*ధ్యానం 😌మార్గ*
భగవంతునిపై నమ్మకం లేకున్న ఫర్వాలేదు కానీ తనపైన తనకు శ్రద్ధలేని వానిని నాస్తికుడని కొత్తమతం అంటుంది. నీపైన నీకు విశ్వాసం ఉన్నప్పుడే నీకు దైవం పట్ల, ఇతర
మానవుల యెడల గట్టి విశ్వాసం కలుగుతుంది. అందువల్ల ఆత్మ శ్రద్ధను కలిగి
ఉండు. మన మతంలో మనం 3 3 కోట్ల దేవుళ్ళతో కొట్టుకుపోతుంటాం.
యాజ్ఞవల్క్యుని ప్రశ్నకు బృహదారణ్యక ఉపనిషత్తులో ఎంతమంది దేవుళ్ళున్నా
రంటే 33 కోట్లు అని చెప్పి, మరల మరల వాటిని తగ్గించుకుంటూ పోయి,
దేవుడు ఒక్కడే అన్న దగ్గర ఆగుతాడు. 'ఏక మేవ అద్వితీయం బ్రహ్మ'
❤️🕉️❤️
శ్రీరామకృష్ణులు ఆ కాళీమాతను ఇలా ప్రార్థిస్తున్నారు: “ఓ అమ్మా! నేను ఓం యొక్క అవతారం! తల్లీ, నీ గురించి ప్రజలు ఎన్ని మాటలు చెబుతారు! కానీ నాకు వాటిలో ఏదీ అర్థం కాలేదు. నాకు ఏమీ తెలియదు, అమ్మ.
నేను నీ పాదములను ఆశ్రయించాను. నేను నీలో రక్షణ కోరాను. ఓ తల్లీ, నీ కమల పాదాలపై నాకు స్వచ్ఛమైన ప్రేమ, తిరిగి రాని ప్రేమను కలిగి ఉండాలని మాత్రమే నేను ప్రార్థిస్తున్నాను.
మరియు తల్లీ, నీ ప్రపంచంతో ప్రళయం చెందకు, మాయగా ఉండు. నీ రక్షణను నేను చూస్తున్నాను. నేను నిన్ను ఆశ్రయించాను.
❤️🕉️❤️
సమాచారాలను మెదడు నిండా నింపడానికి, దానికి శిక్షణను ఇవ్వడానికి
చాలా వ్యత్యాసం ఉంది. మెదడు నిండా నింపడం వల్ల మానసిక శక్తి పెరగదు.
అది ఒక భాండాగారంగా మాత్రమే ఉంటుంది. ఆలోచించడం, ప్రశ్నించడం
వల్లనే మేధస్సు అభివృద్ధి పడుతుంది. మన ఆలోచనలకు స్పష్టమైన ధోరణి
ఏర్పడి, దానితో విషయాన్ని స్పష్టంగా మాట్లాడం అలవాటవుతుంది. అందుచేత
జ్ఞాన మార్గాన్ని అభ్యసించాలి. చాలా సభల్లో పరిచయ వాక్యాల్లో కానీ,
ధన్యవాదాలు తెలపడంలో కానీ చెప్పిందే చెబుతూ చాలా కాలాన్ని వృథా
పరుస్తారు. మనస్సు శిక్షణ లేని కారణంగా అలా జరుగుతుంది. ఏమీ వివరంగా
తెలియని వారి వల్ల మనస్సు పైన సమాజం పైన ఏవిధమయిన ప్రభావం పడదు.
No comments:
Post a Comment