ఒక తరం అమ్మలు తలచుకున్నారు,
"నా కొడుకు అమెరికా లో ఉద్యోగం చేయాలి" అని.
ఒకే ఒక్క తరం తిరిగే సరికి ఇంటికి ఇద్దరు అమెరికా లో సెటిల్ అయ్యారు
----------------------
ఒక తరం అమ్మలు తలచుకున్నారు,
"నా కూతురు నా లాగా కష్ట పడకూడదు" అని.
ఒకే ఒక్క తరం తిరిగే సరికి ప్రతి ఇంట్లో పనమ్మాయి, వాషింగ్ మెషిన్ ఉన్నాయి
----------------------
ఒక తరం అమ్మలు తలచుకున్నారు,
"నా కూతురు నా లాగా భర్తపై డిపెండ్ కాకూడదు" అని.
ఒకే ఒక్క తరం తిరిగే సరికి ఇంటికో అమ్మాయి ఉద్యోగం చేస్తోంది
----------------------
ఒక తరం అమ్మలు తలచుకున్నారు,
"నా పిల్లలు నా లాగా ఇల్లు కోసం, బండి కోసం కష్ట పడ కూడదు" అని.
ఒకే ఒక్క తరం తిరిగే సరికి ప్రతి కుటుంబానికీ ఓ బండి, ఓ ఇల్లూ ఉన్నాయి
----------------------
ఒక్క అమ్మ అనుకుంది,
"నా కొడుకు నా భర్త లా ఓ విదేశీ హుకుం కింద పని చేయడు" అని.
25 ఏళ్లలో ఆ కొడుకు ఛత్రపతి శివాజీ అయ్యాడు. దేశం బానిసత్వం నుంచి బయట పడింది.
----------------------
అమ్మలూ, మీరు అనుకుంటే అయిపోతుంది. ఈ మూడూ అనుకోండి, ప్లీజ్..
1. "నా కొడుకులు సమస్యల నుంచి పారిపోయే వారు కారు. ఈ దేశం లోనే నిలబడి ప్రతి సమస్యనూ సాల్వ్ చేస్తారు. ఈ దేశాన్ని స్వర్గం చేస్తారు."
2. "స్త్రీ త్వం అంటే పురుషుల పట్ల, అత్త గారి పట్ల వ్యతిరేకత కాదు. స్త్రీ స్వాతంత్య్రం అంటే విచ్చల విడి తనం కాదు. కుటుంబాన్ని స్వర్గం చేయడం, రాబోయే తరాన్ని తీర్చి దిద్దడం. నా కూతురు చేసి చూపుతుంది."
3. "నా దేశం, నా ధర్మం సర్వోత్తమమైనవి. నా పిల్లలు వీటిని ప్రపంచం లోనే అత్యుత్తమంగా నిలబెడతారు."
అని.
మీరు అనుకుంటే అన్నీ అలా అయిపోతాయంతే!
(మీరు ఇంట్లో కూర్చునే చేత గాని మనుషులని మీ బుర్ర ల నిండా నింపారు 70 ఏళ్లుగా)
అమ్మాలూ, అమ్మాయిలూ ప్రతి ఒక్కరూ మన చరిత్ర పుస్తకాలు దయచేసి మీరన్నా చదవండి...
No comments:
Post a Comment