Sunday, January 12, 2025

 *రేపు(13.01.25) మహాకుంభమేళ ‌*
🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

144 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళా ప్రత్యేకత ఏంటి.. ప్రయాగ్‌రాజ్‌లోనే ఎందుకు?
: మరికొన్ని రోజుల్లోనే మహా కుంభమేళా ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు జరగనున్న ఈ మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి భక్తులు, నాగ సాధువులు సహా అనేక మంది విచ్చేస్తూ ఉంటారు. అయితే అసలు మహా కుంభమేళా అంటే ఏంటి. దాన్ని ఎందుకు 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. అసలు ఈ మహా కుంభమేళాను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు. కుంభమేళా, అర్ధ కుంభమేళా, మహా కుంభమేళాల మధ్య తేడాలు ఏంటి. ఈసారి మహా కుంభమేళా విశేషాలు.. అక్కడ ఏమేం ఏర్పాటు చేస్తున్నారు  ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ మహా కుంభమేళా ముగియనుండగా.. మొత్తం 45 రోజుల పాటు జరగనుంది. అయితే ఇప్పుడు జరగనున్న కుంభమేళా మహా కుంభమేళా అని.. ఇది 144 ఏళ్లకు ఒకసారి వస్తుందని చెబుతున్నారు. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాను.. 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తే.. ఈ మహా కుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ.. మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను మాత్రం కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు.. మహా కుంభమేళ ప్రారంభం అవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం.. భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒకరోజుతో సమానం. దీని ప్రకారం.. దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే.. భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహా కుంభమేళానే. ఇక ఈ మహా కుంభమేళాను కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహా కుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు.

ప్రయాగ్‌రాజ్ కాకుండా హరిద్వార్‌లోని గంగానది, నాసిక్‌లోని గోదావరి నది, ఉజ్జయినీలోని శిప్రా నదిలో కుంభమేళా నిర్వహిస్తుంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే.. మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం.. దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో.. బయటికి వచ్చిన అమృతం కోసం.. దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. ఆ పడిన ప్రాంతాలో ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి.. ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు.

🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

No comments:

Post a Comment