Friday, December 9, 2022

ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రాధమిక సూత్రాలు...!!

 *ఆధ్యాత్మిక సాధన*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

✅👉 *ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రాధమిక సూత్రాలు...!!*

✅🕉️ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా దైవ నామ జపం చేయాలి...

✅🕉️ నిరంతరం సత్సంగం లేదా సద్గ్రంథ పఠనం కొనసాగించాలి, విన్న మంచి మాటలను ఆచరించి, సత్శీలంతో జీవించాలి. 

✅🕉️ ఈ సూత్రాలు పాటించకుండా ఎవరూ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు...

✅👉 మనసులో వ్యాపకాలు పెరిగే కొద్దీ దైవ నామ స్మరణ తగ్గిపోతుంది...

✅👉 వంద వ్యాపకాలలో... దైవస్మరణ ఒకటి ఐతే... దైవ దర్శనం సులభ సాధ్యం కాదు...

✅🕉️ ఏ వ్యాపకమైనా సంతోషంగానో, దుఖంగానో ముగుస్తుంది. 
నిజానికి సంతోషం, దుఃఖం క్షణికానుభవాలు.  కానీ..‌. సంతోషాన్ని కావాలనుకోవటం, దుఃఖాన్ని వద్దను కోవటం చేత అవి మరింత విస్తృతమై, శాంతిని దూరం చేస్తున్నాయి...

✅🕉️ ప్రతి పనిలోనూ త్రికరణశుద్ధి అలవడితే మనసు నిరంతరం వర్తమానంలో ఉంటుంది. అలా ఉన్న మనసుకు ఆశ, కోరిక, సంతోషం, దుఃఖం ఏవైనా క్షణికానుభవాలే అవుతాయి...
అందుకే వర్తమానంలో ఉన్న మనసు తన స్వరూపమైన శాంతిని అఖండంగా అనుభవించ గలుగుతుంది. 
ఆ అఖండ శాంతి కోసమే మనం ఆధ్యాత్మిక సాధన చేయ్యాలి...



💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

No comments:

Post a Comment