Monday, May 9, 2022

ఈ మెసేజ్ లోని కుర్రాడు ఒంటరి కాదు . వాడిలాగా దారి తప్పిన యువత వేలల్లో .. లక్షల్లో

వాసిరెడ్డి అమర్ నాథ్ గారు.... ఫేస్బుక్ మితృడు ఒకరు, తన బంధువుల అబ్బాయి చెడుదారిలో వెళుతున్నాడని, దయ చేసి కౌన్సిలింగ్ చేయాలని రెండు వారాల క్రితం మెసెంజర్ ద్వారా అభ్యర్తించాడు . నేను బిజీ గా ఉండడంతో సమయం దొరకలేదు . చివరకు నిన్న అపాయింట్మెంట్ ఇచ్చాను .

నిన్న:

ముందుగా ఆ మిత్రుడు నా రూమ్ లోకి వచ్చాడు . ఆ అబ్బాయి గురించి అయన చెప్పిన విషయాలు . " ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు .తండ్రి కాలేజీ ప్రిన్సిపాల్ . అయిదు- పది కోట్ల ఆస్థి ఉంది ఫస్ట్ ఇయర్ లో 50 % మార్కులు సాధించాడు . ఇప్పటికి నలుగురు గర్ల్స్ ఫ్రెండ్స్ . తాగడం అలవాటు ఉంది. ఎంతో మంది మానసిక వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళాము . వారిని బురిడీ కొట్టిస్తున్నాడు . తనలో ఎలాంటి సమస్య లేనట్టు వారిని నమ్మిస్తున్నాడు . ఇంత మంచి అబ్బాయి ని ఎందుకు తెచ్చారు? అని వారు అడిగే పరిస్థితి.ఒక సారి బ్లెడ్ తో చేయి కోసుకున్నాడు "

మీరు బయట కూర్చోండి . ఇప్పుడు ఆ అబ్బాయి ని రూమ్ లోకి పంపండి అన్నాను .

ఆ అబ్బాయి ...
బక్క పలచగా ఉన్నాడు. కళ్ళద్దాలతో ఉన్న అతన్ని చూస్తే బుద్ధిమంతుడు, అమాయకుడు అనిపిస్తుంది . తమిళ్ హీరో ధనుష్ లాగ వున్నాడు .

ఇప్పటికే కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ హాజరయిన అనుభవం ఉంది ." తాగడం మంచిది కాదు .. ఇది బుద్ధిగా చదువుకునే వయసు .. బాగా చదువుకో " లాంటి మాటల్ని నా నుంచి ఆ అబ్బాయి ఎక్సపెక్ట్ చేస్తుంటాడు .

రోగాన్ని బట్టి మందు వెయ్యాలి .. కీలెరిగి వాతపెట్టాలి కదా ! తాను వెళుతున్నది సరైన మార్గం .. అనవసరంగా ఈ సైకాలజిస్ట్ అంకుల్స్ నాకు నీతి బోధలు చేస్తున్నారు అనుకునేవాడిని ఏ విధంగా ట్రీట్ చెయ్యాలి ? ఎలా చెయ్యాలో నాకు తెలుసు . అదే పద్దతిలో ట్రీట్మెంట్ మొదలుపెట్టాను .

"పేరేంటి ?"

ఆన్సర్ వచ్చింది

నా అట మొదలయ్యింది !

." హే! నిన్ను ఫలానా పబ్ లో చాలా సార్లు చూసాను "

"ఆ పబ్ లోనా ? అక్కడికి నేను ఒకటో రెండో సార్లు వెళ్ళాను . బహుశా ఈ పబ్స్ లో ఎక్కడో చూసివుంటారు "అని రెండు మూడు పబ్స్ పేరు చెప్పాడు . తాను తరచూ అక్కడికి వెళుతుంటాని గర్వంగా చెప్పాడు .

మెల్లగా నా ట్రాప్ లో పడ్డాడు . అతన్ని అదే మూడో లో ఉండనించి...

" అవునా .. ఉండొచ్చు . సరిగా గుర్తు లేదు . ఒక సారి బాగా డాన్స్ చేస్తున్నావు . కాస్త తూగుతూ కనిపించవు . అయినా నీ కంట్రోల్ సూపర్ . ఎన్ని పెగ్స్ కొడుతావు ?

పిల్లోడు ఫుల్ ఖుషీ .. ఏదో నీతి బోధలు చెబుతాడు అనుకొంటే ఈ అంకుల్ మంచి చాట్ చేస్తున్నాడు అనుకొన్నాడు .

"ఫైవ్ పెగ్స్ కొడుతాను . అయినా ఫుల్ కంట్రోల్ " అన్నాడు .

" వావ్ .. గ్రేట్ . ఏంటి బీరా ? బీరైతే పెగ్స్ అనరు కదా ?"

" ఇంకా బీర్ ఏంటి . బెకార్డి.. బేకార్దీ రేర్ .. హండ్రెడ్ పైపెర్స్.. టీచర్స్ .. బ్లాక్ డాగ్ రెగ్యులర్ .."

" వావ్. ఫుల్ కాస్టలీ బ్రాండ్స్ .. ట్రెండీ... మీ డాడ్ బాగా సంపాదిస్తుంటాడు . ఏమి చేస్తాడు ?"

డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్" .. చాల గర్వంగా చెప్పాడు .

"మమ్మీ ?"

" చనిపోయింది" మొఖంలో బాధ .

"ఎక్కడ ఉంటావు ? ఇంట్లో ఎవరెవరు వుంటారు ?"..

"మా నాన్న .. ఫలానా టౌన్ లో ఉద్యోగం చేస్తున్నాడు . అక్కడే ఉంటాడు . మేము సిటీ లో .. నేను .. నా కజిన్ .. మా అవ్వ .

"నలుగురు గర్ల్స్ ఫ్రెండ్స్ లో ఎవరితో ఎక్కువ ఎంజాయ్ చేసావు ?{ నిజానికి నేను ఇక్కడ అతని భాషలో మాట్లాడాను . ఆ పదాల్ని ఇక్కడ రాయలేను } ఈ ప్రశ్న తో అతనిలో మార్పు వచ్చింది . తాను నా ట్రాప్ లో పడి అసలు విషయాలు వాగేస్తున్నానని అర్థం చేసుకొన్నాడు . "ఇప్పుడు నాకు ఒకే గర్ల్ ఫ్రెండ్ సర్ "అన్నాడు . { నాకు అర్థం అయ్యిందేమిటంటే గతం లో ఒకరి తరువాత ఒకరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు . బ్రేక్ అప్ అయ్యింది . ఇప్పుడు ఈ అమ్మాయి . తాను కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ . సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు . నేను ఎప్పుడైతే నలుగురు గర్ల్స్ ఫ్రెండ్స్ అన్నానో .. ఇది తన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ కు తెలిస్తే కష్టం .. అందుకే ఏ గర్ల్ ఫ్రెండ్ తో నీకు ఎక్కువ మజా వచ్చింది ? అనే ప్రశ్నకు ఉలిక్కి పడి వాస్తవ లోకం లోకి వచ్చేసాడు . అటు పై నేను అడిగిన ప్రశ్నలకు తప్పుడు సమాదానాలు ఇవ్వడం మొదలు పెట్టాడు . ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 70 మార్కులు అన్నాడు ." నేను ఎప్పుడో కానీ పబ్ కు పోను . ఎప్పుడో ఒక్క సారి అయిదు పెగ్స్ కొట్టాను అదే మీకు చెప్పాను.. తప్పుగా అనుకోవద్దు .. నేను మారిపోయాను " అని నటించడం మొదలు పెట్టాడు .

ఇక వాడి నుంచి నిజాలు రావు అని నాకు తెలుసు . అయినా నాకు రావాల్సిన సమాచారం వచ్చింది . అతను అబద్ద చెప్పాల్సిన అవసరం లేని ప్రశ్నలు అడిగాను . ఏమి కావాలనుకొంటున్నావు ? " ఆర్కిటెక్ట్ "

నా కౌన్సెలింగ్ ప్రక్రియ లో గేరు మార్చాను .

" ఏంటి ? నిజంగానే ? ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 250 మార్కులు . సెకండ్ ఇయర్ లో అదీ వచ్చే అవకాశం లేదు . నువ్వు ఎంసెట్ రాసి రాంక్ సాధించి బి ఆర్క్ చేసి ఆర్కిటెక్ట్ అయిపోదమనే ? ఇదేమైనా వెబ్ సిరీస్ సినిమా నా ? రాబొయ్యేది రోబో యుగం . మూడొంతుల ఆర్కిటెక్ట్ ఉద్యోగాలు రోబోలు ఎత్తుకెళ్ళి పోతాయి . అదే పనిగా రేయి పగలు చదివిన వారే ఉద్యోగాలకోసం వెతుకులాడుకొనే స్థితి ఉంటుంది . నువ్వేమో పబ్ లు.. అయిదు పెగ్గులు . ఒరేయ్ .. నీ ఏజ్ 17 .. అప్పుడే విస్కీ .. వోడ్కా ..అయిదు పెగ్గులు .. నేను చాలా డిఫరెంట్ అని అనుకొంటావు .. నీ లాంటి ప్రతోడు అలాగే అనుకొంటాడు . ఈ భూలోకం నీ లాంటోళ్లను ఎంతమంది ని చూసి ఉంటుంది ? ప్రతోడికి అదే జీవ వ్యవస్థ .. అదే కిడ్నీ లు .. అదే హార్మోనులు .. అరేయ్ .. నువ్వు మందు గ్లాస్ పట్టుకొనేంత వరకే నువ్వు .. అటు పై దానికి బానిస .. దాని కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి . తన పద్దతి ప్రకారం అది పని చేసుకొంటూ పోతుంది . 17 ఏళ్లకు అయిదు పెగ్గులు .మానేసాను .. ఎప్పుడో కానీ పబ్ కు వెళ్ళను అని నువ్వు కహానీ లు చెబితే నమ్మడానికి నేనేమీ లోకం తో టచ్ పోయిన వెర్రి అంకుల్ ని కాను{ ఇక్కడ కూడా నేను వాడిన పదం వేరు . ఇక్కడ దాన్ని రాయలేను } . అరేయ్ .. మారడం నీ చేతిలో లేదు . ఇప్పుడు అయిదు పెగ్స్ .. మరో సంవత్సరం లో హాఫ్ బాటిల్ .. పొద్దునే లేస్తే చుక్క పడక పొతే బెడ్ నుంచి లేవలేని స్థితి త్వరలో వచ్చేస్తుంది . ఇప్పటికే కిడ్నీ లు సగం దొ.. సి ఉంటాయి . ఐదేళ్లకు ఐసీయూ. అరేయ్ .. నీ లాంటి ప్రతోడు . నేను ఫుల్ కంట్రోల్ వున్నాను .. జస్ట్ ఎంజాయ్ చేస్తూ చదువు కొంటాను అనుకొంటాడు . డోపామైన్ అనేది ఒకటి ఉంటుంది . 17 ఏళ్లకే నలుగురు అమ్మాయిల తో సెక్స్ .. డోపామైన్, ఇంకా ఇంకా కావాలి అంటుంది . రేపు ఇంకా ఎంజాయ్ చేయడానికి ఏముంటుంది ? నీ తాగుడికి సెక్స్ పొటెన్సీ చస్తుంది . చదువులో ఫెయిల్ .. ఉద్యోగం లేదు .. నిన్ను పోషిస్తున్న మీ నాన్న కొన్నేళ్లకు రిటైర్ ..అటు పై గోడపై ఫోటో గా మిగిలిపోతాడు . నీకు ఆస్థి వుంది అనుకొంటున్నావు . అది కూడా కర్పూర హారతి లాగ కరిగిపోతుంది . ఉద్యోగం లేని నువ్వు ఏదో పొడిచేద్దామని ఏదో వ్యాపారం మొదలెడుతావు . ఉన్న ఆ అయిదు కోట్ల ఆస్థి మటాష్{ వీడికి ఒక తమ్ముడు ఉన్నాడు. మొత్తం పది కోట్ల ఆస్థి అనుకొంటే వీడి ఆస్థి అయిదు } . అద్దం లో మొఖం చూసుకున్నావా ? 17 ఏళ్లకే బక్క పీనుగులా వున్నావు . నీ గ్లామర్ చూసి అమ్మాయిలు పడ్డారనుక్కొంటున్నావా ? పేస్ చూసుకో .. ఇప్పుడు నువ్వు ఫుల్ కాష్ పార్టీ .. పబ్ ట్రీట్ .. అదీ అట్రాక్షన్ . ఐదారేళ్ళకి ఉద్యోగం సద్యోగం లేక చేతిలో చిల్లి గవ్వ లేని సన్నాసి గా మిగులుతావు . అప్పుడు నీ గర్ల్స్ ఫ్రెండ్ ఎవడితోనో తిరుగుతుంటే అప్పుడు నీకుంటుంది చూడు.... ఇప్పుడు నీ ఎంజొమెంట్ మీ నాన్న క్రెడిట్ . రేపు నీ బస్టాండ్ బతుకు నీ క్రెడిట్ "

చదువు సాగదని , ఉద్యోగం వచ్చే అవకాశం లేదని, ఆరోగ్యం పాడైపోతుందని నేను చెప్పినప్పుడు ఆ మొఖం లో ముందు గా నిర్లప్తత .. అటు పై కొద్దిగా ఆందోళన .. నేను చెప్పే కొద్దీ ఆందోళన తీవ్రమైంది . చివరిగా నీ గర్ల్ ఫ్రెండ్ ఎవడినో చూసుకొంటుంది అంటే మాత్రం రోషం పొడుచుకొని వచ్చింది . " ఆ అమ్మాయి లాంటిది కాదు . నేనేంటే ప్రాణం ఇస్తుంది " అన్నాడు " " అబ్బా .. అమర ప్రేమ .. ఇద్దరూ బ్లేడ్ బ్యాచ్ అన్న మాట . అన్నట్టు మొన్న మీ నాన్న తిట్టాడని బ్లేడ్ తో చేతిని కోసుకొన్నవట కదా. బలే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు . సరే రా ..ఆ అమ్మాయి మంచిదే .. డబ్బు లేక పొతే బాయ్ ఫ్రెండ్ ను మార్చేసే రకం కాదు . సరే . మరి అమ్మాయిని ఏమి పెట్టి పోషిస్తావురా ? భోపాల్ కు వెళ్లి ఆవు కొనుక్కొని దాని పాలమ్మి బతకడానికి ఇది తేజ సినిమా కాదు నాయినా! లైఫ్ .

నీ భవిష్యత్తు చిత్రం చెబుతా విను .. ప్రకృతి అను దేవుడు అను... నీకిచ్చిన ఎంజోయ్మెంట్ లు అన్ని 17 ఏళ్లకే కానించేసావు . సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ కివెళ్ళడానికి రైలు ఎక్కావు. 24 గంటల పయనం . ఫస్ట్ ఏసీ లో దూరావు . నీ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం వరంగల్ స్టేషన్ వచ్చేలోపు తినేసావు డబ్బు ఖర్చుపెట్టేసావు . ఇంకా 22 గంటల జర్నీ వుంది . ఏమి తింటావు ? టాయిలెట్ లో దూరుతావా ? టీసీ వస్తాడు . వరంగల్ లోనో మంచిర్యాల లోనో నిన్ను ప్లాట్ ఫారం పైకి గెంటేస్తాడు . అక్కడ RPF వచ్చి నాలుగు పీకి పోతాడు . ఢిల్లీ కి పోలేవు .. సికింద్రాబాద్ కు తిరిగి రాలేవు . వరంగల్ ప్లాట్ ఫారం పై ముష్టి బతుకు బతికి ఏదో ఒక రోజు పోతావు .. నీకు ఇరవై అయిదు ఏళ్ళు వచ్చేటప్పటికి నీ ఫ్యూచర్ ఇది . పైసా లేదు .. ఉద్యోగం లేదు . తండ్రి ఆసరా లేదు . గర్ల్ ఫ్రెండ్ అసలే లేదు .. 17 ఏళ్లకే జీవితం ఫుల్ ఎంజాయ్ చేశాను అనుకొంటున్నావు కదరా .. ఇదిగో చూడు .. నా ఏజ్ .. నాకు సిక్స్ ప్యాక్ . రెండేళ్ల క్రితం మలేషియా లో అంతకు ముందు న్యూజిలాండ్ లో BUNGY జంప్ చేశా . మరో సంవత్సరం లో ఇంకో సరి చేస్తా . ఇదీ నా ఫిట్నెస్ . లైఫ్ అంటే పెద్ద జర్నీ .. ప్రతి రోజు .. ప్రతి నెల... ప్రతి సంవత్సరం ఎంజాయ్ చెయ్యాలి . ఎంజాయ్ అంటే నువ్వు అనుకోనిది కాదు . అది నీకు పాడె . పెగ్గు పైన పెగ్గు కొట్టినప్పుడు... అమ్మాయి ని .. చేసినప్పుడు వచ్చిన మజా.కు . పది రెట్లు.. వంద రెట్లు... వడ్డీ తో సహా రేపు మూల్యం చెల్లించాలి . కిడ్నీ లు .. లివర్ లు .. మటాష్ .. ఐసీయూ లో .. ప్రతి క్షణం నీ పెగ్గులు రగ్గులు గుర్తుకు వస్తాయి . నేనేదో డబ్బు తీసుకొని కౌన్సిలింగ్ చేసే ప్రొఫషనల్ అనుకొంటున్నావేమో .. అది నా వృత్తి కాదు . నా సర్వీస్ కి లెక్క కడితే నా ఫీజు నువ్వు ఇచ్చుకోలేవు . సాయంకాలం అయిదవుతోంది . ఇప్పటికే నా జిం కు లేట్ అయ్యింది . ఇక నువ్వు వెళ్ళు.. అల్ ది బెస్ట్ తొక్క తోటకూర అని చెప్పను .. నీకు అన్నీ వరస్ట్లే ఇక.. ఇక పో ..అన్నా..

నా షాక్ ట్రీట్మెంట్ పని చేసింది . ఎమోషనల్ అయిపోయాడు . "సర్.. నేను మారాలి అనుకొంటున్నాను . ఒకటి రెండు సార్లు ట్రై చేశాను . కానీ డ్రింక్ మానలేక పోతున్నాను. నా లవ్ మాత్రం సిన్సియర్ సర్ " అన్నాడు .

"నువ్వు నదిలో కొట్టుకొని పోతున్నావు . నిన్ను రక్షించడానికి నా దగ్గర తాడు వుంది . ఆ తాడు విసిరితే నువ్వు పట్టుకోవాలి . నువ్వు పట్టుకోక పొతే నా ప్రయత్నం వృధా ." నేను తాగుడు మానాలి.. చదువు పై దృష్టి పెట్టాలి" అని ఆలోచన నీలో ఉంటే చాలు . అప్పుడు నా ట్రీట్మెంట్ నీ పై పని చేస్తుంది . మారాలి అని కోరిక నీకు లేకపోతె నా ట్రీట్మెంట్ వేస్ట్ . నువ్వు మారాలి .. పైలోకం లో ఉన్న మీ అమ్మ కోసం మారాలి . నీ గర్ల్ ఫ్రెండ్ కోసమైనా మారాలి . మారాలి మారాలి అని నీ హృదయం పదేపదే స్పదించాలి . అప్పుడు ఇంకో సారి నాఅపాయింట్మెంట్ తీసుకొని కలవు ." .

వేగం గా ప్రవహిస్తున్న నది .. అందులో సుడిగుండం .. పక్కనే మొసళ్ళు .. తాను నదిలో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అని భ్రమిస్తున్న 17 ఏళ్ళ దారి తప్పిన అమాయకుడు . ఈ సమాజం చెడగొట్టిన పసివాడు . వాడిని కాపాడానికి నాకు మిగిలిన ఒకే ఒక ఆధారం వాడి గర్ల్ ఫ్రెండ్ పై వాడుకున్న ప్రేమ

. మీకు అర్థం అయ్యిందా ?కాకపోతే మొత్తం మెసేజ్ ని ఇంకో సారి చదవండి . { ఇందులో ఉపయోగించిన భాష కఠినం . తప్పదు . కీలెరిగి వాతపెట్టాల్సి వచ్చిన స్థితి . మీకు అర్థం కావడానికి అదే విధంగా రాసా. సున్నిత మనస్కులకు సారీ .. నేను మాటల్ని మాత్రమే రాయగలిగాను . అతనితో మాటలాడినప్పుడు నా వాయిస్ మోడ్యులేషన్ .. నా ఫేసియల్ ఫీలింగ్స్ .. బాడీ లాంగ్వేజ్ బిన్నంగా, ప్రభావంతం గా వుంది . అది ఇక్కడ మెసేజ్ లో ప్రతిబింబించలేదు .

ఈ మెసేజ్ లోని కుర్రాడు ఒంటరి కాదు . వాడిలాగా దారి తప్పిన యువత వేలల్లో .. లక్షల్లో

.. పతనమైన కుటుంబ వ్యవస్థలు .. దిక్కు తెలియని పేరేటింగ్.. కుప్పకూలిన విద్యావ్యవస్థలు ... అన్నింటికీ మించి దిక్కుమాలిన రోగం .. దాని సాకుతో నెలల తరబడి స్కూల్స్ కాలేజీ లు మూత.. ఆన్లైన్ .. సెల్ ఫోన్ .. వీడియో లు . పోర్న్ లు .. మైనర్ ల కు డ్రింక్ పోసి డబ్బు సంపాదించే పబ్ లు .. మామూళ్లకు అలవాటు పడ్డ రక్షక వ్యవస్థలు .. ఇవేవీ పట్టని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీ లు .. TRP రేటింగ్స్ కోసం నాటకాలాడే టీవీ చానెల్స్ ..

వెరసి కలిసి... మంచి మాట్లాడొద్దు .. చెడు జరుగుతుంటే చూడొద్దు ..

ఇంటికో సైతాను .. టెర్రరిస్ట్ .. ఆస్థి కోసం డబ్బు కోసం అమ్మ నాన్న ను బ్లేడ్ తో గొంతు కోసే బ్యాచ్ లు పుట్టుకొస్తున్నాయి .. వేచి చూడండి .

వద్దనుకొంటే స్పందించండి . మనిషిగా మీ వంతు పాత్ర పోషిం చండి . మౌనం వీడండి .

సేకరణ

చాగంటి కోటేశ్వరరావు గారు ఒక సభలో మాట్లాడుతూ..... పెద్ద తంతు....ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్లో నడుస్తోంది. నేటి కాలం పెళ్లిళ్లు పైన చెప్పినట్టుగా పెద్ద తంతు గా తయారు అయ్యాయి. అందరు చేస్తున్నారు. మనం చెయ్యాలి. చెయ్యక పొతే నామోషీ..! ఇది నేటి రీతి.

ఇది ఒక మిత్రులు పంచుకున్నారు ఆ మిత్రులకు ధన్యవాదాలతో

చాగంటి కోటేశ్వరరావు గారు ఒక సభలో మాట్లాడుతూ.....

పెద్ద తంతు
➖➖➖✍️

ఒక వూళ్ళో ఒక సనాతనుడు ఉండేవారు. తరచూ హోమం చేసేవారు. హోమగుండంలో పోయడానికి నేతి ని గిన్నె లో పెట్టినప్పుడు అయన ఇంట్లో ఉన్న రెండు పిల్లులు బయటకు వచ్చి తెగ గోల చేసేవి. దీనితో హోమం అయ్యేంతవరకు పిల్లుల్ని గంప కింద ఉంచే వారు.


కాలం గడిచింది. అయన వృద్ధాప్యంతో మరణించారు. కొడుకులు హోమం చెయ్యడం మానేశారు. ఏవో ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు కొంత కాలానికి వారికి హోమం చెయ్యాలి అనిపించింది.

ఏమేమి కావాలో ఆలోచించి.. పుజారిని సంప్రదింపులు జరిపారు లిస్ట్ తయారు చేసారు. ఆ తరువాత మూర్ఖత్వం తో "అరేయ్ డాడీ హోమం జరిగేంత వరకు పిల్లుల్ని గంప కింద ఉంచేవారు. మన ఇంట్లో పిల్లులు లేవు కదా గంప కూడా లేదు" అని చెప్పి బజార్ కు వెళ్లి రెండు పిల్లులు, గంప కొనుక్కొని వచ్చి హోమం చేసేంత వరకు గంప కింద పిల్లుల్ని ఉంచారు.

ఎందుకు చేస్తున్నామో తెలియకుండా గుడ్డిగా మనం పాటించేవాటినే ‘తంతు’ అంటారు.

ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్లో నడుస్తోంది. నేటి కాలం పెళ్లిళ్లు పైన చెప్పినట్టుగా పెద్ద తంతు గా తయారు అయ్యాయి. అందరు చేస్తున్నారు. మనం చెయ్యాలి. చెయ్యక పొతే నామోషీ..! ఇది నేటి రీతి. ఎవరో చెవి కోసుకున్నారని మెడ కోసుకుంటారా?

రిసెప్షన్ :-

అబ్బో ఇదో పెద్ద అంతులేని తంతు. అసలు రిసెప్షన్ అంటే ఏంటి? ఆహ్వానం. అంటే అతిథులను పెళ్ళికి ఆహ్వానించడం కదా ? కానీ నేడు జరుగుతోంది ఏంటి ? అసలు కంటే కొసరు ఎక్కువైంది. రాత్రి ఎనిమిది గంటలకు రిసెప్షన్. అర్ధరాత్రో లేదా తెల్లవారు జామున పెళ్లి . అందరూ రిసిప్షన్ కు వస్తారు. వయసులో చిన్న వారు అయిన కాబోయే దంపతులు స్టేజి పై నిల్చుంటారు. వారి ని ఆశీర్వదించడకోసం లేదా గ్రీట్ చేయడం కోసం పెద్ద వారు క్యూ లో నిలబడుతారు. అంటే మనం పెద్ద వారికి ఇచ్చే గౌరవం ఇదన్న మాట. క్యూ చేంతాడంత ఉంటుంది. ఎప్పుడెప్పుడు స్టేజి పైకి వెళ్లే ఛాన్స్ వస్తుందా అంటూ వాచ్ చూసుకొంటూ లైన్ లో ఎంతో ఇబ్బంది పడుతూ నిలబడుతారు. చివరికి ఛాన్స్ వస్తుంది . ఫోటో కోసం ఒక కృత్రిమ నవ్వు. వాళ్ళను ఆశీర్వదించడం.. పెళ్లి కాని వారిని ఆశీర్వదించడం ఏంటి? అపచారం కాదా? అసలు ఇన్ని గంటలకు శుభ ముహూర్తాన వారు దంపతులు అవుతారు అని నిర్ణయించడం ఏంటి? ఆ శుభ గడియలు రాకుండానే వారిని పక్క పక్క ను కూర్చోపెట్టి ఆశీర్వచనమ్ ఏంటి ? వేదం మంత్రాలను వెక్కిరించడం కదా? అంత అభ్యుదయ భావాలు ఉంటే సింపుల్ గా ఆదర్శ వివాహం చేసుకోవచ్చు కాదా? మనసు మంచిదైతే మనిషి కి గొప్ప ఆలోచనలు వస్తాయి కానీ, నేడు మనిషి మనసు వెర్రి పుంతులు తొక్కుతోంది.

చెప్పులు వేసుకొని మరి కొన్ని గంటల్లో వేదం మంత్రాలూ చదవ బోతున్న స్టేజి పైకి ఎక్కడం. దేవుని పూజా మంత్రాల సమయంలో షూ వేసుకుని, చెప్పులు వేసుకుని అవి జపిస్తే భగవంతుని ఆశీస్సులు పొంతదుతారా? ఆ షూస్ ఎక్కడెక్కడ తొక్కి వచ్చిందో. పోనీ ఆచారం సంగతి పక్కన పెట్టండి కనీసం ఆరోగ్య సూత్రాల రీత్యా మంచిదేనా? ఆ స్టేజి పైన కొన్ని గంటల పాటు వధూవరులు కూర్చొంటారు కదా?

రిసెప్షన్ అయ్యింది. ఇక అందరూ డిన్నర్ హాల్ లోకి దూరుతారు. అక్కడ తోపులాట. తిండికి మొఖం వాచిన వారిలా తోసుకొంటూ వెళ్లి ప్లేట్ పట్టుకొని ‘భవతి బిక్షాన్దేహి’ అని నిల్చుంటే ఇక అక్కడ వాడు చేతికి ప్లాస్టిక్ కవర్ వేసుకొని వడ్డిస్తాడు. అక్కడ ఎన్ని పదార్థాలు వున్నాయి అనేది స్టేటస్ సింబల్. కనీసం 30 అయినా లేకపొతే అవమానం. ఒక్కో సారి నూటయాభై దాకా ఉంటాయి. వాటిలో సగం పదార్థాలు పేర్లు జీవితంలో కనీ విని ఉండం. పర్ ప్లేట్ లెక్కన కేటరింగ్ వాడికి ఇచ్చివుంటారు. అవి చూడడానికే బాగుంటాయి. తింటే జీవితంపై విరక్తి పుట్టిస్తాయి. ఏదో ఐదో పదో పదార్థాలు రుచి చూసి ఇక జనాలు బయట పడుతారు. పెద్ద ఎత్తున ఆహారం వృధా. కడుపునిండా తిన్న వాడు ఉండడు. ఒక్క ఐటం అయినా రుచిగా ఉంటుంది అనే భరోసా లేదు. అదో పెద్ద తంతు!

స్టేజి పైన ఫోటో అయిపోయింది. అటెండెన్స్ వేసుకొన్నాం. డిన్నర్ అయ్యింది. ఇక ఏముంది? పరుగో పరుగు. అసలు వచ్చింది దేనికి? పెళ్ళికి! మరి పెళ్లి చూడకుండా వధూవరులను ఆశీర్వదించకుండా ఎలా వెళుతారు? ‘అబ్బా .. మరీ అర్ధ రాత్రి ముహూర్తం. ఎవరు ఉంటారండీ? అయినా ముఖం చుపించాముగా.’ ఇక చల్ .. పోదాం. రిసిప్షన్ అంటే పెళ్ళికి ఆహ్వానం .. ఆ ఆహ్వానము అందుకొని .. ఇంకా పెళ్లి కానీ వారిని దీవించి .. అది కూడా షూస్ తో సహా దీవించి .. ఇక పరుగో పరుగు!

రిసెప్షన్ కి రెండు వేల మంది వచ్చారు అని కేటరింగ్ వాడు చెబుతాడు. ఇక పెళ్లి మొదలయ్యేటప్పటికి పట్టున యాభై మంది లేరు. నిర్మానుష్యంగా పెళ్లి హాల్. పోనీ ఆ కూర్చున్న వారికైనా పెళ్లి జరిపే దృశ్యం కనిపిస్తుందా అంటే జస్ట్ నో ఛాన్స్. ముగ్గురు కెమెరా వాళ్లు.. ఇద్దరు వీడియోగ్రాఫర్స్ .. లైట్ మోసేవాడు. సీట్స్ లో కూర్చొని వారి వెనుక భాగాన్ని దివ్యదర్శనం చేసుకోవలసిందే పెళ్లి జరిగినంత వరకు.

ఎవరికోసమండీ ఈ తంతు? ఎంత వృధా? బంధువులు కలుసుకున్నారు కదా .. నాలుగు మాటలు మాట్లాడుకొందాం అంటే రిసెప్షన్ టైం లో ఆర్కెస్ట్రా. చెవులు చిల్లు పడే సౌండ్. పోనీ వారు పాడే పాటల్ని అయినా వింటున్నారా అంటే ఒక్క నరమానవుడు కూడా ఆ పాటల్ని ఎంజాయ్ చెయ్యడు. వాళ్ళ పాటలు పాటలే .. వినిపించక పోయినా జనాల మాటలు మాటలే. పెళ్లి సందర్భంగా నలుగురు అనాధ పిల్లలకు భోజనం పెట్టొచ్చుగా? వారికి మేము మీ బంధువులు అని చెప్పొచ్చుగా? అసలు ఆ ఫుడ్ ఏంటి ? ఆ wastage ఏంటి? వేదమంత్రాల పేరుతో ఆ అపచారపు పనులు ఏంటి? ఒక్కరైనా ఆలోచించారా? లేదా గంప కింద పిల్లిని కప్పి హోమం చేసే తంతేనా?....

మార్పు అనేది ఎంతో మంది కి ఉపయోగపడే విధంగా ఉండాలి.. బాధ్యతగా ఉండాలి. మనిషి మనసు మంచి వైపు పయనిస్తూ ఉండాలి.... భగవంతుడు మెచ్చేలా నడుచుకుంటామంటూ ఉండాలి ఇక్కడ మానవులు మెప్పించి ఉపయోగం లేదు.

