Thursday, February 2, 2023

మన ఆరోగ్యం…! *టంగ్ క్లీనింగ్* *TONGUE SCRAPING":* *నాలుక గీసుకోవడం*

 0307.  2-7.      020223/8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀135.
*మన ఆరోగ్యం…!

                 *టంగ్ క్లీనింగ్*
         *TONGUE SCRAPING":*
              *నాలుక గీసుకోవడం*
                  ➖➖➖✍️

*అందరూ రెగ్యులర్‌గా బ్రష్ చేసుకుంటూ దంతాలను శుభ్రం చేసుకుంటారు. కానీ, నాలుకను శుభ్రం చేసుకోవడం గురించి ఆలోచించరు. ప్రతి రోజూ పళ్లు తోముకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, టంగ్ క్లీనింగ్ వల్ల కూడా అన్ని ఉపయోగాలే ఉన్నాయంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.*

*అందుకే ప్రతిరోజూ తప్పనిసరిగా టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల నోరు శుభ్రంగా ఉండటమే కాదు.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి అంటున్నారు. రోజూ నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల నాలుకపై ఉండే మృత కణాలు, నాలుకకు అతుక్కుపోయిన పదార్థాలు తొలగిపోతాయి.*

*దీనివల్ల నాలుక శుభ్రంగా ఉండి, ప్రతి రుచిని మరింత ఎక్కువగా, త్వరగా గుర్తించగలుగుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా వల్లే దుర్వాసన, దంతక్షయం వంటి సమస్యలు వస్తాయి. అయితే, రోజూ నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది.* 

*మంచి బ్యాక్టీరియా పెరిగి, నోరు ఆరోగ్యంగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన రాదు. ఆహారం జీర్ణమవడం అనేది నోటి నుంచే ప్రారంభమవుతుంది. నోట్లోని లాలాజలంలో ఉండే ఎంజైమ్‌లు ఆహారాన్ని విడగొట్టి, పేగులలోకి పంపుతాయి. అక్కడ్నుంచి ఆహారం జీర్ణాశయం చేరుకుంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు చాలా ఉపయోగపడుతుంది.*

*కాబట్టి, నోట్లో మంచి లాలాజలం ఉత్పత్తి కావాలంటే నాలుక శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. నాలుకను క్లీన్ చేసుకోవడం వల్ల ఒంట్లోని మలినాలు కూడా తొలగిపోతాయి. దీనివల్ల మెల్లిగా, శరీరంలోని ఇతర అవయవాలు కూడా యాక్టివేట్ అవుతాయి. దీంతో అంతర్గత అవయవాలు రోజంతా సమర్ధంగా పనిచేస్తాయి.* 

*రోజుకు రెండుసార్లు టంగ్ క్లీన్ చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. టంగ్ క్లీనింగ్ వల్ల నోట్లోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీనివల్ల విషపదార్థాలు తగ్గుతాయి. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.*✍️
                              … సేకరణ.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మనసే మూలం…!

 0411.    1-6.       020223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               *మనసే మూలం…!*
                    ➖➖➖✍️

*మనిషి మనుగడకు మూలం ‘మనస్సు’! మనిషి జీవితం మనసు ఆడే ఒక వింత ఆట..!*

*ఈ మనసులో నిరంతరం.. సంకల్ప, వికల్పాలు(willing& doubting) నడుస్తుంటాయి..!*

*మనసులో రోజు మొత్తంలో కొన్ని వేల ఆలోచనలు  పుడుతూ ఉంటాయి..! మన ఆలోచనలు ఎంత అధికంగా ఉంటే మనసు అంత చంచలమై, అలజడికి, అశాంతికి గురి అవుతాము చేసే పనిపై ఏకాగ్రత కుదరక, పనిలో సమర్ధత కోల్పోయి, పరాజయానికి గురి అవుతూ ఉంటాము..!!*

*ఈ మనసులో ఆలోచనలు తగ్గించేందుకు అనేక ధ్యాన విధానాలను అనుసరించినా..,*
*తాత్కాలిక ఉపశమనం లభించిందే కానీ, శాశ్వత పరిష్కారాన్ని పొందలేకపోయాము..!!*

*ఈ అత్యంత శక్తివంతమైన మనసును జయించే ఏకైక మార్గం ‘రాజయోగం’!!*

*నీ దుఃఖానికి కారణం నీ కర్మలు..,               ఆ కర్మలకు కారణం నీ ఆలోచనలు..,               ఆ ఆలోచనలకు కారణం నీ మనస్సు..!! ఆ మనస్సు ఇప్పుడు పంచ వికారీ రూపీ రావణునికి వశమై ఉంది..!! ఆ మనస్సుని నా వశం చేయడం ద్వారానే.. నీకు పరమశాంతితో కూడిన నిర్మల  మనస్సు లభిస్తుంది..!! తద్వారా ఆలోచనల్లో శ్రేష్ఠత చేకూరి, కర్మలలో ప్రావీణ్యత పెరిగి, సత్ఫలితాలను పొంది, సుఖవంతమైన జీవితాన్ని అనుభవించగలవు.." అని నిర్దేశనం ఇస్తూ, అందుకు రాజయోగమే తరుణోపాయం అని సూచిస్తున్నారు పరమాత్మ...!!!*

*"కనుక అత్యంత శక్తివంతమైన ఈ మనసును శక్తితో కాక యుక్తిగా..         ప్రేమతో జయించాలి!   ప్రతి పనీ చేస్తూ..మనసుతో ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి! మనసులో వచ్చే ప్రతి ఆలోచనను అణచివేయక(control), సరిదిద్దితూ(పరివర్తన చేస్తూ) ఉండాలి..!!          ఉద్వేగాలు కలుగకుండా.. సాత్విక గుణాలను మననం చేస్తూ, అనుభవం చేయిస్తూ ఉండాలి.!*

*ఎటువంటి అభ్యాసం చేయాలి అన్నా.. మనసు సహకరించాలి*
*అందుకు నిరంతరం ఈమనస్సులో ప్రేమతో పరమాత్ముని స్మృతి చేయాలి.* 

*రాముడు(Good/God)ఉన్న చోట రావణుడు(Bad/Devil) నిలవలేడు..!!"*

*"రాముడైన పరమాత్మతో సాంగత్యం(స్మృతి) చేయాలి అంటే అందుకు అర్హత.., మనసులో స్వయం పట్ల, సర్వులు పట్ల శుభభావన, శుభకామనలు కలిగి ఉండాలి, అందుకు త్రికరణ శుద్ధిగా సహయోగం(సేవ) చేయాలి..!!                        బాహ్యం నుండి శుద్ధమైన విషయాలను గ్రహించాలి అనే పత్యం ఉండాలి..!!"*

*ఈవిధమైన అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసుని మంచి మిత్రునిగా చేసుకుంటే జీవితమే నందనవనం అవుతుంది..!!*

*సర్వులు తమలోనే ఉన్న మంచి మిత్రుని(మనసుని)కి, పరమాత్ముని స్మృతి అనే శ్రేష్ఠ బహుమానం ఇచ్చి అవధులు లేని ఆనందాన్ని దానికి అనుభవం చేయించాలని ఆశిస్తూ..*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు.

 2212.  1-4.020223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                *ఇది కథకాదు!*
                  ➖➖➖✍️


*తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు… ‘నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు!’*

*రావణుడు జటాయువు యొక్క రెండు రెక్కలను తెంచినప్పుడు… అప్పుడు  మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు…*

*"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం  ‘ప్రభు శ్రీరాముడి’కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు” అన్నాడు!*

*మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.*

*కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వు నవ్వుతున్నారు!*

*ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.*

*రామాయణంలో జటాయువు శ్రీరాముడి  ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.*

*అక్కడ మహాభారతంలో…’* 

*భీష్మ పితామహుడు  ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు.* 

*తేడా ఉందా లేదా?*

*అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా  అయింది. కాని భీష్మపితామహుడు  చనిపోయేటప్పుడు బాణపు మొనలు పాన్పుగా అయ్యాయి!*

*జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు.  జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు  ఏడుస్తున్నాడు.*

*ఇంత తేడా ఎందుకు?*

*ఇంతటి తేడా ఏమిటంటే..,*

*ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో  పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు. అడ్డుకోలేకపోయాడు!దుశ్శాసనునికి  ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.*

*దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే  వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.*

*జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!*

*ఇతరులుకు తప్పు జరిగిందని చూసి  కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపా దిస్తారు.* 

*నిజం అనేది  కలత చెందుతుంది, కానీ ఓడిపోదు.*

"*సత్యమేవ జయతే "*
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

ఆధ్యాత్మిక హృదయం

 1101.  2-4.   020223-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


           *ఆధ్యాత్మిక హృదయం*
                  ➖➖➖✍️

*ఆధ్యాత్మికత మానవ జీవన వికాసానికి, ఉన్నత విలువల సముపార్జనకు సాధనం.* 

*దైవాన్ని అందరూ చూడలేరు. ఆయన భౌతిక నేత్రాలతో దర్శించేందుకు అతీతుడు.*

*శిల్పి మనోభావనకు అనుగుణంగా రూపుదిద్దుకొన్న విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.* 

*నాస్తికుడు తనదిగా చెప్పుకొనే ఆధ్యాత్మిక స్పర్శ లేనివాడు. అది పుష్కలంగా ఉన్న ధన్యజీవి ఆస్తికుడు.* 

*ఆస్తికత్వం అంటే దైవభావనను విశ్వసించి ఆ ఉనికిని హృదయంలో ప్రతిష్ఠించుకొని శాంతిని, ఆనందాన్ని అనుభవించడం!*

*ఎలాంటి దైవభావనకు, ఆధ్యాత్మిక చింతనకు తావివ్వక తనపై, తన స్వశక్తిపై అపార విశ్వాసం ప్రదర్శించి జీవనగమనాన్ని సాగిస్తాడు నాస్తికుడు.*

*మనిషి బాల్య కౌమార దశల్లో పెద్దలు చెప్పే కథలను ఆసక్తిగా వింటాడు. పౌరాణిక, జానపద కథల్లో లీనమై ఏదో తెలియని ఆనందాన్ని అనుభవిస్తాడు. శ్రీకృష్ణుడి బాల్య క్రీడలు, లీలావినోదాలు పిల్లలను ఆకర్షిస్తాయి. అక్కున చేర్చుకుంటాయి. ఊహాలోకాల్లో విహరింపజేస్తాయి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు చెప్పే కథలు పిల్లల్లో కథనాసక్తిని పెంచుతాయి. రంజిల్లజేస్తాయి.*

*ఊహావినోదాల వినువీధిలో బాలలు విహరించి శాంతికి ఆనందానికి చిరునామాగా మారతారు.*

*ఓ బాలకుడిగా శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసులను చంపడం, తోటి బాలలతో చల్దులారగించడం, పొన్నమాను ఎక్కి కోతికొమ్మచ్చు లాడటం, నదీనదాల తీరాల్లో జలకాలాడటం, గోమాతలను కడుపారా మేపి గోధూళి వేళ గృహోన్ముఖులు కావడం, మలిసంధ్య వెలుగుల్లో స్నేహితులతో ఇల్లు చేరుకొని తల్లిదండ్రులను మురిపించడం... పుస్తకాల్లో కథలుగా చదివిన పిల్లల ఆనందానుభూతులు వర్ణింపనలవి కానివి. అలా చిన్నారి దశనుంచి ప్రవర్ధిల్లేదే ఆధ్యాత్మిక హృదయం!*

*ఆధ్యాత్మిక హృదయం ఎల్లలు లేని ఆనందాలకు వేదిక.*

*స్వశక్తిని నమ్ముకొని ముందుకు సాగుతుంది నాస్తికత్వం. నాస్తికభావంతో మమేకమై జీవితాన్ని ఉత్పాదకంగా మలచుకొని విజయతీరాలవైపు ప్రస్థానం సాగించినవారు ప్రాచ్య, పశ్చిమదేశాల్లో ఉన్నారు.*

*పరమాత్మ శక్తిని తనలో నింపుకొని ప్రస్థానిస్తుంది ఆస్తికత్వం. ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం మానవ శక్తిపై ఆధారపడి ఎంతో పురోగమించడం చూస్తాం.*

*దైవం కానిది ఈ దృశ్యప్రపంచంలో ఏదీలేదని నమ్మే దేశాలు భౌతికసంపదతో సంబంధం లేకుండా శాంతి, ఆనందాలతో అలరారుతున్నాయి.*

*మనిషి తన శ్రేయస్సును మాత్రమే తాను నమ్మినప్పుడు ఎదుటివాడిని మానవత్వంతో చూడగల సహృదయం కొరవడుతుంది. పోటీని అధిగమించే ప్రయత్నంలో విలువలకు తిలోదకాలు ఇవ్వడం వాంఛనీయం కాదు.*

*దైవాన్ని హృదయగతంగా విశ్వసించినప్పుడు మనిషిలో నేరభావన నశిస్తుంది. పాపచింతన అంతర్థానమవుతుంది. ఈ జీవితంలో చేసే పాపాలు ప్రారబ్ధఫలంగా మరోజన్మలో అనుభవించాలని నమ్మే సాధకులు నైతిక విలువలకు పట్టంకడతారు.*

*కల్మషాలు పోగుపడకుండా హృదయాన్ని రక్షించుకొనే ప్రక్రియ ఆధ్యాత్మిక సాధన.*

*ఆధ్యాత్మిక హృదయం నిర్మల, నిశ్చలమైన మనసుతోపాటు శాంతిని ఆనందాన్ని ప్రసాదించే గొప్ప సాధనమని తెలుసుకున్న నాడు సాధకుడి ఆనందాతిరేకాలకు లోటుండదు.*

*ఆనందంగా జీవించడం ఓ కళ. ఆ అనుభూతిని పొందడానికి ధనంతో పని లేదు.*

*అరణ్యాల్లో ఆధ్యాత్మిక సాధనచేస్తూ కుటీరాల్లో నివసించి, దైవానురక్తితో బతుకులను సాఫల్యం చేసుకున్న మహర్షుల ఆధ్యాత్మిక హృదయం మనకు ఆదర్శనీయం.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

పవిత్ర హృదయాన్ని పొందగలగడం కన్నా అదృష్టం మరొకటి ఏమి ఉంటుంది.

 010223a1326.     020223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀757.
నేటి…

              *ఆచార్య సద్బోధన:*
                  ➖➖➖✍️

*ఎవరు భగవంతుని యొక్క దివ్యమైన జన్మనూ, కర్మనూ యథార్థంగా తెలుసుకుంటున్నారో అట్టివారు మరణానంతరం ఆయననే పొందుతున్నారు.*

*అనురాగం, భయం, క్రోధం విడిచిన వారూ, ఆయన యందే లగ్నమై ఉన్న మనస్సు కల అనేకులు ఇట్టి జ్ఞాన తపస్సుచే పవిత్రులై భగవంతుని స్వరూపమును పొందియున్నారు.*

*ఆధ్యాత్మిక అనుభవం నిత్యజీవితంలోని అనుభవాలకు దూరంగా ఎక్కడో లేదు. మన నిత్యజీవన విధానం ఆధ్యాత్మికతతో కలిసి ఉన్నది.*

*అయితే ఆ రెంటినీ జత చేసేవి ఆదర్శం పట్ల భక్తి, ప్రార్థనలే. ఈ ప్రార్థన ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తితో కూడుకుని ఉండరాదు.*

*ప్రార్థన అవగాహనతో కూడుకుని ఉండి మన అజ్ఞానాన్ని తొలగించేదిగా ఉండాలి. హృదయ వైఖరిని గ్రహిస్తూ మనస్సుని శుద్ధి చేసేందుకు ఉపక్రమించాలి.*

*పవిత్ర హృదయాన్ని పొందగలగడం కన్నా అదృష్టం మరొకటి ఏమి ఉంటుంది. అటువంటి హృదయం దర్పణంలా ప్రకాశిస్తూ మనలను ప్రతిబింబింపజేస్తుంది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

సంతోషం అంటే....

 0801.  2-6.3️⃣    010223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *సంతోషం అంటే....*
                  ➖➖➖✍️

*మనిషి తాను జీవించినంతకాలం సంతోషంగా ఉండాలనుకొంటాడు. సంతోషం కోసమే అన్నం తింటాడు. సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు. సంతోషం కోసమే పెళ్ళి చేసుకొంటాడు,     పిల్లలు కావాలను కొంటాడు. చేసే పని, కూసే కూత, రాసే రాత... అంతా సంతోషం కోసమే...!*

*ఇంతకూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది విలువైన ప్రశ్న. సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటులేదు. చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావడంలేదు...*

*ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలననుకుంటాడు మనిషి...*

*కానీ ....*
*డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగుచేసిన సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు...*

*అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు...*

*అందంగా ఉంటే సంతోషం ఉంటుందా? దానికీ రుజువు లేదు. ఎందరో అందగాళ్లు, సౌందర్యవంతులు మానసిక క్షోభలతో ఆత్మహత్యలు చేసుకొన్న చరిత్రలున్నాయి...*

*సకల విద్యలనూ ఆపోశన పడితే సంతోషం కలుగుతుందా అంటే అదీ సత్యం కాదు. ఎందరో విజ్ఞాన ఖనులైన మహానుభావులు అశాంతితో తనువులు చాలించారు...*

*కనుక సంతోషానికి మూలం సంపదలు, అధికారం, చదువు, అందం కావని అనుభవపూర్వకంగా మనిషికి అర్థమైంది. సంతోషానికి ధనికులు, పేదలు అనే భేదం లేదు. అందం, చదువు అనే బేరీజులు లేవు. వయోభేదం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషికి స్వాధీనమై ఉండేది సంతోషం...*

*పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకోవడంలోనే సంతోషం. ఎదిగే పిల్లలకు ఆటపాటలతో గడపడం సంతోషం. యువకులకు తమ కలలను సాకారం చేసుకోవడమే సంతోషం. వృద్ధులకు తమ సంతానాన్ని చక్కగా చూసుకొంటూ ఉండటమే సంతోషం. కొందరికి ప్రకృతి ఆరాధన సంతోషం.  కొందరికి తీర్థక్షేత్రాలను సందర్శించడం సంతోషం. కొందరికి సంగీతం వినడం సంతోషం. కొందరికి సృజన చేయడమే పరమానందం. ఇలా సంతోషానికి ఒక నిర్వచనం లేదు. ఒక ఉనికి లేదు...*

*ప్రపంచంలోని అణువణువులోనూ సంతోషం నిండి ఉంది. దాన్ని చూడగలగడమే మనిషి పని*...

*పరిమిత సంపాదనతో అన్నవస్త్రాదులను సమకూర్చుకొని సంతోష జీవనం గడుపుతున్నవాళ్లెందరో ఉన్నారు. వాళ్లకు పూరి గుడిసెలైనా, పక్కా భవనాలైనా ఒక్కటే. రాజప్రాసాదాల వంటి విలాస భవనాల్లో హంసతూలికాతల్పాలపైన పడుకున్నా కొందరు ముళ్లపాన్పు మీద పడుకొన్నట్లే నిద్ర కరవై, దుఃఖ జీవితాన్ని కొనసాగిస్తుంటారు..*

*ఉన్నంతలో గడుపుకొంటూ, తోటివారికి సహాయపడుతూ, దీనులపట్ల కారుణ్యాన్ని ప్రదర్శించేవారికి ఏ సంపదలతోనూ పని లేదు. సంపదలు ఎన్ని ఉన్నా ఎవరికీ ఏ విధంగా తోడ్పడని జీవితాలూ ఉన్నాయి..*

*మనిషి తన జీవితంలో అనుక్షణం సంతోషాన్ని ఆహ్వానించాలి. అసంతృప్తిని తరిమివేయాలి. కష్టాలకు, కడగండ్లకు, బాధలకు కుంగిపోరాదు. ఉన్నంతలో ఆనందాన్ని తోడుకోవాలి. ఆత్మీయులతో మనోభావాలను పంచుకొని సేదదీరాలి. అనవసరమైన భయాలను దరిజేరనీయరాదు. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోరాదు. నీతిమంతమైన జీవితానికి దారులు వేసుకోవాలి. అనుచిత సంపాదనకోసం అర్రులు చాచకూడదు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందించే స్ఫూర్తితో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి. మానసికోన్నతికి దారులను అన్వేషించాలి...*

*అంతర్యామితో అనుసంధానం కావాలి. అదే చిట్టచివరి సంతోషానికి చిరునామా...*

*ఆనందం, సంతోషం ఈ చిన్ని జీవితానికి ఆయురారోగ్యాలు అందరమూ సుఖసంతోషాలతో జీవితాన్ని చక్కగా గడుపుదాం.*

*ఇదే జీవిత పరమార్ధం..*✍️

                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

ఉపసాళకుడు

 1110.  1-4.   010223-6
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                 *ఉపసాళకుడు*
                  ➖➖➖✍️

*మనిషికి మరణ భయం లేకపోతే, ‘మరణించాక నేను ఏమైపోతాను? ఏమైపోవాలి?’ అనే ఆలోచన లేకపోతే పారలౌకిక ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు ఉండవు, రావు. ఈ మరణ భయాలే మత బీజాలుగా ఆదిమ సమాజాల్లో మొలకెత్తాయి. జన్మదినం, నామకరణం, గృహ ప్రవేశం, వివాహం, మరణం... మనిషి జీవితంలో నిర్వహించుకొనే ఈ కార్యక్రమాలలో మానవులు అనాది నుంచీ పాటించినవి మరణానంతర కర్మలే. ఉత్తర క్రియలే!* 

*నాలుగు మంచి పనులు చేసి మరణించిన వ్యక్తికి... ఇతర గతుల సంగతి ఎలా ఉన్నా కీర్తి మాత్రం మిగిలిపోతుంది.* 

*బతికినంత కాలం అమానుషంగా జీవించి, మరణించిన తరువాత తనకు అంతిమ సంస్కారాలు శుద్ధంగా జరగాలని భావించిన ఒక వ్యక్తి గురించి బుద్ధుడు చెప్పిన కథ ఇది…*

*పూర్వం విదేహలో ఉపసాళకుడు అనే పండితుడు ఉండేవాడు.* 

*మొత్తం జంబూ ద్వీపంలో తనంతటి జ్ఞాని, మహా పండితుడూ ఎవరూ లేరని అతను మిడిసిపడేవాడు. ఎక్కడకు వెళ్ళినా తన పట్ల గౌరవ మర్యాదలు ఏ కొంచెం తగ్గినా సహించేవాడు కాదు. అన్ని విషయాల్లో శుద్ధి పాటించేవాడు. శుద్ధి పేరుతో మనుషులను దూరం పెట్టేవాడు.*

*ఉపసాళకుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను కూడా మంచి పండితుడే. ఉపసాళకుడికి వయసు పెరిగింది. వృద్ధాప్యం వచ్చింది.                       ఏ క్షణమైనా మృత్యువు రావచ్చని నిశ్చయించుకున్నాడు. తన కుమారుణ్ణి పిలిచి….*

*”నాయనా! నాకు ఎప్పుడైనా మృత్యువు రావచ్చు. నా మరణ కర్మలు చాలా శుద్ధిగా జరిపించు. నన్ను చందనం కట్టెలతో దహనం చేయించు. నన్ను దహనం ఎక్కడ చెయ్యాలో తెలుసా?” అని అడిగాడు.*

*”లేదు తండ్రీ!”  అన్నాడు అతని కుమారుడు.*

*”అందరినీ దహనం చేస్తున్న మన ఊరి శ్మశానంలో మాత్రం చెయ్యకు. అక్కడ శుద్ధి, ఆచారాలు పాటించని వారెవరినో దహనం చేసి ఉంటారు. గతంలో ఎవరినీ దహనం చేయని పరిశుద్ధ ప్రదేశంలో నా అంతిమ సంస్కారాలు కావించు!” అని చెప్పాడు.*

*”తండ్రీ! అలాంటి ప్రదేశం ఎక్కడ ఉంటుందో నాకు మాత్రం ఏం తెలుసు? మీరే ఆ ప్రదేశాన్ని చూపించండి. అక్కడే చేస్తాను” అన్నాడు కుమారుడు.*

*ఉపసాళకుడు తన కుమారుణ్ణి వెంట తీసుకొని, ఊరి చివరికి వెళ్ళాడు. అక్కడికి సమీపంలో ఉన్న చిన్న కొండ మీదకు చేరాడు. అక్కడ మూడు పర్వతాలు కలిసిన లోయ ప్రాంతాన్ని చూపుతూ- ‘‘నాయనా!  ఈ ప్రదేశం ఉత్తమమైనది!” అన్నాడు.*

*అతని కుమారుడు సరేనన్నాడు.*

*వారిద్దరూ అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న సమయంలో... బుద్ధుడు తన శిష్యులతో కలిసి అటుగా వస్తూ, ఉపసాళకుని దగ్గర ఆగాడు.* 

*విషయం తెలుసుకొని “ఉపసాళకా!             ఈప్రదేశాన్నే ఎందుకు ఎంచుకున్నావు?” అని అడిగాడు.”*

*”అక్కడకు అంత్యక్రియల కోసం ఎవరూ వెళ్ళరు. మూర్ఖులు, అజ్ఞానులు, అస్పృశ్యుల స్పర్శ లేని ప్రదేశం అది!” అన్నాడు.*

*అప్పుడు బుద్ధుడు- “ఉపసాళకా! ఎంత అజ్ఞానివి? ఈ భూమి మీద జీవులు పుట్టని స్థలం కానీ, సంచరించని తావులు కానీ, మరణించి మట్టిలో కలసిపోని ప్రదేశం కానీ ఎక్కడా మిగిలి ఉండదు. ఎన్నెన్నో కల్పాల నుంచి ఈ జీవుల చక్రం ఇక్కడ నడుస్తూ ఉంది. జీవుల భస్మంతో నిండని ప్రదేశం ఏదీ ఈ అవని మీద ఉండదు. మూర్ఖంగా శ్మశాన శుద్ధి కోసం ఆరాటపడకు!” అని చెప్పాడు.*

*ఉపసాళకుడు తన అజ్ఞానాన్ని వీడి, బుద్ధుని శరణు వేడాడు.*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

ఆచార్యుడు భీష్ముడు, బ్రహ్మశ్రీసామవేదం షణ్ముఖశర్మ గారు రచించిన వ్యాసం..*

 0902.  2-4.        010223-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*బ్రహ్మశ్రీసామవేదం షణ్ముఖశర్మ గారు రచించిన వ్యాసం..*

          *ఆచార్యుడు భీష్ముడు*
                ➖➖➖✍️

*ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉంది. దైవీ శక్తులను జాగృతపరచుకొనే మహదవకాశం ఈ కాలంలో ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం...*

*ఈ మూడింటినీ 'కాంతి' మార్గాలు అని భగవద్గీత చెబుతోంది. జ్యోతిర్మండలంలో జరిగే మార్పులు, భూమి సౌరశక్తిని గ్రహించే పద్ధతులు... వీటిని ఆధారం చేసుకొని సూక్ష్మదృష్టిగల మహర్షులు కాలంలో వివిధ పర్వాలను ఏర్పాటు చేశారు.*

*'దేవతలు' అంటే కాంతిశరీరులని అర్థం. సూర్యకాంతి కిరణాల్లో ఉండే చైతన్య విశేషాలను వివిధ దేవతాశక్తులుగా వేదవాఙ్మయం వర్ణించింది. పృథ్విపై వాటి ప్రభావం అమోఘం. వాటిని స్పందింపజేసి సత్ఫలితాలు పొందడమే ఆరాధనగా వ్యాప్తి చెందింది.*

*మాఘమాసంలో సౌరశక్తి నుంచి ప్రసరించే దివ్యత్వం అమోఘం. అందుచేతనే ఈ నెలలో పర్వదినాలన్నీ అత్యంత పవిత్రంగా అనుశాసించారు. ‘రథసప్తమి, భీష్మఏకాదశి, మాఘపూర్ణిమ, మహాశివరాత్రి ఇవన్నీ మాఘ మాసంలోని పుణ్యదినాలు.*

 *ప్రతి నెలా ఏకాదశిని వ్రతదినంగా భావించడం మన సంప్రదాయం. అందులో 'మాఘ ఏకాదశి' అత్యంత పవిత్రం. అయితే ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి' అనడంలో ఒక విశేషం ఉంది.* 

*'మహాభాగవత శిఖామణి' అయిన భీష్మాచార్యుడు ముక్తినొందిన రోజు మాఘ శుద్ధ అష్టమి. అటుతరువాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మఏకాదశిగా వ్యవహరించడం సంప్రదాయ మయ్యింది.*

*భీష్మచరిత్ర భారతంలో ఒక సమున్నత శిఖరం. అరి భయంకరుడైన భీష్ముడు - భీషణత్వానికి ప్రతీక. ఈ భీషణత్వం ఇంద్రియ నిగ్రహంలోను, అంతఃశ్శత్రువులను జయించడంలోను ప్రదర్శించి పరిశుద్ధతను సాధించాడు.*

*దేవవ్రతుడనే పేరు కలిగిన ఈ మహాత్ముడు, పితృభక్తిపరుడుగా తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు.*

*'భీష్మప్రతిజ్ఞ' జగత్ ప్రసిద్ధం. సత్యనిష్ఠకు పేరుపడిన భీష్ముడు కొన్ని సందర్భాల్లో ధర్మాధర్మ నిర్ణయంలో తటస్థంగా ఉన్నా (ఉదా॥ ద్రౌపదిని నిండుసభలో అవమానించిన సందర్భంగా మౌనం వహించడం) వాటి వెనుక దైవ సంకల్ప జ్ఞానం, ధర్మసూక్ష్మాలు హేతువులుగా ఉన్నాయి. ఆ కొద్ది సందర్భాల ఉపేక్షకు కూడా 'అంపశయ్య'లో తనను తాను శిక్షించుకున్న నిర్మలుడు, భీష్ముడు.*

