🙏
✨ఆలోచించే విధానాన్ని మార్చుకుందాం✨
జీవితాసక్తి కోల్పోయినప్పుడు, జీవితం పట్ల ఉరకలెత్తే ఉత్తేజం లేనప్పుడు, జీవితాన్ని ఒక సాహసంగా, ఒక ఆటగా, ఆనందంగా స్వీకరించగలిగే స్థితి లేనప్పుడు శారీరక రుగ్మతలు ,మానసిక సమస్యలు ,సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. మనిషికి ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే ఇలాంటివి ఎదురవుతాయి.
_జీవితమంటే కదలిక అని గుర్తుంచుకోవాలి. మీరు నిస్పృహలో ఉన్నప్పుడు వెలువడి న ఆలోచన తరంగం కూడా తన క్రియలను ఎంతో లయతో నిర్వర్తిస్తూ చెలరేగిపోతూ ఉంటుంది.
_ విస్తారమైన అవకాశాలు, పరిపూర్ణమైన ఆరోగ్యం, సంతృప్తికరమైన పని, అపరిమితమైన సంపద, మనకు తారసపడే వ్యక్తుల ముఖాలలో చిరునవ్వు_ ఇలాంటి వాటిని మనం ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్నామంటే మన నమ్మకాలు చాలా ఆరోగ్యకరంగా
ఉన్నాయని తెలుసుకోవాలి.
అనారోగ్యం, అసంతృప్తికరమైన పని, విస్తారమైన సంపాదన విశ్వసించకపోవడం, ఈ లోకంలో దుఃఖం మరియు చెడునే చూడడం లాంటివి మనకు ఎదురవుతున్నాయా? అయితే మన నమ్మకాలలో లోపం ఉందని తెలుసుకోవాలి.
ఒక మంచి ప్రపంచం పట్ల నమ్మకం, మనల్ని ఇష్టపడే వ్యక్తులు ఇలాంటివి తారస పడుతుంటే మన ఆలోచన విధానం సక్రమంగా ఉందని తెలుసుకోవాలి. మన నమ్మకాలలో ఎక్కడ లోపం ఉందో పరీక్షించుకోవాలి.
జీవితం ఆనందమయంగా ఉండాలా? దుఃఖ భరితంగా ఉండాలా? మనమే నిర్ణయించుకోవాలి. మన నమ్మక వ్యవస్థ నెగటివ్ దశ నుండి పాజిటివ్ దశలోనికి మారడం ద్వారా మన జీవిత సంఘటనలు కూడా మారుతూ ఉంటాయి.
యుద్ధాన్ని ద్వేషించినంతమాత్రాన శాంతి రాదు. మనం శాంతిని ప్రేమించినప్పుడే యుద్ధం రాకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. మన నమ్మక వ్యవస్థను ఆ విధంగా మార్చుకోవాలి.
🙏
✨ఆలోచించే విధానాన్ని మార్చుకుందాం✨(2)
_ ఏ కారణమూ లేకుండా అనారోగ్యం లేదా సమస్య అనేది ఉత్తన్నమవ్వదు. అనారోగ్యాన్ని లేదా సమస్యను మనం ద్వేషిస్తూ ఉండవచ్చు. కానీ దాన్ని ఎంచుకొని వాస్తవం చెందుతున్నది మనమే.
సమస్యను లేదా పేదరికం ని ద్వేషించినంత మాత్రాన సమస్య పరిష్కారం అవ్వదు, పేదరికం మటుమాయం అవ్వదు. మన నమ్మక వ్యవస్థను సమూలంగా మార్చుకోవడం ద్వారా సమస్యను లేదా పేదరికాన్ని ఏరిపారేవేయవచ్చు.
అనారోగ్యం గురించి అసహ్యించుకుంటూ ఉంటే ఆరోగ్యం వస్తుందా? అసంభవం !మనకు ఆరోగ్యం పట్ల సంపూర్ణమైన నమ్మకం ఉండాలి! చక్కటి ఆరోగ్యం పట్ల వాంఛ ఉండాలి; చక్కటి ఆరోగ్యం కోసం ఊహ శక్తి ద్వారా కలలు కనాలి. ఈ ప్రపంచంలో చెడును అసహ్యించుకుంటూ ఉంటే చెడు తొలగిపోవడం జరగదు.
మంచితనం వైపు మన నమ్మక వ్యవస్థను ఏర్పరచుకోవాలి. అలా కాకుండా ఎప్పుడూ రోగాలు గురించే మాట్లాడుతూ ఉంటే అవే మనం ఆకర్షిస్తూ ఉంటాం. అలా కాక ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉన్నాము అని కలలు కన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ ని ఫీలై వాటిని సృష్టించుకుంటాము.
బ్రహ్మ పదార్థము మనలో ఇమిడి ఉన్నప్పుడు మన దేహమే దేవాలయం కదా! ఆత్మ ,పరమాత్మ రెండు మన దేహం లోనే ఇమిడి ఉన్నాయి. దేహాన్ని హీనంగా చూడడం అంటే నీలోని దైవాన్ని హీనపరచడమే!
మన చైతన్య శక్తి విస్తారంగా పెరిగే కొలది మన మనో శక్తి కూడా విస్తారంగా పెరుగుతూ ఉంటుంది. దానికనుగుణంగా మన నమ్మక వ్యవస్థ కూడా మార్పు చెందుతూ ఉంటుంది.
ఉదాహరణకు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు- మీ తల్లి చెప్పడం ద్వారా కానీ- ట్రాఫిక్ ఎక్కువ రద్దీగా ఉన్న రోడ్డును దాటడం చాలా ప్రమాదం అనే నమ్మక వ్యవస్థను ఏర్పరచుకోవడం జరుగుతుంది. పాతికేళ్లు మనకు వచ్చిన తరువాత కూడా ట్రాఫిక్ ఎక్కువ రద్దీగా ఉన్న రోడ్డును దాటడం పట్ల మరో నమ్మక వ్యవస్థ ఏర్పడుతుంది. పాతికేళ్ల వయసులో ఏర్పరచుకున్న ఒక లక్ష్యం మరో పది సంవత్సరాల తర్వాత చానా చిన్నదిగా స్వల్పమైనదిగా అనిపించవచ్చు.
మన మనోశక్తి విస్తరించే కొలది నమ్మక వ్యవస్థ కూడా మార్పులకు లోన్ అవుతూ ఉంటుంది. నిరంతరం మార్పు చెందడం, పరిణామం చెందడం ప్రకృతి ధర్మం కదా!
ఈ భూమి మీద జీవించి ఉన్నంతకాలం కాన్సియస్ మైండ్ అనేది మన మెదడుతో అనుసంధానం ఏర్పరచుకొని దాని ఆధారంగా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ దేహం ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా కాన్సియస్ మైండ్ అనేది ఉంటుంది. అది నిరంతరం వ్యాకోచం చెందుతూ ఉంటుంది. జన్మజన్మకు దాని వ్యాకోచ పరిధి పెరుగుతూ ఉంటుంది.
_ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరోగ్యాన్ని విశ్వసించి తీరాలి. అనారోగ్యాన్ని ద్వేషించినంత మాత్రాన ఆరోగ్యం రాదు. సంపద కావాలంటే సంపద పట్ల విశ్వాసం ఉండాలి. దారిద్రాన్ని ద్వేషించినంత మాత్రాన సంపద రాదు. ద్వేషాన్ని ప్రేమతో జయించాలి. ద్వేషాన్ని ద్వేషించినంత మాత్రాన ప్రేమ రాదు. మన జీవితంలో ఏది కోరుకుంటున్నామో దాన్ని పొందుతామనే విశ్వాసం మనలో ఉండాలి; నమ్మక వ్యవస్థ నెగటివ్ నుండి పాజిటివ్ వైపుకు మారాలి.
బాల్య స్థితి నుంచి తల్లిదండ్రుల ద్వారా+ సంఘం ద్వారా+ విద్యా వ్యవస్థ ద్వారా భౌతిక విషయాల గురించి జ్ఞానాన్ని మన కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంటుంది. దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా intellctuals గా మనం భ్రమ పడుతుంటాం. బాహ్య ప్రపంచం ద్వారా లభించే జ్ఞానం ఎంతో పరిమితమైనది. దాని ద్వారా తర్కం, విశ్లేషణ పెరుగుతాయి కాని ఇంటలిజెన్స్ పెరిగే అవకాశం లేదు.
అంతర్ ప్రపంచాన్ని (soul energy లేక
sub consciousమైండ్ )విరివిగా ఉపయోగించడం ద్వారా కాన్షియస్ మైండ్ పరిధి విస్తరిస్తూ ఉంటుంది. consciousమైండ్ పరిధి విస్తారంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ కూడా విస్తారంగా ఉంటుంది.
మనం చిన్నపిల్లలకు చేయగల అతి గొప్ప సహాయం ఏమిటంటే- వాళ్ల consciousమైండ్ పరిధిని అపారంగా విస్తరింప చేసుకునేందుకు సహాయ సహకారాలు అందించడం. అంటే చిన్నపిల్లలను మెడిటేషన్ చేసుకునేందుకు ప్రోత్సహించడం, ఇమాజినేషన్ పవర్ ను ఉపయోగించడం లాంటివి వాళ్లకు నేర్పాలి. అంతేకాకుండా మన అభిప్రాయాలను ,ఆకాంక్షలను ,మన పరిమిత జ్ఞానాన్ని చిన్న పిల్లలపై రుద్దకుండా వాళ్ల మా నాన వాళ్ళను వదిలేస్తే చాలా చక్కగా ఆటోమేటిక్గా చైతన్య పరిణామం చెందుతారు. మన అభిప్రాయాలను బలవంతంగా పిల్లలపై రుద్దడం తక్షణమే మానేయాలి. నదీ ప్రవాహం లేదా పక్షి గమనం వలె సహజంగా పిల్లలు చైతన్య పరిణామాన్ని చెందుతారు.
🙏
ఆలోచించే విధానాన్ని మార్చుకుందాం(3)
ఈ ప్రకృతిలో ప్రతి మనిషి అంతర్గత శక్తితో కూడిన రక్షణ కవచం కలిగి ఉంటాడు. మన నమ్మక వ్యవస్థకు అనుగుణమైన అభిప్రాయాలు ఆలోచనలు మాత్రమే మన జీవితా అనుభవాలలోనికి అనుమతిం పబడతాయి. మనకు ఇష్టం లేకుండా ఏ బాహ్య శక్తులు మనల్ని ఏమీ చేయలేవు.
మన కాన్షియస్ మైండ్ లో ఏర్పరచుకునే అభిప్రాయాలు, నమ్మకాలగనుగుణంగా భౌతిక సంఘటనలను మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తున్నాము. మన అనుమతి లేకుండా ఎటువంటి దుష్ సంఘటన మన జీవితంలోనికి ప్రవేశించదు. యాక్సిడెంట్ కావచ్చు, హత్య చేయబడటం కావచ్చు, వ్యాధి సంక్రమించడం కావచ్చు, ఆర్థిక బాధలు కావచ్చు ,కుటుంబ సమస్య కావచ్చు లేదా మరేదైనా కావచ్చు_ ఏ భౌతిక సంఘటన అయినా సరే మనo అంగీకరించకుండా, మన అనుమతి లేకుండా, అది మన జీవితంలోనికి ప్రవేశించదు.
మనం భయం వల్లనో, సందేహం వల్లనో, అనుమానం వలన వాటిని మనం ఆహ్వానిస్తున్నాం.
మన కాన్సియస్ మైండ్ పరిధిలో నమ్మక వ్యవస్థను ఆశావహ దృక్పథం వైపుకు మళ్ళించుకోవాలి. ఊహాశక్తి ,అంతర్ ప్రయాణం, ధ్యానం అనేది చాలా ఉపయోగపడతాయి.
వయసు పట్ల మన నమ్మకాల -ఆధారంగా మన భౌతిక దేహం ప్రభావితం అవుతూ ఉంటుంది. మన నమ్మకాల ఆధారంగా దేహంలోని జీవ రసాయనాలను ప్రభావితం చేయడం ద్వారా దేహం యొక్క క్రియలను, జీవితంలో దేహం యొక్క పాత్రను నిర్దేశిస్తున్నాం. మనిషి జీవిత ఆయుష్షు అనేది అతని నమ్మక వ్యవస్థకు అనుగుణంగా ఉంటుంది. 100 ఏళ్ల లోపు దేహం నిర్వీర్యం అవుతుందని, చూపు మందగిస్తుందని, మెదడు చురుకుగా పనిచేయదని, జ్ఞాపక శక్తి కోల్పోతామని, వినికిడి కోల్పోతామని మనం నమ్మక వ్యవస్థను ఏర్పరచుకోవడం ద్వారా దానికి అనుగుణంగానే మన దేహం సిద్ధపడిపోయి తన జీవశక్తి పరిణామాన్ని పొందుతుంది. మన నమ్మక వ్యవస్థ ఎలా ఉంటే అలా మన దేహం అందుకు స్పందిస్తుంది.
భౌతిక దేహం పట్ల ,ఆరోగ్యం పట్ల మనం కలిగి ఉన్న నమ్మక వ్యవస్థ, మరియు ఫీలింగ్స్ దేహంలోని జీవ రసాయనాలను మార్పులకు లోను చేసి అందులోని హార్మోన్లను సరికొత్త రీతిలో ప్రభావితం చేస్తాయి.
ఆరోగ్యంగా ఉండాలనే ఒక సంకల్పం చాలు దాని ద్వారా మన దేహం ఎంతో లబ్ధి పొందుతుంది.
నేను ఆరోగ్యంగా ఉన్నాను! అనే ఒక నమ్మకం మన దేహం లోపల విభిన్న రీతులలో జీవ రసాయనిక క్రియలను కలుగజేస్తుంది. బలమైన సంకల్ప బలం ,దృఢ నిశ్చయమున్న వ్యక్తికి అనారోగ్యం ఉన్నప్పటికీ మైండ్ ఫ్యాకల్టీస్ ను అభివృద్ధి చేసుకోగలిగేటప్పుడు అనారోగ్యాన్ని కూడా పోగొట్టుకోవచ్చు.
దేహాన్ని అనారోగ్యంతో బాధపడనిస్తూ ఉండటం వలన భౌతిక సంఘటనలు భౌతిక జీవితాన్ని ద్వారా లభించే ఆనందం మరి పరిణామాలను కోల్పోవడం జరుగుతుంది. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అనే నానుడి మనం వినే ఉంటాం. జీవాత్మ చైతన్య పరిణామం చెందడం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి చెందటానికి ఈ భూమి మీద భౌతిక జీవితానుభవాలు ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి.
No comments:
Post a Comment