Friday, December 1, 2023

80% జనాభా స్వార్ధంతో, విభజించబడి, చెల్లాచెదురై దిక్కులు చూస్తున్నంత కాలం, 20% మనల్ని పాలిస్తూనే ఉంటుంది.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *100 మంది సామర్ధ్యం గల ఒక హాస్టల్ లో  ప్రతిరోజూ ఉదయం టిఫిన్ లో “ఉప్మా”ను వడ్డించేవారు. ఆ 100 మందిలోని 80 మంది మాత్రం ఉప్మా కాకుండా భిన్నమైన టిఫిన్ ను చేసి పెట్టాల్సిందిగా ప్రతిరోజూ ఫిర్యాదు చేసేవారు.*
💖 *కానీ … మిగతా 20 మంది మాత్రం ఉప్మా తినడానికే చాలా ఇష్టాన్ని చూపేవారు. వాళ్ళందరికీ ప్రీతిపాత్రమైన అల్పాహారం ఉప్మా. మిగతా 80 మంది మాత్రం ఉప్మా కాకుండా మరేదో ఒకటి వండి పెట్టాల్సిందిగా కోరేవారు.*
❤️ *ఈ గందరగోళ పరిస్థితిలో ఏదో ఒక మంచి నిర్ణయానికి రావాలనుకుని ఆ హాస్టల్ వార్డెన్ వోటింగ్ పద్ధతిని ప్రతిపాదన చేశారు. దీని ప్రకారం ఏ టిఫిన్ కి ఎక్కువ ఓట్లు వస్తే ఆ టిఫిన్ నే ప్రతీరోజూ వండిపెట్టడం జరుగుతుంది.*
💕 *అందరికీ ఈ ప్రతిపాదన నచ్చింది. ఉప్మా కావాలి అనుకున్న 20 మంది తమ ఓటును ఖచ్చితంగా “ఉప్మా” కే వేశారు. మిగతా 80 మంది మాత్రం తమతమ ఓట్లను ఇలా వేశారు:~*
💞 *18 - మసాలా దోశ*
💞*16 - ఆలూ పరోటా & దహి*
💞*14 - రోటి & సబ్జి*
💞*12 - బ్రెడ్ & బట్టర్*
💞*10 - నూడుల్స్*
💞*10 - ఇడ్లీ సాంబార్*

💖 *ఓటింగ్ ఫలితాల ప్రకారం ఉప్మా కు అత్యధిక ఓట్లు పడటం వలన, మళ్లీ అదే అల్పాహారం ప్రతీరోజూ వడ్డించబడుతుందని హాస్టల్ వారు నిర్ణయించారు. అందరూ అందుకు అంగీకరించడం అనివార్యమైపోయింది.*
💝 *ఇందులోని నీతి ప్రతీ ప్రజాస్వామ్యంలో అందరికీ కనిపించే గుణపాఠం*
💓 *~80% జనాభా స్వార్ధంతో, విభజించబడి, చెల్లాచెదురై దిక్కులు చూస్తున్నంత కాలం, 20% మనల్ని పాలిస్తూనే ఉంటుంది.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment