Saturday, December 3, 2022

ఏది మంచిది...

 *💎ఏది మంచిది...🌈* 
🕉️🌞🌎🏵️🌼🚩

*🛕దేవుని పాదాలపై పూలు పెట్టేందుకు గుడికి వెళ్ళకు,* 
*ముందుగా మన  ఇంటిని,* *మనసుని  దయ, ప్రేమ, వాత్సల్యాల పరిమళాలతో నింపుకోవడం మంచిది....* 

*దేవుని ముందుదీపాలు వెలిగించేందుకు గుడికి వెళ్ళకు,* 
*ముందుగా మన లోపలి పాపం,* *గర్వం, అహంభావాలెనే చీకటిని హృదయం నుండి తొలగించుకోవడం మంచిది....* 

*తల వంచి ప్రార్థించేందుకు గుడికి వెళ్ళకు,* 
*ముందుగా మన తోటి వారి ముందు వినయంగా ఉండటం నేర్చుకోవడం మంచిది....* 

*మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థించేందుకు గుడికి వెళ్ళకు,...* 
*ముందు మనం చేసే దోషం వల్ల, బాధ పడ్డవారికి, క్షమాపణ చెప్పుకోవడం మంచిది...* 

*మనం చేసిన పాపాలకు క్షమించమనిఅడిగేందుకు గుడికి వెళ్ళకు,* 
*ముందుగా మనలను గాయపరిచిన వారిని హృదయ పూర్వకంగా క్షమించడము నేర్చుకోవడం మంచిది....* 

*అప్పుడు మన హృదయమే దేవాలయము అవుతుంది...* 
*ఆ దేవుడు మనలోనే కొలువై  మనకు ఏమి, ఎప్పుడు ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు....*

   🕉️🌞🌎🏵️🌼🚩

No comments:

Post a Comment