Sunday, January 19, 2025

 *ధనానికి దానం, భోగం, నాశం అనే మూడు గతులున్నాయి. ఒకరికి పెట్టక, తాను తినక, దాచి పెట్టిన సంపదకు ఏదో ఒక మార్గంలో నాశనం తప్పదు. ‘సంపాదించిన విత్తానికి త్యాగమే రక్షణ. చెరువులో నిండుగా ఉన్న నీటికి పారుదల ఒక్కటే రక్షణ’ అంటోంది విక్రమార్క చరితం. పాత్రుడికి దానం చేయ మన్నారు. అది ఉత్తమం. తాను ఆర్జించింది అనుభవించడం తప్పు కాదు. కానీ అది మధ్యమమే. ఈ రెండూ జరగకపోతే దొంగలు అపహరించుకుపోతారు. ఇది అధమం. ధనానికి ధర్మం, అగ్ని, రాజు, దొంగలు అనే నలుగురు దాయాదులు. వీరిలో జ్యేష్ఠమైన ధర్మానికి అవమానం కలిగితే తక్కిన ముగ్గురికీ కోపం వస్తుందంటాడొక కవి. దానశీలురు ధనాన్నంతా దానం చేసి సర్వమూ కోల్పోయినా అది అతడికి శోభనే కలిగిస్తుంది. అర్ధ స్వభావాన్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే ఒక పురుషార్థాన్ని సాధించగలుగుతాం.*.              💫💫💫
*సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ఇలా...*
❤️🕉️❤️
* పని కోసం సమయం కేటాయిస్తే... అది మనకు సంతృప్తినిస్తుంది.

* ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే... అది మన మేధాశక్తిని పెంచుతుంది.

* చదవడానికి కొంత సమయం కేటాయిస్తే... అది మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది.

* నవ్వడానికి కొంత సమయం కేటాయిస్తే... అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది.

* ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే... అది మనకు ఆనందాన్నిస్తుంది.

* వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయిస్తే... అది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

* ప్రార్ధించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే... అది మనకు మనశ్శాంతినిస్తుంది.

No comments:

Post a Comment