*_నేడు సమాజంలో మందిని ముంచడం, ఇకపోతే వంచించడం ఇదే జరుగుతుంది. నేటి మనిషి పాపపుణ్యాలు మరిచి విచ్చలవిడి డబ్బు కొరకు ప్రవర్తిస్తు... పరిగెడుతున్నాడు._*
*_నన్నెవరు చూస్తున్నారు.? నన్ను ఎవరు గమనిస్తున్నారు.? అంటూ చేయరాని పనులుచేస్తూ, సమాజంలో బడాబాబులుగా చలామణి అవుతున్నారు._*
*_మోసం చేసేవాడు తెలివిగా మోసం చేసానని సంబరపడతాడు. మోసపోయినవాడు అయ్యో మోసపోయానే అని బాధపడతాడు._*
*_అసలు మోసపోయింది... మోసం చేసేది ఎవరు.? విధి అనేది ఉందని మరిచి పోకు. కాలం కాటేస్తే కనుమరుగు అవుతావు గుర్తుపెట్టుకో._*
*_విమర్శలకు తలోగ్గకు.!ఎవడో అన్నాడని నువ్వు తగ్గకు, ఎందుకంటే, తగ్గితే తన్నుకు పోతారు.!_*
*_నువ్వెంతో, నీ విలువెంతో... నీ బలగమెంతో, నీ వెనకాల తిరిగే వాళ్లను, చూసి కూడా చెప్పవచ్చు.!_*
*_ఎందుకంటే, కుక్కలతో కలిసితిరిగితే, "మొరగడం" మాత్రమే నేర్పిస్తాయి, కానీ, సింహాలతో కలిసి తిరిగి చూడు, "గర్జించడం" కూడా నేర్పిస్తాయి..._*
*_ప్రమాదం అని తెలిసిన సింహాన్నే ప్రేమించు... ప్రమాదం లేదనుకుని, నక్కలతో చెలిమి వద్దు... అసలు ప్రమాదం... గుంట నక్కలతోనే.!_*
*_మూర్ఖులతో వాదించే బదులు మౌనంగా ఉండడం మేలు. బురదలో పొర్లాడే పందికి (అత్తరు)సుగంధం విలువ ఏం తెలుస్తుంది.?_*
*_ఈ లోకమంతా అవకాశవాదులతో నిండి ఉంది. అవసరానికి ఊసరవెల్లిలాగా రంగులు మార్చే లోకంలో బ్రతుకుతున్నాం జాగ్రత్త._*
*_నిజాన్ని నమ్మించాలి అంటే ప్రూఫ్స్ కావాలి ఈ లోకానికి... అబద్ధాన్ని నమ్మించాలి అంటే నటిస్తే చాలు... స్వార్థపరులు తమ "స్వార్థం" కోసం, ఎవరి జీవితం అయినా "బలి " చేస్తారు.!_*
*_గంజి బువ్వ, తిన్న సరే కానీ... గౌరవంగా బ్రతుకుతాను, కారం గటక తిన్న సరే పౌరుషంగా బ్రతుకుతాను , అంతేగానీ నా ఆత్మ గౌరవాన్ని ఎదుటి వారి ముందు తాకట్టు పెట్టను._*
*_మారాలి అనుకుంటుంది, మార్చుకోవాలి అనుకుంటుంది, నా యాటిట్యూడ్ ని మాత్రమే... ఎవరికోసమో నాక్యారెక్టర్ ని మాత్రం మార్చుకోను.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🦚🙇🦚 🌹🌹🌹
No comments:
Post a Comment