*ఇంద్రియ నిగ్రహానికీ, సత్యనిష్ఠకీ మారుపేరుగా నిలిచిన ఈ పవిత్ర చరిత్రుడు అర్జునునితో సాగించిన యుద్ధంలో తగిలిన బాణాలతో అలాగే నేల కొరిగాడు. ఆ బాణాలే శయ్యగా కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో మహర్షులంతా ఆయనను పరివేష్ఠించి ఉన్నారు.*

*లోకరక్షణకు విష్ణు సంకల్ప ప్రణాళికలో భాగంగా భూమికి దిగిన   ఈ     వసు స్వరూపుడు సర్వ ధర్మాలనిధి, త్రికాలజ్ఞుడు. ఈ 'త్రికాలజ్ఞ' లక్షణంతోనే దైవ సంకల్పానికి అనుగుణంగా వ్యవహరించాడు.*

 *ఈయన అంపశయ్యపై ఉన్న సమయంలో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ యోగంలో ఉన్నాడు. ఒక ధర్మవేత్త లోకాన్ని వదిలి వెళుతున్న వేళ ఆయన నుంచి తరవాతి తరాలకు విజ్ఞాన సంపద అందాలని నిర్ణయించుకున్న కృష్ణుడు, ధర్మరాజాదులతో శరతల్పగతుడైన భీష్ముని చేరుకున్నాడు. ఒక మహాకాలంలో ఎంతో లోకాన్ని దర్శించిన అనుభవం, శాస్త్రాలను ఆపోశనపట్టిన ధార్మిక విజ్ఞానం ఆయనతోనే అంతరించిపోకూడదని కృష్ణ సంకల్పం.*

*పాలించే బాధ్యతను చేపట్టిన యుధిష్ఠిరునకు ఆయన ఆ ధర్మ సంపదనంతా అందించాలని ఆదేశించాడు పరమాత్మ. యుద్ధంతో అలసి, క్షతగాత్రుడై ఉన్న తాను బుద్ధిని ఏకాగ్రం చేసి సూక్ష్మాంశాలతో విషయాలను వివరించే శక్తిలేని వాడనని, కనుక ఆ ధర్మాలను శ్రీకృష్ణునే వివరించమని వేడుకుంటాడు భీష్ముడు.*

*కానీ ముకుందుడు, "తాతా! నీకు అమోఘమైన శారీరక, బుద్ధి శక్తులను అనుగ్రహిస్తున్నాను. వాటితో నీవు నీ అనుభవసారాన్ని, ధర్మసూక్ష్మాలను నీ మనుమనికి అందించు" అని బోధించాడు.*

*ఒక తరం తన తరువాతి తరానికి అందించవలసినది ధర్మాన్నీ, జ్ఞానాన్నీ, అనుభవసారాన్నీ.;    అంతేగానీ ఆస్తి పాస్తులను మాత్రమే కాదు. ఈ సందేశమే భీష్ముని ద్వారా ధర్మజునికి ధర్మోపదేశం చేయించడంలోని పరమార్థం.*

*అప్పుడు భీష్ముడు ఉపదేశించిన సూక్ష్మధర్మాలు, మోక్ష ధర్మాలు మహాభారతంలో శాంతి, అనుశాసనిక పర్వాలుగా అతివిస్తారంగా విరాజిల్లాయి. మహాభారతం వేదాల సారమైతే, ఈ రెండు పర్వాలు (భీష్మబోధ) భారతానికి సారం.*
         
*ఇందులో …పాలనధర్మాలు,రాజధర్మాలు, వ్యక్తి ధర్మాలు, లోకరీతులు, ఉపాసన రహస్యాలు, తత్త్వచింతన.... అన్నీ కలబోసుకుని కనబడతాయి. అంటే, భీష్ముడు ఒక సమగ్ర మానవుడిగా ఈ బోధ ద్వారా మరోమారు నిరూపించు కున్నాడు. తాత్విక చింతన, ధార్మికానుష్ఠానం, దృఢభక్తి, ఇంద్రియ నిగ్రహం - ఇన్ని సులక్షణాలు రాశిపోసుకున్న కారణంగా భీష్ముడు భగవానునికి అత్యంత ప్రీతి పాత్రుడయ్యాడు. ఆచరించి, ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఆయన పేరున ఒక మహాపర్వమే ఏర్పడింది. ఆ పర్వం లోనిదే భగవద్గీత.*

*యావద్భారతజాతీ సంస్మరించదగిన భీష్మాచార్యునికి వందనం!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

భీష్మ ఏకాదశి, శ్రీవిష్ణుసహస్రనామ జయంతి

 1202.    2-4.  010223-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నేడు…

                 భీష్మ ఏకాదశి,
     శ్రీవిష్ణుసహస్రనామ జయంతి
                ➖➖➖✍️

మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ… "మాంధ్యాతి భగవాన్ భీష్మః                        తపోమే తద్గతం మనః"                                 

కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది.
 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.

భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు.                             ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు                            ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.

మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?

ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట.               ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" 
‘హే ద్రౌపతి! ఇతరులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో!’  అని. 

ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నా’ అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.

భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. 

అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతోందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళూ అంపశయ్యపై పడి ఉన్నాను' అని చెప్పాడు. 

హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. 
కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. 'హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. 

శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. 

అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.

భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.  అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. 

అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. 

భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంది.

ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తి పూర్వకంగా స్మరించి తదుపరి, ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

మానవుడు తరతరాలుగా ఆశా మోహములనెడి పాశములతో బంధింపబడి ఉంటున్నాడు.

 310123a2215.    010223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀756.
నేటి…

               *ఆచార్య సద్బోధన:*
                  ➖➖➖✍️

*మానవుడు తరతరాలుగా ఆశా మోహములనెడి పాశములతో బంధింపబడి ఉంటున్నాడు.* 

*చలి కోసం పొయ్యి మీద చిన్న మంట వేసుకుంటే పరవాలేదు. కానీ  చలి ఎక్కువైందని మంట ఎక్కువ పెడితే ఇల్లు కూడా కాలిపోయే ప్రమాదం లేకపోలేదు!* 

*కోరికలు కూడా అంతే, జీవనానికి సరిపోయే అవసరాలు కోరికలుగా ఉండడం తప్పు లేదు. కానీ ఎప్పుడైతే మనలో అత్యాశలు పుట్టాయో అప్పుడే మనల్ని మనం కాల్చుకున్నట్లే అవుతుంది.*

*ఇవన్నీ కాదు గానీ, భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటే ఏ కోరికలూ కోరనక్కర్లేదు. ఏ ఆశలూ పెట్టుకోవాల్సిన పని లేదు. మనకి ఎప్పుడూ ఏమి కావాలి అన్నది ఆయనే చూసుకుంటాడు.*

*ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటూ తనకి ఉన్నదాంట్లో కొంత సాటి మనిషిని, జీవులకు పంచి పెడతారో వారికి లోటు అంటూ ఏమీ లేకుండా చూసుకుంటాడు. ఇట్టి వారి సకల యోగక్షేమాలకు భగవంతునిదే బాధ్యత.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

మన ఆరోగ్యం…! *పిక్క మన రెండో గుండె..!*

 2409. 1-6.   310123-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀67.
మన ఆరోగ్యం…!

       *పిక్క మన రెండో గుండె..!*
                ➖➖➖✍️

ఇప్పటివరకూ మనలో చాలామందికి తెలియని సంగతి ఒకటి తెల్సుకుందాం రండి….
మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం కదా. కానీ మన కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే... మన పిక్కలు. గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేస్తుందో... పిక్క కూడా అలాగే రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది. పైగా గుండె నుంచి పంప్ చేసే రక్తం భూమ్యాకర్షణ శక్తి వల్ల మన కాళ్లకు చేరడం ఒకింత సులభం. కానీ... కాళ్ల నుంచి గుండెకు రక్తం ప్రవహించాలంటే పైవైపునకు అంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ప్రవహించాలి. అందుకు మరింత శక్తి కావాలి. ఆ శక్తిని సమకూర్చేదే పిక్క. అందుకే ‘పిక్క’ను మన శరీరపు రెండో గుండెకాయగా అభివర్ణిస్తారు. ఇక భాషాశాస్త్రానికి వద్దాం. గుండెబలం అంటే ఇప్పటివరకూ అర్థం మనోబలం. కానీ పిక్కబలం అంటే అధైర్యం చూపించి పరుగెత్తడం అని అర్థం. కానీ పిక్క గురించీ, గుండెలా అది నెరవేర్చే విధుల గురించీ వాస్తవం తెలిశాక పిక్కబలమూ ఇంచుమించూ గుండెబలంతో సమానమని మీకు వేరే చెప్పాలా?
 
పిక్కకు ఎందుకీ గుండె డ్యూటీలు...?

మన పిక్కను చూడండి. కాస్త గమనించి చూస్తే అటు ఇటుగా చూడ్డానికి గుండెలా అనిపించదూ? అనిపించడం ఏమిటి, అది నిజంగానే గుండె నిర్వహించే విధులు నిర్వహిస్తుంది. కారణం... గుండె తన పంపింగ్ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంది. దానికో పంపింగ్ ప్రక్రియ ఉంది, పైగా అది శరీరంలో ఎగువన అనువైన ప్రదేశంలో ఉంది. కాబట్టి అన్నివైపులకూ రక్తాన్ని పంప్ చేయడం సులభం. అయితే కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా బలంగా పైకి రావాలి. అలా రావడంతో పాటు ఆ రక్తం అదనపు బరువును అంటే ఆక్సిజన్‌నూ, పోషకాలనూ తనతో మోసుకుపోవాలి. అలా చేసేందుకు పిక్క ఉపయోగ పడుతుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ (సీఎమ్‌పీ) అంటారు. అంతేకాదు... శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు.

• పిక్క గుండె డ్యూటీలెలా చేస్తుందంటే...!

 పిక్కలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తుంటాయి. అయితే మరీ ముఖ్యంగా ఈ కండరాల్లోని రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ కండరాలు ఈ విధిని నిర్వహించడంలో కీలకంగా తోడ్పడతాయి. ఈ కండరాలు క్రమంగా ముడుచుకోవడం, తెరచుకోవడం (రిలాక్స్‌కావడం) అనే పనిని క్రమబద్ధంగా చేస్తూ రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. భూమ్యాకర్షణ కారణంగా రక్తం కిందికి రాకుండా వాల్వ్ (కవాటాల) సహయంతో మూసుకుపోతూ పైవైపునకే రక్తం ప్రవహించేలా చేస్తుంటాయి.
 
ఈ రెండో గుండె సరిగా పనిచేయకపోతే...

మన శరీరపు రెండో గుండె అయిన పిక్క సరిగా పనిచేయకపోతే అప్పటికే వినియోగితమైన రక్తం కాళ్లలో ఉండిపోతుంది. ఈ రక్తంలో ఆక్సిజన్ అప్పటికే కండరాల వల్ల వినియోగం అయిపోయి ఉండటం వల్ల మళ్లీ కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందదు. దాంతో కండరాలు తీవ్రమైన అలసటకు గురవుతాయి.
 
ఈ సమస్య ఎవరెవరిలో ఎక్కువ?
 
చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారికి (ఆఫీసుల్లో పనిచేసేవారికి లేదా కదలకుండా ఇంటిపట్టునే ఉండేవారికి)ఎక్కువసేపు అదేపనిగా నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి (లెక్చరర్లు, టీచర్లు మొదలైనవారికి)  స్థూలకాయంతో బాధపడేవారికి గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలకు ఈ సమస్య రావచ్చు.
 
• సమస్యను అధిగమించడానికి చేయాల్సిందేమిటి?

క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల చొప్పున వాకింగ్ చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా నడవడం వల్ల పిక్కతో పాటు శరీరంలోని అన్ని కండరాలకూ వ్యాయామం ఏర్పడి పూర్తి ఆరోగ్యం బాగుంటుంది).మీ శరీరపు బరువును అదుపులో ఉంచుకోండి. (స్థూలకాయాన్ని తగ్గించుకోండి).మీ కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమి వేసేలా వీనస్ స్టాకింగ్స్ అనే తరహా సాక్స్ వంటి తొడుగులను ధరించండి. ఇలా కనిపించినప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్ సలహా తీసుకోండి.
 
• పిక్క గుండెలా పనిచేయనందున ఎదురయ్యే సమస్యలివే...!

కాళ్ల చివరలకు రక్తసరఫరా చాలా తక్కువగా జరగడంమనకు వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం నిర్వీర్యం కావడంచెడు రక్తాన్ని తీసుకుపోయే సిరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడం వంటివి జరుగుతాయి. దీనివల్ల ఏర్పడే పరిణామాలివే...కాళ్లు ఎప్పుడూ అలసటతో ఉండటం కాళ్లూ, పాదాలలో వాపువేరికోస్ వెయిన్స్ (అంటే కాళ్లపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బినట్లుగా చర్మం నుంచి బయటకు కనిపించడం)కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకుండా అలాగే ఉండటంకాళ్లు రెండూ అదేపనిగా చకచకా కదిలిస్తూ ఉండే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్‌తో బాధపడటంకాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం you (డీప్ వీన్ థ్రాంబోసిస్)✍️
 
- డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,
కేపీహెచ్‌బీ, హైదరాబాద్.

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

శ్రీ ఆంజనేయ స్వామివారి మహిమ తెలిపే ప్రత్యక్షంగా జరిగిన ఒకప్పటి విషయము:

 


2809. 1-3.   310123-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

      *ఓం శ్రీ ఆంజనేయాయ నమః*
                    ➖➖➖✍️

*శ్రీ ఆంజనేయ స్వామివారి మహిమ తెలిపే ప్రత్యక్షంగా జరిగిన ఒకప్పటి విషయము:*

*అవి బ్రిటీష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయము. 1832 వ సంవత్సరము.*

*ఎడ్వర్డ్ అనే అతను తిరుచ్చిరాపల్లిలో కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన కావేరీ నదిపై ఆనకట్ట (నేటి Grand Anaicut near Thanjavur) కట్టాలని సంకల్పించి ఆ పనిని  రామస్వామి అనే కాంట్రాక్టర్ కు అప్పగించారు.*

*ఆ రామస్వామి పరమ ‘రామ’ భక్తుడు.*

*అతను డ్యాం కట్టే పనిని ప్రారంభించాడు. మొదటి వరుస కట్టడం పూర్తి అయినది.* 

*కానీ ఆరాత్రికి కావేరీ పొంగి ఆ కట్టడం కొట్టుక పోయింది. రామస్వామి దిగులు పడి.. మరలా కట్టించాడు.* *దురదృష్టవశాత్తు ఆ వరుస కట్టడం కూడా కొట్టుక పోయింది. రామస్వామికి ఏంచేయాలో పాలుపోలేదు.*
*ఆ కలెక్టరేమో చండశాసనుడు. నిర్ణీత సమయంలో ఆపని పూర్తిచేయాలని శాసించాడు.*

*ఆ రోజు రాత్రి.. రామస్వామి ఆ కట్టడం జరిగే స్థలంలో నిదురించాలని ఉపక్రమించాడు. పడుకుంటే, తలకు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించి లేచి.. ఆ గుచ్చుకున్న రాతిని పెకలించి చూస్తే..., అది 'శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం'.*

*రామస్వామికి కంట్లో నీరు వచ్చాయి. అయ్యో, ఓ ఆంజనేయా, దైవమా.. నిన్ను విస్మరించానే. క్షమించు. అని పరిపరి విధాలా స్వామిని ప్రార్థించి, వెంటనే స్వామిని అచ్చటనే ప్రతిష్ఠించి, వేడుకున్నాడు….“ఈ సారి, కట్టడం కొట్టుకొని పోకుండా నిలబడేటట్లు చేయు తండ్రీ, నీకు గుడి కట్టిస్తాను” అని మొక్కుకున్నాడు.*

*అద్భుతం, ఈ సారి కట్టడం కొట్టుక పోలేదు. రామస్వామి, వెంటనే గుడి కట్టడం మొదలు పెట్టాడు.*

*అంతలో కలెక్టర్ జమాబందీకి వస్తున్నాడని వార్త. రామస్వామికి భయమేసింది. ఒక వరుస కట్టడం మాత్రమే అయ్యింది.*

*సరే ఏమయినా సరే, ఆ దైవమే చూసుకుంటాడనే భావనతో, గుడికట్టే పనిలో నిమగ్నమయ్యాడు.*

*కలెక్టర్ వచ్చాడు. ఇంచుమించు రెండు నెలలు అయ్యింది. కాంట్రాక్టరేమో డ్యాం పని ఆపి గుడి కట్టుచున్నాడు. కలెక్టర్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. రామస్వామిపై విపరీతమైన కోపం వచ్చింది. “ప్రభుత్వపు పనులు ఆపి గుడి కట్తున్నావా. You Indians are idiots, you pray MONKEY GODS.. “ అంటూ అదే కోపంతో అక్కడ ప్రతిష్ఠించిన ఆంజనేయ విగ్రహాన్ని పెకలించాలని ప్రయత్నించాడు.*

*ఇంతలో ఒక అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఎక్కడనుంచి వచ్చాయో గండు కోతులు….రావడం రావడం కలెక్టర్ పైకి దుమికాయి. అతని గుర్రాన్ని తరిమాయి. కోటును చించాయి. శరీరాన్ని రక్తం వచ్చేటట్లు బరికాయి.* 

*కలెక్టర్ భయభ్రాంతుడయ్యాడు. వెంటనే రామస్వామిని, తన బంట్రోతులను ఆ కోతులను తరమమని ఆజ్ఞాపించాడు. వారు తమవల్ల కాదని.. ఆ ఆంజనేయ స్వామినే వేడుకోమన్నారు. *

*కలెక్టరుకు తన తప్పిదం తెలిసి వచ్చింది. వెంటనే ఆంజనేయస్వామి పాదములకు సాష్ఠాంగ నమస్కారములు చేసుకొని, ఇకపై ఈగుడిని తను కట్టిస్తానని ప్రార్థించాడు.* 

*వెంటనే  Government Gezette Notification జారీ చేశాడు. *

*అప్పుడు అక్కడ చేరిన కోతులన్నీ అదృశ్యమయ్యాయి. అదంతా ఆ స్వామి వారి మహిమే అని అందరూ పొంగిపోయారు. *

*గుడి కట్టించారు.*

*తర్వాత అనతికాలంలోనే డ్యాం పని కూడా పూర్తయ్యింది.*
       
*మనం ఈ స్వామి వారి గుడిని, ఆ డ్యాం కట్టడం క్రిందుగా చూడవచ్చు. అందులో కలెక్టర్, కాంట్రాక్టర్ పేర్లను ఒక ఫలకంపై లిఖించి వున్నారు.*

*ఇప్పటికీ మనం Tiruchiraapalli Collectorate లో.. సుమారు రెండువందల సంవత్సరాల క్రితపు గెజిట్ ను చూడవచ్చు.*

*ఓం శ్రీ రామాయనమః*
*ఓం శ్రీ ఆంజనేయాయ నమః*

                     🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

అసలు దెయ్యాలు!

 2709.    1-6.   300123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

            *అసలు దెయ్యాలు!*
                 ➖➖➖✍️

*ఒక చెట్టుకు ఓ గాడిద కట్టేయబడి ఉంది... దాని యజమాని రోజూ దాన్ని అలా కట్టేస్తూ ఉంటాడు... *

*ఓ రాత్రి ఆ చెట్టుపై ఉండే దెయ్యం ఆ కట్లను తెంచేసింది... ఇక ఆ గాడిద గట్టిగా ఒళ్లు విరుచుకుని, మరింత గట్టిగా ఓండ్రపెట్టి లోకంపై పడింది... *

*ముందుగా ఆ పక్కనే ఉన్న పొలాల్లో అడుగుపెట్టి, ఆ చేను అంతా తొక్కి, ధ్వంసం చేసింది... దీంతో చిర్రెత్తిన ఆ రైతు భార్య గాడిదను ఓ గొడ్డలితో నరికేసింది...*

*ఇది చూసి కోపం ఆపుకోలేక సదరు గాడిద యజమాని ఆ రైతు భార్యను వేటకొడవలితో నరికేశాడు...*

*ఆమె భర్త ఊరుకుంటాడా...? ఓ గునపం తీసుకొచ్చి ఆ గాడిద యజమాని గుండెల్లో పొడిచాడు... వాడు వెంటనే చచ్చూరుకున్నాడు...*

*గాడిద యజమాని భార్య ఆగ్రహం పట్టలేక, కొంగు నడుంకు బిగించి,  తన కొడుకులను కేకేసింది. వాళ్లంతా కలిసి ఆ రైతు ఇంటికి నిప్పెట్టారు...*
 
*తన ఇంటిని మంటల్లో చూసి, ఆ బూడిదతో కళ్లు మండిపోయిన రైతు ఆ గాడిద యజమాని భార్యను, కొడుకులను వెంటాడి వెంటాడి చంపేస్తాడు... *

*తరువాత కాసేపటికి ఆవేశం తగ్గి, ఆ దెయ్యాన్ని అడుగుతాడు... ‘‘ఎందుకు ఇంతమంది చావుకు కారణమయ్యావు..?’’*

*దెయ్యం ఏమన్నదంటే..? ‘‘నన్ను అనవసరంగా నిందించకు..!                 నేను ఒక్కరినైనా చంపానా..? చెట్టుకు కట్టేసి ఉన్న ఓ గాడిదను జాలితో విడిపించాను... అంతే..!                          మీరే మీలో ఉన్న అసలు దెయ్యాలను స్వయంగా బయటికి తీసి, ఒకరికొకరు చంపుకున్నారు...!*

*మీడియా, సోషల్ మీడియా కూడా అంతే..!  రోజుకో గాడిద కట్లు తెంపేసి, సమాజం మీదకు వదిలేస్తయ్...! మనం వాదాలు, ద్వేషాలతో తన్నుకుంటూ, పాత స్నేహాల్ని కూడా చంపేసుకుంటూ ఉంటాం..!         కొత్త శత్రువుల్ని ఆహ్వానిస్తుంటాం..!  సో, బహుపరాక్... అసలు దెయ్యాలు ఎవరో అర్థమైంది కదా... జాగ్రత్త...!!!*


*(ఓ ఇంగ్లిష్ పోస్టుకు స్వేచ్ఛానువాదం... గతంలో చదివేసి ఉంటారా..? పర్లేదు, ఇది ఎన్నిసార్లు చదివితే అంత మంచిది... మనసులో బాగా ముద్రపడి మరింత జాగ్రత్తగా ఉంటారు...)*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

భీష్ముడు చెప్పిన కథ… *చెలిమి ఎరిగి స్నేహం చేయలి* ➖➖➖✍️ _-[నిత్యజీవితానికి వర్తించే నీతి]-_

 1901.    2-5.   300123-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
భీష్ముడు చెప్పిన కథ…

     *చెలిమి ఎరిగి స్నేహం చేయలి*
                 ➖➖➖✍️
_-[నిత్యజీవితానికి వర్తించే నీతి]-_

*ఒకానొక అడవిలో ఓ మర్రిచెట్టు కింద ‘ఫలితుడు’ అనే ఎలుక జీవిస్తోంది. అదే చెట్టు మీద ‘రోజసుడు’   అనే పిల్లి కాపురం చేస్తోంది.* 

*ఒక వేటగాడు రోజూ రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి, అక్కడ ఓ వలను పరచి వెళ్లేవాడు. రాత్రివేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి, ఉదయమే వచ్చి వాటిని చేజిక్కించుకుని చక్కగా పోయేవాడు.*

*ఒక రోజు అనుకోకుండా ఈ ‘రోజసుడు’ అనే పిల్లి పోయి పోయి ఆ వలలో చిక్కుకుపోయింది.*

*పిల్లి వలలో పడింది కాబట్టి ఎలుక దానిచుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది.*

*ఆహారం కోసం అటూఇటూ చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కొద్ది దూరంలోనే ఒక ముంగిస, గుడ్లగూబ దానికి కనిపించాయి. అవి ఎలుకని గుటుక్కుమనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు.*

*అలా అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్లి ‘నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను. బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ, ముంగిసల బారి నుండి రక్షించవా !’ అని అడిగింది.*

*పిల్లికి అంతకంటే ఏం కావాలి. వెంటనే అది సరేనంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది.* 

*పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగిస, గుడ్లగూబ జారుకున్నాయి.*

*‘నేను నీ ప్రాణాలను రక్షించాను కదా ! మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడేయి,’ అని అడిగింది పిల్లి.*

*’ఉండు ఉండు నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా ! నిన్ను ఇప్పుడే బయటకు తీసుకువస్తే, నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం ? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను,’ అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది ఎలుక.*

*అన్నట్లుగానే మరుసటి ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుటుక్కున కొరికేసింది.* 

*వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుకా తన కలుగులోకి దూరిపోయింది.*

*మర్రిచెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికివేసిన వలని చూసి తెగ బాధపడ్డాడు. తన ప్రయత్నం వృధా అయిపోయిందన్న బాధతో వెనుదిరిగి వెళ్లిపోయాడు.*

*వేటగాడు అటు వెళ్లగానే పిల్లి కిందకి చూస్తూ ‘ఎలుక మిత్రమా! నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందాము,’ అంటూ పిలిచింది._*

*దానికి ఎలుక నవ్వుతూ ‘మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రడు అవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులం అయిన మనమిద్దరి మధ్యా స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయపడ్డానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు. కానీ ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన నీకు రాకపోదు.’*

*’శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా, ఆ స్నేహాన్ని విడువకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతోంది. నువ్వు నన్ను రక్షించావు. బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు. ఇక మీదట నా జోలికి రాకు !’ అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక.*

*ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి మారుమాటాడకుండా వెనుదిరిగిపోయింది.*
                         
*భీష్ముడు చెప్పిన ఈ కథలోని పాత్రలు సహజశత్రువులైన పిల్లీ ఎలుకలే అయినా, ఇందులోని నీతి నిత్యజీవితానికి కూడా వర్తించి తీరుతుంది.* 

*అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి తెలిసీ అపకారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తోంది.* 

*పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి, జీవితాన్ని పణంగా పెట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తోంది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Wednesday, February 1, 2023

కర్మ-ఫలితాలు:

 0510.  1-5.   290123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                *కర్మ-ఫలితాలు:*
                  ➖➖➖✍️

*మనం నిత్య జీవితంలో అనేక కర్మలు చేస్తున్నాం. మనకి ఎదురయ్యే సమస్యలు, వేదనలు, బాధలు ప్రారబ్ధ కర్మ ద్వారా వస్తున్నాయి.*

*నిజానికి వీటి కన్నా , వీటిని ఎదుర్కొంటున్నపుడు మన ప్రతిస్పందన లే చాలా క్రొత్త కర్మ సృష్టిస్తున్నాయి.*

*వీటి కర్మ ఫలితాలూ ఇప్పుడో మరెప్పుడో అనివార్యంగా అనుభవించాలి!*

*వాక్కు రూపంలో చేసే కర్మలకి ఫలితం వర్తమానంలోను, భవిష్యత్తులో కూడా ఉంటుంది.*

*ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కర్మల కి తిరిగి స్పందించకపోతే కర్మ అంటదా? సాక్షి గా మాత్రమే నిలిస్తే కర్మ సృష్టించ బడదా?  మనం పొందుతున్న కర్మ ప్రారబ్ధ కర్మలో భాగమా? కాదా? ఎలా తెలుస్తుంది?*

*మనం ఎదుర్కొంటున్న భిన్న కర్మలకి తిరిగి ఏవిధంగాను స్పందించకపోతే, క్రొత్త కర్మ సృష్టించబడదు. ఇలా ఉండటం చాలా కష్టమైన విషయమే! దీనికి ఎంతో సాధన అవసరం. భక్తులు, యోగులు ఇలాంటి స్థితి ఎదురైనప్పుడు, ఎవరు తమని ఎలా బాధించినా, వారందరు భగవంతుడి రూపాలు గాను, ఎదురైన కర్మ రూపంగా భావించారు.* 

*’మనకి ఎదురైన ప్రతి సమస్య, వేదన, కష్టం అన్నీ ప్రారబ్ధ కర్మ రూపమే!’ అని భావించడమే మంచిది* 

*ఒకవేళ ఇది క్రొత్తగా వస్తున్నా, గతానికి సంబంధం లేక పోయినా, మన మనస్సు ఇలా స్థిరమై దృఢమై భగవచ్చింతన లో ఉంటే ఏ కర్మ మనల్ని బాధించదు.*

*భక్తి జ్ఞానం మన మనస్సు లో నిండి ఉంటే.. ఏఒక్కరు మనల్ని బాధించలేరు.* 

*నిజానికి మనస్సు ఏ రెండు విషయాలని ఒకే కాలం లో ఆలోచించ లేదు కదా.*

*ఈ భక్తి జ్ఞానాలు ఒక యోగస్థితి లోకి తీసుకు వెళ్లి సర్వ విధమైన చిత్త వికారాలను దూరం చేస్తాయి.* 
                          ….P.L.N..ప్రసాద్.

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

ఆసక్తికరమైన … * *భీష్ముడి జన్మ రహస్యం!!

 0302.   2-9.   290123-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*ఆసక్తికరమైన … *
            *భీష్ముడి జన్మ రహస్యం!!*
                  ➖➖➖✍️

*మహాభారతం ఎంత గొప్ప గ్రంథమో తెలిసిందే. అందులో ప్రతి పాత్ర ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది.* 

*ఇక  అందులో కృష్ణార్జునుల సాంగత్యం, యుద్ధ సమయంలో అర్జునుడు భయపడితే కృష్ణుడు ధైర్యం చెబుతూ, విషయాన్ని కూలంకషంగా విశ్లేషించి చెబితే అది యావత్ మానవాళికి భగవద్గీతగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అనుసరించే మనోవిజ్ఞాన గ్రంథంగా కూడా అందరికి వర్తిస్తుంది.* 

*అలాంటి మహాభారతంలో గొప్ప పాత్ర భీష్ముడు.* 

*ఈయన శంతన మహారాజు, గంగాదేవిల కుమారుడు. సకల విద్యలు అభ్యసించి ధైర్య, సాహసాలలోనూ, యుద్ధ విద్యలోనూ, కళలోనూ ఎంతో ప్రావీణ్యం సంపాదించినవాడు.*

*ముఖ్యంగా మహాభారతంలో ఉన్న ప్రతి పాత్ర మరణం వెనుక యుద్ధమో, కుట్రలో, కుతంత్రాలో ఉంటాయి. కానీ అలాంటివి ఏమీ లేకుండా స్వచ్చంధ మరణం పొందినవాడు ఎవరైనా ఉన్నారా అంటే అది భీష్ముడే.* 

*మాట మీద నిలబడుతూ, న్యాయానికి తన ఓటు వేస్తూ చరిత్రలో భీష్మ పితామహుడిగా మిగిలిపోయిన ఈయన గత జన్మ గురించి తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.*

**ప్రభాసుడు… భీష్ముడు!!*

*’ప్రభాసుడు’ ఎవరు అని చాలా మందికి అనుమానం వస్తుంది. దేవతలలో కూడా జాతులు ఉన్నాయి. వారిలో ‘వసువులు’ కూడా ఒక జాతి.            ఆ వసువులు ‘అష్టవసువులు’ అంటారు.* 

*ఈ అష్ట వసువులలో చివరి వాడు ప్రభాసుడు. ఈ ప్రభాసుడు తన అన్నలు, వారి భార్యలతో కలసి భూలోకానికి వచ్చినపుడు వశిష్ఠ ముని ఆశ్రమంలో తిరుగుతూ అక్కడ కనిపించిన దేవతా రూపమైన ఆవును చూసి దాన్ని ఎత్తుకుని పోతారు.* 

*ఆవును ఎత్తుకుని పోయినందుకు  వశిష్టముని కోపం చేసుకుని వసువులను భూమీ మీద మనుషులుగా పుట్టమని శపిస్తాడు.* 

*అయితే తరువాత వాళ్ళు బతిమాలుకునేసరికి ఆవును తీసుకెళ్లడానికి ముఖ్య కారణమైన ప్రభాసుడిని తప్ప మిగిలిన ఏడు మందికి తొందరగా జన్మ ముగిసి శాపం పోయేలా చేస్తాడు.*

*అయితే ఘోరమైన శాపం పొందిన ప్రభాసుడు కూడా భీష్ముడిగా పుట్టడం వెనుక ఒక రహస్యం ఉంది, ప్రభాసుడి భార్య అయిన యోగసక్త, తన స్నేహితురాలి కోసమే ఆవును దొంగిలించమని అడుగుతుంది.*

*వశిష్ఠుని శాపం గురించి తెలిసిన తరువాత యోగసక్త స్నేహితురాలు ఎన్నో కష్టాలు పడి ప్రయాణం చేసి, వశిష్ఠ మునిని చేరుకుని, ఆవు దొంగిలించడానికి ముఖ్య కారణం నేనే అని చెప్పి, ఆ శాపాన్ని నాకు ఇవ్వమని, ప్రభాసుడికి శాపం తొలగించమని అడుగుతుంది.* 

*ఆమె నిజయితీకి మెచ్చుకున్న వశిష్ఠుడు ప్రభాసుడు చరిత్రలో నిలిచిపోయే క్షత్రియ రాజుగా పుడతాడని శాపంలోనే వరాన్ని ప్రసాదిస్తాడు.*

*అలా భూమి మీద శంతన మహారాజుకు, గంగాదేవికి పుట్టిన భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు.  గంగాదేవి మాయమైపోయిన తరువాత భీష్ముడి తండ్రి ఐన శంతనుడు సత్యవతిని పెళ్లిచేసుకోవాలని అనుకున్నప్పుడు సత్యవతి తల్లిదండ్రులు దేవవ్రతుడు ఉన్నాడు కాబట్టి మేము నీకు మా కూతురుని ఇవ్వము, అతను రాజు అయితే నా కూతురి పిల్లలకు న్యాయం జరగదు అంటారు.* 

*అప్పుడు దేవవ్రతుడు నేను జీవితాంతం పెళ్లి చేసుకొనను, అలాగే రాజ్య పాలన విషయాల్లో సహాయంగా ఉంటాను తప్ప అధికారం తీసుకొనని చెప్పి తండ్రికి రెండో పెళ్లి చేస్తాడు.*

*అలా అతను జీవితాంతం పెళ్లి లేకుండా ఉంటాడు. భీష్మించు అంటే ప్రతిజ్ఞ చేయడం. అలా ప్రతిజ్ఞ చేశాడని దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు స్థిరపడిపోయింది.*

*భీష్మ నీతి, భీష్ముడి పోరాట పటిమ ఎలాంటిదంటే తన మాయోపాయంతో అందరినీ ఆడించే శ్రీకృష్ణుడు ఆ భీష్ముడి భక్తుడు, ఆయన మాట జవదాటని వాడు.*

*ఇంత గొప్ప వీరుడి గురించి విన్న, తెలుసుకున్నా వారి నీతిలో నడిచినా జన్మ ధన్యమవుతుంది. జీవితం సంతోషమయమవుతుంది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

భక్తులు అనే వారికి, భగవంతుని పై ముందుగా నమ్మకం, విశ్వాసం ముఖ్యం!!...

 280123a1832.   290123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀753.
నేటి…

             *ఆచార్య సద్బోధన:*
                ➖➖➖✍️

*భక్తులు అనే వారికి, భగవంతుని పై ముందుగా నమ్మకం, విశ్వాసం ముఖ్యం!!...*

*మనం రైల్వే స్టేషన్‌కు చేరుకునే వరకు, మన సామాను తీసుకెళ్లడానికి ఒక గుర్రపు బండి లేదా సైకిల్ రిక్షా లేదా టాక్సీలో తీసుకెళ్తాం.*

*ఇవేవీ లేని పక్షంలో లగేజీని తలపై మోయాల్సి వస్తుంది,  స్టేషన్‌కు చేరుకుని రైలులో కూర్చున్నాక, రైలు మన లగేజీతో పాటు మనల్ని తీసుకువెళుతుంది.*

*రైలు ఎక్కిన తర్వాత కూడా లగేజీని తలపై పెట్టుకుంటామా?  అలా పెట్టుకుంటే అంతటి కన్నా మూర్ఖత్వం ఇంకేముంటుంది??*

*మనల్ని మోసే రైలు మన లగేజిని మోయాలేదా?! *

*అలాగే మనం భగవంతునికి శరణాగతులమయి ఉండాలి, నిస్సందేహంగా, షరతులు లేకుండా ప్రతిదీ ఆయనకు సమర్పించాలి..!* 

*అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా భగవంతునికి వదిలేయాలి, ఆయన మనకు మంచిదానినే యిస్తాడు.*

*ఇది కేవలం ఆయనపై అచంచల విశ్వాసంతో వున్నపుడే సాధ్యమవుతుంది...*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

అసలైన సౌభాగ్యం

 06102.   1-6.  280123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

           *అసలైన సౌభాగ్యం*
                ➖➖➖✍️

*సమాజంలో అందరిదీ ఒకే రీతి జీవిత గమనం కాదు. కొందరు భాగ్యవంతులు, మరికొందరివి దైన్యమైన జీవన పరిస్థితులు.*

*ఎందరో వారివారిలోని సామర్థ్యాన్ని, సహజ ప్రతిభలను వృద్ధి చేసుకునే అవకాశమూ ఆలోచనా లేనివారు. వీళ్లంతా సంతోషంగా బతుకుతున్నారా అంటే, కచ్చితంగా ఔనని చెప్పలేం.*

*ఆనందం మనసుకు సంబంధించింది. అదేమీ ఎండమావి కాదు. ఆనంద స్థితిని అందుకోవడం కష్టతరం కాదు. ఎందుకంటే సంపదలకు, లేమికి అతీతమైంది ఆనందం. కొన్నిసార్లు బండి లాగేవాడిలో కనపడే ఆనందం సొంత కారు నడిపేవాడిలో కనిపించకపోవచ్చు.*

*సంతోషం లేని సంపదలు విషతుల్యమైన రసభరిత ఫలాల్లాంటివని కౌటిల్యుడు రాజనీతి శాస్త్రంలో చెబుతాడు. మనలో చైతన్యం ఉంటే సంతోషం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.* 

*కష్టసుఖాల మధ్య తేడా గమనించని వ్యక్తి మనసు సదా నిర్మలంగా ఉంటుంది. నిర్మల హృదయం గలవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందం వేరెక్కడో దొరికే వస్తువు కాదు. మనలోని చైతన్యమే ఆనందం!*

*ఏది ఉన్నా లేకున్నా, అసంతృప్తితో జీవించేవాడికి ఆనందం అందని ద్రాక్ష లాంటిదే. జీవన మార్గంలో ఎంత వేగిరపడినా అందరికీ అన్నీ అందవు. దేనికైనా కొన్ని పరిమితులుంటాయని గమనించాలి. ఈ హద్దులను గుర్తించలేకపోతే నిరాశ, నిస్పృహ తప్పవు. మనిషికి దుఃఖం ఇక్కడే ప్రారంభమవుతుంది. ఆశించడంలో తప్పులేదు. ఆశించినదాన్ని అందుకోవడం కోసం శ్రమ పడాలి. ఆశ లాలస కాకూడదు. శక్తికి మించిన ఆశ దురాశే అవుతుంది. గాఢమైన కోరికలతో సతమతం కావడం మంచి లక్షణం కాదు. అది దుఃఖానికి కారణమవుతుంది.* 

*ఎక్కడైతే కోపం, దురాశ, ఈర్ష్య ఉండవో ఆ శూన్యంలో చైతన్యం వికసిస్తుంది. ఆ చైతన్యమే ఆనందానికి     హేతువు అవుతుంది.*

*వక్తగా వేదికనెక్కి ప్రసంగి స్తుంటే... సభలో నిశ్శబ్దం ఆవహించి అందరూ ఆ ప్రసంగాన్ని విని చివర్లో ఆ ప్రాంగణం కరతాళ ధ్వనులతో నిండిపోతే ఆ వక్త లోపలినుంచి ఉబికి ఉబికి పొంగిపొరలి వచ్చేదే ఆనందం. ఆ ఆనందం ఎలాంటిదంటే గతంలో తనను విమర్శించినవారిని సైతం హృదయపూర్వకంగా క్షమించేటంతటిది!* 

*తోటలో గుంత తవ్వి ఒక మొక్క నాటడంలో మనం పూర్తిగా నిమగ్నమై ఆ పరిసరాలనే మరచిపోతే... అదిగో అక్కడ ఉంటుంది ఆనందం!*

*ధనం, ప్రతిష్ఠ, అధికారం కోసం వెంపర్లాడతాం. వాటిలోనే ఆనందం ఉందని అనుకొంటాం. ద్వేషం, అసూయ, కోపం మనల్ని వెన్నంటి ఉంటాయి. అయినా వాటిని గమనించం.* 

*సూర్యోదయానికి ముందే చల్లని వాతావరణంలో కిలకిలా రావాలు చేస్తూ ఆకాశంలో ఎగిరే పక్షులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ప్రాతఃకాలంలో చల్లని గాలులకు ఊగుతున్న చెట్లు, మంచు కురిసిన పచ్చిక, ఇంటిముందు ఉదయాన్నే రంగవల్లులు దిద్దుతున్న గృహిణుల కళాభిరుచి... పరిశీలిస్తే ఎంతగానో ఆకట్టుకుంటాయి. మనసును కట్టిపడేస్తాయి. ఆ ఆనందం ముందు ధనం, ప్రతిష్ఠ, అధికారం ఏ పాటివి? అటువంటి అభిరుచి మొలకెత్తితే- మనుషుల్లో ఆనందం మొక్కగా మారి మ్రానవుతుంది. మనలోని చైతన్యం వికసిస్తే ఆనందం మనసును ఆవహించి ఉంటుంది.*


*యోగి ఎందుకు ఆనందంగా ఉంటాడు? ఆయన వద్ద డబ్బు లేదు. అధికారం అంతకన్నా లేదు. ఆ యోగిలోని చైతన్యం కారణంగా ఎప్పుడూ చిరునగవుతో అంతర్లీనంగా ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. దైవం పట్ల అప్రమత్తతతో, ఎరుకతో ఉంటాడు. ఆనందంగా జీవించగలిగితే పవిత్రత మనల్ని అనుసరించి ఉంటుంది. సంతోషంగా ఉండేందుకు మనిషి మనసుతో సంబంధం పెట్టుకొని భౌతిక విషయాలపట్ల నిర్లిప్తంగా ఉండాలి. సుఖం, దుఃఖం మనకు సంబంధించిన వ్యక్తులపై ఆధారపడి ఉంటాయి. ఆనందం అలా కాదు. అది మన మనసు లోలోపలి నుంచి ఉబికే ఊట!*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

#ఓ_తల్లి_మనసు…*

 0101.  2-8.   280123-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                 *తల్లి మనసు*
                 ➖➖➖✍️

_*Heart touching Memories._*

*#ఓ_తల్లి_మనసు…*

*ఒకప్పుడు నా ఇల్లు నవ్వులు,                    వాదనలు , అరుపులు , కేకలు ,           అల్లరితో హడావిడిగా ఉండేది.*

*ఇల్లంతా పెన్నులు , పుస్తకాలు, ఆట సామాన్లు, మడత పెట్టని దుప్పట్లు , విసిరేసిన చెప్పులు, ఆరేయని తడి తువ్వాళ్ల తో చిందర వందర గా ఉండేది.* 

*నా రోజువారీ పని , అరవడం, వాళ్ళని కోప్పడ్డం , క్రమ శిక్షణ  చెప్పడం , చివరికి అన్నీ నేనే సద్దుకోవడంలా ఉండేది..!*