✍️

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏*

🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

శ్వాస - పంచప్రాణాలు...!

🟩🧘🏼‍♂️🧘‍♀️🧘🟩🧘‍♀️🧘🧘🏼‍♂️🟩

శ్వాస - పంచప్రాణాలు...!

🟩🧘🏼‍♂️🧘‍♀️🧘🟩🧘‍♀️🧘🧘🏼‍♂️🟩

శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి....
1. ప్రాణము
2. అపానము
3. వ్యానము
4. ఉదానము
5. సమానము
అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.

1. ప్రాణము :-
అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొనె వాయువు.

2. అపాన వాయువు :-
బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయువు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతాయి.

3. వ్యాన వాయువు :-
మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు :-
దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు :-
దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

శ్వాస - చక్రాలు :-

ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై
➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు
➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు
➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు
➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు
➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు
➡️ ఆజ్ఞా చక్రము నందు - 1000 సార్లు
➡️ సహస్రారము నందు - 1000 సార్లు
అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.

శ్వాస - అంగుళాలు :-

సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.
➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.
➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.
➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే - బ్రహ్మానందం కలుగుతుంది.
➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.
➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.
➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.
➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.
➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే - అదృశ్యం అవ్వగలరు.

మరింత సాధన చేయగా శ్వాస అవసరమే ఉండదు వారికి.

అలాంటి వారు అమరులు అవుతారు.

శ్వాస - సృష్టి వయస్సు :-

మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన
➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.
➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.
➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.
➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.
➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి +ద్వాపర +త్రేతా + కృతయుగములు) - 43,20,000 సంవత్సరాలు.

శ్వాస - సాధన :-

సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.
మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు.

దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును. 84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులుగా దీనిని సద్వినియోగ పరచుకోగలరు.

🟩🧘🏼‍♂️🧘🧘‍♀️🟩🧘🏼‍♂️🧘🧘‍♀️🟩

సేకరణ

Friday, May 6, 2022

బుద్ధుని మార్గం "విపాసన" ✍️రచన: ఓషో - విపాసన అంటే సాక్షిసాధన.

☘️🌷☘️🌷🍀🌷🍀

💫📚 అవేర్నెస్💫

✍️రచన: ఓషో

భాగం-94(a)

విపాసన

బుద్ధుని మార్గం "విపాసన" - విపాసన అంటే సాక్షిసాధన. అతను వున్న చాలా గొప్ప ఉపాయాలలో ఒకదానిని కనుక్కున్నాడు. అది మీ శ్వాసని మీరు గమనించడం అనే ఉపాయం - కేవలం మీ శ్వాసని గమనించడం - శ్వాస అనేది ఎంతో సామాన్యమైన, స్వాభావికమైన దృగ్విషయం అంటే - అది రోజులో 24 గంటలూ వుంటుంది.మీరు ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఓ మంత్రాన్ని జపిస్తే అప్పుడు మీరు ఒక ప్రయత్నాన్ని చేయాలి. మిమ్మల్ని మీరు నిర్బంధించుకోవాలి. ఒకవేళ మీరు “రామ్... రామ్... రామ్" అని అనాలంటే, మిమ్మల్ని మీరు నిరంతరంగా ప్రయాసపెట్టుకోవాలి. మీరు అనేకసార్లు అలా జపించడం మరిచిపోయి తీరతారు. ఇంకా మీదు మిక్కిలి "రామ్” అనే పదం మళ్ళీ మనస్సుకి సంబంధించినదేదో అవుతుంది. మనస్సుకి సంబంధించింది ఏది అయినా మిమ్మల్ని మనస్సుకి ఆవలివైపుకు తీసుకుని వెళ్ళలేదు.

బుద్ధుడు పూర్తిగా వేరే కోణంలో విషయాన్ని కనుక్కున్నాడు. కేవలం మీ శ్వాసని గమనించండి. శ్వాస లోపలికి వెళ్తుంది. మళ్ళీ బయటకు వస్తోంది. దాన్ని పరిశీలించండి.

ఇక్కడ నాలుగు సంగతులు గమనించాలి. నిశ్శబ్దంగా కూర్చుని కేవలం ఊపిరిని చూడండి. అనుభూతి పొందండి. లోపలికి వెళ్ళే ఊపిరి, మొదటి సంగతి. అప్పుడు ఓ క్షణం శ్వాస లోపల ఉన్నప్పుడు - అది ఆగుతుంది. ఒక చిన్న క్షణం సెకనులో సగం అది లోపల ఆగుతుంది. అది గమనించడానికి రెండవ సంగతి. మళ్ళీ ఊపిరి మరలి బయటకు వెళ్తుంది. ఇది గమనించడానికి మూడవ సంగతి. అప్పుడు మళ్ళీ శ్వాస పూర్తిగా బయటకు వెళ్ళినప్పుడు ఒక సెకనులో సగం ఆగుతుంది. ఇది గమనించడానికి నాల్గవ సంగతి. అప్పుడు శ్వాస మళ్ళీ లోపలికి రావడం

మొదలవుతుంది. ఇదీ శ్వాస యొక్క చక్రం. ఒకవేళ మీరు ఈ నాలుగు సంగతులన్నీ గమనించగలిగితే మీరు ఆ సామాన్య పద్ధతి అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. విస్మయపడతారు. ఎందుకంటే మనస్సు అప్పుడు పనిచేయదు.

గమనిక అన్నది మనస్సు యొక్క లక్షణం కాదు. గమనిక ఆత్మ యొక్క, చైతన్యం యొక్క ధర్మం. జాగరూకత అసలు ఏ మాత్రమూ మానసిక కార్యం కాదు. మీరు గమనించినప్పుడు మనస్సు ఆగుతుంది. ఉండటానికి స్వస్తి చెప్తుంది. అవును, మొదట్లో చాలాసార్లు మీరు శ్వాసని గమనించడం మరిచిపోతూ వుంటారు. మనస్సు మధ్యలో వచ్చి దాని పాత ఆటల్ని ఆడటం మొదలు పెడుతుంది. కానీ ఎప్పుడెప్పుడు మీకు శ్వాసని గమనించడం మరిచిపోయారని గుర్తుకువస్తే, అప్పుడు పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదు. తప్పు చేసామని అనుకోనక్కర్లేదు. కేవలం వెనక్కి వెళ్ళి మళ్ళీ గమనించండి. మళ్ళీ, మళ్ళీ శ్వాసని గమనించడానికి వెనక్కి వెళ్ళండి. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మనస్సు జోక్యం చేసుకోవడం తగ్గుతూ తగ్గుతూ వుంటుంది.
(సశేషం)
🌸🌹🌸🌹🌸🌹🌸🌹

సేకరణ

అమ్మ తిట్టు ప్రేమతో తట్టు

"అమ్మ తిట్టు ప్రేమతో తట్టు"

పొద్దు పొడవగానే మా అమ్మ
తిట్లతోనే నన్ను నిద్ర లేపుతుండేది...
తన నోటికొచ్చిన తిట్లతో
నిత్యం నన్ను తట్టిలేపేది...

ప్రతితిట్టూ నన్ను స్పర్శించినప్పుడు
మృదువుగా..మెత్తగా మత్తుగా
గమ్మత్తుగా తాకుచుండేది...
కోపంతో తిట్టినా..కసితోతిట్టినా
ఆర్ద్రతతో నిండిన అమ్మతిట్లు
ఆత్మీయంగా నన్ను స్పృశించేవి...

నన్ను కన్నపుడు ఎన్నెన్ని
నొప్పులు భరించిందో!!??
ఎన్ని కష్టాలు నెట్టేసిందో!!??
పొత్తిళ్ళలో పురుడు పోసుకున్నప్పుడు
ఊహించని ప్రేమ..ఊహకందని
ఎన్ని ఆశలను ప్రోగుచేసుకుందో!!??

అప్పుడు ఆతిట్లు అన్నీ
నా బాగోగుల గురించే!!...
నా బతుకును దారిలో పెట్టడానికే!!..
నన్ను ఓఇంటివాన్ని చేయడానికే
ఆ తిట్ల తిప్పలన్నీ...
ఆ తిట్లే నాకు ఆశీర్వచనాలైనాయి...
దీర్ఘాయుష్మాన్భవ అంటూ
అక్షింతలుగా నెత్తిపై చల్లినట్లు
అమ్మ నోటితిట్లే శిరోధార్యమైనాయి...

ఎన్ని సమస్యలు ఎదురైనా...
నా ఆలనాపాలనా చూసుకుంటూ
ఆప్యాయతతో హత్తుకొని
తన ఒడిలో దాచుకునేది...
నాలోని అణువణువునూ..ఆనందంతో తన కళ్లలోనే దాచుకునేది...
తన కళ్లెదుటే నాతపనను చూసి
కన్నీరు జారిపోయేవి...

అమ్మతనాన్ని కమ్మగా అందించి..
నా చైతన్యజ్వాలకు ఆజ్యం పోసేది...
నాలో నిద్రిస్తున్న జాగృతిని
తన తిట్లతోనే తట్టి లేపేది!!..

వాస్తవసమాజం వైపు నడిపించడానికి
నా హృదయ తలుపుల్నినిత్యంతట్టి
నామనసు పొరలను సుతారంగా మీటి
కొత్త ఊపిరి పోసేది...
కుళ్లు కుతంత్రాల లోకం నుండి
నన్ను కాపాడడానికే
ఈ తిట్లతోనే ఎన్నో అగచాట్లుపడేది..
అమ్మ అంటే ఇంతేనేమో అనిపించేది...

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

"పక్షులు" వాటి గూడు'ని కోల్పోయినప్పుడు, ఆ 'పక్షులు' విలపించడం, మీరెప్పుడైనా చూశారా?? :-

"పక్షులు" వాటి గూడు'ని కోల్పోయినప్పుడు, ఆ 'పక్షులు' విలపించడం, మీరెప్పుడైనా చూశారా?? :-

🕊️ వర్ష ఋతువు'లో.. ఎప్పుడైతే భయంకరమైన 'వర్షాలు' పడతాయో.. తీవ్రమైన గతి'తో గాలులు వీస్తాయో.. అప్పుడు మీరు, ఎప్పుడో ఒకప్పుడు, చూసే ఉంటారు. ఈ 'పక్షులు' వాటి నివాసాలు కోల్పోపోతుంటాయి. వాటికి ఎంతో నష్టం జరుగుతుంటుంది...

🕊️ కానీ, మీరు ఎప్పుడైనా ఆ 'పక్షులు: ఆ సమయంలో విలపిస్తున్నట్టుగా.. చూశారా?? ఎప్పుడూ లేదు కదా, ఎప్పుడైతే వర్షం ఆగిపోతుందో.. ఆ 'పక్షులు' మళ్లీ గడ్డిపరకలను జోడించి, వాటితో గూడు'ని, తయారు చేసుకుంటాయి. వాటి 'ప్రపంచం' ఇంతకుముందు ఎలా ఉండేదో, మళ్లీ అలానే తయారు చేసుకుంటాయి. కానీ ఎందుకు??...

🕊️ ఎందుకంటే, ఈ చక్రవాక్య 'కాలం' వలన, ఆ పక్షుల'కు ఎలాంటి 'సంబంధం' లేనే లేదు. ఆ 'పక్షలైతే' కేవలం, ఏం చేస్తాయి అంటే, వాటి'చేతిలో ఉన్నది కేవలం "ప్రేమ" మాత్రమే, ఇక ఇదే సంతోషకరమైన 'జీవితాని'కి మూలమంత్రం...

🕊️ ఏదైతే మీ చేతిలో ఉండదో, దానికోసం విలపించడం వల్ల, ఎలాంటి లాభము ఉండదు. మీ 'ధ్యాస', కేవలం మీ వల్ల జరిగే దానిపై మాత్రమే, 'కేంద్రీకృతం' చేయండి...

🕊️ ఏదైతే జరిగిపోయిందో.. చెప్పాలంటే, మీరు దాన్ని మార్చలేరు. కానీ, దేన్నైతే మీరు మార్చగలరో.. మీరు దానిపై మాత్రమే, దృష్టి'ని, 'కేంద్రీకృతం' చేయండి. ఈ జీవితం'లో.. మీరు ధైర్యం'గా ఉండటం నేర్చుకోండి. ఇక ఆ తరువాత, అంతా మంచే జరుగుతుంది...🤝

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

💦గడచి పోయిన క్షణాలు మల్లి రావు 🌈

💦గడచి పోయిన క్షణాలు
మల్లి రావు 🌈
🕉️🌞🌎🏵️🌼🚩

కాలం నిరంతర ప్రవాహం లాంటిది. ఒక్క నిమిషం కూడా ఎవరి కోసం ఆగకుండా అది సాగిపోతూనే ఉంటుంది. పాతనీరు పోయి కొత్తనీరు వచ్చి చేరినట్లు పాత రోజులు గడిచిపోయి.. కొత్త రోజులు వస్తూ వుంటాయి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు మాత్రమే కాదు.. యుగాలకు యుగాలే కాలప్రవాహంలో కలిసిపోతూ వుంటాయి. గడిచిపోయిన క్షణం కూడా మళ్లీ తిరిగి రావటం అసంభవం. అందుకే కాలం విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకుని- ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ, అర్థవంతం చేసుకుంటూ తనకు, తనతోపాటు ఇతరులకూ కాలం ఉపయోగపడేలా చూసుకోవాలి. కాలం లాగే మనిషి జీవితం కూడా ప్రవాహం లాంటిదే. బా ల్యం, కౌమార, యవ్వన, వృద్ధాప్యాలు చూస్తూండగానే గడిచిపోతూ ఉంటాయి. ప్రవాహ ఉధృతిలో మనిషి జీవితం ఎన్నో ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు చూస్తుంది. ఒక్కోసారి అనుకోని దుర్ఘటనల కారణంగా ఉన్నచోట ఉన్నట్లే కాలం స్తంభించినట్లు అనిపిస్తుంది. అందుకే అంటారు తత్త్వవేత్తలు ‘ఇది జీవితం..’ అని! జీవితం
తనంతట తాను నడిచేదే అయినా- కొన్ని విషయాలకు సంబంధించి దాని పగ్గాలు మన చేతుల్లోనే ఉంటాయి. మన జీవితాన్ని మనం హాయిగా, సుఖంగా.. ఓ పాటలా, ఆటలా గడపాలంటే అందుకు మనవంతు ప్రయత్నం చేయాల్సిందే. జీవితాన్ని మంచిదారిలో నడిపించగల చోదక శక్తి, సామర్థ్యాల కోసం అభ్యాసం చేస్తే మన జీవితం మన సొంతం అవుతుంది. మంచి మనసు, ఆరోగ్యకరమైన అలవాట్లు, చక్కటి వ్యక్తిత్వం అలవరచుకోగలిగిన వాళ్లకి మాత్రమే ఇవి సాధ్యమయ్యేవి. జీవితంలో ఏదో సాధించాలని తపనపడే వాళ్లకు ప్రతి ఉదయం శుభోదయమే. ప్రతిరోజూ జీవన గమనంలో ఒక ముందడుగే. గమ్యం కోసం కృషిచేసేవారికి ప్రతిదినం ఒక వరం లాగే ఉంటుంది.

అలాంటిది- సంవత్సరం అంటే ఎన్ని రోజులు..? ఎన్ని వరాలు..? 365 వరాలు. సద్వినియోగం చేసుకున్నవాళ్లకి బతుకంతా పండుగే. ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు అందరి జీవితాల్లోనూ పెద్దవి, గొప్పవి అయి వుండాలన్న నిబంధన ఏమీ లేదు. ఎవరి అభిరుచి,స్థాయిని బట్టి దొరికిన అవకాశాలను ఎంతవరకు సార్థకం చేసుకోగలిగారన్నదే ప్రధానం. నది వద్దకు మనం నీళ్ల కోసం చెంబు తీసుకువెళితే..
చెంబుడు నీళ్లే మనకు దక్కుతాయి. కుండ పట్టుకెళ్ళఓగలిగితే కుండెడు నీళ్లు దొరుకుతాయి. పాత్ర ఎంతటిదైనా ‘దాహం తీరింది కదా’ అన్నదే మనిషికి ఆనందాన్ని కలిగించే విషయం. సంతృప్తిని మించి ఆనందం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్న జీవన సూత్రం అందరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అనుభవమే. మనం ఏటా పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటాం. అలాగే, మనకు ఇంతలా ఉపకారం చేస్తున్న కాలానికీ (అది ఎప్పుడు పుట్టిందో కచ్చితంగా తెలియకపోయినా) కూడా ఒక పుట్టిన రోజు, ఆ సందర్భంగా వేడుక ఉండాలి కదా! అది తెలుగువాళ్ళు చేసుకునే ఉగాది కావచ్చు.. మళయాళీలు చేసుకునే ఓనమ్ కావచ్చు.. బెంగాళీలు చేసుకునే పొహెలా బైశాఖీ కావచ్చు.. ఎవరి లెక్కలను బట్టి వారు ఏటా ఒకసారి ‘కొత్త సంవత్సరం’ సంబరాలు చేసుకుంటారు. ఇంగ్లీషు లెక్కల ప్రకారం జనవరి ఫస్ట్‌న జరిగే న్యూ ఇయర్ వేడుకలను మాత్రం ప్రపంచమంతా పండగలా జరుపుకుంటుంది.
కుటుంబ సభ్యులతోనో, బయట ఫ్రెండ్స్‌తోనో, పబ్బుల్లోనో, క్లబ్బుల్లోనో, ఫామ్‌హౌసుల్లోనో ఆటపాటలతో సరదాగా గడపడం ఆనవాయితీగా మారింది. ఈ కొత్త సంవత్సరం అడుగిడిన సమయంలో కూడా సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శుభాకాంక్షలు చెప్పుకోవడంలోనూ కొత్త పోకడలు చోటుచేసుకున్నాయి. పలు కార్పొరేట్ సంస్థలు, ప్రయివేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు, కస్టమర్స్‌కి గ్రీటింగ్స్, మెసేజీల ద్వారా శుభాకాంక్షలు అందజేశాయి. ఇలాంటి ప్రయత్నాలు ఆయా సంస్థ వ్యాపారాభివృద్ధికి కూడా దోహదం చేస్తాయి. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆలయాలకు వెళ్లి పూజలు చేసిన వారూ ఉన్నారు. ఎవరు ఏ పద్ధతిలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నా- దాని వెనుక అంతరార్థం, అందరి అభిలాష ఒక్కటే. అంతా సుఖసంతోషాలతో బాగుండాలని. అయితే, ఇలా కోరుకోవడంతోనే వేడుక ముగిసిందనుకుంటే- అది అసంపూర్ణమే అవుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ- ప్రతి ఒక్కరూ తమ ఆకాంక్షలను గుర్తు చేసుకోవడమే కాదు, కొన్ని నిర్ణయాలూ తీసుకోవలసి ఉంటుంది. మనలోని లోపాలను, బలహీనతలను మనమే తెలుసుకుని వాటిని అధిగమించేందుకు కొత్త సంవత్సరంలోనైనా సంకల్ప బలంతో ప్రయత్నించాలి.

ఎవరికివారు మేలు చేసుకునేందుకు, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తు గురించి సరికొత్త కలకు మనసులోనే నాంది పలుకుతూ, మన ఆశయాలకు, ఆకాంక్షలకు మరింత పుష్టిని కలిగించేలా మరింత సంకల్పానికి మనసులో చోటు కల్పించగలగాలి. మంచి మనిషిగా, గొప్ప వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకోవటానికి న్యూ ఇయర్ వేడుకలు స్ఫూర్తిని కలిగిస్తాయ. కలలు సాకారమైనపుడే కాలానికి సార్థకత సాధ్యమవుతుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

🎊💦సాధన 🏵️

🎊💦సాధన 🏵️
🌈🌟🌹🦚🚩

సాధన చేస్తే ఈ భూమ్మీద ఏదైనా సాధించవచ్చును అంటారు. నిజమే. కాని ఏ సాధన చేస్తున్నాం? ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏయే నియమాలు పాటిస్తున్నాం, అన్నీ సరిగ్గా ఉన్నాయా, శాస్త్రీయ పద్ధతిలో సాధన సాగుతోందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి.

సాధన అంత సులభం కాదు. సాధనలో వచ్చే అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ఒక లౌకికమైన విషయం సాధించడానికి చాలా కష్టపడాలి. అలాంటిది అలౌకిక సాధనలకు ఎంత ఏకాగ్రత, పట్టుదల, అంకితభావం, దీక్ష ఉండాలి ?

పుస్తకాల్లో చదివినప్పుడు అవి చేతికి అందినట్లుగానే ఉంటాయి. ఆ సూత్రాలను పాటించినప్పుడు, ఆ నియమాలను ఆచరించినప్పుడు సాధకుల గొప్పతనం బోధపడుతుంది.

పతంజలి యోగ సూత్రాలు, నారద భక్తి సూత్రాలు, యోగమార్గాలు అని వీటికి పేర్లు. ఋషులు ఎంతో గొప్ప కృషి చేసి, సాధన చేసి లోకానికి అందించారు. వీటిని ఆచరణలోకి తీసుకురావడమన్నది సాదాసీదా వ్యక్తులకు అయ్యే పని కాదు. చంచల మనస్కులకు అసలు సాధ్యం కాదు. నేను-నాది అనే అహంకారులకు అసలే అంతుచిక్కదు.

సాధన చెయ్యాలనే కోరిక కలగడం కూడా పూర్వజన్మ సుకృతమేనంటారు. పట్టు విడవకుండా దాన్ని కొనసాగించడం పురుష ప్రయత్నం. దానికి దైవానుగ్రహం తోడవ్వాలి.

సాధనలో లోపాలు నాచుమీద నడకలా వెనక్కి లాగేస్తుంటాయి. చిల్లికుండతో నీళ్లు తెచ్చిన చందంలా ఎంతో చేస్తే, ఇంతేనా అని అనిపిస్తుంటాయి.

సరైన గురు సన్నిధిలో వినయ విధేయతలతో, నిజాయతీగా, నిరాడంబరతతో నేర్చుకోవాలనే తపన కలిగిన సాధకుడికి మాత్రమే అనుకూలమవుతుంది సాధన అని చెబుతారు పెద్దలు.

ధ్యానం చేసే వ్యక్తికి ఏకాగ్రత కావాలి. ప్రార్థన చేసే వ్యక్తికి ఆర్తి కావాలి. జపం చేసే వ్యక్తికి భావం కావాలి. పూజ చేసే వ్యక్తికి విశ్వాసం ఉండాలి.

సాధనను మనం నమ్మితే, సాధన మనల్ని నమ్ముతుంది. చేసిందే మళ్ళీ మళ్ళీ పట్టుదలతో చేస్తుంటే, ఆ విషయం మీద పట్టు వస్తుంది. నైపుణ్యం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాని ఆత్మ పట్టుబడుతుంది. చివరికి సాధన మనకు మోకరిల్లుతుంది.

అర్జునుడి సాధన అతణ్ని గొప్ప విలుకాడిగా మార్చింది. హనుమంతుడి రామనామ సాధన అతణ్ని గొప్ప భక్తుడిగా తీర్చిదిద్దింది. సాధన అనేది పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉందని శ్రీరాముడికి వసిష్ఠుడు తెలియజేశాడు.

సత్యం తెలుసుకొని అరుణాచల కొండను ఆశ్రయించిన రమణ కూడా నిత్యం తన మౌన సాధనను కొనసాగించారు. సత్యం తెలుసుకోవడానికి మొదట సాధన చెయ్యాలి. తరవాత తెలుసుకున్న సత్యాన్ని నిలబెట్టుకోవడానికి సాధన చెయ్యాలి.

మెట్టు మెట్టు ఎక్కి శిఖరాగ్రాన్ని చేరుకోవాలి. బొట్టు బొట్టు కలిస్తేనే సముద్రమవుతుంది. మనం చిత్తశుద్ధితో చేసింది ఏనాడూ పోదు. క్రమం తప్పకుండా సాధన చేస్తే, లోపాలు వాటంతట అవే సరి అవుతాయి.

శాస్త్రం మీద, గురువు మీద, సాధన మీద నమ్మకం ఉన్నవారు విజేతలవుతారు. భావితరాలకు మార్గదర్శి అవుతారు. సాధ్యం కానిది లేదని నిరూపిద్దాం !

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

🍁మంచి నియామాలు అన్నీచాలా కష్ఠమెందుకు?

నేటి జీవిత సత్యం.

🍁మంచి నియామాలు అన్నీచాలా కష్ఠమెందుకు?
🎊🌟💦🌹🌈

మంచి నియమాలు అన్నీ చాలా కష్టంగా ఉంటాయి. తుదకు అవే అనంతమైన అమృత తుల్యమైన సుఖాన్ని ఇస్తాయి.

ఆ సుఖం ఎక్కడి నుండో రాదు. మనలో ఉన్న సాత్త్విక బుద్ధి వలన వస్తుంది.

కాబట్టి సాధన మొదట్లో కష్టంగా ఉందని మానకుండా నిరంతరం కొనసాగించాలి.

విషమి అని అన్నారు కానీ విషం అనలేదు. మొదట్లో విషం మాదిరి తోస్తుంది. అంటే చాలా కష్టంగా ఉంటుంది. దానికి భయపడకూడదు.

ఈ ఆత్మ సాధనకు మన పూర్వజన్మవాసనలు అనేక విఘ్నాలు కలుగచేస్తాయి. మనసును అటు ఇటు మళ్లిస్తాయి. వాటికి లొంగకుండా సాధన చేస్తే అనంతమైన సుఖం మీ సొంతం అవుతుంది.

ఏదైనా వ్యాధి వచ్చింది. చేదు మందు, సూది మందు, ఆపరేషన్ ఇవన్నీ చేస్తారు. వాటికి భయపడి పారిపోతే రోగం ముదురుతుంది. ముందు ఇవన్నీ కష్టంగా ఉన్నా, తుదకు జీవితాంతం సుఖాన్ని కలుగచేస్తాయి.

అలాగే విద్యార్థులు సంవత్సరం అంతా నియమం ప్రకారం చదవడం మొదట్లో కష్టంగానే ఉంటుంది. కాని తుదకు పరీక్షలలో మంచి మార్యులు వచ్చి సంతోషాన్ని కలుగచేస్తాయి.

అలాగే అధ్యాపకుడు సంవత్సరం అంతా కష్టపడి పాఠాలు చెబితే, జీవితాంతం ఆ విద్యార్థులు ఆ ఉపాధ్యాయుని దేవునిలాగా పూజిస్తారు. దీనితో విద్యార్థులకు విద్య వస్తుంది. ఉపాధ్యాయునికి గౌరవం లభిస్తుంది.

అలాగే ఉద్యోగి రోజంతా కష్టపడి పని చేస్తే, ఆ ఉద్యోగికి పై అధికారి మెప్పు, జీతంలో పెరుగుదల, పదోన్నతి లభిస్తాయి. ఇవన్నీ మొదట్లో కష్టంగా ఉంటాయి. అంతంలో సుఖాన్ని కలుగచేస్తాయి.

దీనికి మంచి ఉదాహరణ- మనకు భాగవతంలో ఉంది….

దేవతలు, దానవులు పాలసముద్రమును మధించారు. ముందు హాలాహలం అంటే విషం పుట్టింది. కాని వారు అధైర్యపడలేదు. ఆ విషాన్ని మహాశివుడు సేవించాడు. దేవదానవులు వారి కృషి కొనసాగించారు. అమృతం పుట్టింది.

మనలో ఉన్న మంచి చెడు- దేవతలు దానవులు. వాటి మధ్య జరిగే ఘర్షణ పాలసముద్రం చిలకడం. ముందు కష్టాలు వస్తాయి. ఓపికగా భరించాలి. కష్టాలను భగవంతునికి అర్పించాలి. తుదకు అనంతమై సుఖం లభిస్తుంది.

మనం చేసే కృషిని మంధర పర్వతం కింద ఉన్న కూర్మావతారంలో ఉన్న పరమాత్మ పర్యవేక్షించినట్టు, మనలో అంతర్లీనంగా ఉన్న ఆత్మస్వరూపుడు పర్యవేక్షిస్తుంటాడు.

ఈ భావనతో సాధన చేస్తే, సాత్విక సుఖం లభిస్తుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి ధనానుబంధాలు

నేటి ధనానుబంధాలు

సమాజంలో రూపాన్ని చూసి మోసపోవడం, రూపాయిని చూసుకుని గర్వపడిపోవడం చూస్తుంటాం. మనిషిని డబ్బు మార్చకపోయినా, అతడి నిజస్వరూపాన్ని బయటపెడుతుంటుంది. డబ్బు మనిషిని ఎంతో ఎత్తుకు తీసుకెడుతుంది. కీర్తి ప్రతిష్ఠల రుచి చూపిస్తుంది. ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ఆ డబ్బే మనిషిని పాతాళంలోకీ నెట్టేస్తుంది. యుక్తవయసులో ఉన్నప్పుడు డబ్బే చాలా ముఖ్యమైనదనిపిస్తుంది. వృద్ధాప్యంలో అదేమిటో అర్థమవుతుంది అంటారు రచయిత ఆస్కార్‌ వైల్డ్‌.

ఓ వ్యాపారవేత్త తన గోదాముకు తీసుకెళ్లాడు మిత్రుణ్ని... చూసేందుకు ఏముంటుంది, విశాలమైన ప్రదేశం. బోలెడంత సరకు నిల్వ చేసి ఉందక్కడ. చిందరవందరగా బస్తాలు పడి ఉన్నాయి. అంత శుభ్రంగా కూడా ఏం లేదు. అక్కడ ఓ శ్రామికుడు నేల మీద తల కింద చేయి పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. వీళ్ల రాకను గమనించే స్థితిలో అతడు లేడు. అతణ్ని చూపించి ఆ వ్యాపారవేత్త ‘మిత్రమా, నాకు ఇతణ్ని చూస్తే చాలా అసూయగా ఉంది. ఖరీదైన భవంతిలో పట్టుపరుపులపై పడుకున్నా, నేనెప్పుడూ ఇలాంటి నిద్రసుఖమెరుగను’ అన్నాడు. డబ్బున్నంత మాత్రాన సుఖం ఉంటుందనుకోవడం పొరపాటు.

డబ్బును సవ్యంగా ఖర్చు చేసినప్పుడు వ్యక్తికి తృప్తి, ఆత్మానందం కలుగుతాయి. అదే ఆడంబరాలకు పరిమితమైనప్పుడు డబ్బు వృథా అనిపిస్తుంది. డబ్బు లేదన్న నిజాన్ని కనీసం నీడకైనా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుందంటారు అనుభవజ్ఞులు.
దైవం పట్ల విశ్వాసం, మంచితనం పట్ల నమ్మకం లేనప్పుడు సహజంగానే మనుషులు అసంతృప్తితో జీవిస్తారు. అభద్రతా భావానికి గురవుతుంటారు. ఆ బాధలకన్నింటికీ కారణం డబ్బు లేకపోవడమేనని చింతిస్తుంటారు. డబ్బు గల వారందరినీ శత్రువులుగా చూస్తుంటారు. శ్రమను, ధనాన్ని గురువుకు సమర్పించుకున్నప్పుడు దాన్ని ‘దక్షిణ’ అంటాం. దానికి విలువ కట్టలేం. ఈ ‘దక్షిణ’ ఆశీస్సుల రూపంలో తిరిగి వస్తుంది. అది సంతోషం, సంతృప్తి, సమృద్ధిని తీసుకొస్తుంది. ‘ఇంతకంటే ఏం కావాలి’, ‘ఉన్నది చాలదా’ లాంటి భావనలు మనిషికి కలుగుతూనే ఉంటాయి. చిత్రమేమిటంటే- అవి స్థిరంగా ఉండకుండా, వచ్చి మెరుపులా మాయమవుతుంటాయి. మళ్ళీ బుద్ధి బురదగుంటలో పడుతుంది. మనిషి తాపత్రయాల్లో చిక్కుకుంటాడు.

డబ్బు అనేది ఒక ఉపకరణం. సక్రమంగా వినియోగిస్తే అందాలను, అద్భుతాలను సృష్టిస్తుంది. పట్టాలు తప్పితే గందరగోళమే. మనిషి తాను డబ్బు విషయంలో ఎంత గొప్పవాడో తెలుసుకోవాలంటే జీవితంలో డబ్బుతో కొనలేనివి ఏమిటో, ఎన్ని ఉన్నాయో ముందు తెలుసుకోవాలి. ఆ విచక్షణ కలిగి ఉంటే అతడి దగ్గర ఎంత డబ్బున్నా సమాజానికి మేలేగానీ ఏ నష్టమూ ఉండదు. మనిషి చేతుల్లో డబ్బుంటే తానేమిటన్నది మరచిపోతాడు. అది లేకపోతే... అతడేమిటన్నది ప్రపంచం గుర్తుంచుకోదు. దీనివల్లే సమస్య. కానీ, వివేకం గలవారు డబ్బుమాయలో చిక్కుకోరు.

ఎంత ధనం మూలుగుతున్నా, కడుపు నింపేది పిడికెడు మెతుకులేనన్న సత్యం తెలిసినా, పక్కదారి పట్టించే ఆలోచనలకు కళ్లెం వేయలేని బలహీనతలోంచి మనిషి బయటపడాలి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

Thursday, May 5, 2022

🪴💪🏻 మీ జీవిత BIO-CLOCK 💪🏻🪴 💃🏻చక్కటి జీవిత జీవన ప్రయాణం గురించి💃🏻

🪴💐🪴💐🪴🏇💐🪴💐🪴💐🪴

🪴💪🏻 మీ జీవిత BIO-CLOCK 💪🏻🪴


🙏🙏ఓపిక తో చదవండి. 🙏🙏

📕చదివించండి.📕

💃🏻చక్కటి జీవిత జీవన ప్రయాణం గురించి💃🏻

🌱మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము.
కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము.

🙏ఇదే మన బయో-గడియారం🙏

🌱చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు.

🌱50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో
గాఢంగా నమ్మి
చాలామంది తమ
సొంత బయోక్లాక్‌ ను
ఏర్పాటు చేసుకున్నారు.

🌱అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌ ను
మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాము.

🌱చైనాలో చాలా మంది ప్రజలు
120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి
అలా మానసికంగా సంసిద్దులై
వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.

👉కాబట్టి ..!

🌱1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే తద్వారా మనం కనీసం 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.

🌱2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి.
వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.

🌱3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు
(తెల్లజుట్టు ఉంటే)
వెయ్యండి,
యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి.

🌱ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యెట్టి పరిస్థితులలో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు.

🌱4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ
'నెగటివ్ థాట్స్' తో
తీసుకోవద్దు.

🌱ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.
లేదంటే 'ఋణాత్మక ఆలోచన'ల వల్ల
మన శరీరంలో
నెగటివ్ ఎంజైములు విడుదలై
మన జీర్ణ వ్యవస్థను,
మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.
ఎప్పుడూ చురుకుగా ఉండండి.
నడవడానికి బదులుగా
వీలైతే జాగింగ్ చేయండి.

🌱5. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి.

👍(ఇది నిజం కూడ).

🌱6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు.
కనుక ఆనందంగా ఉండండి
తద్వారా ఆరోగ్యంగా ఉండండి.

🌱(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి).

🌱7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు.

🌱మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట,

🌱సరదాకు కూడ....
"నాకు Old age వస్తుంది"
అనే మాటను అనకండి.

🙏చిరునవ్వుతో జీవించండి🙏

🌱అరమరికలు లేని ఆనంద జీవితం గడపండి

💐నవ్వు నవ్వించు💐

🧘‍♂️నిత్యం ధ్యానం యోగ నిరంతర ప్రక్రియ గా ఉండాలి

🧘‍♂️నీ ఆయువు పరిమాణానికి నీ ఆహ్లాదకరమైన జీవితానికి

🧘‍♂️నీ అద్భుత ప్రయాణమే పరమపద సోపాన పటం

💃🏻కాబట్టి మీ మానసిక
'బయో క్లాక్' ని
ఎక్కవ ఆయుర్దాయం ( ఆయువు పరిమాణం పెంచుకోవడం) కోసం మీరే సెట్ చేసుకోండి ....

🌲ఆలోచనా దృక్పధాన్ని మార్చుకోండి🌲.

🙌🌹*Wish you many more happy years ahead with good health and wealth.🌹🙌..

🪴💐🪴💐🪴🏇🪴💐🪴💐🪴💐

సేకరణ

'' మమ్మీలు '' ఇలాంటి ' " అమ్మలు" అయితే ! 🌷.నిద్రకు ముందు మంచి విషయాలు.. అమ్మ ఎప్పుడూ పిల్లలకు కోపం, విసుగు వున్నా మంచే నేర్పాలి...🌷

'' మమ్మీలు '' ఇలాంటి ' " అమ్మలు" అయితే !

🌷.నిద్రకు ముందు మంచి విషయాలు..
అమ్మ ఎప్పుడూ పిల్లలకు కోపం, విసుగు వున్నా మంచే నేర్పాలి...🌷

..... ...వీటి వల్ల జీవితం లో ఇప్పుడు వాళ్ళకి బాధ అనిపించినా మంచి ఉన్నత జీవితం అనుభవిస్తారు..🙂

ఇన్ఫోసిస్ ను స్థాపించిన రోజుల్లో సుధామూర్తి గారు ఆమె భర్త నారాయణమూర్తి గారు , సంస్థను పదికాలాల పాటు ధృఢంగా , విజయవంతంగా నిలబడాలని చాలా జాగ్రత్తగా దాన్ని నడుపుతూ వస్తున్నారు. వ్యక్తిగతంగా పొదుపు చేస్తూ , చక్కటి విలువలతో ఇన్ఫోసిస్ ను ముందుకు తీసుకెళ్ళాలి అనేది వారి ఆలోచన. వాళ్ళ కొడుకు రోహన్ మూర్తికి చాలా మంది స్నేహితులు అయ్యారు. ఒకసారి అతని పుట్టినరోజును ఖరీదైన స్టార్ హోటల్ లో జరుపుకొంటానని తల్లి సుధామూర్తితో చెపుతాడు. అపుడు ఆమె ''ఎంత ఖర్చు అవుతుంది ? '' అని అడుగుతారు. అందుకు అతను '' ఒక యాభై మంది స్నేహితులు రావచ్చు కాబట్టి సుమారుగా యాభైవేలు ఖర్చుకావచ్చు '' అంటాడు. అపుడు సుధామూర్తి గారు ,'' రోహన్ , ఒకసారి మన ఇంట్లో పనిచేసే ఈ పనిమనిషిని చూడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇద్దరి చదువుల ఖర్చు ఒక ఏడాదికి ఇరవైవేల రూపాయలు అవుతుందట. నీవు నీ పుట్టినరోజు వేడుకను వద్దనుకొంటే ఆ ఇద్దరు పేదపిల్లలు రెండు సంవత్సరాలు చదువుకోగలుగుతారు , ఆలోచించు. ఒకవేళ నీవు అనుకొంటూన్నట్టు ఆడంబరంగానే జరుపుకోవాలంటే , అలాగే కానిద్దాం.'' అంటారు. రాత్రంతా ఆలోచించిన రోహన్ మూర్తి ఉదయమే అమ్మ దగ్గరికొచ్చి , '' అమ్మా , నీవు చెప్పినట్టే చేద్దాం, '' అన్నాడట.సంతోషించిన సుధామూర్తి గారు , '' కానీ , రోహన్ నాకు మరో ఆలోచన కూడా వచ్చింది. అదేమంటే నీ స్నేహితులందరినీ మన ఇంటికే పిలువు. ఇక్కడే నీ పుట్టినరోజును జరుపుకొందాం ,'' అంటారు. '' అలాగే అమ్మా , '' అన్నాడు అతను. తన ఫ్రెండ్స్ అందరికి సమోసాతో పాటు ఒక రస్నా ప్యాకెట్ కూడా ఇవ్వాలని చిన్న షరతు పెట్టాడట. సుధామూర్తి గారు నవ్వుతూ అంగీకరించారు.

మరుసటిరోజు యాభైమందీ వచ్చారు. వాళ్ళందరికి ఒక వంటమనిషి తోడు తీసుకొని సుధామూర్తిగారే స్వయంగా వంటలు వండారట. అంతేకాదు, ఆరోజు ఇంట్లో పనిచేసే పనిమనిషికి రోహన్ చేతనే ఇరవైవేల రూపాయలు [ పిల్లల చదువులకోసం ] ఇప్పించారు. ఆ సంఘటన రోహన్ మూర్తి మీద ఎంత ప్రభావం చూపిందంటే , అతను తరువాత విదేశాలకెళ్ళి చదువుకొంటున్నపుడు , అక్కడి యూనివర్సిటీలు ఇచ్చే స్కాలర్ షిప్ ను మొత్తం పేదలకు ఉపయోగించమని బెంగళూరులో వున్న తల్లి సుధామూర్తి గారికి పంపించేసేవాడు.

మన పాఠశాలలు , కళాశాలల్లో ఇలాంటి సంఘటనలను విద్యార్థుల హృదయాలకు హత్తుకొనేలాగా చెప్పనంతవరకూ , మనం మన విద్యాలయాల ద్వారా డాక్టర్లు , ఇంజనీర్లు , బ్యాంకర్లు , వ్యాపారవేత్తలు మొదలైన వారిని తయారుచేయవచ్చేమే కానీ ''మనసున్న మనుషులను'' తయారుచేయలేము
🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్

సేకరణ

వివేకానందులను వేలమందిని సృష్టించగలిగే శక్తిమంతుడు రామకృష్ణుల నోట ప్రతి నిమిషం "భగవదిచ్ఛ" అనే మాట నానుతూ ఉంటుంది.

రెప్పపాటు కాలంలో ఇలాంటి వివేకానందులను వేలమందిని సృష్టించగలిగే శక్తిమంతుడు నా గురువు...అంటారు వివేకానంద.

అలాంటి రామకృష్ణుల నోట ప్రతి నిమిషం "భగవదిచ్ఛ" అనే మాట నానుతూ ఉంటుంది.

భగవదిచ్ఛను స్వాగతించడమే భక్తియోగం.
భగవదిచ్ఛను ఎదిరించడమే కర్మయోగం.

ఒకడు ముందుగానే లొంగిపోతాడు.
మరొకడు ఎదిరించి చివర్లో లొంగిపోతాడు.

ఏ యోగమైనా, ఏ మార్గమైనా చివర్లో లొంగిపోవడమే(శరణాగతి) పరమావధి.

ఓటమిని అంగీకరించడం,
పూర్తిగా నిస్సహాయంగా ఉండిపోవడం
అప్పుడు దాని నుండి వెలువడేదే వివేకం(wisdom).
నీవు చేయగలిగింది ఏమీలేదని అర్థం.
అదే సంపూర్ణ ఆత్మసమర్పణం...అంటారు UG.

పల్లంలోకి నీరే వచ్చి నిండిపోతుంది.
లొంగిపోతే దైవమే వచ్చి నీలో ఉండిపోతుంది.



"ఏ సాధనా చేయకపోవడమే మా సాధన"
అంటుంటారు గురువుగారు...

నిజానికి ఇదే అతి కష్టమైన సాధన అనిపిస్తుంది.

ఏదో ఒకటి చేస్తుండడం సులభం.
ఏమీ చేయకుండా ఉండడమే కష్టం.

కష్టపడి సాధిస్తేగాని మనకు తృప్తి ఉండదు.
సులభంగా దొరికేస్తే ఏ విలువా ఉండదు.

ఊరికే ఉండడం వలన సిద్ధి కలగడం కాదు,
ఊరికే ఉండడమే సిద్ధి.

నీవు నీవుగా ఉండటానికి నువ్వేమీ చేయనక్కర్లేదు.
కానీ నీవు నీవులా కాకుండా మరోలా ఉండటానికి నీవు చాలా(సాధనలు)చేయాలి...అంటారు UG.

"అది" ఇప్పటికే పరిపూర్ణం.
దానిని మనం కష్టపడి పరిపూర్ణం చేయనక్కర్లేదు.

"మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు" అంటారు క్రీస్తు.

రూపాయిలో ఉన్న ఓ "పైసా", రూపాయితో దబాయించి చెప్పవచ్చు- నేను లేకపోతే నీ పరిపూర్ణత్వానికే భంగం అని.

ఉన్నది సద్వస్తువు ఒక్కటే. దానికి విడిగా ఏమీలేదు....అనుకున్నాక మనం సత్యం కాకుండా ఎలా ఉంటాం.

ఈతరానివాడైనా సరే, అమృతసరస్సులో మునిగిపోయి ఎవడైనా మరణించగలడా?

"అది ఉన్నరీతిన ఉన్నది" అంతే.
పొందటమో, పోగొట్టుకోవడమో రెండూ చేయలేం.

సత్యం అనేదానిని-
నీవు పట్టుకోలేవు.
నీలో ఇముడ్చుకోలేవు.
నీవు వ్యక్తం చేయలేవు.
అంటారు UG.



అమాయకులైన పరమానంద శిష్యులు పదిమంది కలిసి ఓ నదిని దాటాక, అందరూ గట్టుకు చేరారా లేదా అని అనుమానమొచ్చి, అందులో ఒకడు తనను మినహాయించి లెక్కపెట్టేసరికి తొమ్మిదిమందే లెక్కతేలుతారు. ఒకడు నదిలో కొట్టుకుపోయాడని అందరూ ఘొల్లుమంటారు.

ఆ దారిన పోతున్న బుద్ధిమంతుడైన బాటసారి ఇది గమనించి, లెక్కించేవాడినుంచి లెక్క మొదలుపెట్టి పదిమందిని లెక్కించి, మీలో ఎవరూ కొట్టుకుపోలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని తెలియజేస్తాడు.



అలా తాను స్వతఃగా ముక్తస్వరూపుడు.
తాను పొగొట్టుకున్నదిగానీ,
క్రొత్తగా పొందవలసినదిగానీ
సాధన చేయవలసిన అగత్యంగానీ
తనకు అస్సలు లేనేలేదు.

ఆ అమాయక బాలుని వలె లెక్క(సాధన) చేస్తున్నాడు.
ఆ పదియవ వాడివి నీవే అని గుర్తుచేసేవాడు గురువు.

వెదికేవాడే.....చివరికి దొరికేవాడు కూడా.



పొరపాటున అద్దాలమహల్ లోనికి వెళ్లిన కుక్కకు
అనేక కుక్కలు ఉన్నట్టు భ్రమపడి ప్రతిబింబాల వైపుకు దాడి చేయడానికి ప్రయత్నించినట్టు

ఉండేది తానొక్కడే అయినా
తననే అజ్ఞానంతో అనేకంగా చూస్తూ
ద్వైతభావనతో ఘర్షణపడుతున్నాడు.

అద్వైతసిద్ధికై గురువును ఆశ్రయించి
సాధన చేస్తున్నాడు.

నిజానికి సాధనలోనూ, సాధ్యములోనూ
ఉండేది "తాను" ఒక్కడే.

ముల్లును మరో ముల్లుతో తొలగించునట్లు
భ్రమను మరో భ్రమతోనే తొలగించాలని
గురువు నిశ్చయించి, శిష్యునికి ఒక సాధనను నిర్దేశించి ఉన్న ముక్తినే ఇస్తాడు అంతే.

నిజానికి-
తనకు లేనిదానిని, తాను కానిదానిని
ఎవడూ ఇవ్వలేడు.
ఇవ్వబడినదంతా తనకున్న దానినే,
తానే అయి ఉన్నదానినే.

ఇతరులకు తాను క్రొత్తగా ఏదో పొందినట్టు
అనిపిస్తుందేగాని

సాధన ద్వారా తానెప్పుడూ ముక్తుడేనని,
పొగొట్టుకున్నది స్వరూపాన్ని కాదు,
జ్ఞప్తినే అని తెలుసుకుంటాడు.

మరపే - బంధం.
జ్ఞప్తియే - మోక్షం.



కథలోని ఓ పాత్ర ఆ కథారచయితకు తెలియకుండా కథలో నుంచి విరమించుకోగలదా?

కలలోని ఓ వ్యక్తి ఆ కలను కనేవానిలోంచి బయటకు దుముకగలడా?

నిజానికి 'నేను కర్తను కాను' అనడానికి కూడా
నీవు కర్తవు కావు.

ఈ మాటయినా నీ వెనక ఉండి
నిన్ను నడిపించేవాడు అంటేనే నీవు అనగలవు.

నీ ప్రతి పలుకూ భగవంతునిదే.
నీ ప్రతి కదలికా భగవంతునిదే.



ఈ జగత్కథలో పాత్రలే జీవులందరూ.
ఆ మహా కర్తే(రచయితే) పరమేశ్వరుడు.

ఆ కర్త తన వినోదము కొరకు రకరకాలుగా
పాత్రలను(జీవులను) సృష్టించి ఆడిస్తున్నాడు.

వినోదార్థం జరుగుతున్న ఈ ఆనందక్రీడలో "యెందుకు" అన్న ప్రశ్నకు అర్థం లేదు.

"ఈశ్వరుడు కర్త" అనేది నిజంగా తెలిసిననాడు
ఆ క్రీడలో నీవూ భాగస్వామ్యం అవుతావేగాని,
"ఎందుకు" అన్న ప్రశ్న వేయవు.
ఏ అయోమయానికీ లోను కావు.
ఏ సుఖదుఃఖాలకూ లోను కావు.

"కర్త"గా నీవెప్పుడైతే తప్పుకున్నావో
(ప్రారబ్ధ-ఆగామి-సంచిత)కర్మలు మూడూ నీ నుంచి తప్పుకుంటాయి.

నీవు "అకర్త"వు అవుతావు.

"అకర్త" తోలుబొమ్మలాంటివాడు.
తోలుబొమ్మకు సుఖదుఃఖాలు ఉండవు.

ఆడించేవాడు - చైతన్యస్వరూపుడు.
ఆటవస్తువులు - జడరూపాలు.

ఆడించేవాడు ఆడిస్తే ఆడుతాయి.
పెట్టెలో పడేస్తే ఊరికే ఉంటాయి.

అలా ఈ ఆత్మ అనే తెరపై ఆడే బొమ్మలు జీవులు.
అనే తెలివి కూడా దైవమే ఇస్తుంది జీవులకు.

జ్ఞానమూ దైవప్రసాదమే.
అజ్ఞానమూ దైవప్రసాదమే.

బంధమూ క్రీడే.
మోక్షమూ క్రీడే.

*

104. కనేదంతా కలవరింత
పలికేదంతా పలవరింత

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

లోపల ఖాళీగా ఉండాలంటే?. "చూస్తా ఉండాల...." అంటూ శూన్యంలోకి చూస్తూ మౌనం వహించారు గురువుగారు...

లోపల ఖాళీగా ఉండాలంటే?.

చూస్తా ఉండాల...." అంటూ శూన్యంలోకి చూస్తూ మౌనం వహించారు గురువుగారు...

*

సద్గురు నోట "చూస్తా ఉండాల" అనే చిన్న మాట
నాకది గొప్ప ఆధ్యాత్మికోపదేశంగా అనిపించింది.

చూస్తా ఉండాల....(సాక్షిగా)

దేనినీ ఖండించడంగానీ,
దేనినీ సమర్థించడంగానీ
దేనికీ ఆశ్చర్యపోవడంగానీ
దేనికీ విచారించడంగానీ
చేయకూడదు...
ఉన్నదానిని ఉన్నట్లుగా(యధాతధంగా) చూడగలిగితే అదే స్థితప్రజ్ఞత.

ఏది ఎలా ఉండాలో అది అలానే ఉంటుంది....
ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకోవడమే
అన్ని ఘర్షణలకు మూలం.

సృష్టిలో ప్రతీది సహజంగా, పూర్ణంగా ఉన్నది.
మార్పు తేవలసిన అవసరం ఎప్పుడూ ఎక్కడా లేదు. అంతా సహజంగా ఉంది...అంటారు గురువుగారు.

తీర్పుతీర్చకుడి...అన్న క్రీస్తు వాక్యం నాకు చాలా ఇష్టం...

అనవసరమైన విషయాల్లో involve అయిపోవడం...

యెదుటవాడు అడక్కపోయినా ఉచిత సలహాలిచ్చేయడం...

ఇతరుల గొడవల్లో తలదూర్చి తీర్పు చెప్పడం...

వాడు అలాంటివాడు, వీడు ఇలాంటివాడు అంటూ తటాలున statements ఇచ్చేయడం...

ఇవన్నీ బ్యాటరీని(ఆత్మశక్తిని) Waste చేసుకునే పనులే...

అనవసరమైన తలంపు కలిగినా,
అనవసరమైన మాట పలికినా...

వెంటనే బ్యాటరీ వేస్ట్ చేసుకోకు, బ్యాటరీ వేస్ట్ చేసుకోకు...అనుకుంటూ తనను తాను తమాయించుకోవాలి(control చేసుకోవాలి).

ఇలా అనుకుంటూ ఉంటే,
అవసరమైనప్పుడు తప్ప అనవసర విషయాలకంతా మనసు, వాక్కు వ్యక్తం కావు...
స్వస్థానంలో అవి హాయిగా ఉంటాయి...

అలా వాక్కు, మనసులను వీలైనంతవరకు వాటి స్వస్థానంలో ఉంచగలిగేటట్లు జీవించగలిగే
టెక్నిక్ నే "కర్మసుకౌశలం" అన్నారు గీతలో కృష్ణభగవానులు.

నీళ్లలో పడవ ఉండొచ్చు పడవలో నీళ్లు ఉండకూడదు...అన్నారు రామకృష్ణులు.

మనం విషయాల్లో ఉన్నా
మనలో విషయాలు ఉండకూడదు.

లోపల "ఖాళీ"గా ఉండాలి...

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

Tuesday, May 3, 2022

మంచిమాట.

మంచిమాట.

ఎవరైనా అన్యాయంగా ..
ఎవరి మీదైనా, చెడ్డు ఆరోపణలు, నిందలు, వేసినంత మాత్రానా, వారి జీవితంతో చెడ్డు అయిపోతుంది, జరుగుతుంది, అనుకోవడం పొరపాటు, మరియు నిందలు వేసిన వారికి కూడా, మనం వారికి ఏమీ చేయనవసరం లేదు ..

ప్రశాంతంగా ఉన్న ..
జీవితమనే కొలనులో ఎవరైనా, అన్యాయంగా అబద్దాలతో, నిందలనే రాయిని వేసినప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు, కేవలం ఆ సమయంలో, అప్పుడు మాత్రమే, అక్కడి ఉన్న ఆ నీటి ప్రశాంతతను, ఆ రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు ..

కానీ, కాసేపు తరువాత, నీరు తేరుకుని నిర్మలంగా, శుభ్రంగా, స్వేచ్ఛంగా, ప్రశాంతంగా కనబడుతుంది, ఉంటుంది కూడా ..

కానీ,

నిందలు వేసినవారు, అందరి దృష్టిలో, మనస్సులో, ఆ రాయిలా, ఆ నీటి కొలనులో శాశ్వతంగా ఎప్పటికీ అడుగునే ఉండిపోతారు, అందుకే, మీరు ఎవరిపైన ఆనోసరంగా లేని పోని ఆరోపణలు, నిందలు వేయడానికి ఇష్టపడకండి, మంచిది కూడా కాదని గ్రహించండి ..

శుభ మధ్యాహ్నం తో మానస సరోవరం 👏

సేకరణ

ఆణిముత్యాలు.

ఆణిముత్యాలు.
🌹ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి.
🌹 సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నారా అని అడగండి.
🌹 పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మాట్లాడండి.
🌹 పోయాక ప్రేమాభిమానాలు కాకుండా జీవించి ఉన్నప్పుడే నేనున్నాను అని భరోసా ఇవ్వండి
🌹అప్పుడే స్నేహ బంధం నిలుస్తుంది.
🌹 అర్థం లేని వాగుడు కన్నా అర్థవంతమైన మౌనం మిన్న.
🌹 ఆచరణలో పెట్టని ఆలోచనలు అర్థం లేనివి.
🌹 ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అర్థవంతమైనవి .

🌹 సమయం మరియు స్నేహం ఉచితంగానే లభ్యమవుతాయి.
🌹 కానీ వాటి సరైన విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకి తెలుస్తుంది .
🌹 లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలివ్వడం.
🌹 ఒక్కటి అడిగితే వెయ్యి చెబుతారు.
🌹 అన్నింటి కంటే కష్టమైనది సహాయం చేయడం.
🌹 వెయ్యిమందిని అడిగితే ఒక్కరు చేస్తారు

🌹 తప్పు చేయని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు.
🌹 తను చేసిన తప్పును సమర్థించుకునే వారు మూర్ఖులు
🌹 ఇతరుల తప్పును వేలు ఎత్తి చూపే వారు అత్యంత మూర్ఖులు
🌹చేసిన తప్పును సరిదిద్దుకునే వారు ఉత్తములు
🌹 ఏ కాలంలో అయిన మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదు అనే దైర్యం అయినా ఉండాలి.
🌹 లేదా ఏమైనా అవ్వని అనే తెగింపు అయినా ఉండాలి .

‌‌ 🌹 గొప్ప తనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు
🌹మన మాటల వల్ల కానీ చేతుల వల్ల కానీ ఎవరిని బాధపెట్టకుండా బతకగలిగితే మనం గొప్పవాళ్ళమే
🌹 ప్రతీ దానిగురించి తీవ్రంగా ఆలోచించి అయాసపడటం తప్ప శాంతంగా ఉండటం ఆలోచించడటం మొదలు పట్టండి.
🌹 ఆరోగ్యంగా శక్తివంతంగా వుంటారు .
✍️
🌹🌹🌹🌹🌹
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి.
మీ మానస సరోవరం 👏

సేకరణ

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

🍃🌷స్వచ్ఛత లేని స్నేహాలకు
విలువ ఇవ్వని బంధాలకు
అబద్ధాలాడే అనుబంధాలకు
మౌనంగా దూరం కావడమే మంచి మార్గం..

🍃🌷ఏదోలా బతకడం కాదు
బ్రతుకులో బాధ్యత ఉండాలి ..
ఆత్మీయత ఉండాలి.
ఆలోచన ఉండాలి.
ఆనందం ఉండాలి..

🍃🌷జీవితంలో పోరాడి గెలవలేని బలహీనులు రాజీ పడతారు..
గెలుస్తామనే నమ్మకం ఉన్న బలవంతులు యుద్ధం చేస్తారు..
బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం..

🍃🌷నిజాయితీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు..

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

దైవ ఆశీర్వాదం ఎప్పుడు తోడవుతుంది?

నేటి జీవిత సత్యం.

అన్ని కాయలూ పళ్లవుతాయా? కావు. గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. అవన్నీ కాయలై, పళ్లయితే ఎంత పంట? అలా పండదు. అలా జరగదు. మతి ఎంతో గతి అంతే అంటారు. మనదైనది మనకు వస్తుంది. మనది కానిది మనకు రాదు. ఇలాంటి కర్మ సిద్ధాంతం మన నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. దీన్ని కొంతమంది ఒప్పుకోరు.దైవ ఆశీర్వాదం అందరికీ సమానమే. ఏ జీవికైనా సరే, అందులో తేడాలు ఉండవు. కొందరికి ఆ ఆశీర్వాదం వెంటనే ఫలిస్తుంది. కొందరికి ఫలించదు. కారణం దైవంలో లేదు. మనలో ఉంది. పాకం శుద్ధిగానే ఉంది. భాండం శుద్ధిగా లేదు! ఇచ్చేవాడు ఆలోచించకుండా ఇస్తున్నాడు. పుచ్చుకొనేవాడిలోనే ఎన్నో ఆలోచనలు. ఇవే ఆశీర్వాదాన్ని అడ్డగిస్తున్నాయి. అర్హత-యోగ్యత మనల్ని ఈ భూమి మీద ఉంచాయి. ఇక్కడ ఎవరి పని వారికుంది. ఖాళీగా ఎవరూ ఉండే ఏర్పాటు లేదు. ఎవరివంతు పాత్రను వాళ్లు చక్కగా పోషించాలి. ఒక పెద్ద యంత్రంలో అతి చిన్న మరకు సైతం ప్రాధాన్యం ఉంటుంది. ప్రపంచం పని ప్రపంచం చేస్తుంది. మన పని మనం చెయ్యాలి. అది అలా ఉండకూడదు, ఇది ఇలా ఉండాలి అని గీతలు గీసి వేలు పెట్టకూడదు. అనవసరంగా నెత్తిమీదకు తెచ్చుకోకూడదు.మన పనిలో మనం లీనమైతే, మన యోగ్యత మన అర్హతను వెలుగులోకి తెస్తుంది. దైవ ఆశీర్వాదం పని చేయడం ప్రారంభిస్తుంది. ఊహించని శుభాలు కలుగుతాయి. అర్థంకాని అదృష్టం మన వెంట పడుతుంది. ఇది ఆశీర్వాద ఫలం. కనిపించకుండా పని చేసే గొప్ప భావమే ఆశీర్వాదం.శ్రీకృష్ణుడి ఆశీర్వాదం వల్ల పాండవులను విజయలక్ష్మి వరించింది. శ్రీరాముడి ఆశీర్వాదం వల్ల హనుమంతుడు లంకను చేరుకొని సీతమ్మ జాడ తెలుసుకోగలిగాడు. ఈ ఆశీర్వాదం అందరికీ ఒకేలా ఫలితాలను ఇవ్వదని కొందరి భావన.సారవంతమైన భూమిలో నాటిన విత్తు తప్పక ఫలిస్తుంది. సందేహం లేదు.ఆశీర్వాద బలం ఫలాన్ని ఇస్తుంది. మట్టి సారవంతమైనది కాకపోయినా మట్టికి బలాన్ని, మంచి విత్తనాన్ని రెండూ అదే ఇస్తుంది. అదే మహానుభావుల ఆశీర్వాద ఫలం. ఒక పని మనం చేపట్టినప్పుడు చాలా శక్తులు అవసరమవుతాయి విజయం సాధించడానికి- కనిపించేవి కొన్ని, కనపడనివి కొన్ని. వాటిలో మన పని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకట్ట వేసేవీ ఉంటాయి. వాటిని తొలగించేది ఆశీర్వాద బలం. మంచి మనుషులు మనకు మంచి జరగాలని, విజయం సాధించాలని కోరుకుంటారు. ఆప్తులు మనకు సహాయం చేస్తారు. దేవతలు ఆశీర్వదిస్తారు.పనికి ముందే మనం ఆశీర్వాదం సంపాదించుకోవాలి. అప్పుడు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది, ఏం చెయ్యాలి? మంచి పనులు చేసేవారు ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయనక్కరలేదు. లోక హితం కోసం చేసే పనుల కోసం దేవతలే మనుషుల రూపంలో వచ్చి సహాయం చేస్తారంటారు. గొప్ప పనులు చేసేవారికి ఆశీర్వాద వర్షం కురుస్తుంది. చెడ్డ పనులు చేసేవాళ్లు దేవతలను పూజించినా, ఆ పూజలు ఫలించవు. ఆశీర్వాదం లభించదు. మన కర్మల్లో గుణ విశేషాలను బట్టే ఆశీర్వాద శక్తి మనకు అండగా ఉండి నడిపిస్తుంది. పుణ్య పురుషులకు… ఎండలో నడిచే మనిషికి పట్టే గొడుగులా ఆశీర్వాదం వెంట ఉంటుంది. సందేహం లేదు!కళ్లకు దేవతలు కనిపించరు. మన పనులు ఫలించే విధానాన్ని బట్టి వాళ్ల ఆశీర్వాదం ఎంతగా పని చేస్తుందో అర్థమవుతుంది. నమ్మేవాళ్లు నమ్ముతారు. నమ్మనివాళ్లు మంచి పనులు చేసినా, దైవ ఆశీర్వాదం తోడవుతుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

ఆశ్రయ దోషం

🌹 ఆశ్రయ దోషం 🌹

🥀మహాభారత యుద్ధం ముగిసింది. ధర్మరాజు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు.

🥀భీష్ముడు ప్రాణాలు విడువడానికి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ యుద్ధభూమిలో అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ధర్మరాజు, శ్రీకృష్ణుని అనుజ్ఞతో తన తమ్ములతోనూ, ద్రౌపదితోనూ భీష్మపితామహుణ్ణి చూడటానికి కురుక్షేత్రానికి వెళ్ళాడు.

🥀పాండవులు, ద్రౌపది ధర్మాత్ముడైన భీష్మునికి పరమ పాదాభివందనాలు చేశారు. తరువాత ధర్మరాజు ఆయనను వర్ణాశ్రమాలు, పౌరుల కర్తవ్యాలు, రాజు విధులు వంటి ముఖ్యమైన విషయాల గురించిన అనేక ప్రశ్నలు అడిగాడు. భీష్ముడు ఆ ప్రశ్నలన్నింటికీ సముచిత జవాబులు ఇవ్వసాగాడు.

🥀ఈ విధంగా భీష్ముడు, ధర్మజునికి ధర్మోపదేశం చేస్తూన్నప్పుడు హఠాత్తుగా ద్రౌపది ఫక్కున నవ్వింది.

🥀ఆ నవ్వు శబ్దం విన్న భీష్ముడు ధర్మోపదేశాన్ని సగంలో ఆపివేసి, ద్రౌపదిని చూస్తూ, "పౌత్రీ! ఎందుకమ్మా నవ్వావు?" అని అడిగాడు.

🥀ద్రౌపది ఆ మాటకు ఎంతో సిగ్గుపడిపోయింది. తల దించుకొని, "నన్ను క్షమించండి, పితామహా! ఏదో అజ్ఞానంలో నవ్వేశాను. తప్పు చేశాను, మన్నించండి" అంది.

🥀పితామహుడు ఆ జవాబు విని తృప్తి చెందలేదు. ఆయన ఇలా కొనసాగించాడు. "తల్లీ! ఏ కులస్తీ కూడా పెద్దల సమక్షంలో ఎన్నడూ నవ్వదు. ఉత్తమురాండ్రలో సర్వోత్కృష్ట అయిన నీ వంటి కులాంగన ఏ కారణం లేకుండా పలువురి సమక్షంలో ససేమిరా నవ్వదు. నువ్వు సుగుణాలరాశివి, మహాపతివ్రతవు. అటువంటి నీకు కారణరహితంగా నవ్వు వచ్చి ఉండదు. కాబట్టి నిస్సంకోచంగా నువ్వు నవ్వినందుకు కారణం ఏమిటో చెప్పు.”

🥀పితామహుని మాటలు విన్న ద్రౌపది కళ్ళు అర్ధమయ్యాయి. చేతులు జోడించి భీష్మునికి నమస్కరిస్తూ ఆమె, “పితామహా! అది చాలా చిన్న విషయం. అయినప్పటికీ మీరు అడిగారు కనుక నేను చెప్పకు తప్పదు. నేను చెప్పింది విన్న తరువాత దయచేసి నా పట్ల కోపం వహించకండి.

🥀“మహానుభావా! మీరు ఇప్పుడు ఇంతలేసి ధర్మోపదేశాలు చేస్తున్నారు. హఠాత్తుగా నాకు ఒక సంఘటన జ్ఞప్తికి వచ్చింది. ఈనాడు ధర్మానికి ఇంత విపులంగా వివరణ ఇస్తున్న ఇదే పితామహుడు, కౌరవ సభలో నాడు దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేస్తూ నా మానానికి భంగం కలిగింప విశ్వప్రయత్నం చేస్తున్నప్పుడు నోరు మెదపకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారే! ఆ సమయంలో, ఇప్పుడు ఇంతగా ధర్మోపదేశం చేస్తున్న భీష్మాచార్యులవారు ఈ జ్ఞానాన్నంతా ఎక్కడ విడిచిపెట్టేశారు? లేదా ఒకవేళ ఈయన ఈ ధర్మాచరణ జ్ఞానాన్ని ఆ తరువాత సంతరించుకొన్నారని అనుకోవచ్చునా! ఇది తలచుకోగానే నాకు ఫక్కువం నవ్వు వచ్చింది. నన్ను మనసారా క్షమించండి" అంది.

🥀అంతా విని పితామహుడు ప్రశాంతంగా ఇలా జవాబిచ్చాడు. "అమ్మా, ద్రౌపదీ! నీ ప్రశ్న చాలా న్యాయసమ్మతమైనది. దీన్లో నిన్ను నేను క్షమించడానికి ఏం ఉంది? కౌరవ సభలో నేను ఆసీనుడనై ఉన్న ఆ సమయంలో ధర్మాచరణ జ్ఞానం నాకు లేకపోలేదు. కాని దుష్టుడైన దుర్యోధనుని ఉప్పు (ఆహారం) నేనప్పుడు తింటున్నాను. ఫలితంగా నేను ఆశ్రయ దోషానికి గురి అయ్యాను. ఆ కారణంగా నా జ్ఞానం మసకబారి మంచి చెడుల తారతమ్యం గురించి యోచించే శక్తిని కోల్పోయింది. దుష్టులు సమర్పించే ఆహారాన్ని తింటే, తిన్న వారి మనస్సూ శరీరమూ దౌష్ట్యాన్ని సంక్రమింప జేసుకొంటాయని శాస్త్రాలు వచిస్తున్నాయి.

🥀కాని ఇప్పుడు యుద్ధంలో అర్జునుడు నాపై ప్రయోగించిన బాణాలచే నా దేహంలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేసింది. దుష్టులు పెట్టిన ఆహారం తినడంతో ఏర్పడ్డ రక్తం ఒక్క చుక్క కూడా శరీరంలో లేకుండా బయటకు వచ్చేయడంతో బుద్ధి స్పష్టతను సంతరించుకొంది. కాబట్టి ఇప్పుడు ఈ మేరకు ధర్మతత్త్వాలను సునిశితంగా విడమరిచి చెప్పగలుగుతున్నాను.”


🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒

సేకరణ

మే నెల 3 వ తేదీ మంగళ వారము అక్షయతృతీయ రోజున బంగారం తప్పక కొనాలా? నిజమైన అక్షయము??? అక్షయతృతీయ అంటే ఏమిటి? వివరణ?

మే నెల 3 వ తేదీ
మంగళ వారము అక్షయతృతీయ రోజున
బంగారం తప్పక కొనాలా?
నిజమైన అక్షయము???
అక్షయతృతీయ
అంటే ఏమిటి?వివరణ?
👇

👉ఈ రోజునే
సింహాచల
వరాహ నరసింహ
స్వామి వారి చందనోత్సవం.

👉అదే రోజున
పరశురామ జయంతి .

మరిన్ని అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత

1. పరశురాముని
జన్మదినం

2. పవిత్ర గంగా నది
భూమిని తాకిన
పర్వదినం

3. త్రేతాయుగం
మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు
తన బాల్యమిత్రుడైన
కుచేలుని కలుసుకొన్న
దినం

5. వ్యాస మహర్షి
“మహా భారతము”ను,
వినాయకుని
సహాయముతో,
వ్రాయడం
మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు
అజ్ఞాతవాసములో
వున్న పాండవులకు
అక్షయ పాత్ర
ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి
కుబేరుడు
శ్రీమహాలక్ష్మితో
సమస్త సంపదలకు
సంరక్షకునిగా
నియమింపబడిన దినం

8. ఆదిశంకరులు
“కనకధారాస్తవం” ను
చెప్పిన దినం

9. అన్నపూర్ణా దేవి
తన అవతారాన్ని
స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు
దుశ్శాసనుని
బారినుండి
కాపాడిన దినం.

అక్షయ తృతీయ రోజున బంగారం తప్పక కొనాలా?

అక్షయ తృతీయ అంటేనే
నేటికాలంలో
బంగారం, వెండి లేదా
ఇతర ఏదేని విలువైన
వస్తువులు కొనడం
అనేది ప్రచారంలో ఉంది.
ఈ రోజున కొన్నది
అక్షయం అవుతుందని
చెప్పిన వ్యాపార ప్రచారాన్ని
వాస్తవంగా నమ్మి వాటిని
కొనుగోలు చేయడం
ఆనవాయితీగా మారింది.

అసలు అటువంటివి
కొనాలని అనుకుని
డబ్బు లేకున్నా
అప్పు చేసో,
తప్పు చేసో కొంటే,
కొన్న బంగారం అక్షయం
అవడం అటుంచి
చేసిన అప్పులు, తప్పులు
తత్సంబంధ పాపాలు
అక్షయం అవుతాయని
శాస్త్రాలు వివరిస్తున్నాయి.

అసలు ఈ రోజున బంగారం కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు

👉ఇది కేవలం
వ్యాపార జిమ్మిక్ మాత్రమే.

అక్షయ తృతీయ నాడు,
మనం చేపట్టిన
ఏ కార్య ఫలమైనా,
[ అది పుణ్యం కావచ్చు;
లేదా పాపం కావచ్చు.]
అక్షయంగా, నిరంతరం,
జన్మలతో సంబంధం
లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది.

పుణ్య కర్మలన్నీ
విహితమైనవే.

అందునా, ఆ రోజు
ఓ కొత్త కుండలో గానీ,
కూజాలో గానీ, మంచి నీరు పోసి,దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి
దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు.

అతిధులకు,
అభ్యాగతులకు,
పెరుగన్నంతో కూడిన
భోజనం సమర్పిస్తే,
ఏ రోజూ ఆకలితో
మనం అలమటించవలసిన
రోజు రాదు.

👉వస్త్రదానం వల్ల
తదనుగుణ
ఫలితం లభిస్తుంది.

👉అర్హులకు స్వయంపాకం,
దక్షిణ, తాంబూలాదులు
సమర్పించుకుంటే,
మన ఉత్తర జన్మలలో,
వాటికి లోటు రాదు.

👉గొడుగులు,
👉చెప్పులు,
👉విసన కర్రల లాటివి
దానం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం.

ఓ సారి పరిశీలిస్తే,
భాగవతం
ప్రధమ స్కంధం ప్రకారం,
పరీక్షిన్మహా రాజు
కలి పురుషుడికి
ఐదు నివాస స్థానాలను
కేటాయించాడు.
అవి: 👇

1)జూదం,
2)మద్య పానం,
3)స్త్రీలు,
4)ప్రాణి వధ,
5)బంగారం.

వీటితో పాటు
కలి కి లభించినవి

👉 ఇంకో ఐదు*👈

1)అసత్యం,
2)గర్వం,
3)కామం,
4)హింస,
5)వైరం.

జాగ్రత్తగా పరిశీలిస్తే,
ఆ పైన ఉన్న ఐదిటికీ
ఇవి అనుషంగికాలు.

ఆ పై ఐదిటినీ
ఇవి నీడలా
వెన్నంటే ఉంటాయి.

అక్షయ తృతీయ రోజు
ఎవరైనా,
ఈ ఐదిటిలో
దేని జోలికి వెళ్ళినా,
కలి పురుషుడి
దుష్ప్రభావం
అక్షయంగా
వెంటాడుతూనే ఉంటుంది.

సేకరణ

Monday, May 2, 2022

ఇంత పెద్ద జీవితములో చిన్న కష్టాన్ని మనం ఓర్చుకోలేమా?

నేటి మంచిమాట.

శుభ్రంగా కాళ్ళూ, చేతులూ కడుక్కుని భోజనానికి కూర్చుంటాం.

మన అమ్మో, ఇల్లాలో మన కంచములో వేడి వేడి అన్నం వడ్డిస్తుంది.

అందులోకి ముద్దపప్పును వేస్తుంది.
ఘుమఘుమలాడే నెయ్యిని చెంచాతో పోస్తుంది.

అంచుకు నోరూరించే ఆవకాయ.

మన ఆకలి రెట్టింపవుతుంది.
ఆత్రంగా దండయాత్ర మొదలుపెడతాం.

ఒక్కో ముద్ద లోనికి దిగుతుంటే, జీవుడు సంతోషంగా గంతులేస్తాడు.

ఆహాహా!...ఏమి మన భాగ్యము!.....

ఇంతలో కఠక్ మని శబ్దం.
పంటి కింద రాయి !!

అంతకు ముందటి దృశ్యం చెల్లాచెదరవుతుంది.

ముఖం రంగులు మారుతుంది.

కోపం నషాళానికి అంటుతుంది.

ఈ రాయి ఎక్కడిది?
బియ్యం లోదా?
పప్పులోదా?

మిల్లులోదా?
ప్లేటు శుభ్రంగా కడగకనా?

ఇల్లు సరిగ్గా ఊడవకనా?

దాని గురించి జుట్టు పీక్కుంటాం !!

తిండి సంగతి మరిచిపోతాం.
వండినవాళ్ళ శ్రమను మరిచిపోతాం.

వడ్డించినవాళ్ళ ప్రేమను మరిచిపోతాం.

ఆ ముద్ద మన నోటికి అందేవరకు జరిగిన గొప్ప విషయాలేమీ మనం గుర్తుంచుకోం.

ఆ ఒక్క రాయి మీదే మన దృష్టంతా.

చిన్న కారణానికి మంచి సంబంధం పాడుచేసుకుంటాం.

జీవితం కూడా అన్నం ముద్ద లాంటిదే!

భగవంతుడు మనకు ఈ జీవితమనే అన్నపు ముద్దను ప్రసాదించాడు.

అందులో రాయి ఏమిటి?... చిన్న కష్టం.

అది రాగానే ప్లేటును పక్కన పడేసినట్టుగా,

జీవితాన్ని పక్కన పెట్టేస్తాం. జీవించడం మానేస్తాం.

ఇంత పెద్ద జీవితములో చిన్న కష్టాన్ని మనం ఓర్చుకోలేమా?

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

వివేకం-విచక్షణ

నేటి జీవిత సత్యం.
వివేకం-విచక్షణ

ఏ విషయంలోనైనా సరే నిజం ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాలి. మనది పోయేదేముందని ఎలాపడితే అలా మాట్లాడకూడదు. చిక్కులు కొనితెచ్చుకోకూడదు. అందుకు వివేకం ఎంతో అవసరం. వివేకం పుస్తక పాండిత్యం కాదు. అది దైవదత్త వరం. మనిషిని ఆపదల్లో చిక్కుకోకుండా తెలివితేటలతో బయటికి చేరుకొనేలా చేసి చక్కటి దారిచూపే దిక్సూచి.
అవివేకం మూర్ఖతకు నెలవు. ఆపదలకు నిలయం. వివేకం- అవివేకం బద్ధశత్రువులు. అవివేకానికి వివేకం అంటే ససేమిరా పడదు. ఒకటి ఉప్పు. మరొకటి నిప్పు. మనిషికి వివేకం తోడైననాడు ఎంతటి కష్టతర కార్యమైనా నిరాటంకంగా ముందుకు సాగిపోతుంది. నిర్విఘ్నంగా నెరవేరుతుంది. వివేకం లోపిస్తే పండితులు సైతం పరమశుంఠలుగా ప్రవర్తించే అవకాశం ఉంది. వివేకం వివేచనకు అంకురం. బుద్ధి కుశలతతో చేపట్టిన ప్రతికార్యంలో తెలివి పనిచేయడం ప్రారంభమవుతుంది.
పరీక్షించి చూసేవరకు పరులను నమ్మవద్దని చెబుతుంది వివేకం. అపనమ్మకాన్ని ఆమడదూరాన ఉంచమంటుంది. ఒంటె కష్టాన్ని, వేడిని, ఆకలిని, దాహాన్ని ఓర్చుకొని ఇసుక ఎడారుల్లో బరువులను మోసుకుపోతూ ఉంటుంది. అలాగే వివేకం కష్టాల కడలిని సులభంగా దాటిస్తుంది. అవివేకం మనిషిని వెర్రివాణ్ని చేసి అపహాస్యంపాలు చేస్తుంది. వివేకం ఆశాభావాన్ని రేకెత్తించి భుజం తట్టి వ్యక్తిని కార్యోన్ముఖుణ్ని చేస్తుంది. అతడికున్న చాపల్యాన్ని అరికడుతుంది. అవివేకి దానికి వశుడై నష్టపోతాడు.
అతిని మితం గావించుకునే వివేకం మనిషికి నిరంతరం అవసరమే. లక్ష్యాలు, ఆశయాలు దీనితోనే సాకారం అవుతాయి. సాధారణ మనిషిని సైతం ఓ ఉన్నతస్థానంలో కూచుండబెట్టేందుకు వివేకం ఎంతగానో ఉపకరిస్తుంది.
లంకాధిపతి రావణుడు అహంకారంతో సీతను అపహరించుకొని వచ్చాడు. నిద్రనుంచి మేల్కొన్న కుంభకర్ణుడికి విషయం తెలిసింది. ‘అన్నా అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడి సతీమణిని అపహరించుకొని రావడంతో నీ అవివేకాన్ని నిరూపించుకొన్నట్లయింది. మళ్లీ ఆమెను రామచంద్రుడి వద్దకు చేర్చి క్షమాపణ కోరుకో. నీకు మేలు జరుగుతుంది’ అంటూ హితవచనం చెప్పాడు. రావణుడు తమ్ముడి మాటల్ని తోసిపుచ్చాడు. చివరికి రాముడి చేతిలోనే హతమయ్యాడు.
అవివేకం వల్ల తొందరపాటుతనం అధికమవుతుంది
ఆపదల్ని కొనితెచ్చుకొన్నట్లవుతుంది అనే హితవచనం చెబుతాడు మహాకవి భారవి తన కిరాతార్జునీయ కావ్యంలో. కర్తవ్యం అనే విత్తనాలను వివేకం అనే నీటితో తడిపి చల్లినట్లయితే ఆ క్రియ శరత్కాలపంటలా సత్ఫలితాలను సంపాదించి పెడుతుంది. వివేకం కలిగించే విచక్షణే దీనిక్కారణం. వివేకవంతుడు సన్నిహితుల మాటల్లోని మంచి చెడులను, మాయమర్మాలను తనకు తానుగా తెలుసుకుంటాడు. సరైన నిర్ణయం తీసుకొంటాడు. ప్రతీది పరిశీలనాత్మకంగా చూసుకొంటూ జాగ్రత్తగా ముందుకెళ్లేవాడి భవిష్యత్తు బంగారుమయమే. కుతంత్రపు పరీక్షలకు లొంగిపోయి చేసే ఆలోచనలతో వివేకం ఉద్భవించదు. వ్యక్తిలో వివేకం ఉదయిస్తే కలతలు, కలహాలకు చోటుండదు. మనసును, హృదయాన్ని భారంగా కుంగదీసే మౌఢ్యాలను, మూర్ఖతలను వదిలిపెట్టి మనిషి ముందుకెళ్లాలి. వివేకంతో జీవితం మకరందమయం అవుతుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

Sunday, May 1, 2022

భార్య-ఓ కథ

నా గుండెను హత్తుకున్న కథ ,దయచేసి అందరూ తప్పగా చదవగలరు . భార్య అంటే బానిస కాదు ,తల్లి,చెల్లి స్థానం కంటే గొప్ప పుణ్యాత్మురాలు .

