Sunday, December 11, 2022

::: మనస్సు గాయం పడటం:::

::: మనస్సు గాయం పడటం::::
శరీరానికి గాయం అయితే అది మనకు కనపడుతుంది. ఈ గాయం త్వరగానే వైద్య సహాయంతో నయం అవుతుంది . మనస్సు గాయం పడితే అర్ధం చేసుకోవడం ఒక్కటే పరిష్కారం.
మనస్సు గాయం పడటం అంటే ఏమిటి?
మన మీద మనకు ఒక అభిప్రాయం వుంటుంది. కొన్ని నమ్మకాలు,ఇష్టాలు,
అంచనాలు, సిద్ధాంతాలు,అనుభవాలు, జ్ఞాపకాలు, వుంటాయి. ఇవన్నీ ఒక ముద్ర గా ఏర్పడి ఘనీభవించి ఒక కృత్రిమ,మానసిక అస్థిత్వాన్ని తయారు చేయబడి ఉంటుంది.
దీని పేరే నేను. ఇది ఈ శరీరాన్ని, మనస్సు ని కలిగి వున్నాను అంటుంది.
నేను కి కొన్ని ఇష్టాలు, కోరికలు, భద్రతా భావం, అనుబంధాలు,సొంతాలు వుంటాయి .
వీటికి అపాయం, నష్టం, కష్టం,కీడు, దెబ్బ, తగిలింది/ఏర్పడింది అని భావించడమే మానసిక గాయం.
ధ్యానం ఈ గాయాలను తగల నివ్వదు. ఏర్పడు తున్న నేను ను ఏర్పడ నివ్వదు.

షణ్ముఖానంద. 9866699774

సేకరణ

No comments:

Post a Comment