Tuesday, January 14, 2025

 *✅తెలుసు కుందాం✅*

*🟥సముద్రంలో నివసించే జలచరాలు ఉప్పు నీటినే తాగుతాయా? లేక వాటికి ఉప్పును వేరు చేసే ప్రక్రియ ఏదైనా ఉంటుందా?*

🟢మన శరీరంలో పోగయ్యే లవణాల్ని, ఇతర నిరర్ధక పదార్థాల్ని మన శరీరం మూత్రం, చెమట రూపంలో విసర్జించి క్రమబద్ధీకరించుకుంటుంది. అలాగే సముద్రంలో ఉండే జలచరాలు కూడా తమ శరీరాల్లో జరిగే ప్రత్యేక యంత్రాంగం (reverse osmosis) ద్వారా లవణీయతను క్రమబద్ధం చేసుకుంటాయి. అందువల్లనే కొన్ని సముద్రపు చేపల్ని తిన్నప్పుడు అవి ఉప్పగా ఉండకపోవడాన్ని గమనించవచ్చు. అయితే మంచినీటిలో మనుగడ సాగించే జలచరాలతో పోలిస్తే సముద్రంలో ఉండే వాటి శరీర కణాల్లో లవణీయత కొంత ఎక్కువగానే ఉంటుంది. వాటి శరీరాల్లో జరిగే కొన్ని విద్యుత్‌ రసాయనిక ప్రక్రియల ద్వారా సముద్రపు జలచరాలు నీటిలో లవణీయతను తగ్గించుకోగలుగుతాయి. ఈ ప్రక్రియనే అయాను పంపు (Ion Pump) అంటారు.

No comments:

Post a Comment