*#ఉదయరాగం*

*పొద్దున్న లేచిందగ్గరినించీ  ‘అమ్మా నా బ్రష్ ఎక్కడ, అమ్మా నా స్కూల్ బాగ్ ఎక్కడ, నా బూట్ లేసు పోయింది, నా హోమ్ వర్క్ బుక్ పోయింది , హోమ్ వర్క్ చెయ్య లేదు , స్కూల్ మానేస్తాను,’ ఇవీ మా ఇంట్లో ఉదయ రాగాలు!*

*#నా_దినచర్య *

*విసుక్కుంటూనే వాళ్ళ వస్తువులు వెతికి ఇవ్వడం, "మీ వస్తువులు మీరే జాగ్రత్త చేసుకోవాలి, పెద్దవుతున్నారు, ఎప్పుడు నేర్చుకుంటారు?"  *

*#సంధ్యారాగం *

*"అమ్మా,?ఏదైనాపెట్టు, ఆడుకోడానికి వెడుతున్నా, నాకు కొత్త బ్యాట్ కొనాలి, మా ఫ్రెండ్ ఇంటికి వెడుతున్నా" అని వాళ్ళంటే…, "చీకటి పడకుండా త్వరగా రావాలి, దెబ్బలు తగుల్చుకోకండి!" ఇవే నా గొంతు లోంచి అప్రయత్నంగా వచ్చే మాటలు .*

*#వర్తమానం *

*ఇప్పుడు నేను అదే ఇంటిలో ,  వాళ్ళు అల్లరి చేసి కొట్టుకున్న  అరుచుకున్నచోట నిలబడి చూస్తున్నాను.*

*ప్రస్తుతం మా ఇంట్లో నీట్ గా సర్ది ఉన్న పక్కలు , మంచాలు , కొంచెం చిరిగిన , పొట్టి అయిపోయిన బట్టల బీరువాలు , ఖాళీ అలమారాలు కానీ... అప్పుడు పిల్లలు వాడిన సెంట్ల వాసన మాత్రం గాలిలో అలానే ఉంది.*

*ప్రతి పిల్లకి, పిల్లాడికి ఒక ప్రత్యేక సువాసన ఉండేది.*
*ఆ వాసనలు ఇప్పటికీ నా ఖాళీ గుండెని నింపుతాయి.*

*ప్రస్తుతం నాకు వాళ్ళ అల్లరి ,  ఆటలు , ప్రేమతో ఇచ్చిన  కౌగిళ్లు , మధుర జ్ఞాపకాలు!*

*ఈరోజు మాఇల్లు ఎక్కడివక్కడ పొందికగా ఆరేసిన తడి బట్టలు , తెరవాల్సిన అవసరమేలేని చెప్పుల స్టాండ్ , శాంతి గా , ప్రశాంతంగా ఉంది. కానీ ఇది నిర్జీవమైన ఎడారి అనిపిస్తుంది.*

*ఇప్పుడునేను ఎవరి మీదా అరవక్కరలేదు , ఎవరికీ ఏమీ చెప్పక్కర లేదు. అసలు మాట్లాడ్డానికే మనుషులు లేరు.*

*ఎప్పుడైనా నా పిల్లలువస్తే , నాతో గడిపి వెళ్లిపోతుంటే , వాళ్ళ బ్యాగ్ లు సద్దుకుంటుంటే , నా గుండెలు పిండి నట్టు అనిపిస్తుంది.*

*వాళ్ళు టాక్సీ ఎక్కి తలుపులు వేస్తుంటే, "వీధి తలుపులు వేసివెళ్ళండి" అని నేను అరిచిన సందర్భాలు గుర్తుకొచ్చి , కళ్ళ నీళ్లు తిరుగుతాయి.*

*ఈ రోజు నేనే అన్ని తలుపులు వేసుకుంటూ తీసుకుంటూ ఉంటే, పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లా దేశంలోనో , విదేశాల్లోనే వాళ్ళ గమ్యాలు వెతుక్కుంటూ వెళ్లిపోయారు. *

*వాళ్ళు ఎప్పటికీ నాపిల్లలు కాబట్టి , నాతోనే ఉండిపోవాలని నా స్వార్ధం చెబుతుంటే , వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, పిల్లల కోసం వెళ్ళాలిగా !*
*భగవంతుడా ..! పిల్లలందరూ ఎక్కడ వున్నా , సుఖంగా ,  ఆనందంగా , ఉంటూ అభివృద్ధిలోకి వచ్చేట్టు చెయ్యమని రోజూ పూజా మందిరం ముందు కూర్చుని ప్రార్ధించడం తప్ప నేనేమి చేయ్యగలను?*

*పిల్లలు పెరుగుతూ తమ దగ్గరే ఉన్న తల్లితండ్రులకు నా విజ్ఞప్తి ఏమిటంటే ..! వాళ్ళు మీ దగ్గర ఉండగానే వాళ్ళ అల్లరి ని ఆనందించండి, ప్రేమని ఆస్వాదించండి , ఆప్యాయత పంచండి , వీలైనంత ఎక్కువ సమయం వాళ్ళతో గడపండి. *

*మీ పెళ్ళికిముందు మీ అమ్మానాన్నలతో , అన్నదమ్ములతో , అక్కచెల్లెళ్ళతో గడిపారు. ఇప్పుడు వీళ్ళతో ఆనందించమని.*
*అందరు మాతృమూర్తులకు , పితృ దేవులకు , అమ్మమ్మ నానమ్మ , తాతలకు ప్రేమతో అంకితం. *✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

భగవంతుని పొందాలంటే…!

 1110.  1-6.   280123-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


     *భగవంతుని పొందాలంటే…!*
               ➖➖➖✍️

*మనం భగవన్నామాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా, ఏదో బాహ్యంగా పైపైన చేస్తూఉంటాము. బయటకు మాత్రం "ఓ భగవాన్! నేను నీ దాసుడను, నాకు నీవుతప్ప వేరే దిక్కులేదు"అంటూ ఉంటాము. కాని మన ప్రవర్తన అందుకు విరుద్దంగా ఉంటుంది. ,*

*మనస్సు అనేక ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా మన మనస్సు, మాట ఒకటిగా ఉండదు. ఇలా ఉంటే భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం ?.* 

*మనం బయకు ఏం మాట్లాడుతామో, మన మనస్సులోని ఆలోచనలు కూడా అదేవిదంగా ఉండాలి. అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి. "భగవంతుని నామం, ఆయన రూపం వేరుకాదు".* 

*భగవన్నామస్మరణలో ఆనందం అధికమౌతుంది. ఆయన ప్రేమమయుడు. ఆనందమయుడు. ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని పొందుతాము ..*

*సాధారణంగా మన మనస్సు నానా విషయాల పట్ల పరుగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనస్సును నియంత్రించి భగవంతుని పై కేంద్రకరించడానికి ప్రయిత్నించాలి.అదే అభ్యాసమంటే .*

*"సూదిబెజ్జంలోకి దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒక్కటిగా చేయాలి. దారపుపోగులు విడివిడిగా ఉంటే సూదిబెజ్జంలోకి దారం ఎక్కించడం అసాధ్యం"...*

*అలాగే భగవంతుని యందు మనస్సును నిమగ్నం చేయాలంటే బాహ్యవిషయాల వైపు పరుగులు తీసే మనస్సును నియంత్రించి ఏకాగ్రం చేయాలి.*

*ఇంద్రియనిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు .*

*"భగవంతుణ్ణి పొందాలంటే పరితపనయే  పరమోత్తమ సాధన !"*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

ధర్మం అంటే దానధర్మాలు చేయడం మాత్రమే కాదు. మీరు మీ హృదయాన్ని ధర్మబద్ధమైన భావాలతో నింపుకోవాలి మరియు స్వార్థం మరియు దురాశలను విడిచిపెట్టాలి. ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోండి. మీ తోటివారిని 'ఇతరులు'గా పరిగణించవద్దు.

 260123a1123.    280123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀752.
నేటి…. 

              *ఆచార్య సద్బోధన:*
                   ➖➖➖✍️

*కోట్ల రూపాయలు వెచ్చించి దానధర్మాలు చేయడంలో గొప్పతనం ఉండదు. మీ ఆలోచనలు, మాటలు మరియు పనులు ప్రేమతో నిండి ఉండాలి. మీ తోటివారి బాధలను తగ్గించే ప్రయత్నం చేయండి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే అందరినీ ప్రేమించు. ఇదే నీ ధర్మం.*

*ధర్మం అంటే దానధర్మాలు చేయడం మాత్రమే కాదు. మీరు మీ హృదయాన్ని ధర్మబద్ధమైన భావాలతో నింపుకోవాలి మరియు స్వార్థం మరియు దురాశలను విడిచిపెట్టాలి. ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోండి. మీ తోటివారిని 'ఇతరులు'గా పరిగణించవద్దు.* 

*మీ ప్రేమను అందరితో పంచుకోండి; స్నేహపూర్వకంగా జీవించండి మరియు ఐక్యతను పెంపొందించుకోండి.*

*ప్రేమ ద్వారా మాత్రమే మీరు ఇతరుల హృదయాలను గెలుచుకోగలరు మరియు వారిని మార్చగలరు.*

*అందుకే, ప్రేమను పెంపొందించుకోవడం మరియు ఇతరులతో పంచుకోవడం ఈ కాలపు అవసరం.*

*దేవుని పట్ల ప్రేమను మరియు మీ కంటే తక్కువ అదృష్టవంతుల పట్ల కరుణను పెంపొందించుకోండి! ఇది విద్య యొక్క సారాంశం.*

*మీ తల్లిదండ్రులకు సేవ చేయండి మరియు వారిని సంతోషపెట్టండి. ఇంట్లో మీ అమ్మానాన్నలకన్నా మించిన దైవం వేరే చోట లేరని గ్రహించుకోండి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

****కష్టాలంటే ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

 కష్టాలంటే ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

ఎన్నో కష్టాల మీద కష్టాలు అనుభవిస్తున్న ఒక గురువు గారిని తన శిష్యుడు గమనిస్తు 
గురువు గారు అనుభవిస్తున్న కష్టాలను చూసి బాధ పడుతూ వుంటాడు 
ఒక రోజు ఒక అగ్ని ప్రమాదం లో
గురువు గారి ఆశ్రమం అంత ఏమి
మిగలకుండ అంతా కాలి బూడిద
అయి పోతుంది .అప్పుడు శిష్యుడు కి ఒక సందేహం వచ్చి గురువు
 గారిని ఇలా ప్రశ్నిస్తాడు

గురువు గారు మీరు ఎన్నో కష్టాలు
అనుభవిస్తున్నారు ఇది నేను చూస్తున్నాను
మీ లాగే ఎందరో గురువులు వారు కూడ
మీలాగే ఎన్నో కష్టాలు అనుభవించారు

జీసస్,సోక్రటీస్,కబీర్,బుద్దుడు ఓషో,రాముడు,కృష్ణుడు,సత్య హరిశ్చంద్రుడు,ఇలా, ఇంకా ఎందరో మహానుభావులు అందరు కూడ ఎన్నో కష్టాలను చవి చూశారు కదా

అయితే నాకు వచ్చిన సందేహం ఏమిటంటే 

మీ గురువులు అందరు కూడ ధర్మం లో ఉండండి ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని
అంటుంటారు

మరి ఈ గురువులు అందరు కూడ
దర్మంగానే ఉన్నారు కదా మరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు అనుభవించారు అని ప్రశ్నిస్తాడు

ఈ ప్రశ్నవిన్న గురువు గారు శిష్యుడు కి ఇలా సమాధానం ఇస్తారు

నువ్వు గురువులు అందరు ఎన్నో 
కష్టాలు అనుభవించారు అని నువ్వు అనుకుంటున్నావు కానీ
వాటిని అనుభవించిన గురువులు మాత్రం వాటిని పరీక్షలు అనుకున్నారు


భౌతిక సుఖo కోసం ఆరాట పడే 
వారు సహనం తో ఉండలేరు 
ఎవరైతే సహనం తో ఉండరో  వారు
 ఎప్పుడు సత్యాన్ని చూడలేరు, చేరుకోలేరు 

మనలో సహనాన్ని పెంచేవి జీవిత పరీక్షలు మాత్రమే మనం ఎన్ని పరీక్షలు అయితే ఎదురుకుంటామో మనలో అంత సహనం పెరుగుతుంది .మనం ఎంత సహనాన్ని పెంచు కుంటామో అప్పుడు మనం అంత సత్యాన్ని చూడగలుగుతాము , చేరుకొగలుగుతాము

అందుకే గురువు లలో సహనాన్ని పెంచడం కోసమే ప్రకృతి గురువులకు పరీక్షలు ఇచ్చి వారిలో ఎంతో సహనాన్ని పెంచి వారికి సత్యాన్ని చూపి వారిని మహానుభావులను చేసింది .కాబట్టి మనకు వచ్చే పరీక్షలను
పరీక్షలు అని కూడ అనుకోకండి అవి మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేర వేసే వారధిలు అనుకోండి మిత్రులారా.

అలాగే నిజాయితీ అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం . ఒక వ్యాపారి తాను ప్రయాణం చేయడం కోసం ఒక ఒంటెను కొనాలి అని అనుకుంటాడు, ఒక వ్యక్తి దగ్గర బేరమాడి ఒక ఒంటెను కొనుక్కుని ఇంటికి చేరుకున్నాడు. తన ఇంటి పనిమనిషిని పిలిచి ఆ ఒంటెను శుభ్రంగా కడగమని చెప్పాడు, యజమాని చెప్పినట్టే ఆ పనిమనిషి ఒంటెను శుభ్రం చేస్తుంటే ఒక చిన్న సంచి కింద పడింది.
అది తీసుకెళ్లి యజమానికి ఇచ్చాడు అతను సంచి తీసి చూడగా నవరత్నాలు ధగధగా మెరిసిపోతున్నాయి. ఇది వెంటనే తీసుకెళ్లి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చేయాలి అన్నాడు ఆ పనివాడు అయ్యా ఇది ఎవరికీ తెలిసే అవకామేశమే లేదు మీరే ఉంచేసుకోండి అని చెప్పాడు. మరి ఇది నాకు కూడా తెలియకుండా నువ్వు ఉంచుకోవలసింది కదా అన్నప్పుడు నేను మీరు నమ్మినా బంటును అయ్యా మిమ్మల్ని మోసం చేయలేను అన్నాడు.
నువ్వే నన్ను మోసం చేయలేను అన్నప్పుడు నన్ను నాకెలా మోసంచేసుకోను అన్నాడు ఆ రత్నాల మూటను తీసుకెళ్లి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చాడు అతను సంతోషంతో స్వాగతించి మీ ఈ చర్యకు నేను ఆనందంగా ఉన్నాను మీకు కావలసినన్ని రత్నాలు తీసుకోండి అన్నాడు.మీకు ఇచ్చే ముందే రెండు రత్నాలను తీసుకున్నాను అన్నాడు ఈ వ్యక్తి సంచిని రత్నాలను లెక్కపెట్టాడు ఆ రత్నాల యజమాని అన్నీ రత్నాలు ఉన్నాయి ఒక్కటికూడా తగ్గలేదు అన్నాడు అందుకు అతను నా రెండు రత్నాలు నా నిజాయితీ నా ఆత్మగౌరవం అన్నాడు.
మిత్రులారా మనిషి జీవితంలో ఎదగడానికి ఎన్నో అడ్డదారులు ఉన్నాయి, కానీ భయపడుతూ బతకాలి. నిజాయితితో సంపాదిస్తే ఆ ధైర్యమే వేరు.

సేకరణ రామిరెడ్డి మానస సరోవరం👏

****🌸 అమృతం గమయ 🌸

 https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v

🌸 అమృతం గమయ 🌸

సాన్నిధ్య సత్సంగలో శ్రీగురు బోధ సారాంశం

*అమృత  బోధ*

నిరంతరం నన్ను ధ్యానించేవారికి నేను ప్రక్కనే ఉంటాను. నా స్పర్శ వారికి తెలుస్తుంది. 
         -------భగవద్గీత.


నీవు వర్తమానంలో ఎదుర్కొంటున్న పరిస్థితులని సృష్టించుకున్నది నీవే అని తెలుసుకో. నీ జీవితంలోని పూర్వ పరిస్థితులలో దోషపూరిత నడవడిక, సత్యదూరమైన తీవ్ర ఆలోచన తరంగాలు, అజ్ఞానంతో చేసే ప్రకృతి విరుద్ధ కర్మలు ఈ వర్తమాన పరిస్థితులకు కారణమని గ్రహించు. నీవు మారాలి. నీకోసం నీవు మారాలి. నేనో, ఇంకెవరో చెప్తున్నారని మారనవసరం లేదు. ఎవరో చెప్తే నేను మారేది ఏంటి అనే అహంకారాన్ని వదిలిపెట్టండి. నేనేం మారనవసరం లేదు మీరే మారండి అంటూ ఎదుటివాళ్లు చెప్పే జ్ఞానాన్ని కనీసం పరిశీలన కూడా చేయకుండా అహంకార ప్రవృత్తితో జీవిస్తూ ఉంటే ఇంక కష్టాలు ఎలా తొలగుతాయి?

కష్టాలతో బాధపడుతూ నీవు సాధారణంగా ఇలా అనుకుంటావు: “పరమాత్ముడు నాకెందుకిలా చేశాడు?”   ఎంత అజ్ఞానం? ఎంత అమాయకత్వం? పరమాత్ముడు మనకి వాటిని ఏమాత్రం కలుగజేయలేదని వెంటనే తెలుసుకో. నీకు, నీ పనులకి నీవే బాధ్యత వహించాలి. నీవు ఒక గోడని గుద్దితే, ఆ గోడ నీకు కష్టం కలిగించాలనుకోదు; కాని నువ్వు నీ చేతిని విరగగొట్టుకోవచ్చు. ఇంత చేసి అజ్ఞానంతో తెలివి తక్కువ తనంతో గోడమీద ఆరోపణ చేస్తే ఫలితం ఉంటుందా?  వివేకాన్ని కలిగి ఉండు.

నేను ఎల్లప్పుడు ధ్యానిస్తున్నా, పూజిస్తున్నా "నన్ను అసలు పట్టించుకోవట్లేదు. కష్టాలన్నీ నాకే వస్తున్నాయి" అని బాధపడేవారు మీలో అనేకమంది ఉన్నారు. 

నిజానికి మీరు ధ్యానిస్తున్నది ఎవరిని? కోరికలని అమితంగా ప్రేమిస్తున్నారు. అందుకే పరమాత్ముడి స్పర్శ తెలియడంలేదు. 

అమ్మని మనం ఎన్నో అడుగుతాం. అన్నీ ఇస్తుందా! ఇవ్వదు. ఎందుకంటే! నీకు ఏది మంచిదో చూసి అది మాత్రమే నీకు ఇస్తుంది. నిన్ను నవమాసాలు మోసి కని పెంచిన అమ్మే నీకు ఏది మంచిదో చూసి ఇస్తుంటే! నీ పుట్టుక కి కారణమైన ఆ పరమాత్ముడికి తెలియదా నీకు ఎప్పుడు ఏది ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో! అందుకే నువ్వు కోరింది కాకుండా నీకు తగింది ఏదో, నీకు ఏది మంచిదో చూసి అది ఇస్తాడు. 

నేను విషం త్రాగుతాను అంటే అమ్మ ఊరుకుంటుందా! త్రాగితే చస్తావ్ అని ఆ రూపంలో ఉండేది మరేదో నిన్ను ఏమార్చి ఇస్తుంది. ఇవ్వడం మాములే. కానీ నీకు మేలు చేసేదే కదా ఇస్తుంది. అలాగే పరమాత్ముడు కూడా నీకు మేలు చేసేది మాత్రమే ఇస్తాడు.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి

కోరికవల్ల క్రోధం పుడుతుంది. క్రోధం వల్ల సమ్మోహం, సమ్మోహం వల్ల స్మృతి( జ్ఞాపకశక్తి) చెదురుతుంది. స్మృతి చెదిరితే బుద్ది నశిస్తుంది. బుద్ది నశిస్తే వివేకజ్ఞానం కోల్పోతారు అన్నాడు భగవానుడు. 

ఒకపక్క కోరిక మీద ఉన్న వ్యామోహం వలన క్రోధం పెరిగి విచక్షణ కోల్పోయి కష్టాలని కొని తెచ్చుకుని, మరొకపక్క నిన్నే నిరంతరం ధ్యానిస్తుంటే, నిన్నే తలుస్తుంటే అన్ని కష్టాలు నాకే ఇస్తున్నావు అంటారు తప్పించి తమలో ఉన్న లోపం చూడడంలేదు.  నిజానికి ఇక్కడ మీరు పరమాత్ముడి ధ్యానంలో లేరు. నిరంతరం కోరికల ధ్యానంలో ఉన్నారు. ఎంతటి అజ్ఞానం?  ఎంతటి బుద్ధిహీనత? 

మీరు ఏది కోల్పోలేదు. వచ్చింది గుర్తించడం లేదు. తెలుసుకోండి.

ఈ సత్య జ్ఞానాన్ని గ్రహించి అనన్య భక్తి చేత సమర్పణ బుద్ధితో పరమాత్ముని సేవించండి - అది ధ్యానమైనా, పూజ ఐనా, కర్మ ఐనా, జ్ఞానమైనా, మంత్రమైనా, తంత్రమైనా, మరి ఏదైనా, చివరికి లౌకిక కర్మ ఐనా -  అప్పుడు పరమాత్ముడి దివ్య స్పర్శ అనుభవమవుతుంది. - సత్ చిత్.

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్

భగవద్గీత  - రాజవిద్యా రాజ గుహ్య యోగం - 22 వ శ్లోకం

సదా నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో ఏకాగ్రమై  నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను.

::::::నేను లేక పోవడం::::::

 *::::::::నేను లేక పోవడం::::::*

    *నేను* చేసే కార్యకలాపాల ద్వారా   నేను నుండి విముక్తి కలగదు.
 
     మరి నేను నుండి విడుదల ఎలా కలుగుతుంది???
 
  *నేనుగా ఏ పని చేయక పోతే, నేను లేనట్లు.*

*షణ్ముఖానంద 98666 99774*

ఆత్మసాధన 🍁ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ యొక్క విశిష్టత ఏంటి, ఆత్మ, పరమాత్మల సంబంధమేమిటి?🍁.

 [2/1, 11:17] +91 73963 92086: ఆత్మసాధన

🍁ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ యొక్క విశిష్టత ఏంటి, ఆత్మ, పరమాత్మల సంబంధమేమిటి?🍁.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఆత్మ అంటే ఏమిటో చాలా మందికి అసలు తెలియదు. దాదాపు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వారిలో ఎక్కువ శాతం మందికి తెలియదు.
దాదాపు చాలా మందికి ఆత్మ అంటే
తెలుసు అంటారు. అది ఏమిటి అంటే కొందరు
దయ్యమని మరికొందరు భూతమని ఇలా దానికి లేని
రూపాలను దానికి లేని తోకలను తగిలిచ్చి నిజమైన
ఆత్మ స్వరూపాన్ని ఆత్మ యొక్క అర్ధాన్ని చివరకు
ఒక వ్యర్ధ పదంగా మారుస్తున్నారు.

ఎవరో ఒక తెలిసి తెలియక అన్న ఒక అజ్ఞానపు మాటను పట్టుకొని అందరికి అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం సరికాదు. ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే పదాన్ని పుట్టిన ప్రతి ఒక్కరు వారి నోటి నుండి ఉచ్చరించి ఉంటారు.అజ్ఞానులైతే వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనసులల్లో భయాలు కలిగినప్పుడు అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకొనినప్పుడు వారి మనసులో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు.కాని ఇది అజ్ఞానంతో ఆలోచించడం.

శ్రీకృష్ణుడు ఏం చెప్పారు..?

మరి కొందరు సద్గురువుల దగ్గర బోధన తీసుకోవడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం వలన అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు. వారికి మాత్రమే ఈ ఆత్మ స్వరూపం గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. ఈ విషయాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు 'ఎవరో ఒక మహా పురషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును.వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో చూచినవరిలో చెప్పినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా తెలుసుకోలేరు.

నిజానికి ఆత్మ అంటే దైవమా, లేక దయ్యమా, ఇది తెలియాలి, మరీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంధంలో లిఖించబడింది. ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంధమే లేదు కాని సరిగా దాని అంతరార్ధాన్ని తెలుసుకోలేక సమతమవుతూ దాని అర్ధాన్ని సరిగా గ్రహింపలేక దానికి నానార్ధాలు చెబుతూ చాలామంది వారు అయోమయం అవడమే కాక అందరిని అయోమయంలో నెట్టేస్తున్నారు.

ఈ ఆత్మ అంటే నిజానకి ఎవరికీ నిజంగానే తెలియదు. దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్ళకు మాత్రమే అది ఏమిటో దాని తత్వము ఏమిటో అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు అంతే తప్ప మత గ్రంధాలలోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించే వాల్లకు కూడ అది ఎలా ఉంటుందో తెలియదు. చూసిన వారు చెప్పిన దానిని చూడని వారు కొద్దిగా దానిని అవగతం చేసుకొని తెలుసుకుంటున్నారు.

ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా తెలిపారు గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని చాల శాస్త్రాల అధ్యయనం చేయడం వలనగాని ఎన్నో గుడార్థాలు మహాత్ముల వద్ద వినడం వలన గాని అత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మ కోసం హృదయ పూర్వకంగా ఆరాటపడి మనననిధి ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది.

ఆత్మ మనోబలం లేనివారికి అజాగ్రత్త పరులకు శాస్త్ర విరుద్దమైన తపస్సులు చేసేవారికి లభించదు. అయితే ధృడంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ పదంతో ఐక్యం పొందగలదు.
ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంధాలు ఏమి బోధించాయో కూడ తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపినాడు. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడను ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరును అజ్ఞానులే.

ఏలాగంటే వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు. ఎవ్వరి చేతను చంపబడేది కాదు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది. నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబదడినను ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పులేనిదనియు శాశ్వతమైనది సర్వవ్యాప్తి చెందినది చలింపనిది స్తిరమైనది మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరముగానిది. మనస్సునకు అందనిది. వికారములు లేనిది. ( 2:19-25)
ఉపనిషతులు: ముండకోపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడినది.

జ్యోతి స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అణువు కంటే సూక్ష్మం అంతటా వ్యాపించినది. అత్యంత సూక్ష్మమైనది సృష్టికి మూలకారణమైనది. అపరిమితమైన జ్యోతి స్వరూపం అయిన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది సూక్ష్మతి సూక్ష్మం అది ఈ శరీరలోనే ఉన్నది. అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు తారలు (చుక్కలు) వెలుగు నీయవు.
మెరుపులు కూడ కాంతి నీయవు. స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వలన మాత్రమే సర్వము కాంతులను వెదజల్లుతుంది.ఈ ఆత్మ జ్యోతి వల్లనే దేదీప్య మానమవుతూ ఉన్నది.
[2/1, 11:17] +91 73963 92086: 1. ఆత్మ ఇది అని వర్ణించుట దుర్లభము ఎందుకంటే అంతా అదే, అన్నీ అదే!
2. అదితిగా వెలుగొందితున్నది ప్రాణశక్తిగా విరాజిల్లుతున్నది, అన్ని భూతములయందు నెలకొనియున్నది ఆత్మ!
3. చెవికి చెవిగా, మనస్సునకు మనస్సుగా, వాక్కనకు వాక్కుగా, ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా అయివున్నదే ఆత్మ!
4. దేని దగ్గరకు మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదియే "ఆత్మ". ఈ ఆత్మనే బ్రహ్మము అని అంటారు.
5. ఎలాగైతే నీరు, వాయువు ఏ వస్తువులో ప్రవేశిస్తే ఆ రూపం దాలుస్తుందో, అలాగే ఆత్మ కూడా ఆయా భూతములలో ప్రవేశించి ఆయా రూపములను ధరిస్తుంది.
6. ఎలాగైతే సూర్యుని కాంతి ఒక వస్తువుపై పడినప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తుందో అలాగే ఆత్మ ఒక ఉపాధిలో ప్రవేశించినప్పుడు ఆ ఉపాధి చైతన్యాన్ని పొందుతుంది.
7. ఆత్మ లేదా బ్రహ్మము శాశ్వతమైనది, చైతన్యవంతమైనది, సర్వవ్యాపకమైనది, సాక్షీభూతమైనది, అన్ని జీవులలో నెలకొనివుంటుంది.
8. జీవుని జ్ఞాననికి ఆధారంగా, సాక్షిగా ఈ ఆత్మచైతన్యస్ఫూర్తి ఎల్లప్పుడూ వెన్నంటి వుంటుంది.
9. ప్రతివిషయాన్ని సూక్ష్మబుద్ధితో/జ్ఞానంతో ఎవడు దర్శిస్తాడో అతడు ఆత్మను పొందుతాడు. ఆత్మద్వారానే జీవుడు వీర్యవంతుడవుతాడు. జ్ఞానము ద్వారానే జీవుడు అమరుడవుతాడు.
10. జీవాత్మకి, పరమాత్మకి ఉపాధి (body) విషయంలో బేధం వున్నప్పటికీ, ఇరువురిలో చైతన్యాంశ (ఆత్మస్వరూపము) మాత్రం ఒక్కటే!
11. పురమనగా శరీరము, అది పురుషునికి(ఆత్మకు) నివాసస్థానము. ఆ పురుషుని(ఆత్మను) ధ్యానించు వాడు ఎటువంటి దుఃఖమును పొందడు. శరీరం క్షీణించిపోతుంది, కొన్నాళ్ళకు నశిస్తుంది కానీ ఆత్మ మాత్రం నిత్యంగా వుండి ఇంకో శరీరాన్ని దాలుస్తుంది.
12. జీవాత్మకు ఈ దేహమే ఉపాధి!పరమాత్మకు ఈ విశ్వమంతా ఉపాధే!జీవాత్మల ఏకమే పరమాత్మ!
13. స్వప్న, జాగ్రదావస్థలలో ఏదీ విశ్వంతో ముడిపడివుంటుందో అదే పరమాత్మ. సకల జీవులలో అది జీవాత్మగా ప్రకాశిస్తుంది. జీవభావాన్ని పొందినవాడు, దానిని కలిగించువాడు కూడా పరమాత్మే.
14. ఏ శక్తితో గ్రహములు, నక్షత్రములు, ద్వాదశ సూర్యులు ఆకాశమున ఒక నిర్ణీతకక్షలో సంచరిస్తున్నాయో ఆ శక్తే పరమాత్మ. నిజానికి ఈ జగత్తు యొక్క తత్వమే పరమాత్మ. కాబట్టీ ఈ ప్రపంచానికి పరమాత్మకి వాస్తవమైన బేధంలేదు.
15. పరమాత్మే జీవాత్మగా ఒక ఉపాధిని కల్పించుకొని వ్యక్తమయ్యేడు! ఉపాధితో కూడిన జీవభావము నశించినపుడు జీవాత్మ పరమాత్మగా బాసిస్తాడు.
16. అయమాత్మా బ్రహ్మ! జీవో బ్రహ్మైవ నా పరః! అహం బ్రహ్మాస్మి! అన్న ఉపనిషత్తుల వాక్యాలకు అర్ధమిదే!
17. ఎచ్చటనుండి జీవుడు వచ్చేడో, అక్కడికి తప్పకా చేరుకోవలసిందే! పరమాత్మనుండి వ్యక్తమైన జీవాత్మ (జీవుడు) మళ్ళీ పరమాత్మను చేరుకోవాలి! అదే జీవాత్మ అసలు స్వరూపము!
18. దానినే యోగము అన్నారు పెద్దలు! అలా చేరినప్పుడే వ్యక్తి జీవిత నాటకము సమాప్తమవుతుంది, అంతేకాని జీవుని మరణముతో సమాప్తము కాదు. జీవాత్మ, పరమాత్మతో యోగం కానంతసేపు జీవునికి జనన మరణాలు తప్పవు.
19. జీవుని పరమాత్మతో చేర్చునదియే జ్ఞానము. ఇది నిష్కామ కర్మాచరణ వలన మాత్రమే సిద్ధిస్తుంది.
20. తన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే "ఆత్మ సాక్షాత్కారము", "ఆత్మ దర్శనము", "భగవద్దర్శనము".
21. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆ ఆత్మవస్తువును అనుభూతిపొంది బ్రహ్మానందాన్ని పొందుతాడు.

