Tuesday, December 20, 2022

మనం సంపాదించినదంతా… మనం చనిపోయాక కూడా.. *మనతో తీసుకెళ్ళవచ్చు!

 మనం సంపాదించినదంతా…
                  మనం చనిపోయాక కూడా..

          *మనతో తీసుకెళ్ళవచ్చు!*
                  ➖➖➖
*మన సంపాదించిన సంపద మొత్తం మనతో పాటు ఎలా తీసుకువెళ్లాలో చక్కని కథ ద్వారా తెలుసుకుందాం…*



*ఒక వ్యాపార వేత్త ఎలాగైనా ధనం సంపాదించాలని, చాలా కష్టపడి సుమారు వెయ్యి కోట్ల రూపాయిలు సంపాదించాడు.*

*ఒకరోజు ఆ వ్యాపార వేత్త తాను ఎంతో కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన ధనం, తాను చనిపోయినా సరే ఎవరికీ, ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని, బాగా ఆలోచించి, పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు.*

*ఏమని అంటే... ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువైన సలహా ఇస్తారో వారికి పది కోట్లు ఇస్తానన్నాడు.*

*నెల గడిచినా ఎవరు రాలేదు. అప్పుడు మళ్ళీ వంద కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో, చిక్కి సగం అయిపోయి ఉండగా...*

*ఒక రోజు ఒక జ్ఞాని వచ్చి... “నేను మీ డబ్బు మీకు చనిపోయిన తరువాత కూడా మీకు ఉపయోగపడే సులువైన సలహా చెపుతాను” అని అన్నాడు...*

*అప్పుడు ఆ వ్యాపార వేత్త... “ఎలా..?”అని ప్రశ్నించాడు...*

*దానికి ఆ జ్ఞాని ఆ వ్యాపార వేత్తతో... “మీరు అమెరికా, ఇంగ్లండ్, జపాన్ వెళ్ళారా..?” అని అడిగాడు.*

*దానికి ఆ వ్యాపార వేత్త... “హా... వెళ్లాను అని చెప్పాగా...”*

*”అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఖర్చు చేశారు?” అని జ్ఞాని అడిగాడు...*
   
*దానికి ఆ వ్యాపార వేత్త... “మన భారతదేశ నోట్లు అమెరికాలో చెల్లవు కనుక నా రూపాయలను డాలర్లుగా మార్చి తీసుకొని వెళ్తాను, అదే ఇంగ్లండ్ అయితే పౌండ్ గా, జపాన్ ఆయితే యన్స్ గా... ఇలా ఏదేశం వెళ్తే, ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి, తీసుకొని వెళ్తాను.”అని అన్నాడు.*     

*అప్పుడు జ్ఞాని ఇలా చెప్పాడు...*

*”ఓ కోటీశ్వరుడా...! అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా, నీడబ్బు నీతో రావాలంటే, నీవు వెళ్లాలని నిర్ణయించుకున్న దేశం లాగా... ఒకవేళ నీవు నరకానికి వెళ్లాలి అని అనుకుంటే నీడబ్బును పాపము లోనికి మార్చు. అంటే దుర్వినియోగం, చెడు వ్యసనాలకి, పాపపు పనులలోనికి మార్చు.* *లేదా... ఒక వేళ నీవు దేవలోకానికి వెళ్లాలంటే, నీ డబ్బును దాన, ధర్మములు చేసి పుణ్యంగా మార్చుకో... “అని చెప్పగానే... ఆ ధనవంతునికి జ్ఞానోదయం కలిగి, ఆ జ్ఞానిని వంద కోట్లు తీసుకోమంటాడు.*

*దానికి జ్ఞాని... “నేను కష్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను!” అని సున్నితంగా తిరస్కరిస్తాడు.* 

*అప్పుడు జ్ఞానోదయం అయిన ఆ ధనవంతుడు, తన ఆస్తికి ఆ జ్ఞానినే నిర్వాహకుడిగా నియమించి, తగినంత జీతం తీసుకోమని చెప్పి, తన సంపద అంతా సన్మార్గంలోనికి, పుణ్యం లోనికి, జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా... పాత పాప కర్మలు  పరివర్తనతో నశించి, మంచి కర్మల వలన పుణ్య గతులకు వెళ్తాడు.*

*ఇదండీ... మానవుని సంపద మానవునితో వచ్చే విధానం..!*

*మనం కష్టపడి సంపాదించినది... మంచి ధర్మ మార్గంలో ఖర్చు చేసి, పుణ్యం గా మార్చి మనతో తీసుకొని వెల్దామా...
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment