Thursday, January 19, 2023

శ్రీరమణీయం: దైనందిక జీవితంలో పవిత్రతను సిద్ధించుకునే మార్గం ఏమిటి ?

 💖💖💖
       💖💖 *"443"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"దైనందిక జీవితంలో పవిత్రతను సిద్ధించుకునే మార్గం ఏమిటి ?"*

*"మన పూర్వీకులు నిర్ధేశించిన మార్గం ధర్మాచరణ. మనం చేసే క్రియలు సక్రమంగా ఉండాలి. మనసు మనకి లోపల ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి అది బయట మన పనుల ద్వారానే వ్యక్తమవుతోంది. మనకు నిద్ర మెలకువ అనే రెండు అవస్థలు ఉన్నాయి. నిద్రలో మన ప్రమేయం ఏదీ లేదు. ఇక మన కదలికలన్నీ మెలకువలోనే ఉన్నాయి. మనకు మెలకువ వచ్చిందే ప్రపంచంతో జీవించడం కోసం. ఆ ప్రపంచంతో మనం ఉండే విధానమే మన మనసుగా ఏర్పడుతుంది. సాధనలో ఏ మనసైతే ఉందో ఆ మనసు మనకు మెలకువలో ఉండగా ఏర్పడిందే ! ఎలుకను పట్టుకోవాలంటే కన్నంలో ఉండగా సాధ్యంకాదు. అది బయట తిరుగుతున్నప్పుడే పట్టుకోవాలి. మనసు బాగు చేసుకోవాలంటే నిద్రలోనో, జపంలోనో కుదరదు. మెలకువగా ఉన్నప్పుడు నిర్వర్తించే క్రియల్లో మార్పు తెచ్చుకుంటే అది శుద్ధి అవుతుంది. అందుకు ధర్మాన్ని ఆచరించటమే సాధకుని కర్తవ్యం కావాలి !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

No comments:

Post a Comment