Thursday, January 19, 2023

::::: భయం::::

 *:::::::::: భయం::::::::::::::*
  
  మనందరికి భయం ఎలా వుంటుందో తెలుసు. కారణం ఎప్పుడో ఒకప్పుడు,
ఏదోఒకందుకు భయ పడి వుంటాము.
   ఈ భయం రెండు రకాలు.
1) భౌతికము లేదా సహాజాతము.
2) మానసికము.
 
1) *భౌతిక భయం*   సహజంగా ప్రతి జీవికి తన ప్రాణ రక్షణ వ్యవస్థ లో భాగంగా భయం వుంటుంది. ఈ భయం అపాయం నుండి తప్పించుకోడానికి కావలసిన శక్తిని, వ్యూహాన్ని ఇస్తుంది. నిజానికి దీనిని భయం అనకూడదు. తెలివిగా తిప్పించు కోవడం అనొచ్చు.
2) *మానసిక భయం*.
 
(1) *ఇది ఆలోచన/ఊహ సృష్టించిన భయం.* ఒక అపాయం జరిగే వచ్చు అనే ఊహా నుండి పుడుతుంది. భవిష్యత్తు లేకపోతే ఈ భయం లేదు.
2) *తప్పు సంజ్ఞ వల్ల భయం*.. కొందరికి బల్లి, పిల్లి, కుక్క అంటే భయం . అక్కడ వారు బల్లి ని కాదు చూస్తుంది. బల్లి ని పులి గా చుస్తున్నారు.
   *ధ్యాన స్థితి అంటే వర్తమానంలో ఉండిన స్థితి* 
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment