏవి అశాశ్వతమో అవి కనుమరుగవుతాయి
ఏవి మనతో ఉండవు ఏదీ శాశ్వతం కాదు
అది గ్రహించి.జరిగినది ఎలాగూ జరిగింది
జరగబోయేది అంతా మంచి అనుకొని
మనకి ఉన్న దానిలో మనతో ఉన్న వాళ్ళతో
హాయిగా చక్కగా రోజు మనకు నచ్చిన భగవన్నామస్మరణ కొంతసేపు చేసుకుంటూ
హాయిగా మనశ్శాంతిగా ఉందాం
ఆ తండ్రి పాదాల చెంత చేరు వరకు🙏

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

శ్రాద్ధ కర్మ

పితృకార్యం అనే మాటలోకే అమ్మకు సంబంధించినటువంటి కార్యం కూడా ఇమిడిపోతుంది. తల్లికానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి రోజు వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డలు తప్పకుండా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. తల్లిదండ్రి శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళు ఏ రోజు శరీరాన్ని విడిచి పెట్టారో ఆరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. అది ఇంటి పురోహితుడు గుర్తుంచుకోవలసిన విషయం కాదు. బిడ్డలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తిథి మధ్యాహ్న కాలంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవతారాధనకు అయితే సూర్యోదయానికి చూస్తారు. నైమిక్తికాలలో మారుతుంది. మాస శివరాత్రి అయితే చతుర్దశి అర్థరాత్రి పరివ్యాప్తమై ఉండాలి. పితృకార్యానికి వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తిథి సూర్యుడు మధ్యాహ్న కాలంలో ఉన్నప్పుడు ఆ తిథి కూడా ఉంది అన్న విషయాన్ని రూడం చేసుకుని పితృకార్యాన్ని నిర్వహించాలి. పితృకార్యాన్ని నిర్వహించేటప్పుడు కానీ, దానియందు పరమ శ్రద్ధతో చేయవలసినటువంటి కార్యం. శ్రద్ధ అన్నమాటకు అర్థం ఏమిటంటే ‘సా శ్రద్ధా కవితా సిద్ధిః యయావ స్థూప లభ్యతే’ – ఇది శాస్త్రం చేత చెప్పబడింది కాబట్టి గురువు గారి చేత నిర్ధారింప బడి అది శాస్త్రవిహితం చేయాలి అని చెప్పబడింది కాబట్టి ‘శాస్త్రస్య గురు వాక్యస్య సత్య బుద్ధ్యాsవధారణా! సా శ్రద్ధా కవితా సిద్ధిః’ – ఇది శాస్త్రము, గురువుగారు చెప్పారు కాబట్టి నేను ప్రమాణంగా తీసుకుని చేస్తాను. ఈమాట ఎందుకు అన్వయం అవుతుంది అంటే అమ్మ/నాన్నగారు బ్రతికి ఉండగా పెట్టిన అన్నం అమ్మ/నాన్న తింటుంటే కనపడుతుంది. శరీరం విడిచిపెట్టేసిన తర్వాత పెట్టిన అన్నం/నీళ్ళు అమ్మకి/నాన్నకి వెడుతున్నాయని దేనిచేత విశ్వాసం పొందాలి? అంటే ప్రమాణ వాక్కు చేత. ఏది ప్రమాణం? - శాస్త్రం ప్రమాణం. ‘తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ’. కొన్ని కొన్ని కంటికి కనపడవు కానీ జరుగుతాయి. నేను ఇక్కడ కూర్చుని డిల్లీలో ఉన్న మా అబ్బాయికి మనియార్డర్ కడితే ఈ డబ్బు వెతుక్కుని పట్టుకెళ్ళి మా అబ్బాయికి ఇస్తారు. పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో కూడా మూడు తరాలు దాటే పర్యంతం పెట్టినటువంటి శ్రాద్ధ కర్మ చేత వాళ్ళకి అందుతుంది. వాళ్లకి దాహం వేస్తుంది. ప్రతి అమావాస్యకి నెలకి ఒక్కరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పితృదేవతలు గుమ్మం ముందుకు వస్తారు. ఆరోజు తప్పకుండా పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణుడికి పొత్తర ఇస్తారు. అంటే పొడి పదార్థములు అని. అలా ఇవ్వకపోతే కనీసం రెండు చేతులు ఊపి చూపించాలి.
ఇక శ్రాద్ధ కర్మ చేయవలసిన రోజు వాళ్ళు శరీరం విడిచిపెట్టేసిన రోజు. ఆరోజు కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కలుసుకోవాలి. కర్త మగ పిల్లవాడు. ఆ కారణం చేత వెనక పుట్టిన పిల్లల చేతులు పైకి పెట్టి మొట్టమొదట పుట్టిన వాడి చెయ్యి క్రింద పెట్టి బొటనవ్రేలు నుంచి నీరు విడిచిపెడతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది. అది పెద్దకొడుకు చేతుల మీదనుంచి పడుతుంటే పితృదేవతలు ఆ నీళ్ళు పట్టి తాగుతారు. దాహోపశాంతి పొందుతారు. అలా పితృ దేవతలకు చేయవలసినటువంటి శ్రాద్ధం శ్రద్ధతో చేయాలి కాబట్టి దానికి శ్రాద్ధం అని పేరు పెట్టారు. ఆ శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు తనకు ఏమి ఉందో తను ఏమి తింటున్నాడో దానికి తగినట్లుగా చేయాలి. దానికి మించి/తక్కువ చేయకూడదు. ఉదాహరణకి నేను రొజూ చక్రకేళి అరటిపండు తింటే ఆ రోజు శ్రాద్ధంలో చక్రకేళి అరటిపండే వాడాలి. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి తండ్రి దశరథమహారాజు గారు మరణించారు అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు అరణ్యవాసానికి వెళ్ళిపోయి. భరతుడు చెప్తాడు. వెంటనే రాముడు స్నానం చేసి గారపిండి ముద్దలు దర్భల మీద ఉంచుతాడు. కౌసల్య గారపిండి ముద్ద చూసి ఏడుస్తుంది. నా కొడుకు ధర్మాత్ముడు గారపిండి ముద్దను దర్భల మీద ఉంచి తండ్రికి తద్దినం పెట్టాడు అంటే రాముడు ఇవాళ గారపిండి తింటున్నాడు అని. అంటే తను ఏది తింటున్నాడో దానితోటే శ్రాద్ధ కర్మ చేయాలి. అలా శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు రెండు విషయాలు జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. ఒకటి అన్నదమ్ములందరూ కలుసుకోవాలి. అలా అన్నదమ్ములు కనీసం తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టేసిన రోజున కూడా కలవకపోతే వాళ్ళు ఏడుస్తారు ఇంత దిక్కుమాలిన బిడ్డలను కన్నాం అని. కనీసం ఆరోజున తల్లిదండ్రుల కోసం కలవడం అనేది ప్రధాన కర్తవ్యమ్. అసలు తల్లిదండ్రి ఎప్పుడు శరీరం విడిచి పెట్టారో కూడా జ్ఞాపకం లేకుండా ఆ రోజున అన్నదమ్ములు కలవకపోతే అంతకన్నా అన్యాయమైన జీవితం శాస్త్రంలో ఇంకొకటి ఉండదు. కాబట్టి తన భార్తతో కలిసి తాను ఉంటే ఆరోజున పచనం చేసిన పదార్థాలతో శ్రాద్ధం పెట్టాలి. అంటే వంట చేసిన పదార్థాలతోనే తద్దినం పెట్టాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా భార్య ప్రక్కన లేకుండా తాను ఉండవలసిన ఇంట్లో ఉండకుండా తాను దూరదేశంలో ఎక్కడో ఉండిపోతే పొడిగా ఉన్నటువంటి పదార్థంతో పెట్టాలి. అందుకే భార్యా సహితుడై వండి పెట్టినటువంటి శ్రాద్ధమే పరమోత్క్రుష్టమైన శ్రాద్ధం. దానిని అన్న శ్రాద్ధము అని పిలుస్తారు. అలా పెట్టలేకపోతే కనీసంలో కనీసం పొడి పదార్థాలు ఇస్తారు. అంటే బియ్యం, కూరగాయలు, చింతపండు ఇలాంటివన్నీ ఇస్తారు. పొత్తర అని పిలుస్తూ ఉంటారు. దానిని ఆమశ్రాద్ధము అని పిలుస్తారు. అలా ఆమ శ్రాద్ధం కూడా పెట్టడానికి తన దగ్గర ఏమీ లేని స్థితిలో పిష్ఠచూర్ణ శ్రాద్ధము అని పెడతారు. బియ్యపు పిండి కానీ ఓషధుల పిండి కానీ (గోధుమలు, ధాన్యం ఓషధుల క్రిందకు వస్తాయి) అటువంటి వాటిని చూర్ణం చేసి ఆ పిండితో శ్రాద్ధ కర్మ నిర్వహిస్తారు. అలా నిర్వహించినటువంటి శ్రాద్ధం పిష్ఠచూర్ణ శ్రాద్ధం. ఇందులో దేనికన్నా ఏది ఎక్కువ అన్న మాట ఉండదు. ఏదైనా శ్రద్ధతో పెట్టాడా? లేదా? ఆ పరిస్థితిని బట్టి పెట్టాడా? లేదా?
భార్యతో ఉంటే అన్న శ్రాద్ధం.
భార్య ప్రక్కన లేకపోతే ఆమ శ్రాద్ధం.
ఆమ శ్రాద్ధం కూడా పెట్టడానికి తగిన అవకాశం లేని స్థితిలో ఉంటే పిష్ఠచూర్ణ శ్రాద్ధం.
నాల్గవ శ్రాద్ధ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు ఆ పరిస్థితిని ప్రోత్సహించకుండా ఉండడం మంచిది. కేవలం ద్రవ్యం ఒక్కటే ఇవ్వడం. హిరణ్య శ్రాద్ధం అంటారు. తాంబూలంలో ఒక బ్రాహ్మణుడు భోజనం చేస్తే ఎంత సొమ్ము అవసరం అవుతుంది అన్నది లెక్కకట్టి ఆ సొమ్మును తాంబూలంలో పెట్టి ఆ రోజున తండ్రిని/తల్లిని తలుచుకుని ఇస్తారు. అది హిరణ్య శ్రాద్ధం అంటారు. కానీ ఆ పద్ధతిని శాస్త్రంలో చాలామంది పెద్దలు వ్యతిరేకిస్తారు. అలా చేయడం మంచిది కాదు. కనీసంలో కనీసం పితృ ప్రపితామహ, పితామహానాం అని ముగ్గురిని తలుచుకుని శ్రాద్ధం పెట్టాలి. తండ్రి, తండ్రిని కన్న తండ్రి, ఆ తండ్రిని కన్న తండ్రి. అంటే తండ్రి, తాత, ముత్తాత. ముగ్గురి పేర్లు చెప్పాలి. వాళ్ళు మళ్ళీ పునరావృత్తి పొందకుండా ఉండడం కోసమని నేను ఈ శ్రాద్ధ కర్మ చేస్తున్నాను అని ఇది అక్షయ తృప్తిని కల్పించి గయా శ్రాద్ధం అగుగాక! అని చిట్టచివర సంకల్పం చేస్తారు. అందుకని తల్లిదండ్రుల కడుపున పుట్టిన బిడ్డలు కనీసం వాడు ఉన్నాడు అనడానికి కారణమైన తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని వాడు శ్రాద్ధ కర్మ నిర్వహించకపోతే ఎలా? అందుకే పితృదేవతల విషయంలో శ్రాద్ధ కర్మ అనేది తప్పకుండా చేయాలి.
అలా చేస్తే ఆశీర్వచనం నాకు కాదు. నా బిడ్డలు వృద్ధిలోకి వస్తారు. శాస్త్రంలో ఒక మాట ఉంది. సంతానాన్ని కటాక్షించే ముందు అందునా కర్మ సంతానాన్ని ఇచ్చే ముందు (కర్మ సంతానం అంటే వాడికి కర్మ చేసేవాడు ఒకడు ఉండాలి కదా ఆ కర్మ చేసేవాడిని ఇవ్వాలా వద్దా? అంటే పితృదేవతలను సంప్రదించి పరమేశ్వరుడు ఇస్తాడు అని. పితృదేవతా స్థానం అక్కడ చాలా బలీయమైనది అని చెప్తారు. కనీస మర్యాదగా పితృదేవతలకు ఆ గౌరవం ఇవ్వాలి.
ఎవరైనా ఏ కారణం చేతనైనా పితృదేవతలకు అలా చేసి ఉండి ఉండకపోతే అప్పుడు ఏం చేయాలి? కొన్నాళ్ళు మానేశారు. ఆ తర్వాత దాని గౌరవం విలువ తెలిశాయి. అయ్యో జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మొదలు పెడదాం అనుకున్నాడు. కానీ గతంలో పెట్టలేదు. ఆ దోషం పోవడం ఎలా? దానికి భారతదేశం మొత్తం మీద ఆ దోషం పోగొట్టగలిగిన క్షేత్రం తిరుమల క్షేత్రం క్రింద ఉన్న కపిలతీర్థం ఒక్కటే. కపిల తీర్థం వెళ్ళి శ్రాద్ధం పెడితే అంతకు పూర్వం శ్రాద్ధం పెట్టనటువంటి దోషం పరిహరింపబడుతుంది. అన్నివేళలా శ్రాద్ధ కర్మ ఒకలా చేయాలని శాస్త్రం చెప్పలేదు. నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి శ్రాద్ధం పెట్టాలి. శ్రద్ధ మాత్రం లోపం ఉండకూడదు. భార్యతో సౌకర్యంగా ఉన్నప్పుడు అన్న శ్రాద్ధమే పెట్టాలి. ఉన్న పరిస్థితిని బట్టి శ్రద్ధారహితుడు కాకుండా శ్రద్ధా సహితుడై చేసేటటువంటి కర్మ కనుక దానికి శ్రాద్ధ కర్మ అని పేరు.

కలశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే..

శ్రీమాత్రే నమః🙏
కలశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే.. సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు పాల సముద్రము మీద శయనించుచున్న తరుణంలో అతని నాభి నుంచి ఒక కలువ పువ్వు ఉద్భవించినది.

దాని మీద కూర్చుని బ్రహ్మ ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. అంతా జలమయమై ఉన్న విశ్వంలో బ్రహ్మ సృష్టి ప్రారంభమైంది. సృష్టికి ముందు విశ్వమంతా జలమయంగానే వున్నదని పురాణాలు చెప్తున్నాయి.

విశ్వం జలమయం కావడం సమస్త జీవులను నీరే ఆధారమనే విషయాన్ని మానవాళి అర్థం చేసుకోవచ్చు. నీరు పూజ్యనీయమైంది. అందుకే ఏ పూజ చేసినా కలశం ఏర్పాటు చేసి.. అందులో పవిత్ర జలంతో నింపుతారు.

కలశానికి పూచే పసుపు కుంకుమలు, మామిడి ఆకులు సౌభాగ్యానికి సంకేతం. కలశములోని నీరు సమస్త విశ్వానికి ప్రతీక. ఇందులో దేవతలుంటారని వారిని ఆహ్వానించే దిశగానే కలశపూజ చేస్తారని విశ్వాసం. ఈ కలశాన్ని పూజించడం ద్వారా సకల దేవతామూర్తులను పూజించడంతో సమానం.🙏

అమ్మ అందరిని చల్లగా చూడు తల్లి🙏

>ఈ కాలం బఫె భోజనాలగురించి వ్యంగ్యగా

ఈ కాలం బఫె భోజనాలగురించి వ్యంగ్యగా వ్రాశారు.డా.పొన్నాడ కృష్ణసుబ్బారావు గారు.
శ్రీ సుబ్బారావుగారికి కృతజ్ఞతలతో .

"యజమానికి సంతోషం లేదు
అతిధికి ఆనందం లేదు"

రుచులవి జాతివి మారెను/
పచనపు కళ మారిపోయి పడమటి వంటల్ /.
కిచెనుల దూరెను మెల్లగ/
శుచియగు మన భావములను శూన్యము చేయన్

గుత్తి వంకాయ కూరా లేదు ,
గుమ్మడికాయ పులుసూ లేదు !
అరటికాయ వేపుడు లేదు ,
అదిరే కొబ్బరి చట్నీ లేదు !
కొత్తావకాయ ఊసే లేదు ,
కొత్తిమీర చారూలేదు !
కందా బచ్చలి మరిచారయ్యా !
గుమ్మడి వడియం విడిచారయ్యా !

