Wednesday, December 7, 2022

 నేటి మంచి మాట.

 అత్యవసర పరిస్థితిలో మాత్రమే
సహాయం అనేది స్వీకరించాలి.
లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది.

 ద్రోహులు ఈర్ష్య పడేలా.. మరణించాలి శత్రువులు కన్నీళ్ళు పెట్టుకునేలా.. జీవించాలి.

ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే.దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేము.

 *నాలుగు మంచి మాటలు* 
*పలకలేని నోరు..!*
*చిన్న సహాయానికి కూడా* 
*లేవలేని చేతులు..!*
*నలుగురితో కలసి* 
*నడవలేని కాళ్ళు..!*
*ఎదుటివారి పరిస్థితిని* 
*అర్థం చేసుకోలేని మనసు..!* 
*ఉన్నా, లేనట్టే..!!* 🙏
*వాళ్ళే అసలైన వికలాంగులు...!!*

జీవితం (Life) ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే .. మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితమనేది కొత్తగానే కనిపిస్తుంది. కొందరు వయసు పెరుగుతుంటే.. కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటారు. కానీ అందరి విషయంలోనూ ఇది సరికాదు. అయితే పెరిగే వయసుతో పాటు.. ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తాం.

 ఏది నీకు *అన్నం* పెడుతుందో,
  దానిని *దైవంగా* భావించు..!! 
ఏది నీకు *నీడనిస్తుందో,*
 దానిని *కోవెలగా* భావించు..!!  
ఏది నీకు *మంచి* నేర్పుతుందో, దానిని 
నిరంతరం *పూజించు..!!* 
 ఏది నీకు *సంతోషాన్ని* కలిగిస్తుందో, 
దానిని నిత్యం *ధ్యావించు..!!* 
 అప్పుడే నీవు *గొప్ప* వాడవవుతావు...!!

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment