Thursday, September 8, 2022

నో..అడ్మిషన్

నో..అడ్మిషన్

🔹🔸🔹🔸🔹🔸

మనం ఎన్నో గ్రంధాలు చదువుతుంటాం. కాని వాటిని అర్థం చేసుకొని, ఆచరణలో పెట్టలేకపోతాం. అలా చేయడానికి, మనం చదివిన దానిని సరిగా అర్థం చేసుకొని, మనసుకు పట్టించుకోడానికి, ముందు మనసు నిర్మలంగా ఉండాలి. 

మనసు ప్రాపంచిక విషయాలతో మకిల పట్టి ఉండకూడదు. తెల్లగా, శుభ్రంగా ఉన్న వస్త్రానికి, ఏ రంగు వేసినా చక్కగా అతుకుతుంది. అదే మురికి పట్టిన వస్త్రానికి ఎంత మంచి రంగు వేసినా అంటదు. అలాగే మనసు నిర్మలంగా లేకపోతే, ఎన్ని గ్రంథాలు చదివినా మనసుకు పట్టవు. 
మనకు బయట ప్రపంచములో నుండి వీనుల విందైన శబ్దములు, కఠోర శబ్దములు వినిపిస్తుంటాయి. అలాగే సుందరదృశ్యములు కనిపిస్తుంటాయి. బయట ప్రపంచములోని వస్తువులను తాకితే స్పర్శ సుఖం, తింటే రుచి కలుగుతాయి. ఇవన్నీ బాహ్య ప్రపంచంలో నుండి మనలోపలికి ప్రవేశించేవే.

మనం తలుపు బార్లా తెరిచిపెడితే దొంగలు, కుక్కలు, అన్నీ లోపలకు బాహాటంగా ప్రవేశిస్తాయి. అదే తలుపు మూసి ఉంచితే, మనకు ఇష్టమైన వాళ్లు, మన వాళ్లు మాత్రమే ఇంట్లోకి వస్తారు. అలాగే మన మనసు ద్వారాలను కూడా బార్లా తెరిచిపెడితే అవసరమైనవి, అవసరం లేనివి అన్ని విషయములు మనసులోకి తోసుకొని వస్తాయి. అదే మనసును మన అదుపులో ఉంచుకుంటే మనకు కావాల్సిన వాటిని మాత్రమే మనసులోకి అనుమతించవచ్చు. ఒక వేళ ఏవైనా బలవంతాన లోపలకు తోసుకొని రావడానికి ప్రయత్నిస్తే బుద్ధి అనే కర్రతో వాటిని కొట్టి బయటకు గెంటవచ్చు. అలా కాకుండా అన్నిటినీ లోపలకు రానిస్తే చెడు అలవాట్లు అన్నీ మొదట అమాయకంగా మనసు లోపలకు వచ్చి అక్కడే తిష్టవేసుకొని కూర్చుంటాయి. ఓ పట్టాన వదలవు. మనషిని నాశనం చేస్తాయి. కాబట్టి ముందే నో అడ్మిషన్ బోర్డు పెట్టాలి. ఏ విషయాలను అంటే వాటిని మనసు లోపలకు రానీయకుండా కట్టడి చేయాలి. ఇది మన కనీస కర్తవ్యం. 



🔹🔸🔹🔸🔹🔸🔹🔸

No comments:

Post a Comment