*👍💞🗣మాట - విలువ💐💥*
*😇మాటను మించిన మహా ఔషధం లేదు.👏*
🧡💚🩷🩵💜💛
*🤝మాటను మించిన మహా యుద్ధము లేదు.*
*⏱️నోరు జారిన మాట, చేజారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి పొందలేము.*💐✍️
🌹 *ఈ సృష్టిలో మాట్లాడే శక్తి ఒక్క మానవుడికే ఉంది..*
*అది మనిషికి దేవుడిచ్చిన దివ్యమైన వరం...*
*🌹_మాట ఓ అద్వితీయ శక్తి..._*
*దాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది...*
*మాటతీరు సంస్కార సంపన్నమైనప్పుడే..*
*ఎదుటి హృదయాన్ని ఆకర్షించగలుగుతుంది...*
*మన భావాలు.. ఆలోచనలు..*
*ఇతరులతో పంచుకొనేందుకు..*
*మాటే ఓ అద్భుత సాధనం...*
*లోకంలో అర్థం కాకుండా మాట్లాడేవారు..*
*అసమర్థంగా మాట్లాడేవారు..*
*ఎంతో మంది ఉన్నారు...*
*అనవసరంగా.. అనాగరికంగా..*
*మాట్లాడేవారూ ఉన్నారు...*
*🌹_ప్రాణికోటిలో మనిషికి పెద్దపీట వేసింది మాటే..._*
*మాటతోనే మనిషి వ్యాప్తిచెందాడు..*
*మాటతోనే మనిషి ఎత్తులకు ఎదిగాడు..*
*ముందు తరాలకు మార్గదర్శకుడయ్యాడు...*
*మహనీయుల మాట..*
*మౌనం అనే మూసలో పోసిన బంగారంలా ఉంటుంది..*
*అందుకే వారి మాటలకు ఎంతో విలువ సమకూరుతుంది...*
*అదుపులేకుండా వాగడం మహాతప్ఫు..*
*మాటను తక్కెడలో పెట్టి తూచినట్లు* *మాట్లాడమంటారు విజ్ఞులు...*
*కటువుగా.. అతిగ..*
*మాట్లాడేవారి పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు...*
*చెడ్డ మాటలు వెలువడకుండా ఉండాలంటే..*
*దానికి మౌనమే సరైన మందు అంటారు# *తత్త్వవేత్తలు...*
*🌹_మాటకు ప్రాణం సత్యం..._*
*ఇది యుగాల పూర్వమే హరిశ్చంద్ర చక్రవర్తితో నిరూపితమైంది..*
*సత్యవచనం కారణంగానే ఆయన పేరు..*
*సత్యహరిశ్చంద్రుడని శాశ్వతంగా నిలిచిపోయింది...*
*మాటల్లో అబద్ధాలు దొర్లకూడదు..*
*అబద్ధం మాట్లాడి నోరు కడుక్కోవడం కన్నా..*
*మౌనంగా ఉండటమే ఉత్తమం అన్నది జ్ఞానుల ఉవాచ...*
*మాట ప్రభావం అద్భుతం..*
*అది మనిషి మనసుకు అద్దం పట్టగలదు..*
*అడ్డంగా నిలువగలదు..*
*కొంపలు కూల్చగలదు..*
*కుటుంబాలను రక్షించగలదు..*
*శిశిరంలో వసంతాన్ని సృజియించగలదు..*
*పెదవి వదిలితే పృథివి దాటిపోగలదు...*
*ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్నయినా వెనక్కి మళ్ళించవచ్చునేమోగాని..*
*పెదవి దాటిన మాటను బ్రహ్మదేవుడైనా వెనక్కి మళ్ళించలేడు...*
*మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి..*
*జాగ్రత్తగా మాట్లాడాలని..*
*పెద్దలు హెచ్చరించి మరీ చెబుతుంటారు...*
*సందర్భశుద్ధి కలిగిన మాటకే విలువ..*
*మన్నన ఉంటుంది...*
*ఔచిత్యం అనే తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడటం ఓ కళ..*
*నోటికి వచ్చినట్లు వాగడం ఓ రోగం..*
*చెడ్డ మాటలతో చెడు ఫలితమే వస్తుంది..*
*అంతేగానీ.. మంచి చేకూరదు..*
*రామాయణంలో మంథర మాటలకు చెవొగ్గిన కైకేయి..*
*ఆ.. తరవాత ఎంత పశ్చాత్తాపం చెందిందో తెలియనిది కాదు...*
*తీయని మాటలతో మన వెనకాలే..*
*గోతులు తీసేవారు ఎంతో మంది ఉంటారు...*
*మాటతీరు మనిషి సంస్కారానికి సూచిక..*
*కార్యసాధనకు పనిముట్టు..*
*ఆకర్షణకు అద్భుత మంత్రం...*
*అందుకే.. మనిషి మంచి మాటతీరును అలవరచుకోవాలి..*
*మనం చెప్పిన మాట ఎదుటివారికి అర్థం కాకపోతే..*
*చక్కటి సామెతల రూపంగా అర్థమయ్యేలా వివరించవచ్ఛు..*
*అప్పుడే.. మాటతీరుకు మంచి..*
*ఆకర్షణ.. స్పష్టత.. పటిష్ఠత.. సమకూరుతుంది...*
*కొందరి సంభాషణల్లో అబద్ధాలు..*
*అపశబ్దాలు.. అసభ్య పదాలు.. అహంకారపు కథలు దొర్లుతుంటాయి...*
*మన మాటతీరు ఎదుటివారికి కంటిలో నలుసులా..*
*పంటి కింద రాయిలా బాధపెట్టే విధంగా ఉండకూడదు...*
*🌹మంచి గంధం పూసినంత హాయి కలిగించాలి...*
*🌹_నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది..._*
*🌹మంచి మాటకు మన్నన ఉంటుంది!!!*మంచి అందంతో పుట్టడం మన చేతుల్లో ఉండదు కానీ"* *మంచి మనసుకల్గివుoడడం అనేది మన చేతుల్లోనే వుoది.*
*_మంచి సంపన్నులకు పుట్టడం మన చేతుల్లో ఉండదు కానీ మంచి సంస్కారంతో బ్రతకడం అనేది మన చేతుల్లోనే ఉంది._*
🩷💚🧡🩵💜💛
No comments:
Post a Comment