స్వయం ప్రకాశిత మైన జ్యోతి స్వరూపమైన ఆత్మను మాటలచేత వర్ణింపలేము దానిని కళ్ళు చూడలేవు ఇంద్రియాలు గ్రహించలేవు, కర్మలు విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై స్వచ్చ మైనపుడు అతని ప్రాణ మన శరీరాలు సర్వం విశుద్ది పొందుతాయి. అపుడు ధ్యాన నిమగ్నుడైనవాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు.
ఆత్మ అంటే ఒక శక్తి .మనం అర్ధం చేసుకోవడానికి దానినే ఒక జ్యోతిగా తెలిపారు అటువంటి శక్తిస్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది. సంపుర్ణమైన ఆ దివ్య శక్తి స్వరూపమైన ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి అది మాత్రమే నువ్వు అని తెలుసుకొని కాంతి వంతంగా స్వయం ప్రకాశితమైన ఆ దివ్య జ్యోతిని నువ్వు నీ శరీరంలోనే చూసుకుని, నిన్ను నువ్వుగా తెలుసుకొని మనం అందరం ఎత్తిన ఈ మానవ జన్మను సంపూర్ణంగా సార్ధకం చేసుకుందాం...

#యోగా_ద్వారా ఏమేమి సాధ్యమో?!??!!
తల పైభాగాన్ని విశ్వం అని, ముందు భాగాన్ని నుదురు భాగం అని అంటారు.  కపాల్ భాగం విశ్వంలో సగం వరకు విస్తరించి ఉంటుంది.  రెండింటి సరిహద్దులో మెదడు యొక్క ప్రధాన స్థానం ఉంటుంది.

 విశ్వం యొక్క కేంద్రాన్ని బ్రహ్మరంద్రం అంటారు.  బ్రహ్మరంద్రం సూది బిందువు ఒకటితో సమానం
 చాలా ముఖ్యమైన రంధ్రాలు ఉన్నాయి.  అన్ని భావాలు, దివ్య ప్రపంచంలోని ఆలోచనలు, శక్తి మరియు శాశ్వతమైన శక్తి ఈ బ్రహ్మరంద్రం నుండి విశ్వంలోకి ప్రవేశిస్తాయి.  సాంప్రదాయ మతంలో, శిఖర (మంట) ఈ ప్రదేశంలో ఉంచాలి.  ఒక నియమం ఉంది.  బ్రహ్మం నుండి వెలువడే శక్తి జ్వాలల ద్వారా ప్రవహిస్తుంది అని.
[2/1, 11:18] +91 73963 92086: మన జ్వాల ఒకవైపు శక్తిని ప్రవహిస్తున్నప్పుడు, అది మరోవైపు దానిని అంగీకరిస్తుంది.  వాతావరణంలో చెల్లాచెదురుగా ఉన్న అసంఖ్యాక ఆలోచనా తరంగాలు మరియు భావోద్వేగ తరంగాలు ఒకే మంట ద్వారా మానవ మెదడులోకి ప్రవేశిస్తాయి.  మన మెదడు జ్వాల లాంటి యాంటెన్నా లేదా ఏరియల్ ద్వారా ఒక రకమైన తరంగాన్ని స్వీకరించడానికి మరియు ప్రసారం చేయడానికి కేంద్రంగా పనిచేస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  

ప్రధాన మెదడు (సెరెబ్రమ్) పైన ఒక చిన్న మెదడు (సెరెబెల్లమ్) మరియు బ్రహ్మరంద్రం నకు దిగువన '#మెడుల్లా' అని పిలువబడే ప్రదేశం దానికి జోడించబడింది.ఈ ఓవల్ పదార్ధం నాసిరకం మెదడులో ఉన్న ద్రవంలో తేలుతూ ఉంటుంది.  ఈ అండాశయ పదార్ధం వెన్నెముక చివరి వరకు విడుదలవుతుంది.ఈ పదార్ధం చాలా రహస్యమైనది.  ఆధునిక శాస్త్రవేత్తలు కూడా దీనిని అర్థం చేసుకోలేరు.మానవ ఆలోచన, భావోద్వేగాలు, భావాలు, మెదళ్ళు మరియు సామర్థ్యాల ద్వారా బయటి నుండి ల్యాండ్‌స్కేపింగ్ శక్తులు అదే అండాశయంతో ఢీకొంటాయి.ఇది స్వయంచాలకంగా మారుతుంది మరియు చెదరగొట్టబడుతుంది.

యోగా ద్వారా అసలు మెదడు ఆకాశం ను చూసేవాడు, ఊహించేవాడు, కలలు కనేవాడు - ఈ ఆకాశంలో ఇవన్నీ అనుభవించాలి,అనుభవిస్తాడు...

స్వస్తి!ఓం శాంతి శాంతి



🔥సర్వే జనా సుఖినోభవంతు🔥!...
.

నేడు - భీష్మ ఏకాదశి

 _*నేడు - భీష్మ ఏకాదశి*_

మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. 
బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. 
నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. 
*"మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః"*  కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు.

*అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది , మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు , ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది , ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి'* అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు.

సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. 
దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది.
 మాఘమాసంలో ఎండకు ఎండుతూ , మంచుకు తడుస్తూ , నీరు , ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు.
 తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది , కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. 
ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.

తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. 
అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. 
భీష్ముడు తనకి *మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః* అని అనుకున్న మహనీయుడు. 
ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు.

అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట ! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. 
ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే ? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. 
ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట *"మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః"* హే ద్రౌపతి ! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.

కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. 
వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు , కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు.
 కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. 
కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు.

ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. 
ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను , ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప , ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.

భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే , పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ *'తాతా ! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు'* అని ప్రశ్నించిదట. 
అందుకు భీష్ముడు 'అవును తల్లీ ! నా దేహం నా అధీనంలో లేదు , అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా , నా దేహం నా మాట వినలేదని అన్నాడు. 
అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు.

కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు , పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. *' హే ద్రౌపతీ ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు , కానీ శరీరం దుష్టమైపోయింది. 
దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను , అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు.
 శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు.

నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు , నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. 
నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. 
నేను చెబితే అది తత్వం , నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు.
 నేల తన సారాన్ని చెప్పగలదా ! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు.

భగవంతుడు సముద్రం లాంటి వాడు , నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది.
 అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి , భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. 
భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు , విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. 
కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది.

నేటి మంచి మాట.

 *నేటి మంచి మాట.

🔸ఒక చెడ్డ గుణం వంద సమస్యలకు కారణం అవుతుంది. కానీ ఒక మంచి గుణం వంద సమస్యలను పరిష్కరిస్తుంది..* 

 *🌸ఒకరిని గుర్తుంచుకోవడమంటే బాధల్లోనో.. సంతోషాల్లోనో తలచుకోవడం కాదు..మన ప్రతి ప్రార్ధనలోను వాళ్లుండడం..* 
 *ప్రతిక్షణం వాళ్ళు బావుండాలని కోరుకోవడం..* 

 *🌷ఆత్మీయుల వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు,ఒక్కోసారి దుఃఖం,బాధ కూడా కలుగుతాయి..అన్నిటినీ భరించగలిగితేనే బంధం శాశ్వతంగా మనతో ఉంటుంది..* 

 *🍁మనిషికి అవసరం గొప్పది. తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది..కలిసున్న బంధాన్ని తెంపు తుంది. ఆస్తులు పంచుకునే రక్త సంబంధం కన్నా మమతలు పెంచుకునే ఆత్మీయ సంబంధం గొప్పది.

ఉషోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

శరీరం కర్మలు చేసే ఒక పరికరం

 *👍శరీరం కర్మలు చేసే ఒక పరికరం✊*

*🌹పునర్విత్తం పునర్మిత్రం* 
*పునర్భార్య పునర్మహి*
*ఏతత్సర్వంపునర్లభ్యం*
*న శరీరం పునఃపునః।।*

 🌷పోయిన *ధనం* మళ్లీ చేరుతుంది. 

🌷*దూరమైన మిత్రుడు* మళ్లీ చేరువఅవుతాడు.      
         
🌷*భార్య* గతిస్తే మరొక భార్య లభిస్తుంది.

🌷*భూసంపద* మళ్లీ ప్రాప్తిస్తుంది. 

పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు! 

కాని *మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి రాదు.*

అందుకే *శరీరం ఖలు ధర్మసాధనం* అన్నారు.

 కేవలం *శరీరం* ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు.

 *శరీరం* ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.

 *శరీరం* ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు.
ఏ పని చేయడానికైనా *శరీరం* కావాలి.

 కనుక *శరీరము* ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.

జంతువులకు *శరీరం* ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు.

పైగా కొద్దోగొప్పో ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి *శరీరం* సహకరించదు.

*బుద్ధి, ఆలోచన, మాట్లాడే శక్తి, కావలసినది సంపాదించుకొనే జ్ఞానం *తగిన అవయవ నిర్మాణం*
ఉండేది ఒక్క *మనుష్యులకే.*

వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.
కనుక మనమందరం శరీరాన్ని కాపాడుకోవాలి.

*అతిగా తిన్నా,*
*అతిగా ఆలోచించినా,*
*అతిగా సుఖించినా,*
*అతిగా దుఃఖించినా,*                    
*ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్తా పుటుక్కుమంటుంది*. 

ఇక *శరీరం* చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు. 

కనుక ముందు *శరీరము* ను జాగ్రత్తగా చూసుకోవాలి.    
                                   
*దీనికి*
 
*సత్యం,* 
*ధర్మం*,
*శాంతి*,
*ప్రేమ,*
*అహింసలను*

 *పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి.*

*విస్తరాకు*

విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు. 
బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,

తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా *మురికి పెంటపై పడేసి వస్తాము.* తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా.

*మనిషి జీవితం కూడ అంతే*
 *'ఊపిరి" పోగానే ఊరిబయట పారేసి వస్తారు*,

విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు *ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది*,

*విస్తరాకుకు ఉన్న ముందు ఆలోచన, తృప్తి భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !*

*"" సేవ చేసే అవకాశము* *వచ్చినపుడు సేవ చేయండి""*     *జారవిడుచుకోకూడదూ* 

మల్లీ ,
ఇంకొకసారి,
ఎప్పుడో చేయవచ్చు
అనుకొని వాయిదా వేయకండి, 
ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే, *కుండ ఎప్పుడైనా పగలవచ్చు అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.*

*ఎంత సంపాదించి ఏమి లాభం ?*

*ఒక్క పైసా కూడా తీసుక పోగలమా?*

*మన చేత* *ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి* 
*మంచి జరిగితే,* 
*మన మానవ జన్మ సార్థకమయినట్లే ........*.*👏🙏 యధ్బావన సద్గతి. సర్వేజనా సుఖినోభవంతు🙏**..

స్కూలులో డాన్స్ నేర్పిస్తున్న టీచర్ video

:::: మనస్సు రెండు రకాలు ::::

 *::: మనస్సు రెండు రకాలు :::::::*

1) *సాంకేతిక మైనది*
2) *మానసిక మైనది*

1:*సాంకేతిక మనస్సు* ..ఇది శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, సాంకేతికంగా పని చేస్తుంది.
 గమనించడం, పరిశీలించడం , అవగాహన చేసుకోవడం, సరైన విధంగా స్పందించడం చేస్తూ మనం జీవితాన్ని ప్రశాంతంగా, నడిపిస్తుంది. మంచి, కావాల్సిన ఆలోచన చేస్తుంది 

2) *మానసిక మనస్సు*. ఇది మనలో భావోద్వేగాలను కలిగిస్తుంది, భ్రమలకు లోను చేస్తుంది. నాది, నేను, నాకు అంటుంది. నేను ఈ శరీరాన్ని కలిగిన వున్నాను,( భాగమై కాదు) అంటుంది. దీనికి ప్రశాంతత తెలీదు. రాగం , ద్వేషం, మోహం చేత నడప బడుతుంది.  చేసిన ఆలోచనే చేస్తుంది.
   *మీ మనస్సు ఎలాంటిది????*


*షణ్ముఖానంద 98666 99774*