Thursday, January 16, 2025

 *`ఉత్తరాయనం దక్షిణాయనం`*

*ఆయనం అనగా పయనించడం అని అర్ధం.*

*ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపుకి పయనించడం అని అర్ధం. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు పయనించడం, తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. భూమి సూర్యుని చుట్టు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయనం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.*

*సూర్యుడు తూర్పు నుండి పడమర దిశను బట్టి  భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు, మరో ఆరు నెలలు ఒక వైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. అంటే భూమి north pole సూర్యుడికి దగ్గర గా ఉన్నప్పుడు ఉత్తరాయణం , south pole దగ్గర అవుతున్నప్పుడు దక్షిణాయణం.*

*ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయనం అయితే 6 నెలలు దక్షిణాయనం.  మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి.  ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతి సంవత్సరము జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని, జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు. అయితే తెలుగు మాసములు, తిధులు అనుసరించి ఆంగ్ల తేదీలు మార్పు జరగ వచ్చు.*

*ఇంతటి మార్పుకు సంబంధించిన విశేషాన్ని లోకం లోని అతి సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా వివరించేందుకు పండగలను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు.*

*మన హిందూ పురాణాల ప్రకారం భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని నమ్మి సూర్యుడు భూమిపై దక్షిణం (south poleకి దగ్గరగా ఉన్నప్పుడు) వైపుకి పయనిస్తున్నంతకాలం దేవతలకి రాత్రి గాను, ఉత్తరం వైపుకి పయనిస్తున్నంత కాలం దేవతలకు పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏవిధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనంలో మేలుకొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని ప్రజలందరికి ఈ విషయం తెలియజేయడం కోసం పెద్దలు పండుగలను జరపడం మొదలు పెట్టారు.*

*మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే కురుసంగ్రామంలో భీష్మాచార్యులు దక్షిణాయనం లో మరణించినా దేహం త్యజించడానికి ఉత్తరాయనం వచ్చే వరకు ఎదురు చూశారు.*

*మహాభారతం పుక్కిట పురాణం అని కొట్టి పారేస్తారు. కానీ ఆ కాలంలోనే సూర్యుని గమనాన్ని ఎంత ఖచ్చితంగా అంచనా వేశారో చూడండి.*

*సాంకేతిక అభివృద్ధి చెందిన నేటి కాలంలో*
*ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో ప్రతీ నెలా ఒక ఫోటో చొప్పున 12 నెలలు సూర్యుని కదలికను ఫోటోలు తీస్తే ఈ క్రింద విధంగా వచ్చాయి.*

*`ఉత్తరాయనం, దక్షిణాయనం ఎందుకు అంటారో ఈ ఫోటో ద్వారా సులభంగా గ్రహించవచ్చు.`*

No comments:

Post a Comment