*మన దేహం శ్రీచక్రం.........!!*
1) త్రైలోక్య మోహన ౼
భూపుర త్రయం.
పాదాలు
2)సర్వాశా పరిపూరక ౼
16దళాలు.
కటిభాగం
3)సర్వ సంక్షోభణ౼
8దళాలు.
నాభి
4)సర్వ సౌభాగ్య దాయక౼
14 దళాలు.
హృదయం
5) సర్వార్థ సాధక ౼
10దళాలు.
కంఠం
6)సర్వ రక్షాకర ౼
02దళాలు.
భ్రూమధ్యం
7)సర్వ రోగాహర ౼
8దళాలు.
లలాటం
8)సర్వసిద్ది ప్రదత్రికోణం ౼
మస్తకం
9) సర్వా నంద మయ బిందు ౼ బ్రహ్మ రంధ్రం
దేహంలో ఒక్కో ఆవరణలో బీజాలు ఉంటాయి.
ధ్వని ద్వారా అవి స్పoదిస్తాయి జపం ద్వారా శక్తిని పొందుతాయు.
శ్రీచక్రం ఇంట్లో ఉంటేనే ఎంతో నిష్ఠగా ఉండాలి అని భయపడే వారు దేహమే శ్రీచక్రం అని తెలిసినప్పుడు ఇంకెంత నిష్ఠగా ఉండాలి.
ఈ సృష్టి యొక్క శక్తి కేంద్ర శ్రీచక్రం , ప్రకృతి లో ప్రకృతి తో అనుసంధానం మై మమేకమై జీవుడు జీవించాల్సిందే గాని ఈ సృష్టి నుండి వేరుపడి జీవించలేరు చివరికి దేహాన్ని వదిలిన ప్రాణం కూడా పంచభూతాల్లో కలవాల్సిందే.
శబ్ద దోషం లేకుండా ఉచ్చారణ ద్వారా ప్రకృతిలో ని విశ్వప్రాణ శక్తి ని పొందుతాము.
ఒక పదార్థం వండే ముందు పాత్ర శుద్ధి చేసినట్టు ఒక సాధన సిద్దించాలి అంటే దేహం (అంతర్గతంగా, బహిర్గతం గా) కూడా శుద్దిగా ఉండాలి.
ప్రతి నాడి ఒక బీజానికి అనుసంధానం గా ఉంటుంది. యోగ ,ప్రాణాయామం ,ద్యానం ఇలా అష్టాంగయోగం తో దేహశుద్ధి చేసుకుంటారు.
మంత్ర సిద్ధి పొందటానికి మనసు నిలకడగా ఉండాలి ద్యానం లో ఏకాగ్రత కుదరాలి కుదిరే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి...
No comments:
Post a Comment