Sunday, January 19, 2025

 🎻🌹🙏పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వాలి....?

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాము.. దక్షత కలిగిన వారికి సమర్పించుకునేది దక్షిణ ..

🌿ప్రదక్షిణ అనేది మనము మనకుగా భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఆయన వైపుగా కదలడము ప్రదక్షిణము,

🌸ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనము ప్రదక్షిణము భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటాము..సమర్పణ ఎందుకు?

🌿సాధారణముగా మనకు ఏ పని చేసి పెట్టినా వారు ఎవరు అయినా వారికి వారి కష్టానికి డబ్బులు లేక వారి కష్టానికి ప్రతిఫలము ఇవ్వడము ధర్మము..

🌸ఒకవేళ అలా ఇవ్వకపోతే అది పెద్ద అధర్మం.. ఇది ఎవరో చెప్పింది కాదు, వాల్మీకి రామాయణములో భరతుడు చెప్పిన ధర్మము.. 
ఇప్పుడు పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వడమో చూద్దాము..

🌿వేదము అంటేనే దైవము,. మానవ నేత్రముకి కనిపించని దైవము మంత్ర రూపములో వేదరాశిలో నిక్షిప్తమయి మనకు వినిపిస్తారు, మన సాధనకు మార్గము చూపి తనలో మనని తన వైపు నడిపించేదే వేదము..

🌸అటువంటి “ దైవముకి కానీ వేదముకి కానీ వెల కట్టే సొమ్ము ఎంత?” పూజాదికాలు యజ్ఞ యాగాదులు చేయగలిగే దక్షత కలిగినవారు ఎవరు??

🌿కేవలము పూజారులే.. పూజారులకు దక్షిణ ఇచ్చేదీ వేదము చదివే దక్షత పొందిన దక్షులు కనుక.. వారిలో ఉన్న వేదముకి విలువ, ఆ వేదముకి విలువ కట్టేంత వారము కాదు, ఈ విషయము గ్రహించాలి..

🌸వారికి దక్షిణ ఇవ్వడము అంటే మనము ఇవ్వగలిగినంత ఇవ్వడము కానీ 10 రూపాయలో లేక 100 రూపాయలో విలువ కట్టి ఇవ్వడము కానే కాదు.

🌿అది తప్పు.. గుడిలో పూజ లేక అర్చనా లేక హారతి లేక ఇతర ఎటువంటి క్రతువులు చేయించుకున్నా పూజారి గారికి దక్షిణ తప్పకుండా ఇవ్వవలసిందే.. నియమం అనరు కానీ ఇది తప్పకుండా పాటించవలసిన ధర్మం & ఆచారం..

🌸దక్షిణ ఇవ్వకుంటే చేసుకున్న పూజకి పూర్తి ఫలితము ఖచ్చితముగా దక్కదు,.. ... ఇది వాస్తవము మరియు సత్యము.. పూజారులకు వారి సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వడము చేత వారు సంతృప్తి చెందడము చేత పొందేవి ఏమిటంటే ..

🌿1) వారి కంఠము, స్వరము, ఊపిరితిత్తులను అనుక్షణమూ నొప్పిస్తూ, అనుగుణముగా లయబద్ధముగా ఉపయోగిస్తూ మంత్రభాగము తప్పు దొర్లకుండా దేవతలను ఆవాహనము చేస్తూ పూజాదికాలు నిర్వహించే వారి కష్టమునకు ప్రతిఫలము,.

🌸దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మము కోసము ఇవ్వడము.. 

🌿2) జీవులను ఉద్ధరించడము దైవ ధర్మము,. వేద రూపమున తనను స్మరించి సర్వ మనవాళికి శుభము కలిగించే మనకు & దైవముకు సాధనముగా ఉన్న పూజారులకు వారి సంతృప్తి మేర దక్షిణ ఇస్తే,

🌸తన ధర్మము కోసము ఉన్న పూజారి సంతృప్తి చూసి దైవము కూడా సంతృప్తి చెందుతారు..స్వస్తి..🚩🌞🌹🙏🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment