Saturday, January 4, 2025

        *రంగవల్లులు - ముగ్గులు*
                 ➖➖➖✍️

*ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి?మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?*

*1. ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.*

*2. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.*

*3. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.*


*4. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి.*
*యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. దైవకార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.*


*5. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.*


*6. దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్,      శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.*


*7. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని           దేవీభాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.*


*8. పండుగ వచ్చిందికదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.*


*9. ముగ్గులు రోజూవేయలేక పెయింట్ తో పర్మినెంట్ గా ముగ్గులు పెట్టేస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.*

*10. నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.*

*11. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.*

*12. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు,పరమార్ధాలతో కూడినవి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 *పూర్వ జన్మ కర్మ.....*

విత్తనం లాగానే క్షేత్రమనబడే ఈ శరీరం కూడా అనాది, కాని అంతం ? ఎప్పుడైతే జీవుడు తన వాసనలను క్షయం చేసుకొని, కర్మఫలాలను జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుంటాడో అతడి జీవభావం నశించి పురుషుడుగా.. క్షేత్రజ్ఞుడుగా.. ఆత్మగా మిగిలిపోతాడు. కనుక పురుషుడు అనాది - అనంతం.

కొన్నిమతాలవారు చెప్పినట్లు అసలు జన్మలే లేవు, జీవుడు పుడతాడు.. చస్తాడు, అంతే  అనే వారి మాటను తీసుకుందాం. పూర్వజన్మ పాపపుణ్యాలు.. కర్మఫలాలు లేకపోతే ఈ జన్మలో పాపం చేసినా పుణ్యం చేసినా ఈ జన్మలోనే అనుభవించాలి. అనుభవించక పోతే రద్దై పోవాలి. మరి పాపాలు చేసిన వారు దుఃఖాలు అనుభవిస్తూ.. పుణ్యాత్ములంతా సుఖాలు అనుభవిస్తూ ఉన్నారా ? లేదు.. 

ఇది మన అనుభవం. సరే ఏమిచేసినా మరణంతో రద్దై పోతాయనుకుందాం. అలాంటప్పుడు ఎలాగూ రద్దై పోతాయి గనుక పుణ్యకర్మలే చేయాల్సిన పనిలేదు. ఎంతటి పాపాలకైనా ఒడిగట్టవచ్చు. స్వార్థంతో హత్యలు, అన్యాయాలు, అక్రమాలు ఏవైనా చేయవచ్చు. దీనిని ఏ మతమైనా అంగీకరిస్తుందా ? లేదు. కనుక జన్మలున్నవి. చేసిన కర్మలు ఊరికే పోవు, అనుభవించి తీరాల్సిందే. ఈ దేహంతో కాకపోతే మరో దేహాన్ని ధరించినప్పుడైనా అనుభవించాలి.

 *దైవలీలలు.....*

కనిపించే ప్రపంచమంతా భగవన్మయం. ఈ ప్రపంచాన్ని సృజించి అందులో తానుగా, తనలో సృష్టిగా దృశ్య ప్రపంచాన్ని ఇముడ్చుకొని భగవంతుడు సృష్టికి ఆధారభూతంగా అలరారుతున్నాడు.

ఏ అవకరమైనా దైవ నిర్దేశితమే. ఆయన సృజనను త్రికరణాలతో ఆమోదించడమే విజ్ఞత. ఆయన ఆజ్ఞకు భిన్నంగా సృష్టిలో ఏదీ రూపుదిద్దుకోలేదని గ్రహించాలి. ఏదో ఒక ప్రయోజనం కోసమే జీవుడికి సంపద గానీ, దురదృష్టం కానీ అందివచ్చిందని, సంపద సృష్టిలో జీవుడి ప్రయోజకత్వం గానీ దరిద్రంలో అతడి అసమర్థత గానీ లేవని సాధకుడు గ్రహించాలి.

ఏ ఒక్కరిపైనా దైవానికి ప్రేమ గానీ, ద్వేషం కానీ ఉండవు. ధర్మ పక్షపాతిగా ఆయన శ్రీకృష్ణావతారంలో పాండవుల పక్షాన నిలిచి వారి శ్రేయస్సును కాంక్షించాడు.

దైవం కరుణామయుడు. తన సృష్టిని ఆయన ఎన్నడూ ఛిన్నాభిన్నం చేయడు. ఆయన కరుణా స్వభావంతోనే సమస్త ప్రాణులకు భూమ్యాకాశ సముద్రాల్లో ఆహారం లభిస్తోంది. ఆయన స్తోత్రప్రియుడు. మనకు అన్నీ ఇచ్చిన పరమాత్మను స్తుతించడంలో విజ్ఞత ఉంది. తనను ఎవరైనా ప్రశంసిస్తే మనిషికి సంతోషం కలుగుతుంది. మనిషికి ఈ స్తోత్రప్రియత్వం భగవంతుడి లక్షణం నుంచే సంక్రమించిందని గుర్తించాలి.

మంచి చెడులు భగవంతుడి సృష్టి. విరుద్ధ లక్షణాలు గల మంచీచెడుల మధ్య సంఘర్షణ సహజం! జగత్తును సృజన చేసి ప్రాణుల జీవన నాటక అభినయాన్ని చూసి వినోదించడం ఆయన లీలలో భాగమేగానీ ఆయనకు ఏ ఒక్కరి పైనా ప్రత్యేక శ్రద్ధ ఉండదు. పరమాత్మ ప్రణాళికలో భాగంగానే సృష్టి-స్థితి-లయం జరుగుతాయి. సృష్టి ఎంత సహజమో లయం కూడా అంతే సహజం. అవి నివారింప వీలుకాని విషయాలని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్పష్టం చేశాడు. దుష్టులైన రాక్షసులను అవ్యాజ కరుణతో సంహారానంతరం తనలో ఐక్యం చేసుకున్న ఉదంతాలు పురాణేతిహాసాల్లో అనేకం కనిపిస్తాయి.

ఎల్లప్పుడూ ఆనందంగా సాత్వికాంశతో జీవించడం పరమాత్మను ఆరాధించడమే. ఆనందమే దైవం. ఆనందమయ సాత్విక జీవనమే దైవారాధన!

దయ, దానగుణం, ఉపకార బుద్ధి వంటి విశేష గుణాల సాధన భగవదారాధనలో అంతర్భాగంగా సాధకుడు గ్రహించాలి.

కొన్ని సంకల్పాలు బలమైన కోరికలుగా మారి అవి తీరక ఉవ్విళ్లూరిస్తూ జీవుణ్ని వేధిస్తాయి. పరితాపం పెంచుతాయి. అనుకోని కొన్ని లాభాలు వరాలై మన ముంగిట వాలతాయి.

బలహీనులపై బలవంతుల దాష్టీకం సృష్టి సహజమే అయినా అహేతుకంగా నిర్దయగా వ్యవహరించే వారి తీరు దైవాన్ని తిరస్కరించడమే అవుతుంది. దుష్టులు కొందరు ఏ రూపంలో అభివృద్ధి చెందినట్లు కనిపించినా ఏదో నాటికి వారి పతనం తథ్యమని చరిత్ర పలుమార్లు ఎలుగెత్తింది.

దానం, కరుణ వంటి సద్గుణాలు అందించే మధురభావ సంతృప్తి అనితర సాధ్యం. స్వార్థం, నిర్దయ వంటి అవలక్షణాలతో మనిషి ఎన్నడూ ఆనందంగా జీవించలేడు.

భౌతిక వస్తుసేకరణ తప్పు కాదు. కానీ వాటి వల్ల ఆనందం లభ్యమవుతుందన్నది ఓ భ్రమ మాత్రమే అంటారు జ్ఞానులు. ఆ సత్యాన్ని సాధకుడూ అనుభవంతో తెలుసుకుంటాడు. తోటివారి ధర్మయుత ఐశ్వర్యం అనసూయాపరులకు మోదాన్ని కలిగిస్తుంది. జనామోదమే దైవామోదమని సాధకుడు అనుభవంలో తెలుసుకుంటాడు.

భగవద్భక్తితో సాధించలేని ఏ లౌకిక విజయమూ ఉండదని పురాణేతిహాసాలు నివేదిస్తాయి. భక్తులకు ఆ మహాకార్యాలు పరమాత్మ సందేశాలని మానవుడు గ్రహించాలి.

 *నిత్య పూజ ఎవరు చేయాలి*
సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం. ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే  ఉండాలి పురుషుడికి. చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు. యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు. ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి. మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి. ‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు. పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.         
 *ధ్యాన 😌మార్గ*
ఎప్పుడూ చంచలమైనది మనస్సు, నిశ్చయంగా ఒక విషయాన్ని
నిర్ణయించగలిగేది బుద్ధి. కాని ఈ బుద్ధి బాహ్య విషయాలను మాత్రమే
నిర్ణయించగలుగుతుంది; ఆంతరిక సత్యాలను చూసే శక్తి దీనికి లేదు. ఎందుకంటేఇది జాగృతి చెందని స్థితిలోని బుద్ధి. అది జాగృతి చెందినప్పుడు మాత్రమే తీక్షణతను సంతరించుకుంటుంది. ఆ తీక్షణమైన బుద్ధి చేతనే ఆత్మను గ్రహించగలం.
❤️🕉️❤️
పశువుల కాపరి ఆవు యొక్క గమనాన్ని దాని అడుగుజాడలతో గుర్తుపట్టి ఆవుని వెతుక్కున్న రీతిలో దివ్యత్వం యొక్క అడుగుజాడలు మానవునియందే ఎక్కువగా ముద్రితమయి ఉన్నందున, మనయందే దివ్యత్వాన్ని వెతకగలగాలి.
 ❤️🕉️❤️
మీరు మీ ఆదర్శాన్ని ధ్యానిస్తే, మీరు దాని స్వభావాన్ని పొందుతారు. పగలు రాత్రి భగవంతుని తలచుకుంటే భగవంతుని స్వరూపం లభిస్తుంది. -రామకృష్ణపరమహంస
❤️🕉️❤️
శ్రీరామకృష్ణులు: గృహస్థుడుగా ఉంటూ భగవంతుని ప్రార్థించే వ్యక్తి నిజంగానే వీరభక్తుడు. 'సంసారాన్ని త్యజించిన వ్యక్తి నన్ను తప్పక ప్రార్థిస్తాడు, నాకు తప్పక సేవలు చేస్తాడు. దాన్లో ఏం గొప్పతనం ఉంది. అతడు నన్ను ప్రార్థింపకుంటే అందరూ అతణ్ణి ఛీకొడతారు. కాని ఎవడు సంసారంలో ఉంటూ నన్ను ప్రార్థిస్తాడో, అడ్డంకిగా ఉన్న పెద్ద బండరాయిలాంటి అవరోధాలను వైదొలగిస్తూ నన్ను ప్రార్థిస్తాడో అతడే ధన్యుడు. అతడే ఘనుడు, అతడే
వీరపురుషుడు' అని భగవంతుడు భావిస్తాడు.          
 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

65. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి

బుద్ధి నాశనం వల్ల వ్యక్తి నశిస్తాడు (భగవద్గీత)

యుక్తాయుక్త విచక్షణ, వివేకం బుద్ధికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు. సరియైన క్రమశిక్షణతో ఈ లక్షణాలను వృద్ధిచేసుకొని బుద్ధిని సక్రమంగా వినియోగించుకోవాలి.ఈ వినియోగం ఇహజీవితాన్ని సార్థకం చేయడమే కాక, పరమార్థాన్ని సైతం సిద్ధింపజేస్తుంది.

అందుకే ఇహానికీ, పరానికి కూడా బుద్ధిశక్తిని యోగం ద్వారా పటిష్ఠం చేయడం ప్రధానం. దానికై మన గ్రంథాలు బహుసాధనల్ని ఆవిష్కరించాయి. ధ్యానం,
యోగాభ్యాసం, జపం, తపస్సు, వేదాంత విచారణ - ఇవన్నీ బుద్ధిని సరిదిద్దడానికి ఏర్పరచినవే.

'సమత్వం యోగముచ్యతే'(భగవద్గీత) 
బుద్ధి సమతౌల్యంలో ఉండడమే యోగం.ఆ సమతుల్య స్థితిలో ఉంటూ పొంగక, క్రుంగక కర్తవ్యపాలన చేయమని బోధించడానికే
గీతావిర్భావం. 'యోగస్థః కురు కర్మాణి' యోగము నందుండి
కర్మలనాచరించమని-జగద్గురువైన శ్రీకృష్ణుని బోధ.

-బుద్ధి సమతులనత్వాన్ని కోల్పోవడం ఎలా జరుగుతుంది? శ్రీకృష్ణుడు గొప్ప మానసిక తత్త్వవేత్తగా ‘గీత’లో సాక్షాత్కరిస్తాడు.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే,
సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే||
క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః।
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి||

- లోకంలో ఉండే విషయవస్తువుల్ని ఎల్లప్పుడూ చింతన చేస్తూ ఉంటే దానితో మానసికంగా 'సంగం'(సంపర్కం) ఏర్పడుతుంది. ఆ సంగం వల్ల కామం కలుగుతుంది.
ఆ కోరిక క్రమంగా అనుకూల, ప్రతికూలాల ఘర్షణలో క్రోధంగా పరిణమిస్తుంది.దానితో సమ్మోహం ఏర్పడుతుంది. ఆ మోహం వల్ల తానేమిటో, అసలు పరిస్థితులేమిటో
పట్టని మఱపు (స్మృతిభ్రంశం) కలుగుతుంది. ఆ మఱపు వల్ల బుద్ధి శక్తి నశిస్తుంది.ఆ బుద్ధి నాశనం వల్ల వ్యక్తిత్వ నాశనం (అధోగతి) కలుగుతుంది.

బుద్ధిశక్తిని పటిష్ఠపరచుకోడానికి గొప్ప పరిష్కారాన్ని సూచించారు మహాత్ములు.విషయవాంఛలతో అంటుకోకుండా (సంగం కాకుండా) జీవనయాత్రకు తగిన పరిమితులతో సంసారాన మసలేవానికి సంగం దోషం ఉండదు. దానివల్ల కామక్రోధ
మోహాదుల దాడిని తప్పించుకోవచ్చు.

