*🎻🌹🙏 మానవ జన్మ తరించడానికి - మహా మంత్రం....!!*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌷తన్మేమనశ్శివ సంకల్పమస్తు!!!...
ఓం నమః శివాయ...🌷
🌿సాంబా... అని పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ...
🌷నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే...
య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్ 🌷
🌸అనే మంత్రాన్ని ఉపదేశించారు. ఇది శివపురాణంలో కూడా వస్తుంది. ఇది చాలా గొప్ప మంత్రం. నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే. నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది.
🌺1) *నమశ్శివాయ...*🌺
🌿(శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం. శివభక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి.
🌸 అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయువాలతో కూడిన ఓంకారం సూక్ష్మప్రణవం.. న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాల శివమంత్రం స్ధూలప్రణవం. పంచాక్షరీని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం.
🌷2) *సాంబాయ...*🌷
🌿అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవి అన్ని సమృద్ధిగా పొందవచ్చును.
🌹3) *శాంతాయ...*🌹
🌸ఆయనని తలంచుకొంటే వచ్చేది శాంతం. జీవితానికి కావలసింది కూడా శాంతమే. "ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే" అని ఉపనిషత్తు చెప్పింది. అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.
🌹4) *పరమాత్మనే నమః...*🌹
🌿చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే... అన్నిటిని కలిపి నాలుగు నామాలతో పొదిగిన మంత్రరాజం ఈ శ్లోకం.
🌸ఈ శ్లోకాన్ని అర్థానుసంధానంగా మననం చేసినవారు శివసాయుజ్యాన్ని పొందుతారు అని ఉపమన్యు మహర్షి స్వయంగా చెప్పారు.....🚩🌞🌹🙏🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment