*ధ్యాన😌మార్గ*
మనమంతా ప్రపంచంలో జరిగే అన్నిటినీ చూస్తున్న, దివ్యమైన సాక్షి రూపాలమే. ఏదో మార్పు చెందనిది లేకుంటే మార్పు చెందుతున్న దానిని చూడలేదు. అదే మనకు సవాలు. మనం కేవలం ప్రపంచానికే సాక్షులం కాదు, మనస్సుకు, బుద్ధికి, అహంకారానికి కూడా సాక్షులమే. అహంకారం మేల్కొని
ఉన్నప్పుడే కానీ, నిద్రిస్తున్నప్పుడు ఉండదు. అయితే ఈ అహంకారం రాక పోకలను చూసేది ఎవరు? రాకపోకలు లేనిదేదో, ఎప్పుడూ ఉండేదే, ఎప్పుడూ
చూస్తున్నదే. మార్పులేనిదే మన నిజమైన ఆత్మరూపం. అదే తురీయ. ఆ తురీయ అవస్థ నుంచి మేల్కొనప్పుడు అంతా అహంకారంతో కూడి ఉంటుంది.
తత్వమసి, తత్త్వమసి, అదేనీవు నీవు శుద్ధ చైతన్యానివి. చైతన్యం ఒకటే, రెండు
చైతన్యాలు లేవు. అందరియందు, అన్నిటియందు చైతన్యమే ఉంది.
❤️🕉️❤️
శారీరకంగా చిన్నగా ఉన్న 'నేను' అనే అహంకారాన్ని ప్రక్కకు నెట్టి నా అనంత ఆత్మని ప్రకటితం చేస్తాను. ఆత్మ అందరితోను ఒకటిగా ఉంటుంది. అదే ఆధ్యాత్మిక ఎదుగుదల.
❤️🕉️❤️
ఓం ఇతి ఏతత్'
'ఓం' అన్న అక్షరం అద్వితీయమయిన దైవం యొక్క చిహ్నం. నిర్గుణ, సగుణాల
అనంత స్వరూపం యొక్క గుర్తు 'ఓం'.
❤️🕉️❤️
మన మహర్షులు, మానవాళిముందు జ్ఞానార్జన ప్రధానమయిందిగాను, అందరూ
అది చేరుకోవలసిన గమ్యంగాను ఉంచారు. కష్టసుఖాలను తరచిచూసినప్పుడు
జ్ఞానం కలుగుతుంది. వివేకంతో ఆలోచించడం ద్వారా ఎక్కువసార్లు కష్టాలద్వారా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాం. ఈ విధంగా మనం కష్టసుఖాల ద్వారా, కష్టసుఖాలను అధిగమించుతాం. అప్పడు మనస్సు దైవాన్ని అనంత ఆత్మను గుర్తిస్తుంది. అది ద్వంద్వ భావాలన్నిటికీ అతీతమయింది.
No comments:
Post a Comment