ఈ 'సంగ' రాహిత్యానికై ఆత్మవిచారణ, యోగం వంటివి ఆచరించాలి. మరియొక
విధానం 'సత్సంగం'.

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||

సత్సాంగత్యం నిస్సాంగత్యానికీ, నిస్సాంగత్యం నిర్మోహత్వానికీ, నిర్మోహత్వం పరతత్త్వ
జ్ఞానానికీ, జ్ఞానం జీవన్ముక్తికీ హేతువులౌతాయి. 'సత్' వస్తువుతో సంపర్కమే సత్సాంగత్యం. ఆ సద్వస్తువే పరమాత్మ. నిరంతరం పరమాత్మను చింతన చేస్తే అది
ప్రపంచంతో సంగాన్ని పోగొడుతుంది. దేనికీ అంటని పరమాత్మను అంటుకొనే బుద్ధి కూడా ప్రపంచపు వాసనల్ని అంటుకోని స్థితికి ఎదుగుతుంది.

శ్రీకృష్ణుడు చెప్పిన క్రమం భగవత్పరమైనప్పుడు అది మరోవిధంగా పరిణమిస్తుంది.
నిరంతరం భగవంతుని చింతన చేసేవానికి భగవత్సంగం ఏర్పడి, ఆయనను ప్రాప్తింపజేసుకోవాలనే కోరిక పెరుగుతుంది. భగవద్విముఖమైన దుర్గుణాల పట్ల,
దుస్సంగం పట్ల వెగటుభావం కలుగుతుంది. భగవద్విరహం వృద్ధి చెందుతుంది.దానితో భగవన్మోహం పెరిగి, ప్రపంచాన్ని మరచే భగవత్స్మరణ ప్రబలమవుతుంది.
క్రమంగా బుద్ధి పూర్తిగా ప్రపంచాన్ని వదలి, వ్యక్తిత్వం ఈశ్వరైక్యం చెందుతుంది. 
ఆ మనోలయమే మోక్షం.

సారంగా-బుద్ధిని ప్రపంచం వైపు (విషయవాంఛల వైపు) త్రిప్పితే బంధం; పరమాత్మ
వైపు మళ్లించితే మోక్షం.            
 💥వంద మంది గురువులకు శిష్యుడిగా ఉండు.,

💥ఒక్క శిష్యుడికి కూడా గురువుగా ఉండొద్దు.

💥పునర్జన్మ అంటే ...
పరిపూర్ణత కోసం ఆత్మ చేసే ప్రయాణం.

💥శకునాలు అనేవి ట్రాఫిక్ సిగ్నల్ లాంటివి. అవి మనకు మంచే చేస్తాయి.

💥 పిల్లి ఎదురు పడితే అశుభం అనుకుంటాము.

 💥 'కాసేపు ఆగి వెళ్ళు నీకు శుభం కలుగుతుంది' అని అది నీకు చెప్పడం.

💥అందరిలో ఉండి,  అందరి గా నటించే మహానటుడు శివుడు.
 అందుకే ఆయనకు 'నట'రాజు అని పేరు వచ్చింది.

💥బయటి నుండి ఇంట్లోకి వెళ్ళేందుకు కాలింగ్ బెల్ అవసరం.,
 అలాగే బహిర్ముఖం నుండి అంతర్ముఖానికి వెళ్లేందుకు ధ్యానం అవసరం.

💥 ఎప్పటికప్పుడు తెలివిగా నిర్ణయాలు వాయిదా వేయడము
 -  తమోగుణ లక్షణం

💥 సరైన ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం
 - రజోగుణ లక్షణం

💥 శాస్త్రీయంగా ఆలోచిస్తూ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకోవడం
- సత్వగుణ లక్షణం

 ఇక చివరగా,
💥 ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న
 వాటి పర్యవసానాలు గురించి ఏమాత్రం చింతించని వారు
- నిర్గుణులు.

 Vedantha panchadasi:
బన్ధమోక్ష వ్యవస్థార్థ మాత్మనానాత్వ మిష్యతామ్ ౹
ఇతి చేన్న యతో మాయా వ్యవస్థాపయితుం క్షమా ౹౹233౹౹

233. బంధమోక్షముల వ్యవస్థ కొరకు ఆత్మలు అనేకములని స్వీకరింప వలెననచో ఆ వ్యవస్థ ఏర్పరచుటకు మాయ సర్వ సమర్థమగుటచే ఆత్మ నానాత్వము అనావశ్యకము.

దుర్ఘటం ఘటయామీతి విరుద్ధం కిన్న పశ్యసి ౹
వాస్తవౌ బన్థమోక్షౌతు శ్రుతిర్న సహతేతరామ్ ౹౹234౹౹

234. అసంభవమును సంభవము
 చేయుచున్నావనే విరోధము ఏల చూడవు ? శ్రుతి కూడా బంధమోక్షములు వాస్తవములని అంగీకరింపదు.

న విరోధో న చోత్పత్తిర్న బద్ధో న చ సాధకః ౹
న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థతా ౹౹235౹౹

234. వినాశము లేదు ఉత్పత్తి కూడా లేదు.
బద్ధుడు లేడు,సాధకుడును లేడు.
ముముక్షువు(మోక్షము కోరువాడు) లేడు.ముక్తుడును లేడు.ఇదే పరమార్థ సత్యము.

వ్యాఖ్య :- "అద్వైత భావాన్ని అంగీకరిస్తే బంధమోక్ష వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమై పోతుంది, కాబట్టి ఆత్మలు అనేకం ఉన్నాయని అనే వారి వాదాన్ని స్వీకరించాలి"
అనటం కుదరదు.
ఎందుచేతనంటే - 

ఆత్మ ఒకటే అయినప్పటికీ మాయద్వారా బంధమోక్ష వ్యవస్థ సాగిపోతుంది.
మాయద్వారా బంధమోక్ష వ్యవస్థ ఎలా జరుగుతుందంటే,
"అత్యంత దుర్ఘటమైన కార్యాన్నైనా సంభవమయేటట్లు చేయగలను"
అనే శ్రుతిని,ఇందలి విరుద్ధ స్వభావాన్నీ చూడటంలేదా ?

వాస్తవానికి బంధమోక్షాలను శ్రుతి అంగీకరించటంలేదు.
బంధం అనేది అవిద్యా జన్యమైతే,
మోక్షాన్ని పారమార్థికంగా అంగీకరించాలి; అని అనుకోవద్దు. ఎందుచేతనంటే,శ్రుతి ఈ బంధమోక్షాలు రెంటినీ సహించటంలేదు.
బంధంలాగానే మోక్షాన్ని కూడా పారమార్థికంగా అంగీకరించటంలేదు.

బంధము వాస్తవమైనచో దానికి నాశమే ఉండదు.అనగా మోక్ష ప్రసక్తియే లేదు.వాస్తవమగు బంధము నుండి మోక్షము కలుగుననుట విరుద్ధ వచనము.

చిద్రూపమైన ఈ ఆత్మ తత్త్వానికి ఉత్పత్తీ లేదు, ప్రళయము(వినాశము)లేదు.
దీనికి పుట్టుక లేదు,చావూ లేదు.
దీనికి బంధమూ లేదు కాబట్టి మోక్షమూ లేదు.బద్ధుడు లేడు సాధకుడును లేడు.
ముముక్షువు(మోక్షము కోరువాడు) లేడు.
"ఇదే పరమార్థ సత్యము".

ఈ "ఆత్మ" అనేది శ్రవణమననాదుల్తో దేనినో సాధించే సాధకుడూ కాడు,ముక్తుడూ కాడు.

"పరమార్థముగనున్నది బ్రహ్మము మాత్రమే అని భావము".

ఇట్టి ఆ బ్రహ్మము నిష్కళముగాను, నిర్వికల్పముగాను,నిరంజనముగాను(శాంతమైనది,మనస్సున కార్యములేనిది) ఉన్నది.ఆ బ్రహ్మమే "నేను" అని తెలిసికొనిన యెడల సత్యముగా 
"బ్రహ్మ" మే యగుచున్నాడు.
   -- అమృత బిందు ఉప: 10
  గౌడపాదకారిక 2.32. ప్ర. 8-71.

మాయాఖ్యాయాః కామధేనోర్వత్సౌ జీవేశ్వరావుభౌ ౹
యథేచ్ఛం పిబతాం ద్వైతం తత్త్వం త్వద్వైతమేవ హి ౹౹236౹౹

236.  మాయ అనే కామధేనువునకు జీవుడు,ఈశ్వరుడు అనే రెండు దూడలు.ఆ ఆవు పాలను ద్వైతమును ఎంతగా సేవించినా 
సత్యము అద్వైతము మాత్రమే.

కూటస్థ బ్రహ్మణోర్భేదో నామమాత్రాదృతే నహి ౹
ఘటాకాశ మహాకాశౌ వియుజ్యేతే నహి క్వచిత్   ౹౹237౹౹

237. (జీవేశ్వరులు మిథ్యయగుటచే వారి భేదము మిథ్య.అట్లే సత్యములగు కూటస్థ బ్రహ్మముల భేదము సత్యము కావలెననే సంశయము పరిహరింప బడుచున్నది.)నామమాత్రముగనే తప్ప కూటస్థమునకు బ్రహ్మమునకు భేేదము లేదు. అనంతమైన ఆకాశమునకు ఘటము నందలి ఆకాశమునకు పేరునకే కదా భేదము.

యదద్వైతం శ్రుతం సృష్టేః ప్రాక్తదేవాద్య చోపరి ౹
ముక్తావపి వృథామాయా భ్రామయ త్యఖిలాన్ జనాన్  ౹౹238౹౹

238. శ్రుతి ప్రోక్తమైన అద్వైతము సృష్టికి పూర్వము ఉండెను, ఇప్పుడును కలదు, 
ఇకమీద ఉండును.
అనగా అది త్రికాలాబాధ్య సత్యమని భావము.

వ్యాఖ్య:- తత్త్వజ్ఞానము లేని సకల జనులను మాయ వ్యర్థముగ భ్రమపెట్టుచుండును.

మాయ,జీవుడు,ఈశ్వరుడుకు ఉన్న భేదము--
జీవుడు,ఈశ్వరుడు అనే వారిద్దరూ,మాయ అనే కామధేనువు యొక్క రెండు దూడల లాంటివారు.ఆ యిద్దరూ ద్వైతమనే పాలను యిష్టం వచ్చినట్లు త్రాగితే త్రాగవచ్చు గాక !

కాని , పరమార్థం వాస్తవిక తత్త్వం మాత్రం అద్వైతమే !సిద్దాంతరూపంలో అద్వైతం మాత్రమే తెలుసుకోదగినది.

జీవుడు,ఈశ్వరుడు ఈ యిరువురు మాయికులు అయినందున వారి భేదం కూడా మిథ్యే అయితే కూటస్థుడు,బ్రహ్మ అనేవారు పారమార్థికమైతే వారి భేదం కూడా పారమార్థికమని అంగీకరించాలి గదా ! అనే సంశయం,

కూటస్థునికి బ్రహ్మకు ఉన్న భేదం నామమాత్రమే ! ఘటాకాశం,మహాకాశం ఈ రెంటికి ఉన్న భేదం నామమాత్రమైనట్లు. అనంతమైన ఆకాశమైనా ఘటమునందలి ఆకాశమైనా పేరునకే కదా భేదము.

" సదేవ సోమ్యేదమగ్ర ఆసీ దేక మేవాద్వితీయం "
--చాందోగ్య 6-2-1   
అనే ఈ శ్రుతిలో సృష్టికి పూర్వం ఏ అద్వితీయ బ్రహ్మం ఉన్నట్లు ప్రతిపాదింపబడ్డదో, ఆబ్రహ్మమే ఆ అద్వితీయ తత్త్వమే సృష్టికి తరువాత ఈనాడు ప్రళయకాలం తరువాత కూడా(ముక్తిలో కూడా) ఉంటుంది.

ఈ విధముగా బ్రహ్మము త్రికాలా బాధ్యము అని తెలుస్తోంది.కాబట్టి సత్యం !

మనం అనుకొనే భేదమంతా మాయద్వారా ఈ జీవులన్నీ భ్రమకు లోనైనందు వలన కలిగిందే ! ఈ భ్రమకు కారణం తత్త్వజ్ఞానం లేకపోవడమే !

పూర్ణ బ్రహ్మ స్వరూపము నుండి విడిపోయిన జీవాత్మ మరలా మునుపటివలనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడమే ధ్యేయంగా ఉండాలి.శ్రుతి స్మృతి మరియు వేదాంతం అన్నింటి సిద్ధాంతం ఇదే.

"జీవాత్మకు అచ్యుతపద ప్రాప్తి".               

Friday, January 3, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
             *ప్రాణస్నేహితులు*

*సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, ఇతిహాసకాలం నుంచి మాత్రం మైత్రీబంధం ఉంది. కర్ణ దుర్యోధనులు, కృష్ణ కుచేలుర కథలు మనకు తెలిసినవే. భర్తృ హరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతః కాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి, క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది.*

*స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుతమైన భావప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన. దూరంగా ఉన్నా, మానసికంగా దగ్గర చేసే మధురభావన. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి, చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ, అవసర సమయాల్లో అండగా నిలబడ గలిగి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయనివాడే నిజమైన స్నేహితుడు.*

*స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజాయతీ, నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావాలు గల వ్యక్తులు మిత్రులు కావడం సాధారణమే. కానీ దాన్ని జీవితకాలం కొనసాగించే వారే ప్రాణస్నేహితులు అవుతారు. పాలు, నీళ్లలా కలిసిపోయే నైజం కలవారి మధ్య స్నేహం అంకురిస్తే, అది వటవృక్షమై ఎంతో మందికి ఆశ్రయం ఇస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతన లేని వ్యక్తులతో తప్పనిసరి స్నేహం చెయ్యాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని వదిలించుకోవడం మంచిది.*

*'నీకు నేనున్నాను, నీ కోసం ఏమైనా చేస్తాను' అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువు లాంటిది. స్థాయీభేదాలు, అరమరికలు లేనివాళ్లే స్నేహితులు కాగలరు. 'స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికన్నా, ప్రాణమిచ్చే స్నేహితుణ్ని పొందినవాడు అదృష్టవంతుడు' అన్నాడు జాన్ రస్కిన్.*

*నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ, స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు. మంచి, చెడుల విచక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాటంతటవే తొలగిపోతాయి. ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే, దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగులుస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు.*

*తప్పు జరిగినప్పుడు 'ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?' అనే రంధ్రాన్వేషణకూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలిగినవాళ్ల మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్లలో ఉన్న మంచిని, ప్రతిభను పదుగురితో పంచుకోవాలి. చెడు అయితే మనలోనే దాచు కోవాలి. మిత్రుడిలో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగేవాళ్లే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత ఖ్యాతికి అర్హులవుతారు.*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*

🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
 *తపన – తపస్సు* 

పూజలు, నోములు, వ్రతాలు, అర్చనలు, ఆరాధనలు, అభిషేకా లు, తీర్థయాత్రలు, దక్షిణలు, ప్రదక్షిణ లు, నామస్మరణలు యిలాంటి పనులన్నింటినీ మనం ఆధ్యాత్మికం అంటున్నాం. అనుకుంటున్నాం. ఇవేవీ కానివి, వీటికి సంబంధంలేని ఇతరత్రా పనులన్నిటినీ లౌకికమని అంటున్నాం. నిజానికి పూజలు, వ్రతాలు వంటివన్నీ ఆధ్యాత్మికానికి మనల్ని తీసుకువెళ్ళే మార్గాలు. సాధనా సరంజామాలు. కానీ అవే అసలు సిసలైన ‘ఆధ్యాత్మికం’ అని అనలేం. ‘నేను’ అనే స్థాయి నుంచి విస్తృతమై, విశాలమై ‘మనం’ అనే స్థాయికి చేరుకునే ప్రయాణమే ఆధ్యాత్మికం. రాక్షసత్వం నుంచి పశుత్వానికి, పశుత్వం నుంచి మాన వత్వానికి, మానవత్వం నుంచి మాధవత్వానికి చేరుకోవటమే ఆధ్యాత్మికం. సంకుచిత్వం నుంచి సంయుక్త తత్వానికి, ఆటవికం నుంచి ఆత్మ తత్వానికి చేరుకోవ టమే అసలు సిసలు ఆధ్యాత్మికం.

ఆధ్యాత్మికం అనేసరికి పూర్వ జన్మ సుకృతం, కర్మ ఫలం, ప్రాప్తం, అప్రాప్తం అనే మాటల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. అన్నీ వాతంతట అవే అమరిపోయి అన్నీ చకచకా జరిగిపోతుంటే, ‘ఆహా! అది వాడి ప్రాప్తం’ అంటాం. అలా జరగక ఎదురు తిరిగితే ప్రాప్తం లేదంటాం. పూర్వజన్మ ఫలం అంటాం. కర్మ అనుభవించాలి అంటాం. అప్రాప్తం అని కూడా అంటాం. ఆచార్య ఆత్రేయ అన్నట్టు ”తలచింది జరిగిందంటే అంతా మన ప్రతిభ అనంటాం. తలచింది జరగని నాడు తలరాతం టూ విధిపై నెడతాం. అయితే భగవంతుడి అనుగ్రహం అనేది ఈ ప్రాప్తం, అప్రాప్తాలు, పూర్వజన్మలు, కర్మలు, సుకృతాల మీదే ఆధారపడి ఉండదు. మన సాధన మీద, మన ప్రయత్నం మీద, దీక్ష మీద, మనం ఉండే స్థితి మీద, పరిస్థితి మీద, మన సంసిద్ధత మీద ఆధారపడి ఉంటుంది.

ద్వాపర యుగంలో ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన ఇంటిలో నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. కృష్ణుని పెదవులను అంటుకుని వేణువు దివ్యమైన వేణు గానాన్ని కృష్ణుడు వేణువును ఊదకుండానే వినిపిస్తోంది. వేణు గానం విన వస్తుంటే చుట్టుపక్కల అందరూ అక్కడికి చేరుకు న్నారు. వేణువు అదృష్టాన్ని అభినందించారు. వేణువును పొగ డ్తలతో ముంచెత్తారు. వేణువుకి అందరూ తనని పొగిడే తీరు కొంచెం అసౌకర్యంగా అనిపించింది. ”నన్ను అలా పొగడ వద్దు. నాలో అహంకారం తలెత్తవచ్చు.” అని వారించింది వేణువు. కొంత సమయం గడిచిన తర్వాత కృష్ణయ్యకు ఎంతై నా వేణువు అంటే కొంచెం ఎక్కువ ఆపేక్ష అనీ, యిష్టమనీ, అది కృష్ణుని పక్షపాత బుద్ధికి నిదర్శనమనీ, కొందరి గుసగుసలు మెల్లగా వేణువు చెవిన పడ్డాయి.

అప్పుడు వేణువు యిలా అంది. ”నా శరీరాన్ని చూడం డి. తొమ్మిది గుండ్రని రంధ్రాలతో, ఎంత గుల్లగా ఉందో! చూసేరా? బాగా గుల్లగా ఉంటూ ఆ నల్లనయ్య నాలో చాలా సులువుగా ప్రవేశించేలా నేను ఉన్నాను. ఉంటున్నాను. ఆ స్థితిలో నేను ఉండగలుగుతున్నాను. మరి మీరో? మీకూ నాలాగే నవ రంధ్రాలే ఉన్నాయి. మీ నవరంధ్రాల నిండా కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, అహంకార మమ కార అసూయలను పూర్తిగా నింపుకుంటున్నారు. నల్లనయ్య తన అనుగ్రహంతో, మీలో చొరబడాలని ఎంత ప్రయత్నిం చినా, చొరబడ లేనంత స్థిరంగా ఉంటున్నారు. ఏమాత్రం గుల్లదనం లేకుండా, దృఢంగా మీ శరీరాలను ఉంచుకుంటు న్నారు. కృష్ణయ్య మీలో చొరబడటానికి అవకాశం ఏమాత్రం అ నల్లనయ్యకు ఈయడం లేదు. అలాంటప్పుడు మీలో ఆ కృష్ణయ్య దివ్యగానాన్ని ఏ రకంగా వినిపించగలడు?” అని అసలు రహస్యాన్ని వివరించింది వేణువు. అవును. భగవం తుడు సహవర్తి. సమవర్తి. అందరూ ఆయనకు సమానులే. ఆయనకు తరతమ బేధం అనేది ఏ కోసాన లేదు. సర్వులకూ సమస్త జీవులకూ తన అనుగ్రహాన్ని సమంగా అందించే తత్వం భగవంతునిది. భగవంతుడు తన అనుగ్రహాన్ని అం దరి మీద నిండుగా, దండిగా, మెండుగా కురిపించడానికి ఎల్ల ప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అయితే అందుకోడానికి మనం సంసిద్ధులమై ఉండాలి. మనసా, వాచా, కర్మణా, మనం సిద్ధ మై ఉండాలి. హృదయాన్ని తెరుచుకుని స్వచ్ఛంగా భగవం తుని కోసం మనం తయారై ఉండాలి. తపన పడాలి. తపిస్తూ ఉండాలి.

...
భజన అనే మాట చాలా పవిత్రమైనది. భజించడం, కీర్తించడం భగవంతుడికే వర్తిస్తాయి. నోరారా భగవన్నామాన్ని పాడి హృదయాలను రంజింపజేయడం భక్తి కార్యాల్లో ముఖ్యమైనది.
నారద భక్తి సూత్రాల్లోని నవ విధ భక్తి మార్గాల్లో మొదటి రెండు.. శ్రవణం, కీర్తనం.
శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నిరూపించిన వాడు పరీక్షిత్తు మహారాజు.
శుకమహర్షి లాంటి విజ్ఞాన ఘని దొరికితే చాలదు, పరీక్షిత్తు వంటి శ్రోత ఉండాలి. 
పరిప్రశ్న అనేది భగవద్గీతలో కృష్ణుడు పలికిన మాట. ప్రశ్నించడం అంటే తెలుసుకోవాలనే కుతూహలంతో అడగడం. పరిప్రశ్న అంటే కుతూహలం సరిపోదు జిజ్ఞాస ఉండాలి. తెలుసుకున్న దాన్ని ఆచరించే కార్యాచరణ కావాలి. 
పరీక్షిత్తు అలాంటివాడు. అందుకే శ్రవణం మోక్షానికి రాజమార్గమైంది.
ఒక్కరే భగవంతుడి నామాన్ని గానం చేస్తే అది కీర్తనం. సామూహిక గానం సంకీర్తనం అని పెద్దలు చెబుతారు.

*భజనలు నాలుగు విధాలు...*
1) నామ సంకీర్తనం : గోవిందా, మాధవా, రామా, కృష్ణా లాంటి నామాలతో భజించడం.
2) గుణ సంకీర్తనం : దేవదేవుడి గుణాలను వర్ణిస్తూ భజన చేయడం.
3) లీలా సంకీర్తనం : భగవంతుడి లీలలను పొగుడుతూ ఆయన చేసిన అద్భుత కార్యాల్ని కీర్తించడం.
4) భావ సంకీర్తనం : భగవంతుడు భావప్రియుడు. మన భావాలతో స్తుతించడం.

పల్లెల్లో నేటికీ కొన్ని భజన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. చిడతల భజన, చెక్కభజన, తాళాల భజన, జ్యోతిభజనతో గ్రామస్థులు భగవంతుణ్ని ఆరాధిస్తుంటారు

శ్రీరామదాసు, అన్నమయ్య మొ. వాగ్గేయకారులు, సంకీర్తనలతో తరించినవారు. తమ జీవితాలను సంప్రదాయ రీతుల్లో సంగీతపరంగా గానానికి అంకితం చేశారు. హనుమంతుడు శ్రీరామ నామ భజనలో అగ్రగణ్యుడు. నిరంతరం రామ నామ తారక మంత్రంతో తరించాడు.

మీరాబాయి కృష్ణ భక్తురాలు. మహారాణి వంశానికి చెందిన స్త్రీ అయినా వీధుల వెంట నగరసంకీర్తన చేసేవారు. మహారాణి హోదాలో ఉండి, వీధుల వెంట తిరిగి భజన కీర్తనలు పాడటం ఆమె మరిది సహించలేక పాలల్లో విషాన్ని కలిపి ఇచ్చాడు. కృష్ణార్పితంగా నైవేద్యం పెట్టి విషం పాలుతాగింది. నామసంకీర్తనా బలంతో ఆమెను  శ్రీకృష్ణుడు రక్షించాడు.

రెండు చేతులూ చరుస్తూ చప్పట్లతో భజన చేయడం గీతానికి అనుగుణమైన తాళంగా ప్రసిద్ధి పొందింది. భజన కూడా ప్రార్థనే.

రామనామ సంకీర్తనలో తరించిన గుహుడు, శబరి, భరతుడు, హనుమంతుడు భజన సంప్రదాయాన్ని ఆదర్శంగా నిలిపారు. అక్రూరుడు, విదురుడు, కుచేలుడు, మీరాబాయి.. కృష్ణ భక్తులుగా చరిత్రలో నిలిచారు.

త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు, ద్వాపరయుగంలో వ్రతాలు, పూజలు, నోములు, కలియుగంలో నామస్మరణ, యుగభక్తి ధర్మాలుగా మహర్షులు పేర్కొన్నారు.

నామి కన్నా నామం గొప్పదని ప్రకటించిన ఆంజనేయుడు భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తిగా నిలిచాడు.
భజన చేద్దాం!
 భద్రంగా ఉందాం!
*ॐॐॐॐॐॐॐॐॐ*
 *`ఒక దేశాన్ని ముస్లిం దేశం గా మార్చడానికి ముస్లిమ్స్ అవాలంబించే పద్ధతులు`* 

`దారుల అమన్ :`
*ఎక్కడైతే 0 ముస్లిమ్స్ ఉంటారో అక్కడ 2-3% ముస్లిమ్స్ వెళతారు సెటిల్ అవుతారు*

`దారుల హారాబ్ :`
*20-30% జనాభా ముస్లిమ్స్ అయ్యాక గొడవలు పెట్టుకోడం అక్కడి లోకల్స్ తో వాళ్ళ ఆడపిల్లలను హరస్ చేయడం చట్ట సభలలో పగ వేయడం చేస్తారు ప్రెసెంట్ మన దేశం ఈ స్టేజి లో ఉంది*

`దారుల ఇస్లాం :` 
*జనాభా లో 35-45% అవగానే ఏ దేశపు లోకల్స్ నీ బలవంతపు మత మార్పిడులు చేయడం చంపడం దోచుకోడం ముస్లిమ్స్ దేశం గా మార్చాలానే డిమాండ్స్ చేయడం లాంటివి చేస్తారు*


 🙏 *రమణోదయం* 🙏

*క్షుద్రమైన బుద్ధిని నశింపచేసే ఉత్తమ ఆత్మజ్ఞానం, హృదయంలో "లోదృష్టి"తో అన్వేషించి చేసే "విచారణ"తోనే ఉదయిస్తుంది. శాస్త్రాలు చదివి అనుష్ఠించని ఆత్మ విచారణ, వంటకి ఉపయోగపడని కాగితంపై గీసిన సొరకాయ బొమ్మ వంటిది.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.531)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*

'కల'నుండి ఇప్పుడే ఎందుకు మేల్కొనకూడదు?  

ఇప్పుడే ఎందుకు మేలుకోవడం లేదు?  

మీరు చేయాల్సిందల్లా మీ ఆలోచనలను ఆపడం.  
మీరు వాటిని ఆపడానికి ప్రయత్నించడం ద్వారా 
మీ 'ఆలోచనల'ను ఆపలేరు.  
మీరు వాటిని గమనించడం ద్వారా 
ఆలోచనలను ఆపవచ్చు. 
మరియు వాటిపై శ్రద్ధ చూపకుండా ఉండండి.  
మీ ఆలోచనలు మరియు స్పృహ మధ్య గోడ ఉంది.  
మీ మనస్సులో గోడను విచ్ఛిన్నం చేయండి 
మరియు ఆలోచనలు స్పృహలోకి ప్రవహించనివ్వండి, 
అక్కడ అవి పూర్తిగా అధిగమించబడతాయి 
మరియు స్పృహ మీ 'వాస్తవికత' అవుతుంది.  

కాబట్టి మీ ఆలోచనలతో పోరాడకండి.  

~ రాబర్ట్ ఆడమ్స్

రమణులు మరణించి జీవించారు కనుకనే
మరణ సమయంలో కూడా సంపూర్ణ ఎరుకతో
"నేనెక్కడికి పోగలను?" అన్నారు!

బయట అంతా నటనే...నీతో సహా
నీలో నీవు - నీతో నీవు జీవించు!

🌹🙏 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

మనస్సుకు శాంతి మనస్సులోనే ఉంది. అది మనస్సు వేగం తగ్గేకొద్ది అనుభవంలోకి వస్తుంది. అలా వేగం తగ్గిన మనస్సు సత్యంతో అనుసంధానమై పూర్తిగా తనతో తానుండి తన్మయస్థితిని పొందుతుంది.

భావాలచేత అది బంధించబడినట్లు కనిపిస్తుందిగానీ భావాలు పోతే దాని స్వతంత్రత దానికి తెలుస్తుంది. మనస్సు తన్మయస్థితిలో ఉంటే భావాలకే కాదు. ముక్తి, మోక్షాలకు కూడా అతీతంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణమైన స్థితిలో ముక్తిమోక్షం అనేవి కూడా భావాలే. భావాలే లేని తన్మయస్థితిలో మనస్సే పరమాత్మగా ఉంటుంది. ఇక దానికి అప్పుడా ముక్తి, మోక్షం అనేవి సిద్ధించే ఉంటాయి. ఏకత్వం పొందిన మనస్సు అభయ స్థితిలో ఉంటుంది. 

అట్టి స్థితిలో నామరూపములు లేనివాడను నేను. మనోతీతము నేను. పరబ్రహ్మము నేను. అపరిమితుడను నేను. చైతన్యమే నేను.

*ఋభుగీతాసారము* 🙏🕉️🙏
 పెట్టుబడి అనగానే మనకి గుర్తొచ్చేది డబ్బే. అన్నింటికన్నా విలువైందిగా మనం భావించేదీ అదే. తెల్లారి లేచి ఏం కావాలన్నా డబ్బుతోనే పని. 

కానీ నిజానికి అన్నింటికన్నా విలువైన పెట్టుబడి... ఎవరూ మనకివ్వలేనిదీ మన దగ్గర నుంచి ఎవరూ దోచుకోలేనిదీ... సమయం. 

అయినా డబ్బును వాడుకోవడంలో దాచుకోవడంలో ఉన్న జాగ్రత్తా దూరదృష్టి సమయం విషయంలో ఉండవు. ఎందుకంటే- అది ఉచితంగా వస్తోంది కాబట్టి లైట్ తీసుకుంటాం. 

'వాడు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తాడు' అంటుంటాం కానీ మనం సమయాన్ని నీళ్లకన్నా ఎక్కువగా వృథా చేస్తాం. మళ్లీ ఎవరే పని చెప్పినా 'అబ్బే అస్సలు టైం లేదు' అని క్షణం తీరికలేనివాళ్లలా పోజు కొడతాం.

👉ఒక్కసారి డబ్బు సంగతి పక్కనపెట్టి సమయాన్ని పెట్టుబడిగా పెట్టడం గురించి ఆలోచించండి. 

🌿అమ్మానాన్నలుగా పిల్లలతో గడ పడానికి, ఆరోగ్యం కోసం మంచి జీవనశైలిని అలవరచుకోడానికి, చదువులోనూ ఆటల్లోనూ రాణించేందుకు సాధనమీద, ఉద్యో గంలో పైకి వెళ్లడానికి నైపుణ్యాల పెంపు మీద, మానసికోల్లాసం కోసం నచ్చిన హాబీ మీద... మీ సమయాన్ని పెట్టుబడి పెట్టి చూడండి. 

👉కొత్త సంవత్సరంలో మిమ్మల్ని మీరే సరికొత్తగా కను గొంటారంటే నమ్మండి!... ✍️
 *ధ్యాన😌మార్గ*
మనమంతా ప్రపంచంలో జరిగే అన్నిటినీ చూస్తున్న, దివ్యమైన సాక్షి రూపాలమే. ఏదో మార్పు చెందనిది లేకుంటే మార్పు చెందుతున్న దానిని చూడలేదు. అదే మనకు సవాలు. మనం కేవలం ప్రపంచానికే సాక్షులం కాదు, మనస్సుకు, బుద్ధికి, అహంకారానికి కూడా సాక్షులమే. అహంకారం మేల్కొని
ఉన్నప్పుడే కానీ, నిద్రిస్తున్నప్పుడు ఉండదు. అయితే ఈ అహంకారం రాక పోకలను చూసేది ఎవరు? రాకపోకలు లేనిదేదో, ఎప్పుడూ ఉండేదే, ఎప్పుడూ
చూస్తున్నదే. మార్పులేనిదే మన నిజమైన ఆత్మరూపం. అదే తురీయ. ఆ తురీయ అవస్థ నుంచి మేల్కొనప్పుడు అంతా అహంకారంతో కూడి ఉంటుంది.
తత్వమసి, తత్త్వమసి, అదేనీవు నీవు శుద్ధ చైతన్యానివి. చైతన్యం ఒకటే, రెండు
చైతన్యాలు లేవు. అందరియందు, అన్నిటియందు చైతన్యమే ఉంది.
❤️🕉️❤️
శారీరకంగా చిన్నగా ఉన్న 'నేను' అనే అహంకారాన్ని ప్రక్కకు నెట్టి నా అనంత ఆత్మని ప్రకటితం చేస్తాను. ఆత్మ అందరితోను ఒకటిగా ఉంటుంది. అదే ఆధ్యాత్మిక ఎదుగుదల.
❤️🕉️❤️
ఓం ఇతి ఏతత్' 
'ఓం' అన్న అక్షరం అద్వితీయమయిన దైవం యొక్క చిహ్నం. నిర్గుణ, సగుణాల
అనంత స్వరూపం యొక్క గుర్తు 'ఓం'.
❤️🕉️❤️
మన మహర్షులు, మానవాళిముందు జ్ఞానార్జన ప్రధానమయిందిగాను, అందరూ
అది చేరుకోవలసిన గమ్యంగాను ఉంచారు. కష్టసుఖాలను తరచిచూసినప్పుడు
జ్ఞానం కలుగుతుంది. వివేకంతో ఆలోచించడం ద్వారా ఎక్కువసార్లు కష్టాలద్వారా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాం. ఈ విధంగా మనం కష్టసుఖాల ద్వారా, కష్టసుఖాలను అధిగమించుతాం. అప్పడు మనస్సు దైవాన్ని అనంత ఆత్మను గుర్తిస్తుంది. అది ద్వంద్వ భావాలన్నిటికీ అతీతమయింది.  
 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

64. అసావాదిత్యో బ్రహ్మా

ఈ ఆదిత్యుడే బ్రహ్మము (అథర్వణవేదం)

సనాతన ధర్మం సూర్యోపాసనను ప్రధానంగా బోధిస్తోంది. సర్వదేవతాశక్తులు సూర్యునిలోనే ఉన్నాయి. సౌరశక్తి వివిధ విధాలుగా పృథ్విపై ప్రసరించి పనిచేస్తోంది.
ఈ భూమిలో ప్రతి వస్తువు తన ఉనికినీ, రూపురేఖల్నీ సూర్యశక్తి నుండే గ్రహిస్తోంది.వృక్షజల సస్యాదులే కాక, జంతుజాలం, మానవులు అందరూ ప్రాణశక్తిని సూర్యుని నుండే గ్రహిస్తున్నారు.

(పరమాత్మ లక్షణాలన్నీ సూర్యునిలో గోచరిస్తాయి. “ఒక సూర్యుడు
సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలిక", దేనికీ అంటని సాక్షి
లక్షణం, సర్వశక్తిప్రదాయకత్వం, సర్వసమత్వం- ఇవన్నీ పరమాత్మ
లక్షణాలే. ఇవి ఆదిత్యునిలో గోచరిస్తాయి.

“ఆదిత్య” శబ్దానికి ప్రధానంగా “అఖండమైన తేజస్సు” అని అర్థం.
"అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోయం" అని ఆత్మ 'అఖండమైన
జ్యోతి'గా 'గీత'లో వర్ణింపబడింది.)

వర్షప్రదాత, అన్నప్రదాత సూర్యభగవానుడు. సూర్యుడొక్కడే అయినా ఆయన నుండి లభించే కిరణజాలాల్లో అనేకానేక శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. వాటి నుండే
వివిధ పదార్థాలు, వాటి ప్రయోజనాలు ఏర్పడుతున్నాయి.

విష్ణు, రుద్ర, బ్రహ్మ, అరుణ(లలిత), సుబ్రహ్మణ్య, గణేశ, గోవిన్ద, శివ, రవి,
భాను ఇవన్నీ సూర్యుని తెలియజేసే నామాలు. ఈశ్వర చైతన్యం మనకు
సూర్యరూపంలో లభిస్తుంది. అందుకే పరమేశ్వరుని తమ అభీష్ట దేవతారూపాలలో ఆరాధించే ఎవరైనా ఆ రూపాన్ని సూర్యమండలంలో ధ్యానించి ఉపాసించడం సర్వశ్రేష్టంగా అన్ని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

సర్వదేవతామయుడైన పరబ్రహ్మయే 'ఆదిత్యుడు' అని వేదం స్పష్టం చేస్తోంది.అగ్నియందు సర్వదేవతలను ఆవాహనం చేసి ఆరాధించే సనాతన సంస్కృతి-సూర్యుని సహజాగ్నిగా, బ్రహ్మాగ్నిగా భావించింది. ఆయనలో సర్వదేవతలను సంభావించి
నమస్కరించితే చాలు-సర్వదైవాలూ సంతోషిస్తారు. కర్మసాక్షి, ప్రత్యక్ష బంధువు,జగచ్చక్షువు-అంటూ భారతీయులు ఎంతో ప్రేమగా ఆరాధించుకునే దైవం సూర్యభగవానుడు.

సూర్యమండలం వేదమండలం, దైవమండలం. 'సూర్యనారాయణుడు' అని విష్ణువుగా ఆరాధించినా, 'భానుమండలమధ్యస్థా' అని అరుణగా లలితాంబను కొలుచుకున్నా,సౌరమండల మధ్యస్థుడైన 'సాంబశివుని'గా ఉపాసించినా, గాయత్రిగా అర్చించినా
సూర్యునిలోని పరమేశ్వరచైతన్యంలో మన వ్యష్టి చైతన్యాన్ని అనుసంధానం చేయడమే.తద్వారా మన ప్రాణశక్తి దివ్యశక్తితో తేజరిల్లుతుంది.

త్రిసంధ్యలలో అందరూ తమ అభీష్టదైవాన్ని సూర్యుని యందు ధ్యానించి ఆరాధించాలని వైదికశాస్త్రాలు వివరిస్తున్నాయి. 'సూర్యునిలో నన్ను భావించి
ఆరాధించేవారు-స్వగృహంలోకి యజమాని ప్రవేశించినట్లుగా నాయందు సాయుజ్యం
చెందుతారు' అని పద్మపురాణంలో శివవచనం.

సూర్యమండలాధిష్ఠాన దైవం - సప్తాశ్వరథారూఢుడు. “ఏకో అశ్వో సప్త నామ”- ఒకే అశ్వం ఏడుగా వ్యవహరింపబడుతోంది అని వేదం సుస్పష్టంగా బోధించింది.
'అశ్వం' అంటే వ్యాపించి (వేగంగా ప్రయాణించునది' అని అర్థం. ఇది కాంతికిరణాన్ని తెలియజేస్తుంది. ఒకే కాంతి ఏడుగా విశ్లేషింపబడుతుందని - అవే గుఱ్ఱాలుగా అభివర్ణించబడ్డాయని వేదహృదయం. శబ్దశక్తికి కూడా సూర్యుడే ఆధారం. అందుకే ఆ ఏడుగుఱ్ఱాలను గాయిత్రీ, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి వంటి ఏడు ఛందస్సులుగా వేదం వర్ణించింది.

సూర్యుడు 12 మాసాలలో 12 విధాలుగా ప్రసరించే చైతన్యమే ద్వాదశాదిత్యస్వరూపాలు. సర్వగ్రహాలను శాసించే సూర్యుడు మహేశ్వరుడే కదా! 

అయితే- ఇలాంటి సూర్యమండలాలు ఎన్నో ఉన్నాయి. ఊళ్ళో అందరి ఇళ్ళల్లో దీపాలున్నా మన ఇంటిదీపం మనకు ముఖ్యం. అలాగే మన పుడమికి గోచరించే సూర్యుడే మనకు దైవం. మన ఇంటి దీపాలలో మన వెలుగును గ్రహించినట్లుగా,
మనకు గోచరించే సూర్యునిలో భగవంతుడు మనకోసం ప్రతిష్ఠితుడై ఉన్నాడు.

పరమాత్మ లక్షణాలన్నీ సూర్యునిలో గోచరిస్తాయి. "ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలిక", దేనికీ అంటని సాక్షి లక్షణం, సర్వశక్తిప్రదాయకత్వం,
సర్వసమత్వం - ఇవన్నీ పరమాత్మ లక్షణాలే. ఇవి ఆదిత్యునిలో గోచరిస్తాయి.

"ఆదిత్య" శబ్దానికి ప్రధానంగా “అఖండమైన తేజస్సు" అని అర్థం.
“అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోయం" అని ఆత్మ 'అఖండమైన జ్యోతి'గా 'గీత'లో వర్ణింపబడింది.

"సూర్య ఆత్మా జగతః" - జగత్తుకే 'ఆత్మ' సూర్యుడు. దేహానికి ఆత్మ ఎలాగో, ప్రపంచానికి ఆదిత్యుడు అలాగ. సూర్యోపాసన మనలోని ఆత్మను ఆవిష్కరించుకొనే
విద్య. బుద్ధిగా, దశ ఇంద్రియాలలో చైతన్యంగా ప్రసరించే ఆత్మ-ద్వాదశాదిత్య
స్వరూపం కదా! ఉపనిషద్విద్య సైతం "అంతరాదిత్యోపాసన"గా మనలోని ఆదిత్య తేజాన్ని గ్రహించమన్నది.   

****వ్యక్తి యొక్క విలువ దేనితో?

 వ్యక్తి యొక్క విలువ దేనితో?

వివేకానందుడు అన్నాడు :

. “మీ దేశంలో బట్టలే వ్యక్తికి విలువైనవి కానీ నేను ఈ ఏ దేశం నుండి వచ్చానో అక్కడ మనిషి యొక్క వ్యక్తిత్వంతో అతడి విలువను లెక్కించడం జరుగుతుంది, బట్టలకు ఎలాంటి ప్రత్యేకమైన విలువా ఉండదు.”

స్వామీ వివేకానంద అమెరికాలో ఎక్కడికో వెళుతూ ఉన్నాడు. సాదా సీదా సాధువు దుస్తులు, తలకు తలపాగా, మెడలో ఎలాంటి టై లేదు. అలాంటి వేషధారణను చూసి అక్కడివారు అనుకున్నారు 'ఇతడు విచిత్రమైన వ్యక్తి.' కాబట్టి వారు ‘హోయ్ హోయ్...' అంటూ అతడి వెంటపడ్డారు. వివేకా నందుడు వెళుతూ ఉన్నాడు అలాగే అతడిని తమాషాను కోరుకునే వాళ్ళు వెంట వెంట వెళుతూ ఉన్నారు. ఒక వ్యక్తి అతడిని కావాలని నెట్టాడు. అతడిని ఇంగ్లీషు భాషలో నెట్టడానికి గల కారణాన్ని అడుగగా అతడు సిగ్గుతో నత్తి-నత్తిగా క్షమించమని కోరుతూ అడిగాడు : “మీరు అలాంటి వేషధారణను ఎందుకు ధరించారు?"

వివేకానందుడు అన్నాడు : “మీ దేశంలో బట్టలే వ్యక్తికి విలువైనవి కానీ నేను ఈ ఏ దేశం నుండి వచ్చానో అక్కడ మనిషి యొక్క వ్యక్తిత్వంతో అతడి విలువను లెక్కించడం జరుగుతుంది, బట్టలకు ఎలాంటి ప్రత్యేకమైన విలువా ఉండదు.”

అమాయకులు బయటి టై-పాయింట్లను చూసి ప్రభావితులౌతారు. బుద్ధిమంతులు వ్యక్తిత్వానికి విలువనిస్తారు. బుద్ధిమంతుల ఎదుట టై-ప్యాంట్లకు ఎలాంటి విలువా ఉండదు. మన దేశం వేడితో కూడిన ప్రాంతం, ఇక టై కట్టుకోవలసిన అవసరం ఏముంటుంది ? చూపించుకోవాల్సిన అవసరం ఏముంది ? మెడకు కట్టుకుని తనను గొప్పగా భావించుకోవడం వివేకం అనిపించుకోదు. ఎవరి హృదయం విశాలంగా ఉంటుందో అలాగే ఎవరైతే గొప్పలో గొప్పయగు భగవంతుని కొరకు అందరితో వ్యవహరిస్తారో వారు గొప్ప.
 Every person in the world is restless and is striving after something. What it is he does not know. In the accomplishment of ambitious projects he seeks the rest that he feels he is in need of - but he finds that worldly greatness, when secured, is a snare and a delusion. He does not find any real happiness or peace in it. He gets degrees, titles, honours, power, name, and fame. He marries, he begets children, he gets all he had supposed would give him happiness. But he finds no rest. Pious men, saints, sages declare that this restlessness of every man, this state of discontent, dissatisfaction and uncomfortableness, of being ill at ease with himself and his surroundings, is solely due to the loss of the companionship of the partner of his soul, God.

Peace is absolute serenity and tranquility, wherein all the mental modifications, thoughts, imagination, whims, fancies, moods, impulses and emotions, instincts etc., cease entirely and the individual soul rests in his own native, pristine glory, in an unruffled state. It is not, of course, the temporary condition of mental quietude which worldly people speak of in common parlance, when they retire for a short time to a solitary bungalow in a forest for a short rest. Peace is the fourth state of superconsciousness. It is the realm of supreme bliss, eternal life and eternal sunshine, where cares, worries, anxieties and fears which torment the soul here, dare not enter; where all distinctions of caste, creed and colour vanish altogether in the one embrace of the divine love and where desires and cravings find their full satiety.

~ Swami Shivananda Saraswati.       
 *స్తంభ నరసింహుని వైభవం*

‘ఇందుగలడందు లేడన్న సందేహం వలదు’ అన్న ప్రహ్లాదుడితో ‘ఏదీ ఈ స్తంభంలో చూపించు’ అంటూ హిరణ్యకశ్యపుడు గదతో మోదగానే స్తంభాన్ని చీల్చుకుని నరసింహ స్వామి ప్రత్యక్షమయ్యాడనేది పురాణ కథనం. సరిగ్గా అదే సన్నివేశంతో నిర్మితమైంది కర్ణాటక, చిక్‌బళ్లాపూర్‌ జిల్లా, బిళ్లూరు స్తంభలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. గర్భాలయంలో స్తంభంలోంచి ఉద్భవించిన తీరులో మూలవిరాట్టు దర్శనమిస్తుంది. ఆ స్తంభం అపరిమితంగా పెరిగిపోతోందని ఉపరిభాగంలో ఉన్న శీలను దించి ఉపశ మింపజేశారట.

స్తంభ నరసింహుని వైభవం

చుట్టూ కొండల బారులు, మధ్యలో పంట పొలాలు, చెరువులు, కుంటలు, నివాసగృహాలు.. ఇలా ఓ సాధారణ గ్రామం బిళ్లూరు. అక్కడే గుట్ట మీద ఉందీ శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. వివిధ రాష్ట్రాల నుంచే గాక ప్రవాస భారతీయులు కూడా ఈ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అల్లంత దూరం నుంచే నరసింహుని గుట్టపై రెండు భారీ విగ్రహాలు దర్శనమిస్తాయి. ఓ పక్కన రామలక్ష్మణులను తన భుజాలపై ఎత్తుకున్న ఆంజనేయుని 60 అడుగుల విగ్రహం, మరో పక్కన 40 అడుగుల ఎత్తున ఆశీనుడైన నాగాభరణాల పరమశివుని శిలాప్రతిమ. గుట్టపైకి వెళ్లే మెట్లమార్గానికి ఇరువైపులా వినాయక, సూర్యభగవానుల ఆలయాలుంటాయి. అలాగే గుడి ప్రాంగణంలో వేంకటేశ్వర, శ్రీరామ మందిరాలున్నాయి. చోళుల నాటి ఆంజనేయ ప్రతిమతో ఉపాలయం ఉంది. ఎన్నిసార్లు ఈ ఆంజనేయునికి ఆలయం కట్టాలన్నా గోడలు కూలిపోవటంతో ఆంజనేయునికిలా ఉండటమే ఇష్టం కాబోలని బహిరంగంగానే ఉంచారట. అందుకే ఇది బయలాంజనేయ ఆలయం అయ్యిందంటారు. 
 Vedantha పంచదశి.           అత ఏవాత్ర దృష్టాన్తో యోగ్యః ప్రాక్ సమ్యగీరితః ౹
ఘటాకాశ మహాకాశ జలాకాశాభ్రఖాత్మకః ౹౹224౹౹

224. అద్వైత సత్యమును నిరూపించుటకే ఉపాధియుతమైన ఆకాశమును పూర్వము ఉదాహరించితిమి.
ఘటమునందలి ఆకాశము, అనంతమగు ఆకాశము జలమునందు ప్రతిఫలించిన ఆకాశము మేఘమునందలి ఆకాశము అని.

జలాభ్రోపాధ్యధీనె తే జలాకాశాభ్రఖే తయోః ౹
ఆధారౌ తు ఘటాకాశ మహాకాశౌ సునిర్మలౌ ౹౹225౹౹

225. జలమునందు మేఘమునందు ప్రతిఫలించిన ఆకాశములు జలము మేఘములనెడి ఉపాధివశమున ఏర్పడినవి.ఘటమునందలి ఆకాశము అనంతమగు ఆకాశము శుద్ధములు నిర్మలములు.

ఏవ మానంద విజ్ఞానమయౌ మాయాధియోర్వశౌ ౹
తదధిష్ఠాన కూటస్థ బ్రహ్మణీ తు సునిర్మలే ౹౹226౹౹

226. అట్లే ఆనందమయ కోశము, విఙ్ఞానమయ కోశము అనునవి మాయ దాని వికారమగు బుద్ధి ఉపాధులుగ ఏర్పడినవి.వానికి ఆధారములు,అధిష్ఠానములు అగు కూటస్థము బ్రహ్మము అనేవి పరిశుద్ధములు.
వ్యాఖ్య:- తత్,త్వం అనే పదాలయొక్క శోధనస్వరూపాన్ని చూపించటానికై వెనుకటి దృష్టాంతాన్ని గుర్తు చేస్తున్నారు.

తత్,త్వం అనే పదాల్ని బాగా శోధనచేసి శుద్ధరూపాన్ని ప్రదర్శించాల్సి ఉంది.ఈ ప్రకరణమునందు తత్,త్వం అనే పదాల శోధనమే ముఖ్య ప్రయోజనం.

అందుచేత,ఘటాకాశ మహాకాశాలు,జలాకాశ,
అభ్రాకాశాల దృష్టాంతం లోగడ చూపబడ్డది.దానిని బట్టి, 

ఘటాకాశస్థానీయుడు కూటస్థుడు,
మహాకాశస్థానీయుడు పరబ్రహ్మ,
జలాకాశస్థానీయుడు జీవుడు,
మేఘాకాశస్థానీయుడు ఈశ్వరుడు!
అని గుర్తుచేసుకోవాలి.

పదార్థశోధన పద్దతి,
జలాకాశం జలరూపమైన ఉపాధియొక్క ఆధీనంలోను, మేఘాకాశం మేఘం అనే ఉపాధియొక్క ఆధీనంలోను ఉన్నందువల్ల పారమార్థికమైనవి
 కావు.

వాటికి ఆశ్రయభూతమైన ఘటాకాశం,మహాకాశం అనేవి స్వచ్ఛమైనవి.
జలంలాంటి ఏవిధమైన ఉపాధిని ఆపేక్షించకుండా శుద్ధము,నిర్మలము 
అయినవి కేవలం ఆకాశ మాత్రంగానే. ఉన్నాయి కాబట్టి!

ఇదే విధముగా ఆనందమయుడైన ఈశ్వరుడు మాయ అనే ఉపాధి యొక్క ఆధీనములోను, విజ్ఞానమయుడైన జీవుడు బుద్ధి అనే ఉపాధి ఆధీనములోను ఉన్నారు.

కాని వారిద్దరికి అధిష్ఠానాలైన కూటస్థుడు,బ్రహ్మ ఈ ఇరువురు మాత్రం,
శుద్ధము,నిర్మలము (పరిశుద్ధము)అయినవారు-ఘటాకాశ మహాకాశాల్లాగా !

పదార్థ శోధనలో ఉపయోగపడుతున్నప్పటికి సంఖ్యయోగమతాలు అంగీకరింపదగినవి కావు.

అవశ్యం ప్రకృతిః సంగం పురేవాపాదయే త్తథా ౹
నియచ్ఛత్యేతమీశోఽ పి కోఽ స్య మోక్షస్తథా సతి ౹౹231౹౹

231. ప్రకృతి శాశ్వతమైనచో పురుషుడు తాను ప్రకృతి కంటె భిన్నుడనని తెలిసికొనిన పిమ్మట కూడా పురుషునియందు ప్రకృతి సంగము కల్పించును.ఈశ్వరుడు శాశ్వతుడైనచో శాశ్వతముగ పురుషుడు శాసింపబడును.ఇక సాంఖ్యుల మతమున పురుషునకు మోక్ష మెక్కడిది ? లేనే లేదని భావము.

అవివేకకృతః సఙ్గో నియమశ్చేతి చేత్తదా ౹
బలాదాపతితో మాయావాదః సాంఖ్యస్య దుర్మతేః ౹౹232౹౹

232. పురుషుని యొక్క ఈ సంగము (దేహాదులయందు) ఈశ్వరునిచే శాసింపబడుట అవివేకము వలన అనినచో మందబుద్ధులగు సాంఖ్యులపై మాయావాదము బలవంతముగ వచ్చిపడును.

వ్యాఖ్య:- వివేకం కలగడానికి పూర్వం, ప్రకృతి జీవుడిని తన బంధనంలో ఉంచుకొంటుంది.
అతనియందు సంగన్ని-అధ్యాసాన్ని కలిగిస్తుంది. వివేకానికి పిమ్మట కూడా జీవుణ్ణి బంధనంలోనే ఉంచుకొంటుంది. ఈశ్వరుడుకూడా జీవుడిని శాసిస్తూ వుంటాడు.
ఈశ్వరుని వల్ల జీవునికి ప్రేరణ కూడా కలుగుతూనే ఉంటుందన్నమాట.

ఈ విధముగా సంగము(అధ్యాసం) శాసనము(ఈశ్వరు నియమనం) ఉంటూనే ఉంటే ఇంకా మోక్షమనేది ఏముంటుంది ?

అద్వైత జ్ఞానం కలిగితేనే తప్ప అసంగత్వజ్ఞానం సైతం కలుగదు.

ప్రకృతి భిన్నత్వ వివేకముచే అవివేకము తొలగుటచే పురుషునకు సంగము, శాసనము సాంఖ్యమతమునకు కూడా ఉండవని ఆక్షేపము.

అవివేకము అనగానేమి ?తరచిచూచినచో అదే మాయయనీ మందబద్ధులగు సాంఖ్యులు దానిని గుర్తింప లేకున్నారనీ సమాధానము.

సంగము,నియమము(ప్రేరణ)
అనేవి అవివేకంవల్ల కలుగుతాయని పూర్వపక్షాలు అనవచ్చు.
అవివేకం నివారింపబడితే ఇక సంగము మొదలైనవి ఎట్లా పుడతాయి ? అని ప్రతిపక్షులు అనవచ్చు.

ఇలాగనుక జరిగితే కుమతులైన సాంఖ్యావాదులు తాము అనుకోకుండానే మాయావాదులైపోతారు.
సంగము(అధ్యాసం),
శాసనం(నియమనం)అనేవి అవివేకానికి కార్యాలు.
దీనిని అంగీకరిస్తే అపసిద్ధాంతం సిద్ధిస్తుంది.ఇందువల్ల సాంఖ్యంలోకి మాయావాదం బలవంతాన వచ్చి చేరుతుంది.అంటే,

అవివేకమనగా వివేకము లేకపోవుట కాదు,
లేని వస్తువు ఫలితములను చూపగలుగుట అసంగతము కనుక.
వివేకము కంటే ఇతరము కాదు,
ధైర్యము మొదలగునవి సంగమును కల్పింపకపోవుట చేత.
వివేకమునకు విరుద్ధమైనదనియే చెప్పవలెను.