పలావు వుందని వడ్డించారు !
ఉల్లీరైతా ఉందన్నారు !
రుచిపచి తెలీని 'కూరే' సారు !
మిక్సుడు పికిల్ కూరేసారు !
బూరీ గారీ నోదిలేసారు !
బూందీ లడ్డూ మార్చేశారు !

గులాబు జామూన్ ఉందన్నారు
లైనులో జనాలు ముందున్నారు !

అయిసు క్రీముకేసడిగేసాకా ,
అయిపోయుంటుందన్నారొకరు !
ప్లేటుని చేతిలో పట్టుకుని ,
ఓ చేతిని జేబులొ పెట్టుకుని ,
బఫే లైనులో నుంచుంటే ,
బఫూన్ లా భలేగా వుంది !

కుర్చీ బల్లా తీసేశారు !
కుదురుగ నిలుచుని తినమన్నారు !
తల్లీ పిల్లా తల్లడిల్లినా ,
ముసలీ ముతకా ముక్కి చూసినా !
బఫే తీరులో బలముందన్నారు !
గొర్రె మూక విని తలవంచారు !

పెద్దా చిన్నా పరుగులె పరుగులు !
ముద్ద కోసమొక యుద్దపు తలపులు !

సాపాటు--గ్రహపాటు

ఔనండీ సుబ్రహ్మణ్యం గారు
అది బఫే మీల్స్ కాదు
బఫెల్లో మీల్స్

దానికి తోడు
హనుమంతుడు
సంజీవ పర్వతం మోస్తున్నట్టు
చేతిలో బరువైన ప్లేటు

ఏ ఐటమ్ కి అది కొద్దిగా
పెట్టించు కుందామంటే
కొండ వీటి చాంతాడు
లాంటి లైను,

ఎంగిలి ప్లేటుతో
ఈదుకుంటూ ప్రయాణం
ఎడమ చేతి బరువు.

లంక మేత గోదారీత లా
మంచినీళ్ళు ఎక్కడో.

మధ్యలో ఆద మరిస్తే
ఏ పిల్లాడో/పిల్లో/పెద్దో
మనకి ఎవరు డాష్ ఇస్తారో

కొంచెం వేగంగా నడిస్తే
ఈ చలవరాతి ప్లోరింగ్ పై
పడిన నీటి చుక్కలకి
నడుం జారుతుందో

వండే వాడెవడో
వడ్డించేవాడెవడో

చక్కగా తిందామంటే
నలుగురికి పరిచయమైన
వారికి కత్తి సామే

ఎవరో ఒకరి పనికి
మాలిన ముచ్చట్లు

ఎక్కడేమున్నాయో
తెలవక అర్ధాకలితో
భోజనం ముగింపు

చెత్త కాయితాలేరుకునే
వాడిలా ఎక్కడ ఏమి
ఉన్నాయో

చూసుకుంటూ
తిరుక్కుంటూ
అభోజనం.

నిజమే నిలబడి
భోజనం నిజంగా
నాగరికుల దౌర్భాగ్యం

అందుకే వెళ్ళక పోతే
ఎవరితో కలవమనుకుంటారు
కనుక ఇంట్లోనే తిని వెళ్ళాలి
అందరితో కలిసి భోజనం చేయాలి
కాదు కాదు చేసినట్లు నటించాలి

పేరుకు విందు దానికి ఓ టైము
కరెక్ట్ టైముకు వెలితే ఎవరూ ఉండరూ,

అలా అని ఆలశ్యంగా
వెళితే పదార్ధాలు నిండుకుండు
నిలబడి పెట్టే భోజనం

యజమానికి సంతోషం లేదు
అతిధికి ఆనందం లేదు

నిజంగా కూర్చుని తినే పంక్తి భోజనం దొరకటం ఈ రోజుల్లో
చాల అదృష్టం.
భోజన కాలే హరి నామ స్మరణ
గోవిందా గోవింద.🚶🚶

Cycling is bad for the Economy (సైకిలు తొక్కడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు)

చాలా చక్కగా వివరించారు, కానీ Cycling is bad for the Economy

Hilarious but true too 😄 Sanjay Thakrar, CEO at Euro Exim Bank Ltd. got economists thinking when he said :
A cyclist is a disaster for the country's economy - He does not buy the car & does not take car loan - Does not buy car insurance - Does not buy Fuel - Does not send his car for servicing & repairs - Does not use paid Parking - Does not become Obese - Yes,.....and well, damn it !! Healthy people are not needed for economy. They do not buy drugs. They do not go to Hospitals & Doctors. They add nothing to country's GDP. On the contrary, every new McDonald outlet creates at least 30 jobs - 10 Cardiologists, 10 Dentists, 10 weight loss experts apart from people working in McDonald outlet. Choose wisely: A Cyclist or a McDonald ? Worth thinking. 🤔🤔😀😀

PS. walking is even worse. they do not even buy a bicycle.


