@ చికిత్స విచికిత్స @
ఒక చిన్న
నెగిటివ్ కామెంట్ ...
తీవ్ర మనోవేదనకు
గురిచేస్తుంది మనని
అతలాకుతలమైపోతుంది
అప్పుడు మన మనస్సు
ఆ అసహనంలో
ఆ నిస్సహాయతలో
మనమేం
మాట్లాడుతున్నామో
అసలు మనమేం చేస్తున్నామో
కూడా తెలియదు
********
ఆ నెగిటివ్
కామెంట్ ను
సంయమనంతో
స్వీకరించగలిగితే
సహనంతో
ఆత్మవిమర్శ చేసుకోగలిగితే
తేటపడుతుంది
తేలిక పడుతుంది మనస్సు
కాసింత మౌనం
అవసరం ఈ ప్రక్రియకు
ఒకింత ధ్యానం అత్యవసరం
ఈ విచికిత్సకు
మనని మనమే
తరచి తరచి చూసుకునేందుకు
సాధన చేయాలి
ఈ నైపుణ్యాన్ని
మనదే తప్పైతే
సరిదిద్దుకోవాలి
తప్పేం లేకుంటే
వివరించి చెప్పేయాలి
*******
కాదు నీదే ...
నీదే తప్పని వాదనకు దిగితే
వాళ్ళ వైపోసారి
జాలిగ కరుణగ చూసేయాలి
అటు తరువాత
విలాసంగ నవ్వుకుంటూ తరలిపోవాలి
ఎవరికీ ఇక
వివరణ అవసరం లేదు
మనకి మనం వివరణనిచ్చుకుంటే
అది చాలు ...
- రత్నాజేయ్ (పెద్దాపురం)
-
No comments:
Post a Comment