🔸ఆడంబరం🔸
" మనిషి ఆడంబరాలకి
బానిసకావడం అత్యంత దుఃఖకరం; దురదృష్టకరం"
అని అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీ చాప్లిన్.
మన ప్రాచీనకాల జ్ఞానులు, సాధు సత్పురుషులు, మేధావులు
అంతా నిరాడంబర జీవితమే సత్యమని , ముక్తిదాయకమని
తెలియజేశారు. అయినా మనం పట్టించుకోము.
బాహ్య వేషాలకు, ఆడంబారాలకి మనిషి లొంగిపోయాడు.
20 వ శతాబ్దపు స్పానిష్ చిత్రకారుడు పాప్ లో పికాసో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చిత్రకారుడు.
ఆధునిక చిత్రకళారంగంలో కొత్త విప్లవం తీసుకువచ్చిన వాడు.
అలాటి పికాసో ఒకనాడు తన మిత్రులను విందుకు ఆహ్వానించాడు.
విందుకు హాజరైన ఒక మిత్రుడు
పికాసో గృహానికి రావడం అదే మొదటిసారి. ఆ మిత్రుడు ఇల్లంతా ఒకటికి పదిసార్లు పరిశీలనగా కలియతిరిగాడు.
అతని కళ్ళలో ఆశ్చర్యం గోచరించింది.
ఆ మిత్రుడు ఏదో అడగడానికి సంశయిస్తున్నాడని గమనించిన పికాసో
" మిత్రమా ! నీవేదైనా అడగాలనుకుంటే నిస్సంకోచంగా అడుగు " అన్నాడు.
ఆ మిత్రుడు అడిగాడు " మీరు , మీ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందాయి. ఎన్నో
మిలియన్ల డాలర్ల విలువ చిత్రాలకు సొంతదారులు.
మీరు చిత్రీకరించే చిత్రాలకై ప్రపంచమే
ఎదురు చూస్తూ వున్నది. కాని మీ గృహంలో
మీరు చిత్రీకరించిన చిత్రం ఒకటి కూడా
అలంకరించబడలేదే... కారణమేమిటి?
అందుకు పికాసో చిరునవ్వుతో
" చిత్రాలను కొని వాటిని గోడలకు తగిలించుకొనేంత అంత ధనికుడిని కాదు నాకంత స్థోమత లేదు."
అని పికాసో యిచ్చిన సమాధానం ఇతరుల ప్రశంసలు పొందడం కోసం కాదు. చిత్రాలు కొనలేనంత లోభి కాదు.
అసలు కారణం ఏమంటే పికాసోకి ఆడంబర జీవితం అంటే యిష్టం లేదన్నది పరమసత్యం.
🌸🌸
ఒక ఊళ్ళో ఒక
సాధారణ గుమస్తా ఉండేవాడు. కానీ అతని భార్యకు ఆడంబర జీవితమంటే మోజు.
ఒక రోజు వారి పెళ్ళి రోజు సందర్భంగా ఆ సామాన్య గుమస్తా తన భార్యకు
ఒక వజ్రపుటుంగరం ప్రజెంట్ చేసి ఆశ్చర్యపర్చాడు.
ఇది చూసిన బావమరది " బావా.. అక్కకు మంచి కానుకే
యిచ్చారు .. అక్క చాలా రోజులుగా
కారు కావాలని కోరుతున్నది కదా....
అది కొనలేకపోయారా ? అని అడిగాడు.
అందుకు బావగారు "వజ్రపుటుంగరం కవరింగ్ లో దొరుకుతుంది. మరి కారు అలా దొరకదే ! అని అన్నాడు తాపీగా.
🔸శేషశ్రీ
No comments:
Post a Comment