Yes 100% correct... You know alcohol drinkers and smokers are the biggest assets for the GDP and countries economy. Diseased peoples are highest supporters for GDP, that is why every food item contains chemicals which kills our health and increases MNC companies income and Government tax...

Congratulations to all of you who increases GDP by sacrifice your valuable life and health...💐💐💐


In olden days in our country our Economic model is mostly rural based Handi crafts,Hartizons and agriculture without any inputs from market. Swayam Samruddik Economic model which is Conservation of the Mother Earth 🌎 and Natural resources.
Now in the name of Modrenisation in the name of Science and Technology Consuming model of Economy is disastrous model,anarchic model .No Healthy food,Air for future generations in the present Consuming model of Economy.
We have to establish Consevation of model by devoleping Natural Farming.The Rural Surplus of economy is going towards Concrete jungles from now to devolep Bio diversity.



సైకిలు తొక్కడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు



సైకిలు తొక్కేవాడు దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. వాడు కారు కొనడు, కారు కోసం అప్పు తీసుకోడు, కారు ఇన్సూరెన్సు తీసుకోడు, పెట్రోలు కొనడు, కారును సర్వీసింగుకు మరమ్మత్తులకు పంపడు, పార్కింగ్ ఛార్జీలు చెల్లించడు. అంతకంటే ముఖ్యం, వాడు లావు అవడు.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యవంతులు అక్కర్లేదు. వాళ్ళు మందులు కొనరు. ఆసుపత్రుల చుట్టూ తిరగరు, డాక్టర్ల మొహం చూడరు. వాళ్ళ వల్ల దేశ స్థూల జాతీయ ఆదాయం ఒక్క పైసా కూడా పెరగదు.

ఆరోగ్యవంతుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే ఈ నష్టానికి విరుద్ధంగా మెక్ డొనాల్డ్ వల్ల ఎంత లాభమో చూడండి. ఒక్కొక్క మెక్ డొనాల్డ్ ఔట్ లెట్ కనీసం 30 మందికి – 10 మంది గుండె నిపుణులకు, 10 మంది దంత నిపుణులకు, బరువు ఎలా తగ్గాలి అని సలహాలిచ్చే మరో 10 మంది నిపుణులకు - ఉపాధి కల్పిస్తుంది. అదీకాక ఆ మెక్ డొనాల్డ్ లో పని చేసే వారుంటారు కదా.

మీరు సైకిలు తొక్కుతారా? మెక్ డొనాల్డ్ కు వెడతారా? దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని తెలివిగా నిర్ణయించుకోండి.

పి. యస్: నడక మరీ ప్రమాదకరం. నడిచేవాళ్ళు కనీసం సైకిలు కూడా కొనరు కదా.

(యూరో ఎగ్జిమ్ బేంక్ లిమిటెడ్ సి.ఇ.ఒ. సంజయ్ టక్రార్ ప్రసంగం నుండి....)

ఒక గర్భవతైన భార్య, ఆమె భర్త ఎవరు పుడితే ఎంచేస్తారో మాట్లాడుకుంటున్నారు..

ఒక గర్భవతైన భార్య,
ఆమె భర్త ఇలా
మాట్లాడుకుంటున్నారు..

భార్య:

ఏం అనుకుంటున్నావ్..?
అబ్బాయి పుడతాడనా ?
అమ్మాయనా..??

భర్త:

అబ్బాయనుకో...
వాడికి లెక్కలు
నేర్పుతాను...
ఇద్దరం కలిసి గేమ్స్
ఆడుకుంటాం...
స్విమ్మింగ్
నేర్పుతా...
చెట్లెక్కడం
నేర్పుతా...
అమ్మాయిలతో
ఎలా మాట్లాడాలో
నేర్పుతా... ఇంకా....

భార్య:

చాలు చాలు!
మరి అమ్మాయి పుడితే..!?

భర్త:

అమ్మాయైతే
ఏం నేర్పనవసరంలేదు...!
అదే నాకు
నేర్పుతుంది...

నేనేం తినాలి...
ఏం తినకూడదు...
ఏం మాట్లాడాలి...
ఏం మాట్లాడకూడదు...
నేను ఎలాంటి బట్టలు
వేసుకోవాలి...

ఒక రకంగా
మా అమ్మ లాగా
అన్నమాట...

ఇంకా నేను దానికి
ప్రత్యేకంగా ఏం
చేయకపోయినా
నన్ను హీరోలా చూసుకుంటుంది...

నన్నెవరైనా
బాధపెట్టారనుకో,
వాళ్ళని అస్సలు
క్షమించదు...
ఎదురు తిరుగుంది...

భర్త దగ్గర కూడా
నాగురించి గొప్పగా
చెప్తుంది...
మా నాన్న నాకోసం
అది చేసాడు...
ఇది చేసాడు అనీ...

భార్య:

సో..అమ్మాయైతే ఇవన్నీ
చేస్తుంది...
అబ్బాయైతే
చేయడంటారు
అంతేగా..??

భర్త:

కాదు..
అబ్బాయైతే ఇవన్నీ
మనల్ని చూసి నేర్చుకుని
చేస్తాడు...

అమ్మాయికి
బై బర్త్ వచ్చేస్తాయ్...

భార్య:

అదేం
శాశ్వతంగా మనతోనే
ఉండిపోదు కదా..!

భర్త:

ఉండదు...
కానీ మనం దాని గుండెల్లో
ఉండిపోతాం...

అందుకని
అది ఎక్కడ ఉంది
అన్నది సమస్య కాదు..!

Daughters
are Angles...
Born with
unconditional
love and care forever...

అందుకని
ఆడపిల్లల
తల్లిదండ్రులు
అదృష్టవంతులు...

కూతురంటే కూడికల,
తీసివెతల లెక్క కాదు
నీ వాకిట్లో పెరిగే
'తులసి మొక్క'...

కూతురంటే
దించేసుకొవలసిన
బరువు కాదు..
నీ ఇంట్లో వెలసిన
'కల్పతరువు'...

కూతురంటే
భద్రంగా చూడవలసిన
గాజు బొమ్మ కాదు...
నీ కడుపున పుట్టిన
మరో "అమ్మ"...

కూతురంటే
కష్టాలకు,కన్నీళ్ళకు
వీలునామా కాదు ...
కల్మషం లేని
'ప్రేమ' కు చిరునామా...

కళ్యాణమవగానే
నిన్ను విడిచివెళ్ళినా...
పరిగెత్తుకొస్తుంది నీకు
ఏ కష్టమెచ్చినా...

తన ఇంటి పేరు
మార్చుకున్న
కడదాక వదులుకోదు
పుట్టింటి పైన ప్రేమను...

కొడుకులా
కాటి వరకు
తోడురాకపోయినా...
అమ్మ అయి
నీకు ప్రసాదించగలదు
మరో జన్మ...

కూతురున్న
ఏ ఇల్లు అయినా
అవుతుంది..
దేవతలు
కొలువున్న కోవెల...

కూతురిని కన్న
ఏ తండ్రి అయినా
గర్వపడాలి యువరాణి ని
కన్న మహారాజు లా..

>కాకులకు ఆహారం ఎందుకు పెట్టాలి?అసలు కాకులకు ధర్మానికి ,సైన్స్ కి ఉన్న సబందం ఏమిటి?

సనాతన ధర్మాచారం
కాకులకు ఆహారం ఎందుకు పెట్టాలి?
అసలు కాకులకు ధర్మానికి ,సైన్స్ కి ఉన్న సబందం ఏమిటి?

మన ఋషులు ,మునులు ఏమైనా పిచివాల్లా?
కాకులకు పాశం(తీపి)పెట్టాలని చెప్తారు!!!కాకులకు పెడితే మన పెద్దలకు ముడుతుంది అని!!!ఒక్క విషయం ఆలోచించండి,మన ఋషులు బాగా తేజస్సు తో, చెప్తారు.ఇదిగో ఆధారం ఇస్తున్నాను.పితృ పక్షాలలో మన పెద్దల ప్రతినిధి గా భావించి కాకులకు భోజనం పెడతాం అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది కేవలం కాకులకే ఎందుకు భోజనం పెడతాం?అని.దానికి జవాబు ,ఆధారం ఇస్తున్న.మన పురాణాలలో చెప్పిన దాని ప్రకారం,గరుడ పురాణం ప్రకారం కాకులు యమధర్మరాజు కు సందేశం ఇచ్చే వాహకాలుగా పనిచేస్తాయి,శ్రాద్ధ పక్షం లో ఇంటింటికి తిరిగే కాకులు అక్కడ తినడం వలన యమలోకం లో ఉండే పితృ దేవతలకు తృప్తి కలుగుతుంది.

దీనికి ఉన్న వైజ్ఞానిక (సైన్స్)కారణం ఏంటి?ఆంటే, కాకులు రావి, మరియు వేప ల గింజలు తింటాయి,తరువాత ఆ గింజలు వాటి కడుపులోనే చర్య (processing) జరిగి ఇది ఎక్కడెక్కడ విసర్జిస్తుందో అక్కడక్కడ ఈ మహావృక్షాలు మోలుస్తాయి.మీకో ముఖ్యమైన విషయం తెలుసా వేప చెట్టు ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఆక్సీజన్ వదిలే ఏకైక చెట్టు,ఇక రావి చెట్టు ఔషధ గుణాలు అద్భుతం గా ఉంటాయి.ఈ రెండు చెట్లు మానవుల ఒక్కరివలన పెరగడం సాధ్యం అయ్యే పని కాదు ఇందులో కాకులు చేసే పని అద్భుతం.అందుకే కాకులను మనం రక్షించాలి.

మరొక విషయం ఏంటంటే ఆడ కాకులు 12 వ నెలలో గుడ్లు పెట్టి పిల్లలను చేస్తాయి.ఆ చిన్న పిల్లలకు ఆహారం అందాల్సి ఉంటుంది అందుకే మన ఋషులు ఈ పిల్లల కోసం ఇంటి పై కప్పు పైన పెద్దలకు ఒక ముద్ద అన్నట్టు శ్రాద్ధ భోజనం అనేది చెప్పడం జరిగింది.

అప్పటినుండి కాకుల కొత్తతరం మొదలవుతుంది.
అందుకే రోజుకో ముద్ద ఇంటి,గోడ ల పైన పెట్టాలని చెప్తారు,ఇది ప్రకృతి రక్షించడానికి మన వంతు బాధ్యత కూడా.మనకు రావి,వేప చెట్లు చూడగానే గుర్తొస్తారు మన పెద్దలు శ్రాధాలు పెట్టడం వలననే ఇలా ఉన్నాయి అని.

సనాతన ధర్మం మీద వేలెత్తి. చూపించే వాల్లుంటారు వాళ్లకు ఒక్కటే చెప్తున్న ముందు సనాతన ధర్మం గురించి తెలుసుకో ఆ తరువాత వేలెత్తి చూపు.మీకు చదవడం రానప్పుడే మా ధర్మానికి తెలుసు ఏ జబ్బు కు ఏ మందు అనేది!!!.సనాతన ధర్మానికి మీ కంటే ముందే మీకు బట్ట కట్టడం రానప్పుడే తెలుసు ఏది తినదగినది ఏది తినకూడనిది అని,
మన వేదాలలో చాలా విషయాలు,మందుల రహస్యాలు ఉన్నాయి.విదేశీయుల మోజులో పడి మన ఋషులను వేలెత్తి చూపించే బదులు వాళ్ళ జ్ఞాన్నాన్ని అర్థం. చేసుకొనే ప్రయత్నం చేస్తే అర్థం అవుతుంది వాళ్ళు ఎంత జ్ఞానాన్ని ఆర్జించారు అనేది
అప్పుడు తెలుస్తుంది.మన ఋషులు ఎంత తెలివి తో జ్ఞానాన్ని ఆర్జించారో అది వర్ణించడం కూడా కష్టమేనేమో.
ఇది అందరికీ తెలియచేయండి.

జై సనాతన ధర్మ