🕉 శ్రీ గురుభ్యోనమః
మౌనం
మౌనం : నిన్ను నీకు పరిచయం చేస్తుంది.
మౌనం : ఈ విశ్వానికి నిన్ను పరిచయం చేస్తుంది.
మౌనం : నీ దిశ నిర్దేశాన్ని గుర్తిస్తుంది.
మౌనం : నీ వాక్కును సరిచేస్తుంది.
మౌనం : నీ మార్గాన్ని సుగమం చేస్తుంది.
మౌనం : నీ ప్రతి పనిలోను విజయాన్ని అందిస్తుంది.
మౌనం : నీ మనస్సును శుద్ధి చేస్తుంది.
మౌనం : వెలకట్టలేని ఆస్థి నీ మౌనం.
మౌనం : ప్రతి ప్రశ్నకు మౌనంలోనే సమాదానం లభిస్తుంది.
మౌనం : మౌన ధ్యానం ఈసృష్టిలో ఉన్న సమస్త లోకాలకు నిన్ను తీసుకువెళ్తుంది.
మౌనం : సమస్త జీవకోటికి నిన్ను పరిచయం చేస్తుంది.
మౌనం : ఈ సృష్టిలోని మహాత్ములకు, మహర్షులకు నిన్ను పరిచయం చేస్తుంది.
మౌనం : ఒక్క మానవునికి తప్ప ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికోటికి మౌనంలోని రహస్యం తెలుసు.
మౌనం : మౌనం విలువ తెలియక మానవుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలకు గురిఅవుతున్నాడు.
మౌనం : మౌనం విలువ తెలిసినవానికి ఏ చింతాలేదు.
మౌనం : ఈ సృష్టిని నడిపిస్తుంది.
మౌనం : ఒక్కరోజు మౌనం నెలరోజుల జీవితాన్ని సరిచేస్తుంది.
మౌనం : నెలరోజుల మౌనం సం ॥ ర జీవితాన్ని సరిచేస్తుంది.
మౌనం : ఒక్క సం ॥ ర మౌనం నీ జీవితమంతటిని సరిచేస్తుంది.
మౌనం : నీ ప్రస్తుత జీవితమౌనం నీ గత 100 జన్మల పాపాలను కడుగుతుంది.
మౌనం : నీ ఆత్మకు మోక్షాన్ని ఇస్తుంది.
మౌనం : నువ్వు నీ ఆత్మను పట్టుకోవాలన్న, నీ ఆత్మ ఉన్నతలోకాలకు చేరాలన్న, నువ్వు విడువలేని, నువ్వు విడువకూడని గొప్ప ఆయుధం ఈ "మౌనం".
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
No comments:
Post a Comment