లేనిదానిలో నుండి ఉన్నది పుట్టదు కనుక వివేకం కంటే వేరొక వివేకం ఉండటమన్నది కుదరదు.వివేకం కంటే అన్యమైనది ఘటాదుల సంగానికి హేతువు కాజాలదు. కాబట్టి వివేకంకంటే వేరొక వివేకం ఉన్నదని అనటానికి వీలు లేదు.

ఇక భావరూపమైన అజ్ఞానం అని అంగీకరిస్తే మాయావాదాన్ని అంగీకరించినట్లే!

అద్వైతవాదం అంగీకరిస్తే బంధమోక్ష వ్యవస్థ కుదరదు.కాబట్టి 
ఆత్మలు అనేకం ఉన్నాయనే అంగీకరించాలి ! అని వారి వాదం--
 
ఇదే అజ్ఞానము మాయ అని అద్వైత సిద్ధాంతము కనుక సాంఖ్యులు మాయనాహ్వానించినట్లే అగును.     

Thursday, January 2, 2025

 సిటీ మార్కెట్‌లో, ఒక ప్రత్యేకమైన దుకాణం పెద్ద సైన్‌బోర్డ్‌తో తెరవబడింది:

 "ఇక్కడ మీరు భర్తలను కొనుగోలు చేయవచ్చు."

 దుకాణం తెరిచిన వెంటనే, లోపలికి వెళ్లడానికి ఆసక్తిగా మహిళలు గుమిగూడారు.  కానీ దుకాణం వెలుపల ఒక హెచ్చరిక వ్రాయబడింది:

 "భర్తని కొనడానికి నియమాలు"

 - ప్రతి స్త్రీ ఒక్కసారి మాత్రమే దుకాణంలోకి ప్రవేశించవచ్చు.

 - దుకాణంలో మొత్తం 6 అంతస్తులు ఉన్నాయి మరియు ప్రతి ఫ్లోర్‌లో వివిధ రకాల భర్తల గురించి వివరించబడింది.

 - కస్టమర్లు ఏ అంతస్తు నుండి అయినా భర్తను ఎంచుకోవచ్చు.

 - మీరు ఒక్కసారి పైకి వెళ్తే, దుకాణం నుండి నిష్క్రమించడం తప్ప, మీరు తిరిగి క్రిందికి రాలేరు.

 ఓ యువతి ఉద్వేగంతో షాపులోకి ప్రవేశించింది.

 **మొదటి అంతస్తు:**

 సంకేతం ఇలా ఉంది:

 "ఇక్కడ, భర్తలు ఉద్యోగం మరియు నిజాయితీగా ఉన్నారు."

 ఇంకొంచెం చూస్తాను’’ అనుకుని ఆ అమ్మాయి ముందుకు కదిలింది.

 **రెండవ అంతస్తు:**

 సంకేతం ఇలా ఉంది:

 "ఇక్కడ, భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీపరులు మరియు పిల్లలను ప్రేమిస్తారు."

 “ఇంకా మంచిదేదో చూస్తాను” అని ఆ అమ్మాయి మళ్ళీ ఆలోచించి ముందుకు సాగింది.

 **మూడో అంతస్తు:**

 సంకేతం ఇలా ఉంది:

 "ఇక్కడ, భర్తలు ఉద్యోగంలో ఉన్నారు, నిజాయితీపరులు, పిల్లలను ప్రేమిస్తారు మరియు చాలా అందంగా ఉన్నారు."

 ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆగింది కానీ ముందుకు వెళ్లకుండా ఉండలేకపోయింది.

 **నాల్గవ అంతస్తు:**

 సంకేతం ఇలా ఉంది:

 "ఇక్కడ, భర్తలు ఉద్యోగం, నిజాయితీ, అందమైన మరియు ఇంటి పనులలో సహాయం చేస్తారు."

 “ఇంతకంటే ఏం బాగుంటుంది?” అనుకుంది ఆ అమ్మాయి.  కానీ ఆమె హృదయం "ఇంకో అంతస్తు చూద్దాం" అని చెప్పింది.

 **ఐదవ అంతస్తు:**

 సంకేతం ఇలా ఉంది:

 "ఇక్కడ, భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీపరులు, అందమైనవారు, ఇంటి పనులలో సహాయం చేస్తారు మరియు వారి భార్యలను గాఢంగా ప్రేమిస్తారు."

 ఆ అమ్మాయి నమ్మలేకపోయింది.  “అలాంటి భర్త ఉండగలడా?” అనుకుంది.  కానీ ఉత్సుకత ఆమెను చివరి అంతస్తుకు తీసుకెళ్లింది.

 **ఆరవ అంతస్తు:**

 సంకేతం ఇలా ఉంది:

 "మీరు ఈ అంతస్తుకు వచ్చిన 3339వ మహిళ. ఇక్కడ భర్తలు లేరు. మహిళలను పూర్తిగా సంతృప్తి పరచడం అసాధ్యమని నిరూపించడానికి మాత్రమే ఈ అంతస్తు. మా దుకాణాన్ని సందర్శించినందుకు ధన్యవాదాలు! ఎడమ వైపున ఉన్న మెట్లు బయటికి దారితీస్తాయి."

 **ముగింపు:**

 నేటి కాలంలో, చాలా కుటుంబాలు మరియు అమ్మాయిలు "అత్యుత్తమమైన" అన్వేషణలో వివాహానికి సరైన వయస్సు మరియు అవకాశాన్ని కోల్పోతున్నారు.  సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం గొప్ప జ్ఞానం.
 *దైవానుగ్రహం.....*

*మనకి అనుభవంలోకి వచ్చిన ప్రయోజనం వెనుక అవ్యక్తంగా ఉన్న పరమాత్మను గుర్తిస్తే దైవానుగ్రహం నిరంతరంగా ఎలా వర్షిస్తుందో తెలుస్తుంది. దైవం యొక్క స్వరూపమే అనుగ్రహం అనే విషయం అప్పుడు అర్థమవుతుంది.*

*తల్లి కడుపులో చిన్న వీర్యపు బిందువుగా మొదలైన మన జీవితం తొమ్మిది నెలల్లో చక్కని రూపుదిద్దుకోవడం మనకు అనుగ్రహంగా కనిపించటంలేదు. పుట్టినప్పుడు జానెడు పకందుగా ఉండి ఆ తర్వాత ఆరడుగులు పెరగడంలో ఆశ్చర్యం కలగటంలేదు.*

*కానీ ఎవరో ఎక్కడో ఏదో ఒక వస్తువు సృష్టించారని తెలిస్తే తెగ ఆశ్చర్యపోతాం. మనం అనుభవించటం మినహా స్వయంగా చేయలేని ఎన్నో విషయాలు ప్రకృతి మనకు అందిస్తుంది. మనతో నిమిత్తం లేకుండా జరిగిపోయే పనంతా దైవమే...*

*గులాబీ మొక్క నాటి నీళ్ళు పోస్తే, పువ్వు సిద్ధమవుతుంది. కానీ ఇది దైవానుగ్రహం అని మనకు అనిపించదు.*

*మామిడిపండులోని తియ్యదనం అంటే ఇష్టపడతాం. అది మనకు లభించటాన్ని అనుగ్రహం అంటాం. పండులో తియ్యదనం ద్వారా వ్యక్తమైన అనుగ్రహం భూమిలో టెంకె నాటినప్పుడే ఉంది.*

*రుచికరమైన వంటచేసి పెట్టినవారి శ్రమను గుర్తించి కృతజ్ఞతలు చెప్తాం. కానీ అసలు ఆ వంటకు మూలమైన ఆహార పదార్థాలను అందించిన దైవానుగ్రహాన్ని మనం గుర్తించం.*

*ఈ సృష్టి అంతా దైవానుగ్రహంగా వ్యక్తమవుతుంటే... కొంత మంది మాత్రం పరిమిత ఫలాల్ని ఆశించి అవి నెరవేరటాన్ని బట్టి అనుగ్రహాన్ని కొలతలు వేసుకుంటారు...*

     *🔱|| ఓం నమః శివాయ ||🔱*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁

*లక్షల శ్లోకాలు గల* *"మహాభారత" సారాంశం...* *తొమ్మిది వాక్యాలలో...*

 *జై శ్రీకృష్ణ.....*

*లక్షల శ్లోకాలు గల*
*"మహాభారత" సారాంశం...*
*తొమ్మిది వాక్యాలలో...*

*మీరు 'ఏ మతస్తులు' అయినా, స్త్రీ లేక పురుషుడు అయినా, బీదా ధనిక అయినా ఏ ప్రాంతం వారైనా సరే.. ఆణిముత్యాలు వంటి "ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి".*

1. *మీ పిల్లల 'అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు' తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు... వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు.*
*ఉదా:-  "కౌరవులు."*

2. *నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని 'అధర్మం' కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.*
*ఉదా:- "కర్ణుడు"*

3. *యోగ్యత తెలుసుకోకుండా 'పుత్ర వాత్సల్యం' తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.*
*ఉదా:- "అశ్వత్థామ".*

4. *పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ 'నిర్వీర్యుడై' బ్రతకవలసి వస్తుంది.*
*ఉదా :-" భీష్ముడు."*

5. *సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  'దురహంకారం' తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.*
*ఉదా :-"దుర్యోధనుడు "*

6. *"స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది".*
*ఉదా:- "ధృతరాష్ట్రుడు."*

7. *తెలివితేటలకి 'ధర్మం, సుజ్ఞానం' తోడైతే విజయం తప్పక లభిస్తుంది.*
*ఉదా:- "అర్జునుడు".*

8. *'మోసం,కపటం,' జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు.*
*ఉదా:- "శకుని."*

9. *నీవు 'నైతిక విలువలు' పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.*
*ఉదా :- "యుధిష్ఠిరుడు."*


*🌷||సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు||🌷*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁
 *#మరిచిపోతున్నాం....* 
🦚🌹🌻💎🪷🌈

 *తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం* 
 *ప్రపంచంలో జరిగే* 
 *యుద్దాల గురించి*  
 *అన్యాయాల గురించి* 
 *ప్రతిరోజు ఆరా తీస్తూ* 
 *మన పక్కనున్న మనుషుల్ని*  
 *పట్టించుకోకుండా పక్కకు తప్పుకుంటున్నాం*  

 *తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం* 
 *అమ్మ ను వంట గదిలో వదిలిపెట్టి*  
 *అమ్మకైన గాయాలను ఖాతరు చేయకుండా*  
 *ఏం కర్రీ చేసావంటూ పైపైకి* 
*నవ్వుతూ అడుగుతున్నాం*  

 *తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం* 
 *నాన్నను డబ్బులు అడగడమే తప్పా* 
 *నాన్న మన కోసం చేస్తున్న* 
*అప్పులెన్నీ* 
 *కడుతున్న వడ్డీ లెన్నీ* 
 *పడుతున్న పాట్లెన్నీ* 
 *అడగడం మరిచిపోతున్నాం*  

 *తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం* 
 *మనకున్న ఎకరాలు ఎన్నో గుర్తుపెట్టుకొని*  
 *నాన్న వాటిని కాపాడడానికి పడుతున్న కష్టాలను* *లోలోపల కార్చుతున్న కన్నీళ్లను* *గుర్తించలేకపోతున్నాం*  
 *బాధ్యతలు బరువులు మోసీ మోసీ* 
 *కుంగిపోయిన నాన్న  వెన్ను ను* 
 *బక్కచిక్కిన అమ్మను*  
 *కనీసం దగ్గరికి* *తీసుకోలేకపోతున్నాం* 

 *వీకెండ్ విందుల్లో విలాసాల్లో* 
 *మునిగితేలి* 
 *ప్రపంచాన్ని మరిచిపోవడమే* 
 *మన ప్రపంచం* *అనుకుంటున్నాం* 
 *ఇక్కడ మందు బాటిళ్లు, చికెన్ ముక్కలు*సిగరెట్ డబ్బాలే కాదు* 
 *అంతకన్నా మత్తు నిచ్చే* *మనుషులు ఉన్నారని* *మరిచిపోతున్నాం* 

 *తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం* 
 *క్లబ్బులు పబ్బులే కాదు* 
 *మనల్ని తిరిగి మనుషుల్ని*
 *చేసే పుస్తకాలు ఉన్నాయని* 
 *మన స్వేచ్ఛ స్వాతంత్రాల* *కోసం వాళ్ళ ప్రాణాలనే* *పణంగా పెట్టిన పోరాట* *యోధులు ఉన్నారని* 
 *మరిచిపోతున్నాం* 

 *తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం*  
 *ఎప్పుడంటే అప్పుడు బిర్యానీ*
 *ఆర్డర్ పెట్టుకొని* 
 *తినే మనం* 
 *కలుషిత ఆహారం తిని* 
 *విగత జీవులైన విద్యార్థులు* 
*ఉన్నారని* 
 *తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం* 

 *తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం* 
 *అర్ధరాత్రి బెనిఫిట్ షోలకు వెళ్లి* 
 *తిరిగి వచ్చే కొడుకు కోసం* 
 *భర్త కోసం* 
 *తెల్లవార్లు ఎదురుచూసే* 
 *తలుపు గడియ తీసే ఉంచే* 
 *మన అమ్మ , భార్య మన కోసం  ఉన్నారని* 
 *ఎదురుచూస్తుంటారని మరిచిపోతున్నాం* 
🦚🌹🌻💎💜🌈

****ఆధ్యాత్మిక గ్రంధాలలో " ధ్యానానికి వున్న విశిష్టత

 *🙏ఆధ్యాత్మిక గ్రంధాలలో " ధ్యానానికి వున్న విశిష్టత🙏*

*పూజకోటి సమం స్తోత్రం,*     
 *స్తోత్రకోటి సమో జపః* 
 *జపకోటి సమం ధ్యానం ,*          
 *ధ్యానకోటి సమో లయః* 
 
*భావం:* 

కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం,
కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం,
కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం,
కోటి ధ్యానాదులు ఒక లయానికి సమానం.

 *నాస్తి ధ్యాన సమం తీర్థం;*     
 *నాస్తి ధ్యాన సమం తపః|*   
 *నాస్తి ధ్యాన సమో యజ్ఞః*  
 *తస్మాద్యానం సమాచరేత్* 
 
*భావం:* 

ధ్యానంతో సమానమైన తీర్ధం కానీ , ధ్యానంతో సమానమైన తపస్సు కానీ ధ్యానంతో సమానమైన యజ్ఞాలు కానీ లేవు , అందువలన | అన్నింటికన్నా ఉత్తమమైన ధ్యానం తప్పక అభ్యసించాలి.        
           
                 - *వ్యాసమహర్షి*

*🧘‍♀ధ్యాన పద్ధతి🧘‍♀* 

🔸ఒకచోట కూర్చుని 
 శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంచి, కళ్లు రెండూ మూసుకొని,మీ లో జరుగుతున్న సహజమైన
ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమ నించాలి. 
🔸మధ్యమధ్యలో ఆలోచనలు  వస్తే వాటిని వెంటనే కట్ చేసి మళ్లీ మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. 
🔸ఏ మంత్రమూ చెప్పరాదు. ఏ రూపాన్ని ఊహించుకో రాదు.
 🔸ఇలా చేయగా చేయగా   మీ పమనస్సులోని ఆలోచనలు  తగ్గి, ఆలోచనలు లేని స్థితికి చేరుకుంటారు.
 *శివుడు లేని చోటెక్కడ..?*


🌷అవ్వయ్యార్ శివ భక్తురాలి కథ:🌷

🌿అవ్వాయ్యార్ అనే వృద్ధురాలి భక్తికి మెచ్చి గణపతి ఆమెను సశరీరంగా  కైలాసానికి తీసుకు వెళ్తాడు.

🌸అవ్వ కడు వృద్ధురాలు కావడం తో కాళ్ళు మడిచి కూర్చోలేక శంకరుని ముందు కాళ్ళు చాపి కూర్చుంటుంది.

🌿పరమేశ్వరుడి పక్కనే ఉన్న పార్వతికేమో మనస్సు చివుక్కమంది.' అలా కూర్చోవడం అపరాధం కదా!అన్న భావం తో ఆమెకు ఒక్కసారి చెప్పి చూడమని పతి దేవుణ్ణి కోరింది.

🌸అమ్మో ! ఆమె పరమ భక్తురాలు.ఆమెనేమీ అనకూడదు!అన్నాడు శివుడు. అయినా పరమేశ్వరి ఆ అమర్యాదను సహించక చెలికత్తె కు చెప్పిచూసింది.

🌿ఆ సఖి అవ్వను సమీపించి ' అవ్వా!అవ్వా! కాళ్ళు ఈశ్వరుని వైపుకు పెట్టకు అంది'.అప్పుడు ఆ వృద్దురాలు ' అలాగా అమ్మా! ఈశ్వరుడు లేని చోటు ఎక్కడో చెప్పు , 

🌸కాళ్ళు అటు వైపు పెట్టుకుంటాను ' అంటూ పక్కకు తిప్పుకుందట ! పరమేశ్వుడు కూడా ఆవైపుకు తిరిగాడు.అటు తిప్పితే అటు తిరిగాడు.ఎటు తిప్పితే అటు శంకరుడు తిరగాల్సి వచ్చింది .

🌿 అలా తిరుగుతూ పరమేశ్వరుడు పార్వతీ వైపు చూసి ' నేను చెబితే విన్నావు కాదు!ఆమె నన్ను ఎలా తిప్పుతుంది చూడు.అందుకే నేను నోరు మెదపకు అన్నాను.

🌸నేను భక్తుల వశమే అని నీకు తెలుసు కదా! అంటాడు.
అప్పుడు పార్వతీదేవి అవ్వా క్షేమించు అని ఆమెను ప్రార్థించి నదట! అయినా శివుడు లేని చోటెక్కడైనా ఉందా?...             
 *అనంత మద్భుత మాశ్చర్యం బిది..*

తాళ్లపాక పెదతిరుమలాచార్య అధ్యాత్మ సంకీర్తన

అనంత మద్భుత మాశ్చర్యం బిది
సనాతనుఁడ నను సరవిఁ గావవే 

బలిమి నసురలకు భయంకరుఁడవు
అలరి అమరులకు ఆనందకరుఁడవు
తలకొని ఋషులకు తపఃఫలదుఁడవు
పలు నీ మహిమలు పలుకఁగ వశమా 

అరయ వేదముల కాధారంబవు
పరగఁగ జీవుల ప్రాణనాథుఁడవు
పరమయోగులకు పరబ్రహ్మమవు
తిరముగ నీమూర్తి తెలియఁగ వశమా 

జగముల కెల్లను సర్వబంధుఁడవు
తగిలిన శ్రీకాంతకు నివాసమవు
జిగి శ్రీవైష్ణువులకు శ్రీవేంకటపతివి
తగు నీ కత లివి తలఁచఁగ వశమా

*అనంత మద్భుత మాశ్చర్యం బిది*

👆భావము :

- శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు

     తండ్రి అన్నమాచార్యులవారికి సమవుజ్జీ అయిన కొడుకు ఈ పెద తిరుమలాచార్యులు. ఈయన కూడ తండ్రివలెనే లెక్కకు మిక్కుటమైన సంకీర్తనలను శ్రీవేంకటేశ్వర మకుటంతో రచించి తరించాడు. ఈ కీర్తనలో పెద తిరుమల శ్రీవేంకటేశ్వరుని *"ప్రభూ! ఇది (నీ మహిమ) అనంతము.... ఇది (నీమూర్తి) అద్భుతము... ఇది (నీ కథలు) ఆశ్చర్యకరము. ఓ సనాతనుడ! (ఆదికి ననాదియైన వాడా) నన్ను సరవి (క్రమముగా) రక్షించువయ్యా!"* అంటున్నారు. ఈయనా వైష్ణవుడై ఆ మతప్రచారం చేసి తరించాడు. స్వామి యెవరెవరికి ఏమిటో వివరిస్తున్నారు.

     సనాతనుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు అనంతమైన మహిమలు కలవాడవు. నీవు అద్భుతమైన మూర్తివి. నీ ఆశ్చర్యకరమైన కథలు తలచిన వారి జన్మ ధన్యము. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇది అనంతమద్భుతమాశ్చర్యంబు... అందుచేత నన్ను రక్షించవయ్యా!

1. దేవా! నీవు ఎంతో బలవంతులైన అసురులకు కూడా భయంకరమైన వాడవు. వారిని వెదకి మరీ... సంహరించావు. అమరులైన (మరణంలేని) దేవతల కందరికీ ఆనందము నొసగువాడవు. తలకొని (పూనుకొని) మునులకు వారి తపస్సులకు తగిన ఫలితముల నొసగు పరమాత్మవు. అటువంటి నీ మహిమ యెట్టిదో పలుకుట నా వశమా! నీవు అనంతమైన మహిమలు కలవాడవు.

2. ప్రభూ! నీవు చూడబోతే, వేదములన్నింటికీ ఆధారభూతుడవు... (వేద రక్షకుడవు, వేద నుతుడవు, వేదవేద్యుడవు). జీవులందరికీ -  చీమ అయినా తిమింగిలమైనా, తీతువు పిట్ట అయినా, గండ భేరుండమైనా, అమ్మకడుపులో పెరుగుతున్న బిడ్డ అయినా, పర్వతాకారుడైన రాక్షసుడకైనా ప్రాణనాథుడవు. ప్రాణం రూపంలో వున్న అంతర్యామివి నీవే. పరమయోగులందరూ పరబ్రహ్మగా భావించి ఆరాధించేది నిన్నే. అట్టి నీ మూర్తి (స్వరూపం) ఇది... అని తిరముగ (స్థిరంగా) తెలుసుకోవటం, మా వల్ల అవుతుందా?

3. ఓ దేవదేవా! జగములకెల్ల (పదునాల్గు భువనాలకు) నీవు సర్వబంధుడవు. తగిలిన (నిన్ను వలచి వలపించుకొన్న) శ్రీకాంతకు (లక్ష్మీదేవికి) నివాసమవు (హృదయంలోనే నివాసమై వున్నవాడవు). శ్రీవైష్ణవులందరికీ నీవు శ్రీవేంకటేశ్వరుడవు. ఓ శ్రీమన్నారాయణా! నీ భాగవత కథలు ఆశ్చర్యకరమై విన్నవారిని పావనులను చేస్తాయి. ఆ కథలనన్నింటిని తలచి నీ ఘనత నెరుగుట నావల్ల అయ్యే పనేనా? అది నేను సాధించగలనా ప్రభూ!          
 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

63. యథా చిత్తం తథా వాక్చ యథా వాక్చ తథా క్రియా

చిత్తము, వాక్కు, క్రియ ఒకేలా ఉండాలి (వేదవాక్యం)

శుద్ధత కోసం వేదమతం అనేక భావనలను ప్రసరించింది. వాక్కు వ్యక్తి సంస్కారానికి ప్రతీక. వ్యక్తిత్వం వాక్కులో ప్రతిఫలిస్తుంది. అందుకే వాక్కును శుద్ధం చేసుకోవడంప్రధానం.

అయితే వాక్కు వేరుగా, మనస్సు వేరుగా కాకుండా మనోవాక్కులు ఏకం కావాలి. మనస్సులోని సంకల్పం, భావన పటిష్ఠంగా వాక్కులో నెలకొనాలి. అలాగే అన్నమాట
పదిలంగా మనస్సులో నిలవాలి. ఇదే నిజమైన సత్యవ్రతం.

వేదం ఈ మాటలను పలికి 'ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి' అని ప్రతిన పలికించింది. శాశ్వతమైన పరమాత్మయే 'ఋతం' - ఆయన నుండి ప్రసరించిన చైతన్యమే 'సత్యం'. వాటిని మననం చేయడం, వాక్కుతో అర్చించడం యథార్థమైన వ్రతం.

అధ్యయన సందర్భంగా ఈ మంత్రాన్ని చెబుతూ, అధ్యయనం చేసిన దివ్య విషయాలు వాక్కునందు, మనస్సు నందు సుప్రతిష్ఠితం కావాలని బోధిస్తున్నది వేదమాత. కేవలం
మాటలతో అధ్యయనం చేయడమే కాక - ఆ విద్య మనస్సులో నిలవాలి. అధ్యయన కాలంలో మనస్సు, వాక్కునందు నిలవాలి. ఇది ఏకాగ్రతకు, శ్రద్ధకు ఉన్న ప్రాధాన్యాన్ని
తెలియజేయడం.

అలా పలికిన సత్యం పలికిన వానిని, అధ్యయనం చేయించిన గురువును కూడా రక్షిస్తుంది. అందుకే ‘తన్మామవతు- తద్వక్తారమవతు- అవతు మామ్... అని శాంతి
మంత్రం పూర్తవుతుంది.

మనోవాక్కుల ఏకత్వం సిద్ధించి తరువాత క్రియరూపంగా పరిణమిస్తే ఆ జీవితం ధన్యం. దీనినే 'ఆర్జవత్వం' అంటారు. 'ఋజుత్వ'మే ఆర్జవత్వం. మనోవాక్కాయ కర్మల ఐక్యత, శుద్ధతలే ఋజుత్వం. ఈ ఆర్జవ శక్తి ఆత్మను కాపాడుతుంది.

అసత్యాలతో, వంచనలతో తనను కాపాడుకోగలననుకోవడం భ్రమ మాత్రమే.అది ఆత్మను క్షోభింపజేసి, పతనానికి తీసుకువెళుతుంది.

యథా చిత్తం తథా వాక్చ
యథా వాక్చ తథా క్రియా యి

చిత్తమేదో మాట అదే, మాట ఏదో క్రియ అదే. ఇదే త్రికరణ శుద్ధి. ఈ త్రికరణాలలో 'సత్యం' నిండితే ఆ జీవితం పరిపూర్ణం. వాక్కు వెలికి వచ్చేటప్పుడు - అది సత్యమో,
కాదో మనస్సుకి తెలుస్తుంది. మనస్సు వెనుక సత్యం ఉంటుంది. అది మాటగా రాకపోతే, ఆ సత్యం మనస్సును హెచ్చరిస్తూనే ఉంటుంది. తాను పలికేది సత్యమో,అసత్యమో ఆ అంతరంగానికి తెలుసు. అంతరంగ స్వరమే వెలికివస్తే సత్యం. అది
లేకుండా అంతరంగమొకటీ, అనేదొకటీ అయితే మాట సగం ముక్కలైనట్లే. వాక్కు, అంతరంగం ఒకటైన నాడు ఆ వాక్కుకి బలం వస్తుంది.

అలాగే అన్న వాక్కును నిలబెట్టుకున్నప్పుడు బాహ్యమూ, భావమూ ఒకటై మనస్సుకి
పటిష్ఠత చేకూరుతుంది. ఆ కారణంచేత సత్యం వాగ్విషయమే కాదు, మనోవిషయం కూడా.

సత్యమే నారాయణుడు. సర్వజ్ఞుడైన విష్ణువే వెలుపలా, బైటా ఉన్నవాడు. ఆ స్పృహ ఉన్నప్పుడు అసత్య జీవనమే ఉండదు. సత్యం లేని అర్చన, ఉపాసన, యజ్ఞం,
తపస్సు వ్యర్థం. సత్యంతో కూడిన యజ్ఞం సర్వాంగీనమవుతుంది.

మనస్సుకి భిన్నంగా మాట్లాడినా, మాటకు భిన్నంగా ప్రవర్తించినా చేసిన తపస్సు క్షీణిస్తుంది. మనోవాక్కుల ఏకత్వమే మహాతపస్సు. ఆ తపోమయ జీవనాన్ని
సాధించడమే జీవన పరమార్థం. భారతీయ తాత్విక చింతనకి మూలభూమిక ఇదే.              
 *ముక్తి... సాధన.....*

ముక్తిని కోరిన సాధకుడు ఒక సద్గురువును సమీపించి - వినయంతో ఆయనను ప్రశ్నించి ఆయన బోధను స్వీకరించాలి. ఐతే గురువును చేరి ఆయనను సేవించి, పూజించితే ముక్తి వస్తుందా ? రాదు ! మరి ఎలా? అంటే..

గురువు మార్గాన్ని సూచిస్తాడు. ఆ మార్గంలో జాగ్రత్తగా ప్రయాణం చేయవలసిన వాడవు నీవే. నిన్ను నీవే ఈ సంసారసాగరం నుండి ఉద్ధరించుకోవాలి. దానికై నిర్విరామంగా కృషి చేయాలి. ఏమిటా కృషి...

సమ్యక్ దర్శన నిష్ఠ...

ముందుగా నీ దృష్టిని సరి చేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని మనం రాగద్వేషాలనే రంగుటద్దాల నుండి చూస్తున్నాం. కొన్నింటిపై రాగం - కొన్నింటిపై ద్వేషం. బుద్ధిలో ఈ రాగద్వేషాలుంటే వస్తువులు ఉన్నవి ఉన్నట్లు కనిపించవు. మనకు ఇష్టమైన వ్యక్తి ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా, అందవిహీనంగా ఉన్నా మనకు బాగానే ఉంటాడు. అదే ఇష్టం లేని వ్యక్తి ఎంత బాగా మాట్లాడినా - ఏమి అన్నా వాటిల్లో నుండి తప్పులను వెతుకుతాం. అతడు మంచిమాట మాట్లాడినా అందులో చెడు కనిపిస్తుంది. కనుక ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటమే సమ్యక్ దర్శనం అంటారు. అట్టి నిష్ఠలో నిరంతరం ఉండాలి.

యోగారూఢత్వం...

ఈ సమదృష్ఠితో - సమ్యక్ దృష్ఠితో ప్రపంచాన్ని చూస్తూ ఉండటంతో క్రమంగా మన మనస్సు ప్రశాంతమవుతుంది. అప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుంది. నిజంగా ఈ ప్రపంచం ఎంతో ఆకర్షణీయమైనదిగా కనిపిస్తుంది. సుఖాన్నిచ్చేదిగా కనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. ఆ నిజం తెలిస్తే ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు చూస్తే మనలో వస్తువులపై గాని, విషయాలపై గాని, భోగాలపై గాని కోరిక, వ్యామోహం లేకుండా తటస్థంగా - నిర్లిప్తంగా ఉండగలుగుతాం. అలా ఉన్నప్పుడు మనస్సులో కోరికల వత్తిడి లేకపోవటాన ఎటువంటి సంచలనం, ఆందోళన లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా వివేక వైరాగ్యాలతో మనస్సు ప్రశాంతమైనప్పుడు కర్మలపై ఆసక్తి తగ్గిపోయి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవటానికి గురువు చూపించిన మార్గంలో జ్ఞానాన్ని గ్రహించటానికి, సాధనలు చేయటానికి తయారుగా ఉంటాం. ఇలా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవటానికి నిరంతరం కృషి చేసే మనస్సు యోగంలో ఉన్నది అని చెప్పవచ్చు. మనస్సు ఇలా ప్రాపంచిక విషయాలవైపుకు భోగాల వైపుకు పరుగులు తీయకుండా స్థిరంగా - శాంతంగా ఉండి ఆత్మవైపుకు ప్రయాణం చేస్తుంటే యోగారూఢత్వంలో ఉన్నట్లే. ఆ విధంగా మనస్సును శుద్ధం చేసి ఉన్నత లక్ష్యం మీద నిలపటానికి కృషి చేయాలి.. 

 Vedantha panchadasi:
తృణార్చకాది యోగాన్తా ఈశ్వరే భ్రాంతిమాశ్రితాః ౹
లోకాయతాది సాంఖ్యాన్తా జీవే విభ్రాన్తి మాశ్రితాః ౹౹216౹౹

216. గడ్డిని పూజించువారు మొదలు యోగసాధకుల వరకు అందరూ ఈశ్వరుని గూర్చి భ్రమించినవారు.
లోకాయతులు(చార్వాకులు)మొదలు సాంఖ్యుల వరకు అందరు జీవుని గూర్చి భ్రమించిన వారు.

అద్వితీయ బ్రహ్మతత్త్వం న జాయన్తి యదా తదా ౹
భ్రాన్తా ఏవాఖిలాస్తేషాం క్వ ముక్తిః క్వేహ వా సుఖమమ్ ౹౹217౹౹

217. అద్వితీయ బ్రహ్మతత్త్వమును ఎరుగకపోవుట చేత వారందరూ భ్రాంతిచెందినవారే .
వారికి ముక్తి ఎక్కడ?సుఖమెక్కడ?ఏదీ లేదని భావము.

ఉత్తమాధమ భావశ్చేత్తేషాం సాదస్తు తేన కిమ్ ౹
స్వప్నస్థ రాజ్యభిక్షాభ్యాం న బుద్ధః స్పృశ్యతే ఖలు ౹౹218౹౹

218. వారికిని ఉత్తమము అధమములైన సుఖములు ఉండవచ్చును గదా,బ్రహ్మజ్ఞానము లేకపోయినా ఉంటే ఉండనిమ్ము.దాని వలన లాభమేమి? 
స్వప్నమందు రాజ్యములేలినా బిచ్చమెత్తినా మేలుకొనినపుడు సమానమే గదా?

తస్మా న్ముముక్షుభిర్నైవ మతిర్జీవేశవాదయోః ౹
కార్యా కింతు బ్రహ్మతత్త్వం విచార్యం బుద్ధ్యతాం చ తత్ ౹౹219౹౹

219. కనుక ముముక్షువులకు జీవేశ్వరులను గూర్చి వాదములు పెట్టుకొనుట తగదు.కాగా బ్రహ్మత్త్వమును గూర్చి విచారింపవలెను.దానిని తెలిసికొనవలెను కూడా.

పూర్వపక్షతయా తౌ చేత్తత్త్వ నిశ్చయహేతుతామ్ ౹
ప్రాప్నుతోఽ స్తు నిమజ్జస్వ తయోర్నైతావతావశః ౹౹220౹౹

220. అట్టివాదములు పూర్వపక్షరూపమున తత్త్వనిశ్చయమునకు తోడుపడును కదా అంటే అట్లే కానిమ్ము.కాని వశము తప్పి ఆ వాదవివాద సముద్రమున మునిగిపోకుండ మాత్రము జాగ్రత్తపడుము.
వ్యాఖ్య:- వాదోపవాదములనునవి అంతులేక కొనసాగును.అవి చిత్తవిభ్రమణమును మాత్రమే కల్పించును.

చెట్లను,రాళ్ళను(అర్చకా)పూజించేవారు మొదలుకొని యోగమార్గాన్ని అనుసరించేవారి వరకు ఉన్న వాదులంతా ఈశ్వరుని విషయంలో భ్రమకులోనై ఉన్నారు.అట్లాగే చార్వికాది నాస్తికులు మొదలుకొని సాంఖ్యుల వరకూ అంతా జీవ విషయకమైన భ్రాంతికిలోనై ఉన్నారు.
ఇందుకు కారణ మేమంటే-

అద్వితీయమైన బ్రహ్మత్త్వాన్ని తెలుసుకొనలేని వారంతా విభ్రాంతులై ఉన్నట్లే!
అటువంటి వారికి మోక్షంగాని,
ఈ లోకంలో సుఖంగాని ఎట్లా లభ్యమౌతుంది?

భ్రాంతులైన అజ్ఞానులు కాబట్టి మోక్షం కలుగదు.తమ పక్షానికి సంబంధించిన మొండి పట్టుదల కలవారైనందున ఈ లోకంలో చిత్తశాంతి సైతం లభించదు. చిత్తశాంతి లేకపోతే సుఖం ఉండదు గదా!

ఇతర పక్షాలకు సంబంధించినదైనా ఏదో ఒక జ్ఞానమంటూ కలిగి ఉన్నందున దానికి తగినట్టి ఉత్తమ మధ్యమాధమ సుఖం ఏదో ఒకటి లభించాలి గదా! అంటే -

అట్లా వాదించేె వారిలో ఉత్తమాధమభేదాలు ఉంటే ఉండవచ్చుగాక!
వాటివల్ల ముముక్షువులకు ఏమి లాభం ఉంటుంది?

స్వప్నంలో లభించే రాజ్యసంపదవల్లగాని,భిక్షాచరణ దారిద్ర్యంవల్లగాని స్వప్నంనుండి మేల్కాంచిన వానికి కలిగే లాభం ఏముంటుంది?
ఆ విధమైన స్వప్నంలో కలిగే సంపదవల్ల,దారిద్ర్యంవల్ల లాభంగాని నష్టంగాని ఏమీ ఉండదు.

ఇక ఉపసంహారంగా జీవేశ్వర స్వరూప జ్ఞానం విచారిస్తే,

అందుచేత,
మోక్షాన్ని కోరేవారు జీవేశ్వర విషయకరమైన వ్యర్థవివాదాల జోలికి పోకుండా,శ్రుతుల్లో చెప్పినట్లుగా బ్రహ్మతత్త్వమును గూర్చి విచారించి తెలుసుకుని బ్రహ్మతత్త్వమునకు సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి.

ముముక్షువులు 
జీవవాదం,ఈశ్వరవాదం అనే ఈ వివాదంలో పూర్వ పక్షానుసారంగా తత్త్వ నిర్ణయానికి కారణం అయితే కావచ్చు!తప్పులేదు.
కానీ,వివేకరహితులై ఆ వివాదాల్లో మునిగిపోయి పడి ఉండటం తగదు.

సత్యము,జ్ఞానము,
అనంతరూపత్వము కలదేదో అదే బ్రహ్మము.అదే యథార్థమైనది-అదే వాస్తవికమైనది.

అసఙ్గ చిద్విభుర్జీవః సాంఖ్యోక్త స్తాదృగీశ్వరః ౹
యోగోక్తస్తత్త్వమోరథౌ శుద్ధౌ తావితి చేచ్ఛృణు ౹౹221౹౹

221. (ఆక్షేపము): కాని "సాంఖ్యులు  చెప్పునట్లు జీవేశ్వరులు సంగరహితులు శుద్ధచైతన్యము శాశ్వతులు అనీ యోగులనునట్లు తత్త్వమసి అనే వాక్యమున తత్,త్వం అనే పదములకు అర్థమగు ఈశ్వరుడు జీవుడు శుద్ధ స్వరూపులనీ వేదాంతులు అంగీకరింపవలెను" 
అంటే విను.

న త్తత్త్వమోరుభావర్థావస్మత్సిద్ధాన్తతాం గతౌ ౹
అద్వైత బోధనాయైవ సా కక్షా కాచిదిష్యతే ౹౹222౹౹

222.(సమాధానము):- ఆ అర్థములు అద్వైత సిద్ధాంతమును అనుసరింపవు.అవి జీవ ఈశ్వరులకు వాస్తవమగు భేదమున్నట్లు ప్రతిపాదించును.
అద్వైత సిద్ధాంతమున అట్టి భేదము లేదు.సిద్ధాంతము బోధించుటకు తాత్కాలికముగ మాత్రమే భేదము స్వీకరింపబడును.

అనాది మాయాయాభ్రాంతా జీవేశౌ సువిలక్షణౌ ౹
మన్యన్తే తద్ వ్యుదాసాయ కేవలం శోధనం తయోః ౹౹223౹౹

223. అనాదియగు మాయచే ప్రభావితులై జనులు జీవులు ఈశ్వరుడు అత్యంతము విలక్షణతత్త్వములని భావింతురు. ఇట్టి భ్రమను తొలగించుటకే వేదాంతి తత్,త్వం పదముల అర్థమును విచారించును. వ్యాఖ్య:-సాంఖ్యయోగమతాలవారు చెప్పే జీవేశ్వరులు,శుద్ధచిన్మయులు,
చిద్రూపులు అవటం మీకూ సమ్మతమే గదా !
కాబట్టి,ఈ జీవేశ్వరుల విషయం పూర్వపక్షంలోకి వస్తుందా?రాదా?

సాంఖ్య మతాన్ని అనుసరించి జీవుడు అసంగుడు,చేతనుడు,వ్యాపకుడు.
అట్లాగే యోగమతాన్ని అనుసరించి ఈశ్వరుడుకూడా అసంగుడు, చిద్రూపుడు వ్యాపకుడు(విభుడు)

ఈ జీవుడు ఈశ్వరుడు అనే మాటలు క్రమంగా త్వం,తత్ అనే పదాలకు సరియైన అర్థం అవుతుంది.
అట్లా అనటం అద్వైతమతానికి అనుకూలంగానే ఉంది గదా!
ఇక వారిని పూర్వపక్షులుగా పరిగణించటం ఎందుకు? అంటే,

వారు చెప్పినట్టి త్వమ్,తత్ అనే పదాల అర్థం అద్వైతమతాన్ని అనుసరించి చెప్పినది కాదు.
కూటస్థుడు,బ్రహ్మ అనే శబ్దాలలో విడిగా ఎక్కడైనా చెప్పినప్పటికీ అది అద్వైతజ్ఞానాన్ని కలిగించటానికి మాత్రమే చెప్పబడినది!

ఈ రెంటికి ఉన్న ఏకరూపత్వాన్ని ప్రతిపాదించటానికి మాత్రమే అలా భిన్నత్వంగా వ్యాఖ్యానింపబడినది. అంతే తప్ప,
ఆ రెండూ వేరువేరు అని భిన్నత్వాన్ని అంగీకరించలేదు.

జీవుడు,ఈశ్వరుడు అనే పదాల్ని పరిశీలించటంవల్ల తప్పుదిద్దటమువలన కలిగే ప్రయోజనమేంటంటే,

తనకు ఆశ్రయమైనవారినే వ్యామోహితుల్నిచేసి,భ్రాంతికి లోనుగావించే మాయవల్ల భ్రమలోపడి,విపక్షులైనవారు జ్ఞానులై ఉండే తమ విపరీత జ్ఞానంవలన జీవుని ఈశ్వరుణ్ణి వేరువేరుగా భావిస్తున్నారు.

అందుచేత, వారి భ్రాంతిని తొలగించ టానికే త్వం,తత్ అనే శబ్దాలను ఆరూపంలో శోధనం చేయవలసి వచ్చింది.
పరిశీలన చేసి,తప్పుదిద్దవలసి వచ్చింది.

ఎన్ని దారులలో ప్రయాణించినను "తత్త్వ"విచారణ ద్వారా మాత్రమే ఆ పరమాత్మ ను తెలుసుకోగలము.