🙏🙊🙉🙈🙏
అజ్ఞాని ఆత్మజ్ఞాని
అజ్ఞానికి ఆత్మజ్ఞాని పిచ్చివాడుగా కనిపిస్తాడు
ఆత్మజ్ఞానికి అజ్ఞాని అమాయకుడుగా కనిపిస్తాడు
బాగా నిశితంగా గమనిస్తే పరిశీలిస్తే గానీ ఈ రెంటి మధ్యలో ఉన్న అంతరార్థం ఏమిటో అర్థం అవుతుంది.
ఆత్మజ్ఞాని ధ్యానం చేస్తాడు
ఆత్మజ్ఞాని మౌనంగా వుంటాడు
ఆత్మజ్ఞాని శాకాహారం మాత్రమే తింటాడు
ఆత్మజ్ఞాని సత్ గ్రంథ పఠనం చేస్తాడు
ఆత్మజ్ఞాని సజ్జన సాంగత్యం చేస్తాడు
ఆత్మజ్ఞాని తనకోసమే కాకుండా సమాజం కోసం జీవిస్తాడు
ఆత్మజ్ఞాని సేవా కార్యక్రమాలు చేస్తాడు
ఆత్మజ్ఞాని ఆధ్యాత్మిక మార్గంలో వుంటాడు
ఆత్మజ్ఞాని ఎవరినీ విమర్శించడు
ఆత్మజ్ఞాని తీర్పులు ఇవ్వడు
ఆత్మజ్ఞాని వాగ్వాదం చేయడు
ఆత్మజ్ఞాని ప్రతీ మాట ఆలోచించి మాట్లాడతాడు
ఆత్మజ్ఞాని ఏదీ వృదా చేయడు
ఆత్మజ్ఞాని నిరాడంబరంగా వుంటాడు
ఆత్మజ్ఞాని దేనికీ పొంగిపోడు
ఆత్మజ్ఞాని దేనికీ కుంగిపోడు
ఆత్మజ్ఞాని మోక్షం మాత్రమే కోరుకుంటాడు
ఆత్మజ్ఞాని అన్నిటిలో అత్బుతంగా వుంటాడు.
అజ్ఞాని వీటి అన్నిటికీ వ్యతిరేకంగా వుంటాడు.👏
No comments:
Post a Comment