Saturday, January 4, 2025

 *పూర్వ జన్మ కర్మ.....*

విత్తనం లాగానే క్షేత్రమనబడే ఈ శరీరం కూడా అనాది, కాని అంతం ? ఎప్పుడైతే జీవుడు తన వాసనలను క్షయం చేసుకొని, కర్మఫలాలను జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుంటాడో అతడి జీవభావం నశించి పురుషుడుగా.. క్షేత్రజ్ఞుడుగా.. ఆత్మగా మిగిలిపోతాడు. కనుక పురుషుడు అనాది - అనంతం.

కొన్నిమతాలవారు చెప్పినట్లు అసలు జన్మలే లేవు, జీవుడు పుడతాడు.. చస్తాడు, అంతే  అనే వారి మాటను తీసుకుందాం. పూర్వజన్మ పాపపుణ్యాలు.. కర్మఫలాలు లేకపోతే ఈ జన్మలో పాపం చేసినా పుణ్యం చేసినా ఈ జన్మలోనే అనుభవించాలి. అనుభవించక పోతే రద్దై పోవాలి. మరి పాపాలు చేసిన వారు దుఃఖాలు అనుభవిస్తూ.. పుణ్యాత్ములంతా సుఖాలు అనుభవిస్తూ ఉన్నారా ? లేదు.. 

ఇది మన అనుభవం. సరే ఏమిచేసినా మరణంతో రద్దై పోతాయనుకుందాం. అలాంటప్పుడు ఎలాగూ రద్దై పోతాయి గనుక పుణ్యకర్మలే చేయాల్సిన పనిలేదు. ఎంతటి పాపాలకైనా ఒడిగట్టవచ్చు. స్వార్థంతో హత్యలు, అన్యాయాలు, అక్రమాలు ఏవైనా చేయవచ్చు. దీనిని ఏ మతమైనా అంగీకరిస్తుందా ? లేదు. కనుక జన్మలున్నవి. చేసిన కర్మలు ఊరికే పోవు, అనుభవించి తీరాల్సిందే. ఈ దేహంతో కాకపోతే మరో దేహాన్ని ధరించినప్పుడైనా అనుభవించాలి.

No comments:

Post a Comment