♦️భార్య-ఓ కథ♦️👇:

▪️నా భార్య చనిపోయి ఇప్పటికీ నాలుగురోజులు గడిచిపోయాయి..
తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు..

▪️చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాము...
తను నాతో పాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను..

▪️ప్రతి విషయానికి 'ఏమండీ'...... అనే పిలుపుకు నేను దూరమయ్యాను..

▪️నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు..

▪️ ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు..

▪️ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది...

▪️నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు.. వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే స్వార్థం నాలో ఉండేది..

▪️సెలవు దినాలలో నేను మరియు పిల్లలు టివి చూస్తూ ఆనందిస్తుంటే, తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది..

▪️ఎప్పుడైనా మాతో పాటు టివి చూడటానికి కూర్చుంటే 'అమ్మా... నీళ్లు,
'అమ్మా... తినడానికి ఏమైనా తీసుకురా'.., 'కొంచెం కాఫీ పెట్టవోయ్' అంటూ .. తనని మళ్లీ వంటింట్లోకి పంపించేవాళ్ళం...

▪️ నేను అడగకుండానే అర్థం చేసుకుని నా అన్ని పనులు చేసి పెట్టేది..

▪️ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లకు మరియు కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని మరవలేకపోతున్నాను..

▪️ తన ఇష్టాలను సహితం నేను గుర్తించలేకపోయాను.. సినిమాలకు గానీ షికారులకు గానీ తీసుకువెళ్ళ లేకపోయాను.. తను కూడా ఎప్పుడూ అడిగింది లేదు..

▪️ఆఫీసు నుండి లేటుగా వచ్చినపుడు 'ఎందుకు లేటయ్యింది' అనే తన ప్రశ్నకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని..

▪️ ఏమండీ... పాలవాడికి డబ్బులు..,
పేపర్ వాడికి డబ్బులు.., కరెంట్ బిల్లు.., పిల్లల ఫీజులు కట్టే విషయం మరీ మరీ గుర్తుచేసేది..

▪️ చివరకు నాకు సంబంధించిన బిపి మాత్రలు, షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకొండని మరీ మరీ గుర్తుచేసేది.. ఇప్పుడు అవన్నీ గుర్తుచేయడానికి తనులేదు..

▪️ తన గురించి ఎప్పుడూ, ఏది కావాలని నోరు తెరచి అడిగింది లేదు..

▪️రాత్రి పని అంతా ముగించుకుని నా పక్కన పడుకున్నప్పుడు..
ఏమండీ... ఎదలో నొప్పిగా ఉంది .,నడుము నొప్పిగా ఉంది.., కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల అని చెప్పి -అటు తిరిగి పడుకునేవాడిని..

▪️ చివరికీ ఆ ఎద నొప్పి హార్ట్ ఎటాక్ రూపంలో వచ్చి తనను తీసుకు వెళ్లేవరకు నేను గుర్తించలేకపోయాను..

▪️ఇంట్లో అంతా కొత్త.. వంటింట్లో ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి.. ఉదయం నుండి తిన్న ప్లేట్లు, పాత్రలు అన్నీ సింక్ నిండా అలాగే పడిఉన్నాయి..

▪️పిల్లలు ఏది పట్టనట్లు తమ తమ మొబైల్స్ తో బిజీగా గడుపుతున్నారు..

▪️తను ఉన్నన్నీ రోజులు అన్ని సులభంగా అయ్యే పనులు.., ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి..

▪️ పిల్లలు తమకు కావాల్సిన నూడుల్స్ తిని ఖాళీ పాకెట్స్ కూడా సింక్ లో పడేసారు..

▪️ అన్ని పాత్రలు కడిగేసి.. ఫ్రిడ్జ్ లో ఉన్న ఆపిల్ పండు తినేసి పడుకుందామని భారంగా బెడ్రూం వైపు నడిచాను..

▪️లైట్ ఆఫ్ చేసి పడుకుందామనేలోపు గోడ మీద వేలాడుతున్న తన భావ చిత్రాన్ని చూసి తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చాయి..

▪️తనను నిర్లక్ష్యము చేయకుంటే నేను, నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళం అని తలచుకుంటూ భారంగా కళ్ళుమూసాను...



కన్నులు ఉన్నప్పుడే వాటి విలువ తెలిసేది.. కన్నుల దృష్టి తగ్గిన తర్వాత వాటి విలువ తెలిసి కూడా ప్రయోజనం ఉండదు.. ఇది జీవిత సత్యం.

▪️అందుకే : "ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ, తిన్నది పుష్టి ఆలమందకున్" - అని చెప్పించారు తిరుపతి వేంకట కవులు - అర్జునుడితో.

▪️ఆడది లేని యిల్లు : వట్టి పోయిన ఆవులా, వడ్ల గింజలు లేని వరి కంకుల్లా, నీళ్లు లేని దిగుడు బావిలా, చంద్రుడు లేని పున్నమి లా, సంతానం లేని సౌందర్యవతి లా, వాసన లేని పువ్వు లా, మగతనం లేని యువకుడిలా, విగ్రహం లేని గుడిలా, ఉప్పులేని శాకం లా, పండితులులేని పల్లె టూరు లా, గుణవంతుడు గాని కుమారుడులా, సదభ్యాసము లేని విద్యలా, జీతం లేని ఉద్యోగం లా, అడవి గాచిన వెన్నెల లా, డబ్బులు లేని బ్యాంకు అకౌంట్ లా, దీపం లేని యిల్లు లా -
వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఆ లోటు పూడ్చలేము

ఇంటికి 🪔ఇల్లాలు

🙏🙏🙏🙏🙏.
🌼🌼
Forwarding Good Msg
Recd.from Other Group
🌼🌼

🌼🏵Jatoth RameshNaik Rathod 🏵🌼
+919441681187
👍🌹💕💞♥️❤️👍🌹🌹

సేకరణ

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

ఎవరైనా మీ మాట నమ్మకపోతే
ఒట్టు వేసి నమ్మించడానికి అస్సలు
ప్రయత్నించకండి......

మన మీదే నమ్మకం లేనప్పుడు
ఇతరులపై ఒట్టు వేస్తే నమ్ముతారా....

నమ్మకం లేని చోట ఒట్టు కూడా
నమ్మకాన్ని కలిగించదు.......!!


🌹 ఓటమి అంటే
అవమానం కాదు...

మనల్ని మనం తెలుసుకునే
గొప్ప అవకాశం......!!

🌹 మోసం చేసేవారిది
తప్పు కాదు...

ఎందుకంటే వారి పనే అది...
మోసపోయేంతలా నమ్మడం
మన తప్పు.....!!

🌹 ఎదుటి వ్యక్తి నీపై నేరుగా
గెలిచే దమ్ము లేనప్పుడే

నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం
మొదలుపెడతాడు....!!

🌹 కొన్నిసార్లు..... నీకు నువ్వే
భుజం తట్టుకోవాలి....,

ఎందుకంటే .....తట్టేవారి కంటే
నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో.....!!

కొన్నిసార్లు......
నీకు నువ్వే నవ్వించుకోవాలి,

ఎందుకంటే.... నవ్వించేవారి కంటే
నవ్వులపాలు చేసేవారు
ఎక్కువ ఈ లోకంలో......!!

🌹 తప్పు ఇతరులదైతే....
జడ్జిలా తీర్పిస్తాం......

తప్పు మనదైతే....
లాయర్ లా వాదిస్తాం......!!


🌹 మూర్ఖునితో వాదన...బోర్లించిన
కుండపై నీళ్ళు పోసినట్లే....
*🌅శుభోదయం...తో మానస సరోవరం 👏

సేకరణ

ప్రతి రోజూ లేవగానే మనిషి దేనికోసమో తాపత్రయపడుతుంటాడు. అసలు తాపత్రయం అంటే ఏమిటి? ఎందుకు అతనలా తాపత్రయపడుతుంటాడు?

నేటి జీవిత సత్యం.

ప్రతి రోజూ లేవగానే మనిషి దేనికోసమో తాపత్రయపడుతుంటాడు. అసలు తాపత్రయం అంటే ఏమిటి? ఎందుకు అతనలా తాపత్రయపడుతుంటాడు?


మనిషి తాపత్రయాలకు అంతు ఉండదు. ఆ తాపత్రయంతోనే జీవితంలో పరుగులు పెడుతుంటారు.

ఈ వయసులో కూడా కొడుకులకు సంపాదించి పెట్టాలనే తాపత్రయం ఎందుకు?.. నా తాపత్రయం అంతా వాడి గురించే… లాంటి మాటల్ని మనం వింటుంటాం.

అసలు తాపత్రయం అంటే ఏమిటో తెలుసుకుందాం.

హిందూ ధర్మం ప్రకారం మనిషికి కలిగే ఆటంకాలు లేదా కష్టనష్టాలు మూడు రకాలు.

అవి భౌతికమైనవి, దైవికమైనవి, అంతర్గతమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి .

భౌతిక ప్రపంచంలో ఉండే క్రూర జంతువులు, సాటి మనుషులు, ప్రకృతి వైపరీత్యాలు.. అంటే భూకంపం, వరదలు, అగ్ని ప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు తదితరమైన వాటిని భౌతికిమనవిగా చెబుతారు.

దైవికమైన వాటికి వస్తే మనకు మనకి కనిపించని ప్రపంచం ద్వారా వచ్ఛే కష్టనష్టాలు. అంటే దైవ దోషాలు, రాక్షసులు, భూతాలు, దయ్యాలు, ఆత్మలు మొదలైన వాటి ద్వారా సంక్రమిస్తుంటాయి.

ఆధ్యాత్మికమైన కష్టాల గురించి చెప్పాల్సి వస్తే తన గురించి లేదా ఇతరుల గురించి బాధ పడడం, శరీరం, బుధ్ది అదుపులో లేక పోవడం, వ్యాధి, శారీరక లేదా మానసిక రుగ్మతలతో సతమతమవడం మొదలైనవి.


తాపత్రయం అనే పదానికి ఉన్న అర్థం ఏమిటో చూద్దాం. తాపం అంటే వేడి, త్రయం అంటే మూడు.. మూడు రకాల కష్టాలని అనుకోవాలి.

ఈ తాపాలు ఆధ్యాత్మిక తాపం,ఆధిభౌతిక తాపం, ఆధిదైవిక తాపం అని మూడు రకాలుగా విభజించారు పెద్దలు. సామాన్యులు మాత్రం తాపత్రయపడటం అంటే ఎత్తలేని బరువును మోయడం, పెట్టలేని పరుగుకు ప్రయత్నించడంగా భావిస్తారు. ఆధ్యాత్మిక తాపం గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మ నశించనిది, శరీరం నశించేది. ఈ శరీరంలో ఆత్మ నివసిస్తుంది. మనసు, దాని ఇతర స్థాయిలలో చేసే అన్ని చర్యలను సాక్షీభూతంగా శరీరం అనుభవిస్తుంది. మనసుకు సంబంధించింది పురుషార్ధసాధన. ఇందులో మూడో పురుషార్ధమే కామం. కామమంటే కోరిక, లేదా ఇంకేదైనా కావచ్చు. స్త్రీ పురుష సంబంధమొక్కటే కామం కాదు. ధర్మం దాటినపుడు మాత్రమే మనసు చేసే చిత్రంతో చిక్కులు కలుగుతాయి. వీటినే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలుగాను, అంతఃశత్రువులుగానూ చెబుతుంటారు. ఇవి బయటికి కనిపించవుగానీ చాలా కష్టాన్నే కలగచేస్తాయి. ఏదో ఒక కోరిక లేనివారు ఉండరు. నాకే కోరికా లేదన్నవారినెవరినీ నమ్మకూడదు. ఈ పురుషార్ధ సాధనలో కలిగే తాపమే ఆధ్యాత్మిక తాపం. శరీరానికి సంబంధించిన కోరికలు ఆరు. అవి ఆకలి, దప్పిక, జర, రుజ, శోకం, మోహం. ఆకలికి, ముఖ్యంగా దప్పికకి అసలు ఓర్చుకోలేం.‘గోచీ కంటే దరిద్రం, ప్రాణహాని కంటే ఎక్కువ కష్టం’ లేదని నానుడి. జర అంటే ముసలితనం, రుజ అంటే వ్యాధి బారినపడటం.. ఇవి రెండూ తప్పించుకోలేనివి. ఈ రెండూ పెద్ద కష్టాలే. చివరివి శోకం, మోహం నుంచి తప్పించుకోవాలని తంటాలైతే పడతాం కాని సాధ్యం కాదు. ఎవరికి వారు మాత్రమే అనుభవించవలసినవి ఈ కోరికలు. ఇవే అధ్యాత్మిక తాపాలు .

అధిభౌతిక తాపం గురించి తెలుసుకుందాం. ఈసృష్టిలో ఎవరిమటుకు వారొకరే కాదు, చాలా ప్రాణులు, ప్రాణం కానివీ ఉన్నాయి, ఈ సృష్టితో సహజీవనం తప్పదు. అప్పుడపుడు మనతో జీవించే ఇతర జంతువుల వలన, మనుషుల వలన కలిగే కష్టాలే అధిభౌతిక తాపాలు.
ఉదాహరణకి నల్లులు, దోమలు కుట్టడం, తేలు, పాము లాటివి కాటేయడం లాంటివి. వీటికంటే చాలా ముఖ్యం సాటి మనిషి నుంచి కలిగే కష్టం కూడా. ఇతరజీవులను హింసించడం, వధించడం ఆధిభౌతికతాపమే.

భగవంతుడు కలగచేసే కష్టాలను అధిదైవిక తాపాలన్నారు. భగవంతుడు చేశాడనే కంటే మానవుడు తన నెత్తిన తనే దుమ్ముపోసుకుని అధిదైవిక తాపాలంటున్నాడనడం బాగుంటుందేమో.
పంచభూతాలెప్పుడూ వాటివాటి హద్దులు దాటవు. కాని వాటి సమతుల్యతను మానవుడు చెడగొట్టినపుడు విజృంభిస్తాయి. అప్పుడు మానవుడు బలహీనుడే. హంసమంత్రం సర్వకాల సర్వావస్థలలో తిరుగుతుండవలసిందే. హంసమంత్రం అంటే గాలి పీల్చేటపుడు కలిగే శబ్దమే హం, గాలి వదిలేటపుడు కలిగే శబ్దం స, ఈ రెండూ కలిస్తే జీవితం, లేకుంటే మరణం.

చూశారు కదా తాపత్రయాలు ఎన్ని విధాలుగా ఉంటాయో. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలలో చిక్కుకుని మనిషి మనుగడ సాగిస్తుంటాడు. ఇలాంటి తాపత్రయాలతో కుంగిపోకుండా స్థతప్రజ్నతతో ప్రతి మనిషీ జివించాలి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