Wednesday, December 14, 2022

భోగి విశేష సామాన్యాల మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు. వివేక ... వైరాగ్యాలతో నీవు మూడు లక్షణాలు సముపార్జించాలి.

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏

భోగి విశేష సామాన్యాల మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు. 

వివేక ... వైరాగ్యాలతో నీవు మూడు లక్షణాలు సముపార్జించాలి. 

ఇంద్రియ సంనియమం .. ఇంద్రియములపై ఆధిపత్యం లేక సమబుధ్ధి రాదు. 

అంతరింద్రియ నిగ్రహమే నిగ్రహం ... మనసు ... బుధ్ధి అంత:కరణను జ్ఞాతస్థానం లో పెట్టటమే ... 

ఇంద్రియములను తమకు ఆధారభూతమైన .. ఆశ్రయమైన చైతన్య స్థితి లో నిలకడ చెందించు. 

నీ తెలివి లో గురువు మేల్కోవాలి ... గురువు తెలివితో నీ తెలివి పనిచేయటం ఉపదేశం. 

గుణత్రయముచే బాధింప బడుతున్న సాధకునికి నీవది కాదు అని చెప్పటమే గురి .. గుర్తు 
తెలిపేవారే గురువు. 

సర్వత్ర సమబుధ్ధి దర్శింప చేయటానికి ఏర్పడినవి ఆశ్రమాలు ... ఇంద్రియ నిగ్రహాన్ని అందించేవి ఆలయాలు. 

భోగానికి దగ్గరగా కాదు యోగానికి దగ్గరగా ఉండాలి అదీ ఉపవాసం. 

తనకు లేని బలహీనతను తనకే ఉన్నదని భావించటం క్లైబ్యం. 

గత క్షణం గురించి వ్యధ చెందకూడదు ... వర్తమానం పోతుంది. 

నిన్న వెళ్ళిన నీటికి ఇవాళ వంతెన ఎలా కడతావు. 

ఇంద్రియ నిగ్రహం ... సర్వత్ర సమ బుధ్ధి ... సర్వ భూత హితే రతా: .. సంసిధ్ధత ... సమ్యజ్ఞానం ..
ఈ ఐదు లక్షణాల ద్వారా స్వరూప జ్ఞానంలో మేల్కొలుపుతారు .. గురువు. 

మహనీయులకు దర్శనమే సమాధి. 

అనుభవ జ్ఞానం ఉన్న సద్గురు మూర్తిని దర్శించారంటే .. అది నీ జీవితంలో ఉత్తమమైన మలుపు. 

నీ చైతన్యం సద్గురు చైతన్యం లో కలిసి పోవాలి. ... నిన్ను నీవు కోల్పోవటానికి సంసిధ్ధత కలిగి ఉండాలి .. 

దేహ తాదాత్మ్యతా బుధ్ధి తో కూడిన మోహం + అవిద్యా సంబంధమైన నిద్ర = మరణం. 

భోగిని యోగిగా ... యోగి ని జ్ఞానిగా మార్చేది .. సందర్శనం. 

శ్రీ విద్యా సాగర్ స్వామి వారు 
గురుగీత -35 

జై గురుదేవ 🙏

No comments:

Post a Comment