*:::::::::::: ధ్యాన వస్తువు :::::::::::*
ధ్యానం లో భాగమైన ఏకాగ్రత వహించడానికి రకరకాల సంస్థలు రకరకాల వస్తువులను మనకు పరిచయం చేసినవి.
అవి శ్వాస, హృదయం, వెలుతురు, దేవుడిరూపం, నామం, మంత్రం, శక్తిచక్రాలు మొదలగునవి.
*ఇందులో శ్వాస అత్యంత శ్రేష్ఠమైనది.ఎలాగంటే.*
1) శ్వాస నిత్యం మనతో వుంటుంది.
2) శ్వాస చలనం లో వుంటుంది కనుక గమనిక,లేదా
ధ్యాస పెట్టడం తేలిక.
3)ఏ మతానికి, కులానికి చెందినది కాదు. కనుక అందరూ స్వీకరించ వచ్చు.
4) శ్వాస తో ఎలాంటి భావాలు ముడిపడి లేక చాలా స్వేచ్చ గా, స్వచ్ఛంగా వుండి ధ్యానం ప్రక్కకు వెళ్ళదు.
5) ధ్యాన సాధనలో శ్వాస క్రమ బంధమై, శారీరక,మానసిక శాంతికి దారితీస్తుంది
6) మనస్సు ని త్వరగా ఏకాగ్ర పరుస్తుంది.
7)మనస్సుని అంతర్ముఖం
వైపు త్రిప్పడంలో శ్వాస దిట్ట.
*షణ్ముఖానంద. 98666 99774*
No comments:
Post a Comment